Friday, 15 April 2016

భద్రాచల రామయ్య







సీతమ్మకు చేయిస్తి..!

జగదానందకారకుడైన రాముడికీ జగన్మాత జానకికీ జరిపించే కళ్యాణం కడుకమనీయం. అసలు కళ్యాణం అంటే అది సీతారాములదే. కళ్యాణంలోని ప్రతి ఘట్టం కనులకు పండగే. ఇందులో అమితమైన భక్తితో రామదాసు చేయించిన ఆభరణాలను సీతారాములకు అలంకరించే ఘట్టం మరీ ప్రత్యేకం. శతాబ్దాల కి¨ందటే స్వామికీ సీతమ్మకీ ఏయే నగలు అలంకరించాలో వాటన్నింటినీ అమర్చిన గొప్ప భక్తాగ్రజుడు శ్రీరామదాసు. తానీషాల కాలంనాటి ఆభరణాలకు రాములోరి దర్బారులో ఇప్పటికీ విశిష్ట స్థానమే.

ప్రపంచంలోని ఏ దేవుడి నగలైనా భక్తులు చేయిస్తారు. కానీ ఒక్క భద్రాద్రిలో మాత్రం స్వామివారి నగలకు స్వయంగా ఆ శ్రీరాముడే కదలి వచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. తానీషా ప్రభువుల ఖజానాలోని నగదుతోనే కంచర్ల గోపన్న రాములవారికీ, సీతమ్మకూ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకూ నగలు చేయిస్తాడు. దీంతో ఆగ్రహించిన తానీషా గోపన్నను చెరసాలలో బంధిస్తాడు. అంతట శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి వచ్చి ఆరు లక్షల రామమాడలను రాశిగా పోసి తానీషాకు ఇస్తాడు. అలా రాముడు తన ఆభరణాలకు తానే మూల్యం చెల్లించుకున్నట్లయింది. దీంతో రామదాసు భక్తిని తెలుసుకున్న తానీషా నాటి నుంచీ రాములవారి కళ్యాణానికి పట్టువస్త్రాలూ, ముత్యాల తలంబ్రాలూ సమర్పించడం ప్రారంభించాడు. నేటికీ భద్రాచలం రాములవారి దేవస్థానంలో చైత్ర శుద్ధ నవమి రోజున జరిగే కళ్యాణానికి ప్రభుత్వం తరఫున వీటిని అందజేస్తూ ఉండటం విశేషం.


రామదాసు ప్రత్యేక కృషి
భద్రాచలంలోని సీతారాముల వారికి ఎలాంటి ఆభరణాలు తయారు చేయించాలి అనేదానిపై రామదాసు ఎంతో కృషి చేశాడని చెబుతారు. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే స్వామివారికి అలంకరించే నగలు, కిరీటాలు, శఠారి, ఛత్ర, చామరాలు, వస్త్రాలు మొదలైనవాటిని తయారు చేయించాడన్నది పండితుల విశ్లేషణ. రామదాసు భక్తితో సీతారాములకు చేయించిన ఆభరణాల్లో అత్యంత వైభవోపేతమైంది చింతాకు పతకం. చింత చిగుర్లాంటి ఎర్రని రాళ్లను పొదిగిన ఈ నగ తయారీకి ఆ కాలంలోనే పదివేల వరహాలు వెచ్చించాడట రామదాసు. జానకీనాథుడి అలంకరణకు కలికితురాయినీ చేయించాడు. ఇక లక్ష్మణ స్వామికి ముత్యాల పతకాన్ని, భరత శత్రుఘ్నులకు పచ్చల పతకం, రవ్వల మొలతాడు చేయించాడు.

మూడు సూత్రాలు!
చైత్రశుద్ధ నవమినాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఈ కళ్యాణ వేడుకలో స్వామివారు కట్టే తాళిబొట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ వేడుకలో రాములవారు సీతమ్మ మెడలో మూడు సూత్రాలను కడతాడు. పితృవాత్సల్యంతో భక్త రామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి మొత్తం మూడు సూత్రాలను కళ్యాణంలో సీతమ్మవారికి ధరింపజేయడం భద్రాచల క్షేత్ర ఆచారం. ఇలా మూడు సూత్రాలతో తయారైన మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటిచెబుతుంది. కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలకు ఈ సూత్రాలు సంకేతాలు.

వైరముడి...
రామయ్యకు ఉన్న ఆభరణాల్లో మరో ప్రత్యేకమైన ఆభరణం వైరముడి. ఈ కిరీటాన్ని కూడా ఈ ప్రాంతానికి తహసీల్దారుగా వచ్చిన వ్యక్తే చేయించడం విశేషం. 1880 ప్రాంతంలో నెల్లూరుకు చెందిన రంగరాయుడు అనే భక్తుడు భద్రాచలానికి తహసీల్దారుగా వచ్చినప్పుడు దీన్ని చేయించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.

స్వర్ణ పుష్పార్చన
భద్రాద్రి రామయ్యకు ప్రతి ఆదివారం స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది. ఈ అర్చనకు ఉపయోగించే నూట ఎనిమిది స్వర్ణ పుష్పాలను చినజీయర్‌ స్వామి బహూకరించారు. అలాగే ప్రతి శనివారం స్వర్ణ తులసీ దళాలతో మూలవిరాట్టును పూజిస్తారు. శతవర్ష ఉత్సవాల్లో భాగంగా సుమారు అయిదు కిలోల బంగారంతో వీటిని చేయించారు. బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు మూడున్నర కోట్ల రూపాయల విలువైన పదికిలోల బంగారు కవచాలను శ్రీరామచంద్రమూర్తికి సమర్పించాడు. వీటిని ప్రతి శుక్రవారం మూలవిరాట్టుకు అలంకరిస్తారు.

ఒడిలో సీతమ్మతో, చేతిలో శంఖచక్రాలతో భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీరాముడి దర్శనం జగన్మంగళ దాయకం. అందుకే నవమినాటి రామయ్య పెళ్లిలో రామదాసు చేయించిన మంగళసూత్రాలను అర్చకస్వాములు ఆనందంగా చూపిస్తుంటే, ఎంత దూరాన్నుంచైనా రెండు చేతులతో కళ్లకద్దుకుని తమ భక్తిని ప్రదర్శిస్తారు. ఈ సందడి ఒక్క భద్రాచలంలోనే కాదు ప్రతి తెలుగు పల్లెలోనూ కనిపిస్తుంది. ప్రతి హృదయం రాముడి కళ్యాణాన్ని చూసి పరవశిస్తుంది.

మామిడి నాగేశ్వరరావు,
భద్రాచలం






శ్రీరామ నవమి

హిందువులకు ముఖ్యమైన పండగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీరామచంద్రుడు విళంబి నామ సంవత్సరంలో, చైత్రశుద్ధ నవమినాడు, పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించాడు. చైత్రశుద్ధ నవమినే శ్రీరామనవమిగా భావిస్తారు. దేవుడు అవతరించిన రోజే కళ్యాణాన్ని ఆచరించాలన్నది పాంచరాత్రాగమ సంప్రదాయం. ఆ ప్రకారం శ్రీరామనవమినాడే సీతారాముల కళ్యాణం జరిపించడం అనాదిగా వస్తోంది. ఈ వేడుక కూడా అభిజిత్‌లగ్నంలోనే జరగడం విశేషం.

శ్రీరాముడిలాగే రామనామం కూడా చాలా విశిష్టమైంది. రామనామాన్ని జపంగానే కాదు బిడ్డకు పేరు పెట్టి పిలిచినా, ఏమరపాటుగానైనా స్మరించినా పుణ్యమేనంటాడు పోతన. ‘రామా’ అని పలకగానే మనలోని పాపాలన్నీ పటాపంచలైపోతాయన్నది ఆర్యోక్తి. అంతటి మహిమాన్విత నామాన్ని కలిగిన శ్రీరామచంద్రుడి కళ్యాణం లోకానికీ పండగే. అలాగే పూజ పూర్తయిన తర్వాత మిరియాలూ బెల్లంతో చేసిన పానకాన్నీ, వడపప్పునూ నైవేద్యంగా పెడతారు. పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతారు. దీని వెనుక ఆరోగ్యపరమైన పరమార్థం కూడా ఉంది. పానకంలో వాడే మిరియాలూ, యాలకులూ వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే వడపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవచేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది కూడా.



Mar 26, 2018

అదిగో భద్రాద్రి...!

‘రామ’యన బ్రహ్మమునకు మారుపేరు అన్నాడు త్యాగరాజు. అంటే ఆ రెండక్షరాలలో బ్రహ్మసంకేతం ఉందన్నమాట. ర+ అ+ మ = రామ అవుతుంది. ‘ర’ అంటే అగ్ని. ‘అ’ అనేది సూర్యుడు. ‘మ’ అనగా చంద్రుడు. ‘ర’కారం అగ్ని శక్తి అధిష్టాన దేవత ఈశ్వరుడు. అ అంటే హిరణ్యగర్భ ఆదిత్యుడు వాచ్యుడు అయిన బ్రహ్మ, ‘మ’ అంటే సోమర స విష్ణుతత్తం. ఇట్లా రామ శబ్దం త్రిమూర్తి శక్తాత్మకంగానూ, సూర్యచంద్రాగ్నిమయ తేజంగానూ అవుతుంది.

రాముడు పితృ ఆజ్ఞను పాటించినవాడు. సంస్కారవంతుడు. మహాగుణశోభితుడు. త్యాగమూర్తి అన్నిటికీమించి ఉన్నత మానవుడు. అందుకే రామున్ని స్మరించినా , అతని గుణాల్ని అనుసరించినా ఉత్తమ సంస్కారవంతులై మానవ జీవితం అనుభవిస్తారు. ఆ కథను లోకానికందించిన వాల్మీకి మహా లోకోపకారం చేశారు. రాముడు నడయాడిన ఈ నేల పవిత్రమైంది. అట్లా పవిత్రమై ఆంధ్రులు అయోధ్యాపురిగా భావించే భద్రాచలం నాటి నుంచి నేటికీ ప్రభా భాసితమై ఒప్పారు తున్నది. పవిత్రగోదావరి చెంతన భద్రగిరిపై వెలసిన ఆ సీతారామలక్ష్మణులకు క్రీ.శ. 17వ శతాబ్ది (1674) అప్పటి స్థానిక తహసీల్దారు కంచర్ల గోపన్న సుందర మందిరాన్ని నిర్మించాడు. అనంతర కాలంలో రామభక్తుడగుటచే అతడే భక్తరామదాసు అయినాడు. సీతారామలక్ష్మణులు వనవాసకాలంనాడు ఈ దండ కారణ్య ప్రాంతంలో సంచరించారు. అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న భద్రమహర్షికి శ్రీమహావిష్ణువు, శ్రీరామచంద్రుడి అవతారంగా దర్శనమిచ్చి అతడికి మోక్షప్రాప్తి కలిగిస్తాడు. భద్రుడి కోరిక మేరకు భద్రగిరిపై కొలువుదీరుతాడు. అందుకే రామచంద్రుడు శంఖచక్రాదులు ధరించి, వామాంకముపై సీతతో, ప్రక్కన లక్ష్మణస్వామితో కొలువులందుకొంటున్నాడు. ఆ ప్రత్యక్ష దైవానికి క్షేత్రపాలకులుగా శ్రీయోగానంద జ్వాలాలక్ష్మీ నరసింహస్వామి, అన్నపూర్ణాసమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఇక్కడే నెలకొని ఉన్నారు. ఈ కొండపై గణేశుని, నవగ్రహాల ఆలయాలుకూడా ఉన్నాయి. ప్రతిరోజూ రామదాసు తూము నరసింహ దాసు కీర్తనలతో ఉదయం గం. 4.30లకు ప్రభాతోత్సావం జరుగుతుంది. ఉదయం 7.గం. నుంచి రాత్రి 8.30 గం. ల వరకు స్వామివారికి అభిషేకాలు దర్శనాలు వగైరాలుంటాయి. ప్రతియేటా రెండుసార్లు సంప్రదాయక మహోత్సవాలు ఈ ఆలయంలో జరుగుతాయి. శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామ నవమి చైత్ర శుద్ధనవమి పునర్వసు సుముహూర్తమున సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగుతుంది. విశాలంగా వేసిన చలువ పందిళ్ల కింద ఆ రోజు ఉదయం 10గం. నుంచి మధ్యాహ్నం 12.30గం. ల వరకు అంగరంగవైభవంగా కళ్యాణవేడుక జరుగుతుంది. అశేష జనావళి అక్కడ చేరి తరిస్తారు. ఆ వేడుకను దివి నుంచి ముక్కోటి దేవతలు వీక్షిస్తారని భక్తుల నమ్మకం. ఆ పవిత్ర తలంబ్రాలు సీతారాములపై కురిపించే దృశ్యం చూడవలసిందేకాని వర్ణించరానిది. అపారమైన ఆభరణాలు ధరించిన ఆ అర్చామూర్తులు భక్తులను తరించుటకై దివి నుంచి భువికి దిగివచ్చినారేమో అనిపిస్తుంది. సకల వాయిద్యాలతో సంబరాలు జరుగుతాయి. పురోహితులు ఆగమశాస్త్ర ప్రకారం గా క్రతువును జరుపుతుంటారు. వంశపారంపర్యంగా వధువు పక్షాన, వరుని పక్షాన అర్చకులు కార్యక్రమాలు హోమాదులు నిర్వహిస్తారు. మాంగళ్యధారణ, పాణిగ్రహణంవంటి తంతులు జరుగుతాయి. సీతారాముల పట్టాభిషేకం, డోలోత్సవాలవంటివి ఉంటాయి.

ఉగాది (తెలుగు, కర్ణాటక రాష్ట్రాలకు) నూతన సంవత్సరం. అప్పటి నుంచి వరుసగా తొమ్మిది రోజులు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు ప్రతి గ్రామంలో, వీధిలో, కొందరు ఇండ్లల్లో కూడా జరుపుకుంటారు. సీతారాములు తమ ఇంటివారేనని భావనతో అర్చిస్తారు. క్రీ.పూ. 5010 సం.లో పుట్టాడని భావిస్తున్న ఆ శ్రీరాముడు ఇప్పటికీ నిత్యనూతనుడై, ఆ దంపతులు ప్రతి యేటా నవ వధూవరులవడం చరిత్రలో మరెక్కడా కానరాని విషయమే కదా!

ఈ వేడుకల్లో సంప్రదాయబద్ధంగా కొన్ని నైవేద్యాలను దేవుడికి సమర్పించడం జరుగుతున్నది. వాటి వివరాలను తెలుసుకుందాం..

పానకం: అంటే శ్రీరామ చంద్రమూర్తికి అమితాసక్తిగా భావిస్తారు. ఆ తయారీ ఇట్లా ఉంటుంది. ఉదాహరణల పరిణామంగా చెప్పుకుంటే..రెండు కప్పుల నీరు, అరచెంచా అల్లంపొడి, రెండు మూడు కప్పుల తురిమిన బెల్లం, అరచెంచా దంచిన మిరియాలు, యాలకులు సేకరించి తయారుచేస్తారు. ఈ బెల్లం వల్ల ఖనిజాలు, విటమిన్లు దొరుకుతాయి. అల్లంచేత జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. కడుపుబ్బడం, వాతపిత్త రోగాలు నివారింపబడి పొట్ట శుభ్రపడుతుంది. అల్లం కాలిన గాయాల్ని కూడా ఉపశమింప జేయడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అట్లే అల్లం, మిరియాలు, తేనె లేదా బెల్లం (శర్కర) గొంతుపట్టడం, దగ్గు, జలుబు వంటి వ్యాధుల్ని కూడా నివారిస్తుంటాయి.

వడపప్పు: నానబెట్టిన పచ్చని పెసరపప్పు ఒక కప్పు, పొడిచేసిన రెండు కప్పుల కొబ్బరి తురుము, అవసరమైనంత దంచిన పచ్చిమిర్చి, కొంత నిమ్మరసం, వంటి పదార్థాలతో ఉడకబెట్టకుండా వడపప్పును సిద్ధం చేస్తారు.

చలిమిడి: వేడినీటిలో దంపుడు బియ్యాన్ని రెండు మూడు గంటల వరకు నానబెట్టి, గుడ్డ పరచి ఆరబెడతారు. ఆ బియ్యాన్ని పిండిచేసి చక్కెర లేదా బియ్యం సరిపడా నీటిలో కలుపుతారు. కొబ్బరి తురుము, ఏలకులు అవసరమున్నంత కలిపి ముద్దలుగా చేస్తారు. ఈ వంటకాలు సీతారాములకు ఇష్టమని ప్రసాదాలుగా తయారుచేసి పంచుతారు. వేసవి ఆరంభ దినాలలో ఈ పెసరపప్పు వగైరా వస్తువులన్నీ దేహానికి చ ల్లదనాన్ని ఇస్తాయని గుర్తించవచ్చు.

భద్రాచలంలో జరిగే మరో మహా ఉత్సవం వైకుంఠ ఏకాదశి. ఇది డిసెంబరు నెలాఖరులోనో, జనవరిమొదటి వారంలోనో ధనుర్మాసంలో వస్తుంది. తెలుగులో మార్గశిర మాస శుద్ధ ఏకాదశి అవుతుంది. అప్పుడు పది రోజులుగా , దశావతార మహోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఉత్సవంలో భక్తరామదాసు కీర్తనలు, భజనలు, నిత్యం జరుగుతుంటాయి. కొలిచినవారికి కొండంత అండ మన భద్రాద్రి రామయ్య అంటారు భక్తులు.

ఒక రాముడు ఇద్దరు కృష్ణులు
భద్రాచల రాముడికి ఇద్దరు కృష్ణులతో విడదీయరాని అనుబంధం ఉంది. ఒక కృష్ణుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు దగ్గర్లోని ఇరవెంది గ్రామంలో ఉంటే మరో కృష్ణుడు యాదాద్రి భువనగిరి జిల్లా మక్తామాధవరం (మహదేవపూర్)గ్రామంలో ఉన్నాడు. ఇరవెంది గ్రామంలోని కృష్ణమందిరం నిర్మాణం చూసి ఎంతగానో ఆనందించిన రామదాసు అదే తరహా ఆలయాన్ని రాముడికి కట్టించాడు. ఆ విధంగా రాముడికి కృష్ణుడికి బంధమేర్పడింది. ఇక మక్తామాధవరం కృష్ణమందిరం, భద్రాచలం రామమందిరం ఒకేసారి నిర్మించడానికి పూనుకున్నారు. కారణాంతరాల వల్ల రామమందిరం ప్రారంభించడానికి కొంచెం ఆలస్యమైంది. ఈ ఆలయం మాత్రం అనుకున్న సమయానికే ప్రారంభమైంది. రామాలయాన్ని రామదాసు కడితే ఈ కృష్ణాలయాన్ని ఆయన మేనమామ అక్కన్న కట్టించాడు. ఇలా ఈ రామ, కృష్ణులకు బంధం ఏర్పడింది.

రెండు పెళ్ళిళ్ళ రాముడు
రాముడు ఏక పత్నీవ్రతుడు. ఆయన ఒకేసారి సీతమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఇది మన అందరికీ తెలిసిందే! సీతారాముల వివాహ వార్షికోత్సవాన్ని మనం యేటా రామనవమినాడు చేసుకుంటూ ఉంటాం. మొదట్లో లేకపోయినా తర్వాత రాములవారికి కూడా నిత్యకళ్యాణం ఒక సేవగా వచ్చి చేరింది. రామనవమినాడు భద్రాద్రికి రాలేని వారి సదుపాయం కోసం ఈ నిత్యకళ్యాణం తీసుకువచ్చారు. భద్రాచలంలో రాముడి కళ్యాణం చైత్రశుద్ధనవమినాడు మిట్టమధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో చేస్తారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట రామాలయంలో చైత్రశుద్ధ చతుర్దశినాడు రాత్రివేళ వెన్నెలలు కురిసేవేళ వివాహం చేస్తారు. ఇక రంగారెడ్డిజిల్లా హయత్ నగర్ మండలం కవాత్‌పల్లి గ్రామంలో కొలువుదీరిన రాముడు శ్రీరామనవమినాడు పగలు రాత్రి సమయాలలో రెండుసార్లు వివాహం చేసుకుని విచిత్రమైన సంప్రదాయాన్ని నెలకొల్పాడు. సూర్యవంశ తిలకుడైన రాముడి వివాహాన్నిభద్రాచలంలో సూర్యుడు మాత్రమే చూడగలడు. ఒంటిమిట్ట రామచంద్రుని కళ్యాణాన్ని చంద్రుడు మాత్రమే చూడగలడు. సూర్యవంశంలో పుట్టి రామచ్రందునిగా వెలుగొందుతున్న రాముని పెళ్ళిని ఒక్క కవాతుపల్లిలోనే సూర్యచంద్రు లిద్దరూ చూడగలరు.





March 25, 2017

భద్రాద్రి రాముడు.. బంగారు రాముడు

భారతదేశంలో ఉన్న రామక్షేత్రాలన్నింటిలో రాముడు ద్విభుజుడు. భద్రాచల రాముడు మాత్రం చతుర్భుజుడు. భవ్య ధరిత్రి భద్రగిరిలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై సంచరించాడు. అందుకే ఈ ప్రాంతమంతా రామాయణ రసరమ్య సన్నివేశాలతో ఆధ్యాత్మికత ఉట్టి పడుతూ ఉంటుంది. భక్త రామదాసు రాములోరికి ఆలయం కట్టించటమే కాక అనేక బంగారు ఆభరణాలు చేయించి చరిత్రలో అపర భక్తాగ్రేసరులుగా మిగిలిపోయారు. ఆ బంగారు ఆభరణాలు నేటికి భక్తులను తన్మయత్వంలో ముంచెత్తుతుంది. భద్రాద్రికి తరలివచ్చే భక్తులు సైతం అనేక రకాల బంగారు ఆభరణాలను భద్రాద్రి రాముడికి కానుకగా సమర్పిస్తున్నారు. ప్రస్తుతం రాములోరికి 49 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు, 786 కేజీలకు పైగా వెండి, 34 కోట్లకు పైగా పిక్స్‌డ్ డిపాజిట్లు, 1347 ఎకరాలకు పైగా మాన్యం ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో భద్రాద్రి రామయ్యకు ఆస్తులు ఉండి బంగారు రామయ్యగా విరాజిల్లుతున్నారు. రాబడి మార్గాలపై మరింత దృష్టిసారిస్తే ఆలయం ప్రగతి బాట పడుతుంది.

49 కేజీల బంగారు ఆభరణాలు...
భద్రాద్రి రాముడు బంగారు రాముడే. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాద్రి రామయ్య దర్శనార్ధం నిత్యం దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. తమ ఇలవేల్పుగా రామున్ని భావించే భక్తులు అనేక రకాల కానుకలు సమర్పిస్తుంటారు. బంగారం, వెండి, రాగితో పాటు పెద్ద మొత్తంలోనే నగదు కానుకలు కూడా సమర్పిస్తారు. క్రీస్తు శకం 16వ శతాబ్ధంలో భక్తరామదాసు భద్రాద్రిలో రామాలయాన్ని కట్టించి రాములోరికి అనేక రకాలుగా బంగారు ఆభరణాలు చేయించిన సంగతి విధితమే. నేటికి ఇవి భక్తులకు దర్శనమిస్తున్నాయి. ముక్కోటి, శ్రీరామనవమి సందర్భాల్లో రామదాసు చేయించిన ఆభరణాలను సీతారామచంద్రస్వామి వార్లకు దరింప చేస్తున్నారు. భక్తరామదాసు చేయించిన కలికితురాయి (30గ్రాములు), రవ్వల మొలతాడు (30గ్రాములు), పంచపాత్రలు (576 గ్రాములు), తమలపాకు (62 గ్రాములు), సున్నపు కాయ బంగారు గొలుసు (56 గ్రాములు), శ్రీరామమాడ (58 గ్రాములు), రెండు వరుసల గొలుసుతో పచ్చల పతకం (100ల గ్రాములు), బిల్లల భుజ బందు, తాయత్తులు, చంద్రవంక లక్కతో సహా (40గ్రాములు), దుద్దులు 2, చెవి పోగులు 2 (40 గ్రాములు), కెంపుల చింతాకు పతకం (50 గ్రాములు), మూడు మంగళ సూత్రాలు గొలుసు (258 గ్రాములు), జడ నగరు (200ల గ్రాములు), సీతమ్మవారి కిరీటం (160 గ్రాములు), తులసి గుండ్లహారం (300ల గ్రాములు), వైరముడి (120 గ్రాములు), అషరఫీల హారం (448 గ్రాములు), డైమండ్ నక్లెస్ పతకంతో (45 గ్రాములు), గజ్జల వడ్డానం (150 గ్రాములు), బిల్లల మొలతాడు, తాయత్తులు (100 గ్రాములు) ఈ ఆభరణాలన్ని నేటికి రామాలయంలో భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఇవేకాకుండా భక్తులు సమర్పించిన అనేక రకాల బంగారు ఆభరణాలు రాములోరికి దరిస్తున్నారు. మొత్తం 49 కేజీల 195 గ్రాముల 347 మిల్లీ గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వెండి 786 కేజీల 280 గ్రాముల 260 మిల్లీ గ్రాములు ఉంది. ఇలా 700 రకాల ఆభరణాలు భద్రాద్రి రామయ్యకు ఉండటం గమనార్హం.

రూ.34 కోట్లకు పైగా పిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో...
భద్రాద్రి రామయ్యకు బంగారం, వెండి ఆభరణాలే కాకుండా రూ.34 కోట్ల 28లక్షల 66వేల 467 లు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో నగదు ఉంది. ఇవి వివిధ బ్యాంకుల్లో నిల్వ చేశారు. వీటి నుంచి వచ్చే వడ్డీ ద్వారా నిత్యన్నదానం, ఉద్యోగులకు వేతనాలు అందజేస్తున్నారు. ఎంప్లాయీస్ పింఛన్ ఫండ్, అన్నదానం, శాశ్వత పూజలు, భూములు, రిజర్వ్యూఫండ్, కాటేజీ నిర్మాణం, వాగ్గేయ కారోత్సవాలు, ఫ్లవర్ డేకరేషన్, రామదాసు ప్రాజెక్టు, జనరల్ ఫండ్ ఇలా 196 ఎఫ్‌డీఆర్‌లు ఉన్నాయి.

వివిధ జిల్లాల్లో 1347 ఎకరాల మాన్యం..
రాములోరికి వివిధ జిల్లాల్లో 1347 ఎకరాల మాన్యం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65.76 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 0.14 ఎకరాలు, మెదక్ జిల్లాలో 233.23 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లాలో 14.64 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 26.45 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 34.13 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 41.02 ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 911.78 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 20.12 ఎకరాల మాన్యం ఉంది. ఇందులో 18.32 ఎకరాల మాగాణి భూమి కాగా, 1328.95 ఎకరాల మెట్ట భూమి ఉంది. వివిధ జిల్లాల్లో రాముని మాన్యం ఆక్రమణల్లో కూడా ఉంది. కోర్టు పరిధిలో కొన్ని కేసులు నేటికి పెండింగ్‌లో ఉన్నాయి. భద్రాద్రి రామయ్యకు ఇంత నగదు, ఆభరణాలు ఉన్నప్పటికీ ఇంకా పెంచుకునే మార్గం అనేకం. భద్రాచలం క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శాశ్వత సుందర భద్రాద్రికి రూ.100కోట్ల నిధులను  కేటాయించడం జరిగింది. త్వరలోనే ఈ నిధులతో భద్రాచలం రామక్షేత్రం సర్వాంగ సుందరంగా మారనుంది.







బంగారు రాముడు.!



భద్రాద్రి రాముడు భక్తుల ఇలవేల్పేకాదు బంగారు రాముడు కూడా...!
32 కేజీల స్వర్ణాధిపతి...!
1347 ఎకారాల ఆసామి...!
రెండు తెలుగు రాష్ట్రాలలో విలువైన భూములు సొంతం...!
ఏడాదికేడాది సీతారాముల ఆదాయం పెరుగుతున్నా ఖర్చులు కూడా సమం అవుతున్నాయి!
పాలక మండలి ఏర్పాటుతో ఆలయ ప్రగతి గణనీయంగా పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. నిత్యం వేలాది మంది భక్తులు భద్రాచలం తరలివస్తుంటారు. భద్రాద్రి రామయ్యను తరిస్తే సకల సంతోషాలు కలుగుతాయన్న నమ్మకం భక్తులది. అంతేకాకుండా రామయ్యకు కానుకలు సమర్పిస్తే తమకు కూడా ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడతాయన్న భావన. అందుకే నిత్యం భద్రాచలం తరలివచ్చే భక్తులు వివిధ రకాల కానుకలు సీతారాములకు సమర్పిస్తుంటారు. రాముడిపై ప్రేమతో ఆలయం కట్టించడమే కాకుండా నాడే అనేక బంగారు ఆభరణాలను అపర భక్తగ్రేసరుడు కంచర్ల గోపన్న చేయించాడు.

చింతాకు పతకం, పచ్చలపతకం, రవ్వల పతకం, మంగళసూత్రాలు, రవ్వల మొలతాడు, బంగారు శఠారి, శంకుచక్రాలు, వైరముడి, బంగారుజడ, శ్రీరామమాడ, కలికితురాయి తదితర వాటిని బంగారంతో రామదాసు చేయించాడు. రామదాసు చేయించినవే కాకుండా అనేకమంది భక్తులు రామయ్యకు నాటి నుంచి నేటి వరకు అనేక కానుకలు సమర్పించారు. ప్రస్తుతం శ్రీసీతారాములకు 32 కేజీల 670 గ్రాముల 538 మిల్లీగ్రాముల బంగారం ఉండటం గమనార్హం. 12 కేజీల 279గ్రాముల 750 మిల్లీగ్రాముల బంగారు బాండ్ల రూపంలో ఉంది. వెండి 795 కేజీల 19 గ్రాముల 590 మిల్లీగ్రాములు ఉంది.

అదే విధంగా రామయ్యకు చాలినంత బంగారమే కాదు వేలాది ఎకరాల మాన్యం కూడా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మెట్ట, బీడుతో కూడిన పంటపొలాలు, స్థలాలు ఉన్నాయి. ఖమ్మం, మెదక్ తదితర తెలంగాణ జిల్లాలతోపాటు కృష్ణ, గుంటూరు, ప్రకాశం, కర్నూల్, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భద్రాచలం దేవస్థానం భూములు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 97సెంట్ల మెట్టభూమి, 80.13 సెంట్లు బీడు భూములు, మెదక్ జిల్లాలో 233.23 ఎకరాల బీడు భూములు ఉన్నాయి. ఆంధ్రాలో ఉన్న జిల్లాల్లో 17.35 మెట్ట, 1015.59 ఎకరాల బీడు భూములు ఉన్నాయి. మొత్తం మీద రామయ్యకు మాన్యం మెట్ట 18.32 సెంటీమీటర్లు, 1329.95 బీడు భూములు కలవు. అయితే ఇందులో ఆంధ్రాలో 974.06 ఎకరాల భూమి, తెలంగాణలో 233.23 ఎకరాల భూమి ఆక్రమణలో ఉండటం గమనార్హం. వీటికి సంబంధించిన కేసులు కోర్టులో ఉన్నాయి.

కాగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంకు కానుకలు విరివిగా వస్తున్నా ఖర్చులు కూడా అంతే విధంగా ఉంటున్నాయి. 2012-13లో రూ.23,90,75, 307.08లు ఆదాయం రాగా రూ. 24,27,72,543.70 ఖర్చు అయింది. 2013-14లో రూ.22,02,45,929.54 ఆదాయం రాగా రూ.22,07,48,713.69 ఖర్చు అయింది. 2014-15లో రూ.288,345,057.09 ఆదాయం రాగా రూ.279,939,207,00 ఖర్చు వచ్చింది. ఆలయానికి ఆదాయ వనరులు బాగానే ఉన్నప్పటికి రోజురోజుకు ఖర్చులు పెరుగుతుండటంతో మిగులు ఆదాయం కనిపించడంలేదు. ఆలయ ఆలనా పాలనతోపాటు ఉద్యోగుల జీతభత్యాలు ఇందులో నుంచే ఖర్చు పెట్టాల్సి ఉంది. ఇటీవల పుష్కరాలకు ఆదాయం భాగానే వచ్చినా ఖర్చు కూడా అంతే వచ్చింది. ఆదాయ వనరులను ఇంకా పెంచుకునేందుకు దేవస్థానం అధికారులు దృష్టిసారించాల్సి ఉంది. పాలకమండలి లేకపోవడం కూడా అనేక సమస్యలకు దారి తీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే దేవస్థానం పాలకమండలి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో ఇక భద్రాద్రి రామాలయం ప్రగతి బాట పట్టే అవకాశం ఉంది. 



Mar 26, 2018


రాముడి పుట్టిన రోజు సీతమ్మ హడావుడి


శ్రీరామనవమి అంటే రాముడి పుట్టిన రోజు. కాకతాళీయంగా అదే రోజున రాముడి కళ్యాణం కూడా జరిగింది. దాంతో రాముడికి పెళ్ళిరోజు, పుట్టినరోజూ ఒక్కటే అయ్యాయి. కానీ సీతమ్మ పరిస్థితి అదికాదు. సీత వైశాఖమాసం శుక్లపక్షం నవమినాడు పుట్టింది. ఈ రోజును సీతానవమిగా జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. ఉత్తరాదిన జరిగే ఈ పండగకు దక్షిణాదిన అంతగా ప్రాచుర్యంలేదు. రామయ్య వంటి కొడుకు పుట్టాలని..సీతమ్మ వంటి బిడ్డ కావాలని..అని జానపదులు పాట కూడా పాడతారు. కాని సీత జయంతిని జరుపుకోవడం అంతగా కనబడదు. అయినా శ్రీరామనవమి అనగానే పండితులు సీతారాముల కళ్యాణం, సీతాకళ్యాణం అంటూ మాట్లాడతారే తప్ప రాముని పుట్టినరోజు గురించి ఘనంగా మాట్లాడరు. అదేమంటే సీతారాములు అవిభాజ్యులు అంటారు. కనీసం రాముడి కళ్యాణం అని కూడా అనరు. రాముడికి అత్యంత ప్రాధాన్యమున్న రోజున సీతమ్మే ముందు నిలిచి ప్రజల ఆలోచనలను ఆకట్టుకుంటోంది.

శ్రీరామనవమి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సీతారాముల కళ్యాణం. కానీ ఈ కళ్యాణం కన్నా ముందునుంచే ఈ నవమికి ప్రాధాన్యత ఉంది. ఏమిటా ప్రాధాన్యత? ఈ చైత్రశుద్ధనవమినాడు పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడు. శ్రీమన్నారాయణుడు కోరికోరి ఈ ముహూర్తాన్ని ఎంచుకుని జన్మించాడు. ఇది శుభలగ్నమని ఈ సమయంలో అవతారం తీసుకోమని బ్రహ్మదేవుడు ముహూర్తం పెడితే నారాయణుడు అందుకు అంగీకరించి భూమిపై అవతరించాడు. ఆయన రాకతో సూర్యవంశం తరించింది. ఇక్ష్వాకుడు ఆదిగాగల వంశకర్తలు, మూలపురుషులు తమ జన్మతరించిందని, తమ పూజలు, పుణ్యకార్యాలు ఫలించాయని బ్రహ్మానంద పడిపోయారు. శ్రీరాముడి పుట్టినరోజున ఇష్టమృష్టాన్న భోజనాలతో, పంచభక్షపరమాన్నాలతో ఊరంతటికీ విందుచేసేవాడు దశరథ మహారాజు. ఆ రోజున లోకాలన్నీ పండగ చేసుకున్నాయి. సీతమ్మను పెళ్ళి చేసుకోకముందు వరకు శ్రీరామనవమి రాముడి పుట్టినరోజుగానే పరమ విశేషంగా ఉంది.

రాముడు విశ్వామిత్రుడి వెంట అడవికి వెళ్ళడం, తాటక, సుబాహు తదితర రాక్షసులను వధించడం చేశాక జనక మహారాజు ఆహ్వానంపై మిథిలానగరానికి వెళ్ళాడు. అది సీతమ్మ పుట్టిన ఊరు. సీతమ్మ అంటే సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి అని జనకమహారాజు, ఆయన భార్య ధరణీదేవి కూడా నమ్మారు. అలాగే అపురూపంగా పెంచారు. పిల్లలే లేని వారికి సీతమ్మ అయోనిజగా దొరికింది. కన్న ప్రేమకన్నా పెంచిన ప్రేమ గొప్పదన్న సామెతను జనకమహారాజు నిజంచేశాడు. ఆమె తండ్రిచాటు బిడ్డగా పెరిగింది. అందుకే ఒక్క సీతాదేవే జానకి అని పిలిపించుకోగలిగింది. ఆ తర్వాత రోజులలో ఆయనకు ఊర్మిళాదేవి జన్మించింది. ఆమెను కూడా ఎంతో గారాబంగా పెంచినా జానకీ అనే ముద్దుపేరు ఆమెకు దక్కలేదు. నిజానికి కడుపుచించుకుంటే పుట్టిన బిడ్డకాబట్టి ఊర్మిళకు ఆ పేరు దక్కాల్సి ఉంది. కానీ ఆ స్థానాన్ని ఆమెకన్నా ముందుగా జనకుని జీవితంలోకి ప్రవేశించిన సీతమ్మ సంపాదించుకుంది. బిడ్డలే లేని రోజులలో దొరికిన సీతమ్మ అపురూపంగా అనిపించినా బిడ్డపుట్టిన తర్వాత కూడా ఆ ప్రేమను తగ్గనీయకుండా ప్రదర్శించిన జనకమహారాజు ఎంతో గొప్పవాడు.

జనకుడి ఇంట్లో శివుని విల్లు ఉంది. దక్షయజ్ఞం సమయంలో వింటితో చెలరేగి అరుద్రయాగానికి వచ్చిన వారిని దండించాడు. దేవతలు శివునికి లొంగిపోయి ప్రసన్నం చేసుకున్నాక ఆయన తన వింటిని దేవతలకు ఇచ్చి వెళ్ళిపోయాడు. వారు ఆ వింటిని జనకమహారాజుకు ఇచ్చి వెళ్ళారు. ఆయన ఆ వింటిని పూజామందిరంలో ఉంచి పూజించేవాడు. అది ఒక వాహనంపై ఉండేది. ఒకసారి తన ఆటబంతి కోసం సీత ఆవాహనాన్ని పక్కకు తోసేసింది. మహావీరులైనా కదిలించలేని ఆ వింటిని ఎక్కుపెట్టే వాడే సీతకు సరైన జోడు అని నిర్ణయించుకుని చాటింపు వేయించాడు జనకుడు. యోగ్యుడైన వీరుడు దొరికే వరకు ఈ ఆహ్వానం అమలులో ఉంది. కనుక ఎందరో రాజులు అదేపనిగా వచ్చినపుడో, అటుగా వచ్చినపుడో, తమకు తోచినపుడో వచ్చారు..విల్లుఎక్కుపెట్టే ప్రయత్నాలు చేశారు..విఫలమయ్యారు! తమ వల్ల కాక కొందరు డీలాపడితే, మానవమాత్రుడికి సాధ్యంకాని నియమంతో రాజలోకాన్ని అవమానపరుస్తున్నారని చాలామంది విరగబడ్డారు.. తిరగబడ్డారు.. విరుచుకుపడ్డారు.. కత్తులు దూశారు.. కదం తొక్కారు.. ఎడతెగని యుద్ధాలు చేశారు. వయసు మీద పడ్డా సీతను కాపాడేందుకు జనకుడు శక్తికి మించిన యుద్ధాలు చేశాడు..రాజమూకను తరిమి తరిమి కొట్టాడు. ఎంత మంది ఏకమై వచ్చినా వెనుదిరగకుండా.. వెనకడుగువేయకుండా.. మడమతిప్పని పోరాటాలు చేశాడు. ఆయన ఆయుధాగారంలో ఆయుధాలన్నీ అయిపోయాయే తప్ప యుద్ధాలు మాత్రం ఆగలేదు. యజ్ఞాలుచేసి దేవతలను మెప్పించిన జనకుడు ఆయుధాలు సమకూర్చుకుని పోరాటాలు చేసి చేసి అలసిపోయాడు. వాలిపోతున్న వయసుతో ఇలా ఎంతకాలం పోరాటం చేయడం..? సీతమ్మను ఎలా రక్షించడం..అని బెంగపడ్డాడు. ఆ స్థితిలో రాముడు ఆయన అంతఃపురానికి వచ్చాడు. శివుని విల్లు విరిచి ఆయన బెంగ తీర్చాడు.

రాముని జననంలో ఆనందం, సకల దేవతావ్యూహం ఉంటే సీతమ్మ వివాహం వెనక ఒక కన్నీటి గాధ, భయం, ఆందోళన, మానసిక ఉద్రేకం ఉన్నాయి. అవన్నీ తీర్చిన రాముడు సీతకు దేవుడికన్నా ఎక్కువవాడయ్యాడు. పెళ్ళి చేసుకుని నిజంగానే ప్రాణనాథుడయ్యాడు. సామాన్య స్త్రీలంతా సామాన్య పురుషుల్ని వివాహం చేసుకుని ఆయనను దేవుడిగా భావిస్తే సీత నిజంగానే దేవున్ని వివాహం చేసుకుంది. ఈ పెళ్ళి కూడా ఆయన పుట్టిన రోజునాడే జరగడం మరో విశేషం.

చైత్రశుక్ల నవమి ఈ విధంగా రెండు ప్రధాన సంఘటనలకు వేదిక అయింది. ఆ రెండు సంఘటనలు రాముడివే! అయినా సరే నవమినాడు ఏమిటి ప్రత్యేకత అని అడిగితే రాముడి వివాహం అని ఎవ్వరూ చెప్పరు. జానపదులు మాత్రమే రాములోరి వివాహం అంటారు తప్ప సభ్యసమాజంలోని వారు మాత్రం సీతారాముల వివాహం అనో, సీతాకళ్యాణమనో మాత్రమే అంటారు. పండగంతా రాముడిదైనా కీర్తి పూర్తిగా సీతకు సొంతమైంది. ఈ విధంగా సీతమ్మ రాముని పుట్టినరోజునాడు ఆయన జీవితంలోకి ప్రవేశించి తన ప్రాముఖ్యతను పెంచేసుకుంది. దాంతో రాముడి పుట్టిన రోజు హడావుడి పక్కకుపోయి సీతా కళ్యాణం తెరమీదికి వచ్చింది. ఇలా రాముడి పుట్టినరోజునాడు సీతమ్మ హడావుడే కనబడుతోంది. 




భద్రాచలం గుడికి సంభందించిన విషయాలు

కోదండరాముడు, అయోధ్యరాముడు, జానకిరాముడు అంటూ ఆ శ్రీరామమూర్తిని భక్తులు ఆర్తితో పిలుచుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమయిన శ్రీ రాముడు మానవరూపంలో ఈ భూమి యందు నడయాడిన ఉత్తమ పురుషుడిగా మన వేదాలు చెబుతున్నాయి. మానవులు ధర్మంతో ఎలా మెలగాలో అనే విషయాన్ని తాను ఆచరించి చూపించిన మహా ధర్మమూర్తి. ఆయన అంత ధర్మమూర్తి కాబట్టే ఆయన పాలన కూడా అంత గొప్పగా వుండేది. అందువల్లే ఇప్పటికీ ఏ ప్రాంతంలోనైనా పాలన బాగా జరిగితే ఆ పాలన జరిగిన ప్రాంతాన్ని శ్రీరామరాజ్యంగా భావిస్తారంటే ఆయన పాలన ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం గుడి గురించి అక్కడి విశిష్టతల గురించి తెలుసుకుందాం.

భద్రాచలం శ్రీరాముని యొక్క దివ్యక్షేత్రం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గోదావరినది తీరంలో వున్నది. ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో వున్నది. పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడి కోసం తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు వచ్చింది. ఇతిహాసం గోల్కొండను నవాబు అబుల్ హసన్ తానీషా పరిపాలించేటప్పుడు భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు.

1. సమీపంలోని పర్ణశాల
రామావతారంలో సీతారాములు లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేసే సమయంలో ఈ భద్రాచలం సమీపంలోని పర్ణశాలలో వున్నట్లు చరిత్ర చెపుతుంది. అక్కడ ఉన్నప్పుడే రావణుడు సీతను అపహరించాడు. సరిగ్గా అదే సమయంలో భద్రుడనే ఋషి రాముడిని చూసి ఒక వరం అడిగాడు.


2. వరం
ఆ వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు కొలువై వుండాలి. దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను. తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినపుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట.

3. భద్రుని ఘోరతపస్సు
కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరచిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అది తెలిసిన భద్రుడు ఘోరతపస్సు చేయటంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిసాడు

4. విష్ణువు
అయితే ఆయన వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం,విల్లుతో పాటు విష్ణువు చేతిలో వుండే శంఖచక్రాలను కూడా తనతో తీసుకువచ్చేశాడని అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడూ కుడివైపునే లక్ష్మణుడు ఎడమవైపున నిల్చొన్నట్లు పురాణాలను బట్టి తెలుస్తుంది.

5. మూల విగ్రహం
అందుకే అక్కడ మూల విగ్రహం ఎక్కడా లేని విధంగా వుంటుంది. రాములవారి విగ్రహం నాలుగు చేతులతో వుండగా లక్ష్మణ స్వామి ఎడమవైపున వున్నట్లు కనపడుతుంది. ఆయన నాలుగు చేతులలో కుడివైపున వున్న రెండు చేతులలో శంఖము, బాణము వుండగా, ఎడమవైపున వున్న రెండు చేతులలో విల్లు, చక్రము కనిపిస్తుంది.

6. వైకుంఠం రాముడు
వైకుంఠం నుండి నేరుగా వచ్చి ఇక్కడ వెలిసాడుకాబట్టి వైకుంఠ రాముడయ్యాడని మరో కథనం వుంది. భద్రుడనే ఋషి తపస్సు వలన ఆయన తపస్సు చేసిన కొండ మీదే శ్రేరాముడు వెలశాడు. అందుకే ఆ ప్రాంతం భాద్రాద్రిగా పేరు గాంచింది.

7. రామరామరామ
అయితే అక్కడి గర్భగుడి ప్రక్కనే భద్రుడి బండ అనే ఒక బండరాయి వుంది. ఆ రాయిపై చెవి పెట్టి వింటే రామరామరామ అనే శ్రీరామ జపం వినిపిస్తుందట. రామదాసు ఇప్పుడు వున్న రామాలయాన్ని కట్టించక మునుపు ఒక చిన్న ఆలయంగా అక్కడి బోయవారు కట్టి పూజించేవారు.

8. ఆదిశంకరాచార్యులు
ఆలయ నిర్మాణానికి కొన్ని వందల సంవత్సరాలకి ముందు అక్కడికి వచ్చిన ఆదిశంకరాచార్యులు శ్రీరామదర్శనం చేసుకున్నప్పుడు సాక్షాత్తు వైకుంఠంలో వున్నట్లు ఆయనకు అనిపించిందట. అందుకనే భద్రాద్రి రాముడికి వైకుంఠరాముడు అని పేరు పెట్టారని ఒక కథనం వుంది.

9. రామదాసు చరిత్ర కథ కాదు
ఆ పేరుని ఇప్పటికీ భక్తులు స్మరిస్తూనే వున్నారు. రామదాసు చరిత్ర కథ కాదని యదార్థ ఘటనని నిరూపించటానికి ప్రధమ సాక్ష్యం భద్రాద్రి ఆలయమయితే రెండవ సాక్ష్యం గోల్కొండలోని రామదాసు చెరశాల.

10. రాములవారి పూజలు
రామదాసుని బంధించిన చెరశాలలో నిత్యం రాములవారి పూజలు చేసుకోవటానికి అక్కడ గోడలపై రామదాసు స్వయంగా తన చేతులతో సీతారాములు, ఆంజనేయస్వామి, లక్ష్మణస్వామి విగ్రహాలను చెక్కాడు. ఇప్పటికీ ఆ బొమ్మలు గోల్కొండ కోటలోని రామదాసు చెరశాలలో కనిపిస్తాయి.

11. గర్భగుడి
రాములవారి గర్భగుడిపై వున్న చక్రాన్ని ఎవ్వరూ తయారుచేయలేదట. ఆ గుడి కడుతున్న సమయంలో భక్తరామదాసు అక్కడ గోదారిలో స్నానం ఆచరిస్తున్నప్పుడు ఆ నదీ ప్రవాహంలో కొట్టుకువచ్చి రామదాసు చేతిలో పడిందట ఆ చక్రం. అది రాములవారు ప్రసాదించారని భావించిన రామదాసు ఆ చక్రాన్ని తీసుకువచ్చి గర్భగుడి గోపురంపై ప్రతిష్టించాడు.

12. ఏకశిల
ఆలయంలో రాముడు కొలువైవున్న గర్భగుడిపై వున్న శిఖరాన్ని ఏకశిలపై చెక్కారు. ఈ రాయి బరువు 36 టన్నులు, అంతటి బరువైన రాయిని ఎటువంటి ఆధునిక పరికరాలు లేని ఆకాలంలో అంత పైకి చేర్చిన అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంతటి ఉన్నతస్థానంలో ఉండేదో తెలుస్తుంది.

13. దేవుడికి ఆభరణాలు
ఈ ప్రపంచంలోని ఏ ఆలయంలోనైనా దేవుడికి ఆభరణాలు భక్తులు చేయిస్తారు. కానీ ఒక్క భద్రాద్రిలో మాత్రం రాములవారి నగలకు ఆయనే మూల్యం చెల్లించాడు.రామదాసుప్రభుత్వ డబ్బుతో స్వామివారికి నగలు చేయించినందుకుగానూ, రామదాసుని చెరశాలలో బంధించారు.

14. శ్రీరామ టెంకలు
తన భక్తుడిని విడిపించటానికి రాములవారు ఆయన కాలం నాటి శ్రీరామ టెంకలు అంటే నాణేల రూపంలో ఆరు లక్షల రూపాయలను చెల్లించాడు. దీన్నిబట్టి గుడి ఖర్చు, ఆభరణాల ఖర్చు రాములవారు స్వయంగా చెల్లించినట్లయింది. ఇప్పటికీ ఆ నాణేలు గుడి మ్యూజియంలో వున్నాయి.

15. ముత్యాల తలంబ్రాలు
రాములవారి కల్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఒక ప్రత్యేక స్థానం వుందనే చెప్పాలి. భక్తరామదాసు వల్ల అప్పటి రాజు తానీషాకి కలలో రాముడు దర్శనం అవటం వల్ల ఆ మహాథ్భాగ్యానికి పొంగిపోయిన తానీషా ముత్యాల తలంబ్రాలను రాములవారి కల్యాణంలో సమర్పించి ఒక శాసనం కూడా చేసాడు.

16. పాలకుల చేతుల మీదుగా
ఈ శాసనం ప్రకారం స్వామివారి కల్యాణంలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు పాలకుల చేతుల మీదుగానే రావాలని వుంది. అందుకే ఇప్పటికీ ఆ సంప్రదాయాలని మన ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి.

17. మంగళ సూత్రాలు
రాముల వారి కల్యాణంలో వాడే మంగళ సూత్రాలు 16 వ శతాబ్దంలో భక్త రామదాసు చేయించాడు. అప్పుడు ఆయన చేయించిన మంగళ సూత్రాలతో పాటు మిగిలినఆభరణాలన్నీ ఇప్పటికీ వాడుతున్నారు.

18. శ్రీరామనవమి వేడుకలు
భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలలో శ్రీరామునిపై వేసే కోటి తలంబ్రాలను చేతితో తయారుచేస్తారు. అంటే తలంబ్రాలకు అవసరమయే బియ్యం కోసం వడ్లగింజలను దంచడమో, మిషిన్ ల మీద ఆడించడమో చేయకుండా ఒక్కొక్క వడ్లగింజ మీద పొత్తును చేతితో తీసి ఆ బియ్యాన్ని కోటితలంబ్రాలుగా చేస్తారు.

19. బస్సు సౌకర్యం
భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా అనుసంధానమై వుంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

20. రైలు సౌకర్యం
భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి రెండు, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.

21.లాంచీ సౌకర్యం
గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి.







భద్రాచలం విషయాలు

భద్రాచలం శ్రీరాముని యొక్క దివ్యక్షేత్రం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గోదావరినది తీరంలో వున్నది. ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో వున్నది. పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడి కోసం తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు వచ్చింది.

ఇతిహాసం 

గోల్కొండను నవాబు అబుల్ హసన్ తానీషా పరిపాలించేటప్పుడు భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు.

దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి చేయించాడు. ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్థించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది.

1. కొలువుతీరిన శ్రీరామచంద్రుడు
దేవాలయ మందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది.

2. సీతారామ కళ్యాణ ఉత్సవం
ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం.

3. వైకుంఠ రాముడు
భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు.

4. బస్సు సౌకర్యం
భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా అనుసంధానమై వుంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

5. రైలు సౌకర్యం
భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి రెండు, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.

6. లాంచీ సౌకర్యం
గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి.

7. వికలాంగుల కోసం
భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారి కోసం లిఫ్ట్‌ సౌకర్యం కలదు.

8. కిన్నెరసాని
భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము, జింకల పార్కు ఉన్నవి.

9. పర్ణశాల
వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడి నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం.

10. పాపి కొండలు:
సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది.

11. సంస్కృతి సంప్రదాయాలు
భద్రాచలం పరిసరప్రాంతాలలో సుందరమైనటువంటి అడవి, జలపాతాలు ఉన్నవి. భద్రాచలం చుట్టుపక్కల గిరిజన ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు కట్టుబొట్టు ధింస్సా నృత్యం, కొమ్మునృత్యం జాతరలు పండగలు జరుపుకుంటారు. భద్రాచలంలో శ్రీరామ నవమి నాడు సీత రామ కళ్యాణం ఎంతో ఘనంగా జరుపుతారు.

12. భద్రగిరి
మేరుపర్వతం మరియు మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.

13. వైకుంఠ రాముడు
శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణంను ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖును ఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటుంది. భద్రుని కోరికమేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్షనమివ్వటంవల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు.

14. సీతమ్మవారు
ఇతర దేవాలయములలో సీతమ్మవారు రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనయై ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురకూ రెండు పీఠాలు ఉంటాయి ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది. అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు కాని ఇక్కడ మాత్రం ఎడమపైపున ఉంటాడు.

15. నిత్యపూజలు, ఉత్సవాలు
ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతున్నది.

16. వైకుంఠఏకాదశి పర్వదినం
వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనమివ్వటంవల్ల వైకుంఠఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారదర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్దిచెందింది. ఇది కూడా చదవండి:శ్రీ పెద్దమ్మ దేవాలయం

17. నిత్యపూజలు
తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబదడిన ఆరు వంశాలకు చెందిన శ్రీవైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికి భద్రాచలంలో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. రామానుజులవారిచే శ్రీరంగంలో నిర్ణయించబడిన విధంగానే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు.

18. పర్ణశాల
ఇది భద్రాచలం నుండి 35 కి.మీ. దూరంలో ఉన్నది. సీతారామలక్ష్మణులు తమ వనవాస వనవాసం సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడిరూపంలో వచ్చిన మారీచుని బొమ్మ. పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మవాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపుని రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు.

19. భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి
రావణుడు సీతను అపహరిమంచిన ప్రదేశం ఇది. సీత వియోగాన్ని పొందిన రామచమంద్రుడు శోక మూర్తిగా కనిపిస్తాడు. భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాల రామునిలో కనిపించదు. శ్రీరామ నవమి రొజున ఇక్కడ కూడా కల్యాణోత్సవం జరుగుతుంది.

20. జటాయుపాక
భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువు యొక్క ఒక రెక్క ఇక్కడికి 55 కి.మీ. దూరంలో ఉన్న వి.ఆర్.పురం మండలంలో రెఖపల్లి గ్రామంలో పడిందట.

21. దుమ్ముగూడెం
ఇక్కడ జరిగిన భీకరయుద్ధంలో రాముడు 14,000 రాక్షసులను హతమార్చాడట. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉన్నది గనుక దీనిపేరు దుమ్ముగూడెం. ఇక్కడి రాముడిని ఆత్మారాముడంటారు.

22. వేడినీటి బుగ్గలు
ఇవి భద్రాచలానికి 5 కి.మీ. దూరంలో ఉన్న వేడినీటి బుగ్గలు. ఇక్కడ నదిఒడ్డున ఎక్కడ తవ్వినా వేడినీరు ఊరుతుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు చలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారట.

23. శ్రీరామగిరి
ఇది గోదావరి దిగువన 55 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన యోగరాముని మందిరం ఉంది.

24. పాపికొండలు
పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి.

25. ఆహ్లాదకరమైన వాతావరణము
సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది.

26. పాపికొండల అడవులు
పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉన్నది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది.

27. గోదావరి నది
పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణంకు మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.




భద్రాచల రామయ్య

శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవుడిగా దాల్చిన అవతారం శ్రీరామ అవతారం. మానవ రూపంలో భూమిపై అడుగుపెట్టిన ఆ దివ్యమూర్తి పురుషోత్తముడిగా ఎలా వుండాలో ఆచరణలో చూపించాడు. చైత్ర మాసం నవమినాడు జన్మించిన శ్రీరాముడు ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా రామరాజ్యాన్ని నెలకొల్పాడు. ఈ నెల 15న శ్రీరామనవమి పర్వదినం. ఈ సందర్భంగా యావత్‌ భారతదేశంతో పాటు తెలుగురాష్ట్రాల్లో నవమి వేడుకలు అంబరాన్ని తాకుతాయి. ప్రతి ఇల్లు, వీధి, వాడ, పట్టణం, నగరం... శ్రీరామ నామ స్మరణతో ప్రతిధ్వనిస్తాయి. తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట ఆలయాల్లో జరిగే శ్రీరాముని బ్రహ్మోత్సవాల విశిష్టతను, ఆలయ చరిత్రను తెలుసుకుందాం.

కరుణాపయోనిధి.. భద్రగిరి రామయ్య
పవిత్ర గోదావరి నదితీరంలోని భద్రాద్రిలో వెలసిన శ్రీసీతారామస్వామి ఆలయం దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. వనవాసకాలంలో స్వామివారు సీతా, లక్ష్మణులతో కలిసి ఇక్కడే నివాసమున్న పవిత్రనేల ఇది. పర్ణశాల నుంచే అమ్మవారిని రావణాసురుడు అపహరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

భద్రగిరి
మేరు, మేనకల పుత్రుడైన భద్రుడు మునిపుంగవుడు. స్వామివారు పర్ణశాలలో నివాసమున్న విషయం తెలుసుకొని దర్శించుకుంటారు. అనంతరం రాముల వారు సీత అన్వేషణకు బయలుదేరుతారు. రావణవధ అనంతరం అక్కడకు విచ్చేస్తానని భద్రునికి వరమిస్తాడు. కొంత కాలానికి రావణ వధ జరగడం, శ్రీరామ పట్టాభిషేకం వెంట వెంటనే జరిగిపోతాయి. భద్ర మహర్షి శ్రీరామ దర్శనం కోసం తపస్సు చేస్తాడు. భక్తుని తపస్సును గమనించిన వైకంఠరాముడు యావత్‌ వైకుంఠమే కదిలివచ్చిన రీతిలో భద్రుడికి ప్రత్యక్షయ్యాడు. తాను కొండగా వుంటానని తనపై స్వామివారు అధిష్టించాలని భద్రుడు కోరుకుంటాడు. భక్తుని కోరిక ప్రకారమే భద్రగిరిపై సీతాసమేతంగా స్వామి వెలిశారు.

భక్త రామదాసు
గోల్కోండ రాజ్యంలో పాల్వంచ పరగణాకు కంచెర్ల గోపన్న తహశీల్దారుగా నియమితులయ్యారు. పరమ రామభక్తుడైన గోపన్న భద్రగిరిపై వున్న శ్రీరామచంద్రప్రభువుకు ఆలయ నిర్మాణం చేయాలని తలుస్తాడు. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఆలయనిర్మాణానికి వినియోగిస్తాడు. సమాచారం అందుకున్న గోల్కోండ పాలకుడు తానీషా అతన్ని బందీఖానాలో బందిస్తాడు. తానీషాకు రామ, లక్ష్మణులే మారువేషాల్లో వచ్చి స్వయంగా గోపన్న చెల్లించాల్సిన ధనం చెల్లించి అతన్ని విడిపించినట్టు కథనాలు వెల్లడిస్తున్నాయి. చెరసాలనుంచి విడుదలైన గోపన్న తన జీవితాన్ని శ్రీరాముని సన్నిధిలోనే గడిపి భక్త రామదాసుగా చరిత్రలో నిలిచిపోయారు. శ్రీరాముడిపై ఆయన అనేక కీర్తనలను రాశారు.

వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు
శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శ్రీరామ కల్యాణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు భద్రాద్రికి చేరుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను రాములవారికి సమర్పిస్తారు. అంగరంగవైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు రెండు కన్నులు చాలవంటే అతిశయోక్తికాదు.

ఎలా చేరుకోవచ్చు
* హైదరాబాద్‌ నుంచి రైలులో భద్రాచలం రోడ్డు రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడ నుంచి భద్రాచలానికి చేరుకోవచ్చు.
* ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలనుంచి భద్రాచలానికి బస్సు సౌకర్యముంది.
* సమీప విమానాశ్రయం 117 కి.మీ.దూరంలోని రాజమండ్రి విమానాశ్రయం.
* హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 325 కి.మీ.దూరంలో ఉంది.






భద్రాద్రి
రెండున్నరేళ్లు రాముడి నివాసం

మానవ చరిత్రలో పురుషోత్తముడిగా రాముడు ప్రసిద్ధిగాంచాడు. దాంపత్యమంటే వీరిదే అని చెప్పేంతలా సీతారాములు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారని, గౌరవించుకున్నారు. అందుకే వారు ఆదర్శదంపతులు అయ్యారు. శ్రీరాముడు పుట్టినరోజు, పెళ్లి రోజు కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగాయని అంటారు. అందుకే ఈ రోజున హిందువులకు పెద్ద పండుగ. రాముడు తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవసానికి వెళ్లాడు. ఆ వనవాసంలో రెండున్నరేళ్లు మన భద్రాద్రిలోనే గడిపాడని అంటారు. అందుకే ఆ భద్రాద్రి పుణ్యక్షేత్రంగా, దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. ప్రతి ఏడాది ఇక్కడ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భ్రద్రాద్రి త్రేతాయుగంలో పెద్ద అటవీ ప్రాంతం. ఆ అటవీ ప్రాంతాన్ని పర్ణశాలగా పిలిచేవారప్పుడు. ఇక్కడే రాముడు ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని భార్య, తమ్ముడితో నివాసం ఉన్నాడు. రామాయణంలోని ముఖ్య ఘట్టం జరగడానికి నాంది పలికింది ఈ ప్రాంతంలోనే. ఈ కుటీరంలో ఉన్నప్పుడే లక్ష్మణుడు శూర్పనఖ ముక్కుచెవులు కోశాడు... సీతమ్మ బంగారు లేడిని చూసింది... రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు... తద్వారా రామరావణ యుద్ధానికి బీజం పడింది.

పర్ణశాలకు దగ్గర్లో ఉన్న దుమ్ముగూడెం ప్రాంతంలోనే అప్పట్లో రాముడు నలభైవేల మంది రాక్షసులను చంపాడని చెబుతారు. ఆ సమయంలో ఎగసిన దుమ్మువల్లే ఆ ప్రాంతానికి దుమ్ముగూడెం అనే పేరు వచ్చిందని చెబుతారు. అలాగే రావణాసురుడు సీతమ్మను ఎత్తుకు పోతున్నప్పుడు జటాయువు అడ్డు తగిలింది భద్రాద్రికి దగ్గర్లోనే. జటాయువు రెక్క తెగిపడిన ప్రాంతమే జటాయువు పాకగా తరువాత ఎటపాక గా మారినట్టు చరిత్రకారులు చెబుతారు. ఇక దగ్గరలోని ఉష్ణగుండల ప్రాంతం కూడా రాముడి చలవ వల్లే ఏర్పడిందట. రాముడు సీతమ్మ వారి దాహం తీర్చడం కోసం బాణం ఎక్కుపెట్టి భూమిలోకి వదులుతాడు. భూమిలోంచి వేడి నీళ్లు బయటికి వస్తాయి. ఆ ప్రాంతమే తరువాత ఉష్ణ గుండలగా మారిందట. ఇలా భద్రాద్రితో పాటూ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రామ పాద స్పర్శతో పునీత మైనవే. అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని ప్రతీతి.



ఒంటిమిట్ట - కోదండరామాలయం



శ్రీ కోదండరామాలయం 

శ్రీ రామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా వెలసిన క్షేత్రమే కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం. త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఇక్కడ నడిచినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగంలో స్వామివారు శ్రీ కోదండరామస్వామిగా తన భక్తులకు అభయమిస్తున్నారు. శ్రీ రామునికి అనుంగు భక్తుడైన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ లేకపోవడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఆంజనేయుని రాకకు ముందే ఈ క్షేత్రంలో స్వామివారు విహరించినట్టు తెలుస్తోంది.

జాంబవత స్థాపితం
వానరులలో బ్రహ్మజ్ఞాని జాంబవంతుడు. ఆయన ఎన్నో యుగాలను చూశారు. అనుభవశీలి, మేధావి, శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్న అనంతరం సీతారామ, లక్షణ విగ్రహాలను ప్రతిష్టించారు. కొద్దికాలానికి సంజీవరాయ మందిరంలో ఆంజనేయవిగ్రహాన్ని నెలకొల్పారు. కలియుగంలో ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ఒంటెడు, మిట్టడు అనే సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. వారిపేరుతోనే ఒంటిమిట్టగా ఈ గ్రామం ఖ్యాతిచెందింది. వీరి విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.

అద్భుతమైన ఆలయనిర్మాణం
ఆలయ నిర్మాణం విజయనగరవాస్తు శైలిలో అద్భుతంగా నిర్మితమైవుంటుంది. మూడు గోపురాలు సుందరంగా వుంటాయి. ఆలయం లోపల స్తంభాలు, గోడల పై సజీవమైన చిత్రకళను వీక్షించవచ్చు. విఘ్నేశ్వరుడు నాట్యభంగిమలో వుండి భక్తులకు ఆశీర్వచనం ఇస్తుంటాడు. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో పర్యటించిన ఫ్రెంచ్‌ యాత్రీకుడు టావెర్నియర్‌ ఆలయ గోపురం దేశంలోని పొడవైన గోపురాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆలయాన్ని అన్నమయ్య సందర్శించి అనేక సంకీర్తనలు రచించారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతనామాత్యులు ఆ గ్రంథాన్ని ఇక్కడే స్వామివారికి అంకితమిచ్చారు. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన రామభద్రకవి ఈ ప్రాంతానికి చెందినవాడేనని తెలుస్తోంది. ఆంధ్ర వాల్మీకిగా ఖ్యాతిచెందిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట నివాసి కావడం విశేషం. 1

పున్నమి వెలుగుల్లో పురుషోత్తముని కల్యాణం
చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

రాష్ట్ర ఉత్సవంగా బ్రహ్మోత్సవాలు
రాష్ట్ర విభజన అనంతరం కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించారు.

ఎలా చేరుకోవచ్చు
* కడప-తిరుపతి రహదారిపై వుంది. కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
* రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది.
* కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది.
* తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.




ఒంటిమిట్ట కోదండ రామాలయం 
సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడిన ప్రసిద్ధ ఆలయం

భారతదేశంలో కొలువై వున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కోదండ రామాలయం ఒకటి! ఇది ఎంతో ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో వుంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఇంకా చెప్పుకోదగ్గ ఎన్నో విశేషాలు ఈ ఆలయంలో సంతరించుకుని వున్నాయి.

రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా వున్న సమయంలో విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. అలాంటి సందర్భమే ‘సీతారామ కల్యాణం’ జరిగాక కూడా ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి దుష్టశిక్షణ కోసం రాముణ్ణి ప్రార్థించగా.. ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారు. తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.

ఆలయ విశేషాలు :
1. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని విగ్రహాలు ఈ ఆలయంలో చెక్కబడ్డాయి. అంతేకాదు.. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం దేశంలో ఇదొక్కటే.

2. ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.

3. 16వ శతాబ్దంలో ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.

4. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

ఇమాంబేగ్ బావి కథనం :
1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ రాజుకు ప్రతినిథిగా ఇమాంబేగ్ చెలామణీ అయ్యాడు. ఒక సందర్భంలో ఇమాంబేగ్ ఈ ఆలయానికి వచ్చిన భక్తులను..

‘మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా?’’ అని ప్రశ్నించాడు.
అందుకు భక్తులు.. ‘‘చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు’’ అని సమాధానమిచ్చారు.
దాంతో ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు.
అందుకు ప్రతిగా మూడు సార్లు ‘ఓ’ అని సమాధానం వచ్చింది.
ఆ సమాధానం విన్న ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. వెంటనే స్వామి భక్తుడిగా మారిపోయాడు.

అలా స్వామి భక్తుడిగా మారిపోయిన ఇమాంబేగ్... అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ‘ఇమాంబేగ్ బావి’గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, ఇక్కడి విశేషం. 


అందరి దేవుడు ఒంటిమిట్ట రాముడు

రఘురాముడు నడయాడిన పుణ్యభూమి ఏకశిలానగరి. దాశరథి పాద స్పర్శతో పునీతమైన ఈ ప్రదేశం ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతోంది. ఇక్కడి కోదండపాణి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమని భక్తుల విశ్వాసం.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం ఎంతో విశిష్టమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీరామనవమికి ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ సీతారాముల కల్యాణం నిర్వహిస్తోంది.

స్థల పురాణం...
జాంబవంతుడు త్రేతాయుగంలో ఒంటిమిట్టలోని శృంగిశైలంపైన ఆశ్రమం ఏర్పాటుచేసుకొని ఓ శిలలో సీతారాములను దర్శించుకుంటూ, వందేళ్లకుపైగా తపస్సు చేశాడని పురాణాలద్వారా తెలుస్తోంది. వనవాస సమయంలో రాముడు ఈ ప్రాంతంలో సంచరించి ఒంటిమిట్టకు సమీపంలో తపస్సు చేసుకుంటున్న మృకుండమహర్షికి రాక్షసుల బాధను తొలగించాడని చెబుతారు. వనవాస సమయంలో సీతమ్మకు దప్పిక అయినప్పుడు రాముడు భూమిలోకి బాణం చొప్పించాడనీ, దాంతో పాతాళం నుంచి జలం ఉబికిందనీ, ఆ నీటి బుగ్గే ప్రస్తుతం ఆలయ సమీపానున్న రామతీర్థం అని చెబుతారు. ఒంటిమిట్ట కోవెలలో సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులు ఏకశిలపై కన్పిస్తాయి. అందుకే దీనికి ఏకశిలానగరం అని కూడా పేరు.

ఆలయ అభివృద్ధి
క్రీ.శ. 1336లో విజయనగర సామాజ్య్రాన్ని హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించారు. క్రీ.శ 1345 ప్రాంతంలో వీరి సోదరుడు కంపరాయలు ఉదయగిరి ప్రాంతానికి పాలకుడుగా వచ్చాడు. ఒకసారి ఒంటిమిట్టలో పర్యటించినపుడు స్థానిక బోయ నాయకులు ఒంటడు, మిట్టడు రాజుకు సదుపాయాలు కల్పించారు. వారి విన్నపం మేరకు క్రీ.శ 1355 నాటికి గుడినీ, చెరువునీ అభివృద్ధిచేశాడు. అదే సమయానికి బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. కాశీ నుంచి తమ గురువు విద్యారణ్య మహర్షిని వెంట తీసుకుని రామేశ్వరం బయలుదేరాడు. గోదావరి తీరంలోని ఇసుకపల్లి నుంచి నాలుగు విగ్రహాలు తీసుకున్నాడు. మూడు విగ్రహాలను గండికోట, పామిడి, గుత్తిలకు చేర్చి సీతాలక్ష్మణులతో శ్రీరామచంద్రుడు కొలువుదీరిన ఏకశిలామూర్తిని ఒంటిమిట్టలో నిలిపాడు. అక్కడ విద్యారణ్య మహర్షి ఆధ్వర్యంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలనూ, బ్రహ్మోత్సవాలనూ నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఒంటిమిట్ట గుడిలో చైత్ర మాసం ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతారాముల వివాహం జరుగుతూ వస్తోంది. తొలిసారి ఆ ముహూర్తం రాత్రి పూట వచ్చింది. అదే ఆనవాయితీ ప్రకారం ఇప్పటికీ రాములవారి కల్యాణం రాత్రిపూట జరుగుతోంది. క్రీ.శ.1600 నుంచి ఆలయం అభివృద్ధి చెందింది. మట్లి ఎల్లమరాజు కుమారుడు అనంతరాజు, ఆయన వారసులూ ఆలయాన్ని ఘనంగా అభివృద్ధి చేశారు.


A.సుబ్బారెడ్డి, 
న్యూస్‌టుడే



Tuesday, 12 April 2016

Popular Temples of Telangana

Top 15 Most Popular Hindu Temples of Telangana

Telangana region lies on the Deccan plateau, It has a majority of tourist Attractions, Heritage sites, historical monuments and old temples. The most famous temples in Telangana region are Yadagirigutta Temple, Bhadrachalam Temple, Hyderabad Birla Mandir,Thousand Pillar Temple, Bhadrakali Temple and Meenakshi Agasteeshwara Swami Temple.

  1. Bhadrakali Temple
    Bhadrakali Temple of Hanamkonda is a famous Devi temple located on the hilltop between the twin cities of Hanamkonda and Warangal. The temple is known to be one of the oldest temples for Goddess Bhadrakali in India and one of the most famous Bhadrakali temple.
  2. Yadagirigutta Temple
    Yadagirigutta-Temple
    Yadagirigutta Temple is a popular Hindu Temple in Telangana state, dedicated to Narasimha Swamy, an incarnation Lord Vishnu. Sri Lakshmi Narasimha Swamy Temple of Yadagirigutta is situated on a beautiful and pleasant Hillock in Town.
  3. Bhadrachalam Temple
    Bhadrachalam_Temple
    Bhadrachalam Temple of Seetha Ramachandra Swamy shrine is the most famous temple in Telangana, dedicated to Lord Rama. The temple of Bhadrachalam is located on the banks of Godavari River.
  4. Thousand Pillar Temple
    Thousand-Pillar-Temple
    Thousand Pillar temple is located in Hanamkonda part of the Warangal city,dedicated to Shiva, Vishnu and Surya. This famous historic monument was built in a typical Chalukyan style of architecture by King Rudra Deva.
  5. Keesaragutta Temple
    Keesaragutta Temple is dedicated to Lord Siva and his consorts Bhavani and Sivadurga,located in Rangareddy district of Telangana. This temple is also known as Ramalingeshwara Swamy temple, as Sri Rama installed Siva lingam here.
  6. Ramappa Temple
    Ramappa_Temple_Warangal
    Ramappa Temple also known as Ramalingeswara temple is located in the valley of Palampet village, 77 km from Warangal. The temple is known for its elaborate carvings,floating bricks and stands as a remarkable testimony of Kakatiyan architecture.
  7. Sangameshwar Temple
    Sangameshwara temple is another fine example of Chalukyan grandeur,situated in Alampur, Mahbubnagar district. Alampur is a temple-town situated in Mahbubnagar district in the Telangana state.
  8. Gnana Saraswati Temple
    Basara-Gnana-Saraswathi-Temple
    Gnana Saraswati Temple is located on the banks of Godavari River at Basar, dedicated to Goddess Saraswati. It is one of the two most famous Saraswati temples in India.
  9. Karmanghat Hanuman Temple
    Karmanghat Hanuman Temple is one of the oldest temples in the city, located at Karman ghat. The temple is most famous Lord Hanuman temple spreading over three acres land in the area Karmanghat near Hyderabad.
  10. Hyderabad Birla Mandir
    Birla-temple-hyd
    Birla Mandir Hyderabad is one of the most beautiful temples in Hyderabad and one of the 18 Birla Mandir in India. The temple is built on a 280 feet high hillock and one of the most famous attraction in the state of Telangana.
  11. Kondagattu Temple
    Kondagattu Temple is dedicated to Lord Anjaneya Swamy located about 35 km from Karimnagar. The temple of Kondagattu is one of the famous temples of Karimnagar now called Kondagattu Anjaneya Swamy Temple.
  12. Meenakshi Agasteeshwara Swami Temple
    Meenakshi Agastyeswara Swamy Temple is located at Vadapalli and a famous place of worship for Lord Shiva’s devotees. The Shivalinga is situated 120 metres above from the water level of the river but Shivalinga is always full of water.
  13. Raja Rajeshwara Temple
    Sri Raja Rajeshwara temple is situated in the town of Vemulavada, dedicated to Lord Shiva. Rajarajeshvara temple built by King Rajaraja Chola, also the temple has a very special offering made by devotees called kode mokku.
  14. Chaya Someswara Swamy Temple
    The historical Chaya Someshwara Swamy temple located at Panagal is dedicated to Lord Shiva and it is a popular site during the festival of Shivarathri. There are two famous Shiva temples, Chaya Someswara Swamy temple and Pachala Someswara temple
  15. Narasimha Temple Nampally Gutta
    Vemulawada_Nampally_Gutta
    Lakshmi Narasimha Swamy Temple is situated at Nampally Gutta,32 km from Karimnagar. The temple is nestled on a small hillock on the Vemulawada,dedicated to Lord Lakshmi Narasimha and built in a model of Snake. Nampally Gutta temple has the largest statue of snake in India and it is one of the most famous tourist place in Telangana state.

Popular Temples In and Around Bangalore

15 Most Popular and Must Visit Temples In and Around Bangalore


Bangalore has number of ancient and famous temples dedicated to Indian God and Goddess, most of the temples has large number of Gods worshipped as murtis or idol. If you are visiting Bangalore then here is the list of the best and famous Bangalore temples for spiritual seekers – ISKCON Temple Bangalore, Naganatheshwara Temple, Dharmaraya Swamy Temple and Sugreeva Venkateshwara Temple.

  1. Sugreeva Venkateshwara Temple - Sugreeva
    Sugreeva Venkateshwara Templ is located at Balepet area in Bangalore and dedicated to Sugreeva, one of the important character of Ramayana. The temple features a six feet tall statue of Sugreeva.
  2. Kote Venkataramana Temple -God Venkateshwara
    Venkataramana-Temple-Bangalore
    Kote Venkataramana Temple is dedicated to the god Venkateshwara,located near the old fort at Krishnarajendra Road. Venkataramanswamy Temple is one of the oldest shrines in Bangalore.
  3. Banashankari Amma Temple - Banashankari Amma
    Banashankari Amma Temple
    Banashankari Amma Temple is one of the very famous temple in Bangalore and devoted to Banashankari Amma. The temple of Banashankari is one of the oldest and one of the very famous temple in Bangalore.
  4. Kempfort Shiva Temple - Lord Shiva
    Kempfort-Shiva-Temple
    Kempfort Shiva Temple lies near the Old Airport Road in residential and apartment area in Bangalore. The temple has a 65 feet tall statue of Lord Shiva in sitting posture and a huge Lord Ganesha statue along with and a Navagraha temple inside.
  5. Dodda Ganeshana Gudi - Nandi Bull
    Bull-Temple
    Dodda Ganeshana Gudi is also known as Bull Temple or Nandi Temple, situated in Bull Temple Road in the area of South Bangalore. The temple is house to one of the largest Nandi murthis in the world and Bugle Rock garden is situated behind the temple.
  6. Domlur Chokkanathaswamy Temple - Lord Vishnu
    Domlur Chokkanathaswamy temple is one of the oldest temples in the Bangalore city and the complex has several notable sculptures and decorative features. The Chokkanathaswamy Temple is dedicated to Chokkanathaswamy or Lord Vishnu.
  7. Ranganathaswamy Temple - Lord Ranganathaswamy
    Ranganathaswamy Temple is an ancient and famous Vaikhanasa temple in the city of Bangalore,built in the Vijayanagara style. The temple host famous Bangalore Karaga Festival and Chariot Festival every year.
  8. Puncha Mukhi Ganesha Temple - Sri Ganesha
    Puncha-Mukhi-Ganesha-Temple
    Panchamukhi Ganesha Temple is beautiful 5 faced Ganesha statue temple,located at the outskirts of Bangalore city on Bangalore – Mysore Highway. The temple has been built very recently with a big statue of Lord Ganesha on the roof of the temple
  9. Gavi Gangadhareshwara Temple - Lord Shiva
    Gavi-Gangadhareshwara-Temple
    Gavi Gangadhareshwara Temple also known as Gavipuram Cave Temple is famous for its mysterious stone discs and a huge Trident of Lord Shiva. Gavipuram Cave Temple is one of the finest example of Indian rock-cut temple architecture.
  10. Shree Surya Narayan Swamy Temple - Sun God
    Sri Suryanarayana Swamy Temple in Domlur is dedicated to the Sun God and one of the lesser known temple in Bangalore. The Suryanarayana Temple a must go place in Bengaluru and one among the few Sun God temple in India.
  11. Kailash Vaikunta Mahakshetra Temple
    Kailasa-Vaikunta-Mahakshetra-Temple
    Sri Kailasa Vaikunta Mahakshetra Temple is located in Rajaji Nagar 5th Block, which is less than 3kms Bangalore Railway station. The temples has Panchamukha Anjaneyar and Shiva Tirupurasundari.
  12. Sri Dwadasha Jyotirlinga Temple - Shiva Jyotirlinga
    Dwadasha-Jyotirlinga-Temple
    Sri Dwadasha Jyotirlinga Temple is located in Omkar Ashram,one of the highest points of Bangalore city. The Sri Dwadasha Jyotirlinga Devasthana is unique and one of the most magnificent and gigantic temples in Karnataka.
  13. Shrungagiri Shanmukha Temple - Lord Shanukha
    Shrungagiri-Shanmukha-Temple
    Shrungagiri Shanmukha Temple is located in RajaRajeshwari Nagar and one of the important tourist destination in Bangalore city. Sri Shanmukha Temple on the hillock has a breathtaking architecture of six faces of Lord Shanukha.
  14. Dharmaraya Swamy Temple - Pandavas
    Dharmaraya-Swamy-Temple-Bangalore
    Shri Dharmaraya Swamy Temple is a unique temple in India, dedicated to the Pandavas and not found anywhere else in India. The Dharmaraya templeis is one of the oldest and famous temple situated in Bangalore city.
  15. Agara Lord Hanuman Temple - Lord Hanuman
    Hanuman-bangalore-agara
    Agara Hanuman Temple is located in the south east side of Bangalore city build during recent years. The temple has 102 feet Gigantic statue of Lord hanuman and Agara village also has Jagannath Temple and host annual Rath Yatra.

Sunday, 3 April 2016

మారేడుమిల్లి - రంపచోడవరం : దేవుని సృష్టించిన సొంత భూమి !

సహజ సిద్ధమైన అటవీ అందాలకు, ప్రకృతి రమణీయతలకు పుట్టినిల్లు మారేడుమిల్లి ప్రదేశం. తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రికి 84 km. దూరంలో భద్రాచలం పోయే మార్గంలో ఈ మండలం ఉన్నది. తూర్పు కనుమల అటవీ అందాలను ఇక్కడ తనివితీరా ఆస్వాదించవచ్చు. కరెక్ట్ గా చెప్పాలంటే ఇది భద్రాచలం అడవుల్లో ఉందనమాట..! మారేడుమిల్లి లో వ్యూపాంట్లు అద్భుతంగా ఉంటాయి. డీప్ ఫారెస్ట్ లోనికి వెళ్లే కొలది దారిపోడవునా అడవి జంతువులు, అరుదుగా పులులు మరియు పక్షులు కనిపిస్తాయి. మరొక విషయం ఈ మారేడుమిల్లి అడవులను ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు తన స్థావరంగా ఉపయోగించేవాడట ..! ఇక్కడికి సమీపంలో 12 కి. మీ. దూరంలో రంపచోడవరం గ్రామం ఉన్నది. ఇక్కడ అల్లూరి సీతారామరాజు పూజలు చేసేవాడట. జలపాతాలు, ప్రకృతి అందాలకు ఇది కూడా మారేడుమిల్లిని ఏమాత్రం తీసిపోదు. మరి ఈ వనవిహారంలో ఏమేమి చూడాలో ఒకసారి తెలుసుకుందాం పదండి !

మారేడుమిల్లి ఎలా చేరుకోవాలి?
మారేడుమిల్లి చేరుకోవాలంటే ..
విమాన మార్గం - మారేడుమిల్లి సమీపాన రాజమండ్రి విమానాశ్రయం(82 KM) కలదు.
రైలు మార్గం - మారేడుమిల్లి కి సమీపాన రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే స్టేషన్ గా ఉన్నది. ఇక్కడైతే అన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగుతాయి.
రెండు రోడ్డు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటేమో రాజమండ్రి నుంచి, మరొకటేమో భద్రాచలం నుంచి.
1) ఉచిత సలహా ఏంటంటే, రాజమండ్రిలో ట్యాక్సీ లేదా ట్రావెలర్ అద్దెకు మాట్లాడుకోని వెళ్ళాలి.
2) రాజమండ్రి నుంచి వచ్చేవారు బస్ స్టాండ్ కు వెళ్ళి, భద్రాచలం అని తగిలించిన బోర్డ్ గల బస్సులో ఎక్కి, రెండు - మూడు గంటలు ప్రయాణించి మారేడుమిల్లి(85 కి.మీ) చేరుకోవాలి.
3) భద్రాచలం నుంచి వచ్చేవారు బస్ స్టాండ్ కు వెళ్ళి, రాజమండ్రి అని తగిలించిన బోర్డ్ గల బస్సులో ఎక్కి, 88 కి.మీ. దూరం ప్రయాణించి మారేడుమిల్లి చేరుకోవాలి.

ఏమేమి చూడాలి ?
మారేడుమిల్లిలో మరియు చుట్టుప్రక్కల చూడటానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. అందులో ప్రధాన ఆకర్షణ జలతరింగిని జలపాతం. ఈ జలపాతం అందమైన ప్రకృతి ప్రదేశంలో ఉన్నది. దీనిని చూడటానికి తెల్లతెల్లారుజామున వెళితే బాగుంటుంది.

నందవనం
నందవనం - బేంబూ చికెన్ మరియు ఔషధ మొక్కల తోటలకు ప్రసిద్ధి. ఇదికూడా సహజ అందాల కోవకే చెందినప్పటికీ సరైన మేంటెనెన్స్(నిర్వహణ) లేదు. తూర్పు కనుమలు, ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన మొక్కలను సందర్శనకై ఉంచారు.

వాలీ సుగ్రీవ మెడిసినల్ ప్లాంట్ కన్వర్శేషన్ ఏరియా
వాలీ సుగ్రీవ మెడిసినల్ ప్లాంట్ కన్వర్శేషన్ ఏరియా ఒక ఎత్తుపల్లాల భూభాగం. సుమారు 260 హెక్టార్ లలో విస్తరించిన ఈ ఏరియాలో 230 రకాల మొక్కలు మరియు అరుదైన మొక్కలను గుర్తుంచారు. ఇది కూడా సందర్శించదగినదే ..!

కార్తీకవనం
కార్తీకవనం మొక్కలతో నిండిన ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ముఖ్యంగా కార్తీక మాసంలో(అక్టోబర్ నెలలో) ఇక్కడ వనభోజనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. రావి, వేప, ఉసిరి, మర్రి మరియు బిల్వ మొక్కలు ఎక్కవగా కనిపిస్తాయి.

కాఫీ మరియు పెప్పర్ తోటలు
నందవనంలో చూడవలసిన మరో స్పాట్ కాఫీ మరియు పెప్పర్ తోటలు. వీటితో పాటు చెట్లు, పొదలు మరియు వివిధ పండ్ల తోటలు చూడవచ్చు.

మదనకున్జ్ - విహార స్థలం
మదన కున్జ్ విహార స్థలం అడవిలోకి వెళ్లే దారిలో కనిపిస్తుంది. ఇక్కడ పులులు, అడవి దున్నలు, జింకలు, నెమళ్ళు, అడవి కోళ్లు, ఎలుగు బంట్లు చూడవచ్చు. పులులు మాత్రం అరుదుగా కనిపిస్తాయి. అడవి పక్షులు, సీతాకోక చిలుకలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

క్రొకడైల్ స్పాట్
ఇక్కడ పాములేరు వాగు ఉంద. అక్కడే ఈ క్రొకడైల్స్ ఉంటాయి. ఇక్కడ స్నానాలు చేయటం నిషేధం కారణం మీకు తెలుసుగా ..?

టైగర్ స్పాట్
టైగర్ స్పాట్ మారేడుమిల్లికి 5 కి.మీ. దూరంలో అడవిలో ఉంటుంది. అక్కడికి వెళితే పులుల గాండ్రింపులు వినవచ్చు.

జంగల్ స్టార్ క్యాంప్
సైట్ జంగల్ స్టార్ క్యాంప్ సీట్ కి, రామాయణానికి మధ్య లింక్ ఉంది. ఇక్కడ రామాయణ కాలంలో యుద్ధం జరిగినట్లు భావిస్తుంటారు. క్యాంప్ సైట్ పక్కనే మూడు వైపుల నుంచి ప్రవహించే వలమూరు నది నీటి ప్రవాహాలు, గడ్డి మైదానాలు, కొండలు, అడవులు చెప్పాలంటే తూర్పు కనుమల అందాలన్నీ ఇక్కడే ఉన్నాయా? అన్నట్టు అనిపిస్తుంది.

వనవిహారి రిశార్ట్
మీరు వనవిహారి రిశార్ట్ లో బస చేసేవారితే అక్కడికి సమీపంలోని జంగల్ స్టార్ రిసార్ట్ కు వెళ్ళి, ఆ ప్రదేశ అందాలను, పాములేరు ప్రవాహాన్నీ ఆనందించవచ్చు.

మరిన్ని జలపాతాలు
స్వర్ణ ధార, అమృత ధార అనేవి మారేడుమిల్లిలో చూడవలసిన మరికొన్ని జలపాతాలు. ఇలా ఎన్నో మారేడుమిల్లిలో చూడవలసిన ఆకర్షనీయ ప్రదేశాలు ఉన్నాయి.

రంపచోడవరంలో ...
రంప జలపాతం రంపచోడవరంలో చూడవలసిన ప్రధాన టూరిస్ట్ స్పాట్. ఈ జలపాతం సంవత్సరం పొడవునా నీటి ప్రవాహాలతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే పురాతన శివాలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి గాంచినది. అల్లూరి సీతారామరాజు ఈ ఆలయంలోనే పూజలు చేసేవాడట ..!

రంప జలపాతం
శ్రీ నీలకంఠేశ్వర వన విహార స్థలం రంప చోడవడం గ్రామానికి 4KM దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రకృతి మాత దీవించి ప్రసాదించిన నీలకంఠేశ్వర మరియు రంప జలపాతాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో, అడవుల్లో ఉన్న ఈ జలపాతాల శబ్ధాలు ఒకింత అనుభూతిని, ఆనందాన్ని మిగుల్చుతుంది.

పురాతన శివాలయం
స్థానిక ప్రజలు, చుట్టుప్రక్కల ప్రాంతాలైన కాకినాడ, రాజమండ్రి, భద్రాచలం నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద శివరాత్రి పర్వదినాన, సెలవు దినాల్లో జలపాతాల వద్దకి వచ్చి ఆనందంలో మునిగి తేలుతారు. స్నానాలు ఆచరించి కాలినడకన పక్కనే ఉన్న పురాతన శివాలయంలో పూజలు జరుపుతారు. అల్లూరి సీతారామరాజు కూడా ఆలయంలో పూజలు జరిపారని వినికిడి.

వాతావరణం
మామూలుగా ఐతే మారేడుమిల్లి ని మాన్సూన్ తరువాత సందర్శించాలి. మాన్సూన్ లో వర్షాలు అధికంగా ఉంటాయి కాబట్టి అడవుల్లో జారిపడే అవకాశం లేకపోలేదు..! ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా రాత్రిళ్ళు చల్లగా ఉంటుంది ... ఉదయం వేడిగా ఉంటుంది. వేసవి లో సందర్శన ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

వసతి
మారేడుమిల్లి లో బస చేయటానికి రెండు ప్రదేశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ వారు ఎకో- టూరిజం ప్రాజెక్ట్ లో భాగంగా రెండు రిసార్ట్ లను నడుపుతున్నది. ఒకటేమో వనవిహారి రిసార్ట్, మరొకటేమో జంగల్ స్టార్ రిసార్ట్.
వనవిహారి రిసార్ట్
వనవిహారి రిశార్ట్ లో చాలా గదులు అద్దెకు లభిస్తాయి. ఇందులో ఏసీ, నాన్ - ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. జంటలకి లేదా చిన్న చిన్న గ్రూప్ లు గా వచ్చేవారికి ఈ రిశార్ట్ సూచించదగినది.
జంగల్ స్టార్ రిశార్ట్
జంగల్ స్టార్ రిశార్ట్ 10 -20 మంది కలిసి గ్రూప్ లు గా వచ్చేవారికి సూచించదగినది. టెంట్ వసతి, రాత్రుళ్ళు చలి మంటలు ఇక్కడి ప్రత్యేకతలు. ఫుడ్ మరియు ఊరికి దూరంగా ఉండటం ప్రతికూలతగా చెప్పవచ్చు.

భోజన సౌకర్యాలు
మారేడుమిల్లి లో, రంపచోడవరం లో చిన్న చిన్న హోటళ్లు అనేకం ఉన్నాయి. మారేడుమిల్లి లో తినటానికి సూచించదగిన ప్రదేశం వనవిహారి రిశార్ట్ క్యాంటీన్. ఇక్కడ ఫుడ్ అమోఘం. ఇక్కడ బేంబూ చికెన్ రుచి చూడటం మరవద్దు ..! బేంబూ తినటానికి స్పెషల్ గా హోటల్ అంటూ ఏదీ లేదు. అన్ని హోటళ్ళలో ఈ చికెన్ వండుతారు.

ట్రిప్ ఎలా సాగుతుంది ?
మొదటి రోజు
మారేడుమిల్లికి టూర్ ప్యాకేజీలు ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడలో ఏ ట్రావెల్ ఏజెంట్ నైనా సంప్రదించి రెండురోజుల పాటు వనవిహారంలో ఉండవచ్చు. కొన్ని ట్రావెల్ సంస్థలు గైడ్ ను పెట్టి వసతి, భోజనాలు, రవాణా సదుపాయాలను కలిస్తున్నాయి.
రాజమండ్రిలో దిగి, టెంపో వాహనాన్ని లేదా తూఫాన్ వాహనాన్ని మాట్లాడుకోని, దారి మధ్యలో గోకవరం వద్ద అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) చేసుకొని మారేడుమిల్లి చేరుకుంటే ఆ అనుభూతే వేరు. రూమ్ లు వనవిహారిలో ముందుగానే ఆన్‌లైన్ లో బుక్ చేసుకుంటే మంచిది. అక్కడికి వెళ్ళి బుక్ చేసుకొన్నా ప్రాబ్లమ్ లేదు. చెక్ - ఇన్ అయి, వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్అప్ అయి కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు.

ఫారెస్ట్ ట్రెక్
ఫారెస్ట్ ట్రెక్ మధ్యాహ్న సమయంలో ప్రారంభిస్తారు. వీలైతే మధ్యాహ్నం తిని కానీ లేదా రిశార్ట్ నుండి ప్యాక్ చేసుకొని గాని 12 కి. మీ. వరకు ట్రెక్ చేయవచ్చు. తిరిగి సాయంత్రం రావాలి సుమీ ..! ఈ 12 కి. మీ. ట్రెక్ లో మొదట మీరు చేరుకోవలసిన ప్రదేశం జంగల్ స్టార్ రిశార్ట్. ఇక్కడ మీరు పాములేరు ప్రవాహాన్నీదాటవలసి వస్తుంది. ఈ ప్రవాహాన్నీ దాటితే మీరు 1 కిలోమీటర్ అదనపు దూరం ట్రెక్ చేయవచ్చు. దాటే సమయంలో ఆ చల్లని నీటి ప్రవాహం కాళ్ళకు తగులుతుంటే ఆ పూల వాసనలు, మట్టి వాసనలు అహా..! ఇది తనివితీరా ఆనందం అంటే ఆ క్షణంలో బాధలు గీదలు ఏమీ గుర్తుకురావు. ప్రవాహాన్నీ దాటిన తరువాత తీసుకొచ్చిన ప్యాకెట్ ను తెరిచి భోజనం చేస్తే బాగుంటుంది. అడవిలో ట్రెక్ చేస్తున్నప్పుడు అదేదో తెలీని ఆనందం, ఉత్సాహం దరి చేరుతుంది. వివిధ పక్షుల కిలకిల రాగాలు చెవులకు ఇంపుగా అనిపిస్తాయి. దారి పొడవునా వివిధ రకాల మొక్కలను కెమరా ఉంటే ఫోటోలు తీసుకోవచ్చు. వృక్షశాస్త్రం చదివేవారికి ఉపయోగపడొచ్చు. ట్రెక్ పూర్తవగానే సాయంత్రం ఆరు లేదా ఏడు గంటల కు ఊర్లో కి వచ్చి టీ, కాఫీ, స్నాక్స్ లు తినవచ్చు. ఉదయం టిఫిన్ సప్పగానే, మధ్యాహ్నం లంచ్ సప్పగానే సాగింది. డిన్నరైనా కాస్త నాన్ - వెజ్ లాగించండి. రిసార్ట్ క్యాంటీన్ లో గాని, లేదా రిసార్ట్ కు దగ్గర్లోని షాప్ లో గాని వెళ్ళి బేంబూ చికెన్ లాగించండి. డిన్నర్ అయిన తరువాత క్యాంప్ ఫైర్ వెలిగించి ఆట పాట లతో చిందులేయండి. నిద్రవస్తే వెళ్ళి బజ్జొండీ ..!
తరువాతి రోజు
ఉదయాన్నే లేచి రూమ్ చెక్ -ఔట్ అయి (ఖాళీ చేస్తున్నట్టు), జలతరింగిని జలపాతం వైపు అడుగులు వేయాలి. అక్కడ గంట -రెండుగంటలు ఉండి చుట్టుప్రక్కల అందాలను ఆనందించవచ్చు. ఆతరువాత రంప జలపాతం వైపు ప్రయాణించాలి. సమయముంటే స్వర్ణ ధార, అమృత ధార జలపాతాలను చూడవచ్చు.
రంపచోడవరం వెళ్లే మార్గంలో భూపతి పాలెం వద్ద ఆగి, రిజర్వాయర్ అందాలనూ వీక్షించవచ్చు. రంపచోడవరం చేరుకొని, అక్కడి నుంచి 4 కి. మీ. దూరం ప్రయాణించి రంప జలపాతం చేరుకోవచ్చు. పక్కనే ఉన్న పురాతన శివాలయాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడికి వచ్చే సరికి మధ్యాహ్నం లంచ్ టైమ్ అవుతుంది. పక్కనే ఉన్న హోటళ్ళలో భోజనం లాగించవచ్చు. ఇక్కడ కాసింత విశ్రాంతి తీసుకోవటానికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ గెస్ట్ - హౌస్ లు ఉన్నాయి. తిరుగు ప్రయాణం రంపచోడవరం నుంచి సాయంత్రం 6 గంటల సమయంలో రాజమండ్రి బయలుదేరి, అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ బస్ ఎక్కితే ఉదయం 8 గంటలప్పుడు దింపుతుంది. రెండు రోజుల మారేడుమిల్లి - రంపచోడవరం ట్రిప్ చాలా బాగుంది కదూ ..! మీరు కూడా ఈ ట్రిప్ ని ఇంతకంటే ఎక్కువ ఆనందంతో గడిపి, మీ అనుభూతులను మాతో పంచుకోండి ..!

నల్లమల అడవుల్లో దాగున్న రహస్య జలపాతాలు, ఆలయాలు !

తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న నల్లమల అడవులు ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల్లోని 5 జిల్లాల్లో(మహబూబ్‌నగర్, కొద్ది మేర నల్గొండ జిల్లాలలో, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కడప) విస్తరించి ఉన్నాయి. నల్లమల కొండల సరాసరి ఎత్తు 520 మీ. వీటిలో 923 మీ. ఎత్తుతో బైరానీ కొండ మరియు 903 మీ. ఎత్తుతో గుండ్ల బ్రహ్మేశ్వరం కొండ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ అడవుల్లో పులులు సమృద్దిగా ఉండటం వలన ఈ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ గా ప్రకటించారు.

నల్లమల అడవులు ఆధ్యాత్మిక పరంగా, ప్రకృతి పరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఈ దట్టమైన అడవిలో గుళ్ళు, గోపురాలు, జలపాతాలకు లెక్కలేదు. రోడ్డు ప్రక్కన ఉన్న ప్రదేశాలకు వెళ్ళవచ్చేమో కానీ అడవుల్లో దాగి ఉన్న కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలంటే దేవుడు కనిపిస్తాడు. ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండలు, గుట్టలు దాటుకుంటూ రాళ్లు రప్పల మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఊకెనన్న వస్తినే అని అనిపించకమానదు. సరెలే ..! దేవుడు ఎట్ల రాసి పెట్టింటే అట్ల జరుగుతుంది కానీ ఆ ప్రదేశాలను చూసొద్దాం పదండి ..!

సలేశ్వరం క్షేత్ర్రం
నల్లమల అడవుల్లో మొదట మహబూబ్ నగర్ వద్దాం. ఇక్కడ సలేశ్వరం క్షేత్ర్రం గురించి చెప్పుకోవాలి. ఆకాశ గంగ ను తలపించే మహత్తర జలపాతం ఇక్కడ ఉంది. ఈ జలపాతం వేసవిలో చల్లగా ఉంటుంది. కొండల్లో శివుడు కొలువైఉంటాడు. చుట్టూ ఉన్న ప్రకృతి నిజంగా స్వర్గమనే చెప్పాలి.
సలేశ్వరం ఎలా చేరుకోవాలి ?
హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ఫరహాబాద్ చౌరస్తా నుంచి 16 కి. మీ. అటవీ మార్గం గుండా ప్రయాణించి, రాంపూర్ అనే చెంచు పెంట వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి 6 కి.మీ. దూరం వరకు కాలి నడకన వెళితే సలేశ్వర క్షేత్రం చేరుకోవచ్చు. ఏ మాత్రం ఎబరపాటుగా ఉన్న లోయలో కిందపడతారు సుమి !

ఉల్లెడ ఉమామహేశ్వర
స్వామి అహోబిలం చాలా మంది వెళ్లివస్తుంటారు కానీ దాని పక్కనే ఉన్న ఉల్లెడ క్షేత్రం గురించి ఎవరికీ తెలీదు. ఈ క్షేత్రంలో ఉమామహేశ్వరుడు లింగమయ్య రూపంలో పూజలందుకొంటున్నాడు. అక్కడికి వెళితే అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించున్నట్లుగా భావిస్తారు.
ఉల్లెడ ఉమామహేశ్వరం క్షేత్రం ఎలా చేరుకోవాలి ?
అహోబిలంకు మూడు కిలోమీటర్ల దూరంలో కొండ పక్కన దారి ఉన్నది. గతంలో అయితే కాలి నడక మార్గాన 20 కి.మీ. రాళ్లు, రప్పల నడుమ ఇరుకిరుకు కాలిబాటలో నడిస్తే గాని ఉల్లెడ మహేశ్వర స్వామి వద్దకి చేరుకోలేని పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడికి వచ్చే స్థానిక ప్రజలు, భక్తులు, అడవి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు పెరగడం తో రవాణా గతం తో పోల్చుకుంటే కాస్త బెటార్.
ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం లోయ వరకు వాహనాలు వెళ్లే విధంగా చిన్న చిన్న రాళ్ళ బాటలు ఉన్నాయి. అక్కడ దిగి తాడు పట్టుకుంటూ కిందకి దిగాలి. సెలయెర్లు దాటాలి ... మాళ్ళీ తాడు పట్టుకొని పైకి ఎక్కాలి. ఇలా సాహసాలు చేస్తూ వెళితే గాని స్వామి దర్శనం అవ్వదు.

బ్రహ్మంగారి మఠం
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వద్ద నల్లమల కొండల్లో ఉన్న దారి గుండా కొద్ది దూరం వెళితే(సుమారు రెండు మైళ్ళు వెళితే) కొన్ని గుహలు కనిపిస్తాయి. ఆ గుహలు సుమారు 100 వరకు కనిపిస్తాయి. అక్కడి గుహాల్లో శివుడు గవి మల్లేశ్వరుని గా పూజలదుకుంటున్నాడు.

నెమలిగుండం రంగనాథ స్వామి ఆలయం
ప్రకాశం జిల్లా గిద్దలూరు నుండి గంటన్నార దట్టమైన అటవీ మార్గంలో ఉన్నది నెమలిగుండం. ఇక్కడి ఆలయాన్ని శనివారం తప్ప మిగితా ఏ రోజుల్లో తెరవరు. సాయంత్రం 6 అయ్యిండంటే ఎవ్వరూ ఉండరు. పక్కనే గుండ్లకమ్మనది పై నుండి జలపాత ధారవలే కిందకు పడుతుంటుంది. ఈ జలపాతం ఏడాదంతా నీటి సవ్వడులతో చుట్టూ ప్రకృతిని ఆహ్లాదపరుస్తుంది.
నెమలిగుండం ఎలా చేరుకోవాలి ?
నెమలిగుండం వెళ్ళాలంటే గిద్దలూరు, మార్కాపురం, నంద్యాల నుండి శనివారాల్లో బస్సులు నడుస్తాయి. గిద్దలూరు నుండి షేర్ అటోల సౌకర్యం కూడా ఉన్నది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ... ఇక్కడి చేరుకోవడమే తరువాయి ...!

కొలనుభారతి
నల్లమల అడవుల్లో చాలా మందికి తెలీని మరో క్షేత్రం కొలనుభారతి. కర్నూలు జిల్లా ఆత్మకూరు శివపురం తర్వాత నల్లమల అడవుల్లో ఈ క్షేత్రం ఉన్నది. ఇక్కడి ప్రధాన దైవం సరస్వతి దేవి అయినప్పటికీ దగ్గర్లోనే సప్త శివాలయాలు ఉంటాయి.

గుండ్ల బ్రహ్మేశ్వరం
గుండ్ల బ్రహ్మేశ్వరం కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు సరిహద్దు మండలాల్లో నల్లమల అడవుల్లో ఉన్నది. ఈ ప్రాంతంలో అశ్వత్థామ (ద్రోణాచార్యుని కుమారుడు) స్వయాన శివలింగాన్ని ప్రతిష్టించాడు. అబ్బుర పరిచే ప్రకృతి సౌందర్యాలతో నిండిన ఈ క్షేత్రంలో అభయారణ్యం, రెండు చిన్న కోనేరులు, ప్రాచీన విగ్రహాలు చూడవచ్చు.
గుండ్ల బ్రహ్మేశ్వరం ఎలా చేరుకోవాలి ?
గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రానికి చేరుకోవాలంటే ముందుగా మీరు కర్నూలుకు గాని లేదా నంద్యాల కు గాని చేరుకోవాలి. కర్నూలు రైల్వే స్టేషన్ నుండి 100 కి. మీ. దూరంలో, నంద్యాల రైల్వే స్టేషన్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రానికి శివరాత్రి పర్వదినాన ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది.

నిత్యపూజ కోన క్షేత్రం
కడప జిల్లా నల్లమల అడవుల్లో రాళ్లు, రప్పలు దాటుకుంటూ వెళితే చేరుకొనే మరో క్షేత్రం నిత్యపూజ కోన. ఒకవైపు లోయ, మరోవైపు బండ రాళ్ళ మధ్య నిత్య పూజా స్వామి లింగ రూపంలో దర్శనమిస్తాడు. అలాగే కొంత దూరం ముందుకు వెళితే అక్కదేవతల కోన కు చేరుకోవచ్చు.
నిత్యపూజ కోన క్షేత్రానికి ఎలా చేరుకోవాలి ?
కడప నుండి సిద్దవటం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడి నుండి దట్టమైన అడవి మార్గాన వెళితే నిత్య పూజ కోన క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండ కింద ఉన్న పంచలింగాల వరకు బస్సులు, షేర్ ఆటోలు తిరుగుతుంటాయి. పంచలింగాల నుండి ప్రధాన గుడి వరకు కాలినడకన వెళ్ళాలి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యన సాగే నడక మార్గం చాలా ఆహ్లాదకరంగా ఉండి, ట్రెక్కింగ్ ను తలపిస్తుంది.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...