Showing posts with label అష్టాదశ శక్తిపీఠాలు. Show all posts
Showing posts with label అష్టాదశ శక్తిపీఠాలు. Show all posts

Saturday, 20 October 2018

శక్తిపీఠాలు తెలుసుకుందామా!









శక్తిపీఠాలు తెలుసుకుందామా!


పురాణాల ప్రకారం... బ్రహ్మదేవుడి కుమారుడైన దక్షప్రజాపతి కుమారై సతీదేవి శివుడిని వివాహాం చేసుకుంది. ఒకానొక సమయంలో త్రిమూర్తులు దేవసభ ఏర్పాటు చేశారు. అ సభకు దేవాదిదేవతలంతా హాజరయ్యారు. దక్షుడు సభకు అలస్యంగా వచ్చారు. అ సమయంలో శివుడు లేనందున అవమానంగా భావించి వెళ్లిపోయాడు. శివతత్వం దృష్టి తెలియక దక్షుడు శివుడిని విస్మరించి నిరీశ్వర యాగం తలపెట్టాడు. అ యాగానికి దేవతలందరిని పిలిచి సతీదేవి, శివుడిని మాత్రం ఆహ్వానించ లేదు. తండ్రి తల పెట్టిన యాగానికి శివుడు ఎంత వద్దని చెప్పినా వినకుండా సతీదేవి వెళ్తుంది. అక్కడ దక్షప్రజాపతి శివుడిని అపహస్యం చేస్తూ నిందిస్తాడు. దీంతో మనస్తాపానికి గురైన సతీదేవి అక్కడే ఆత్మార్పణ చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు ప్రళయరుద్రుడై సతీదేవి మృతదేహంతో సృష్టిని మరిచి తాండవం చేశాడు. శివుడిని శాంతింప చేసే ప్రయత్నంలో దేవతలంతా కలసి విష్ణుమూర్తిని వేడుకుంటారు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని సంధిస్తాడు. దాంతో శివుడి భుజంపై ఉన్న సతీదేవి మృతదేహాన్ని ఆ చక్రం 108 శకలాలుగా చేయడంతో ఒక్కొక్క శకలం ఒక్కో ప్రదేశంలో పడిపోయింది. అ భాగాలే శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. ప్రధానమైన శరీర భాగాలు 18. ఈ భాగాల్ని శక్తిపీఠాలుగా ఆది శంకరాచార్యులు ప్రాణప్రతిష్ఠ చేశారు. భారత దేశంలో 17 శరీర భాగాలు, శ్రీలంకలో ఒక భాగం ఉంది.




శ్రీలంక శాంకరీదేవి

రావణస్తుతి సంతుష్టాకృత లంకాధివాసినీ
సీతాహరణ దోషేణ త్యక్తలంకా మహేశ్వరీ
సజ్జనస్తుతి సంతుష్టా కదంబవనవాసినీ
లంకాయాం శాంకరీదేవీ రక్షేత్‌ ధర్మ పరాయణా!!

‘రావణుని స్తోత్రాల చేత సంతుష్టురాలై, అతని లంకాపట్టణంలో నివసించడానికి అంగీకరించింది. కానీ రావణుడి దోషమైన సీతాపహరణం వల్ల లంకను వీడిన మహేశ్వరివి నీవే. శాంకరిగా, కదంబవనవాసినిగా సజ్జనుల చేత స్తుతించబడే వనదుర్గా.. మాకు ధార్మిక ప్రవృత్తిని కలిగించి మమ్మల్ని... అంటూ శాంకరీదేవిని భక్తులు కొలుస్తారు. ప్రస్తుతం శ్రీలంకగా చెలామణీలో ఉన్న ఒకనాటి లంకాపట్టణమే శాంకరీదేవి నెలకొన్న శక్తి పీఠక్షేత్రం. పశ్చిమ సముద్రతీరాన ట్రింకోమలి పట్టణంలో ఈ మొదటి శక్తిపీఠం ఉంది. ఈ తల్లిని మహర్షులు వనశంకరి అని పిలిచేవారు. వనం అంటే నీరు, అడవి అనే అర్థాలున్నాయి. లంక చుట్టూ నీరు ఉండటం సహజమే. పైగా ఆమె కదంబవనవాసిని. ఏ విధంగా చూసినా వనశాంకరీదేవి, లంకా శక్తిపీఠసంస్థితగానే భావించాలి. అమ్మను వనదుర్గా మంత్రంతోనూ పూజిస్తారు. ఈ తల్లి రాక్షసగుణాలను సంహరిస్తూ, ధర్మాన్ని రక్షిస్తూ భక్తపాలన చేస్తుందని అంటారు. అయితే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకున్న పోర్చుగీసువారు ఈ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసినా అమ్మవారి విగ్రహం మాత్రం పదిలంగా ఉంది. పురాతన ఆలయం పక్కనే మరో ఆలయం నిర్మించారు.

కంచి కామాక్షమ్మ

శివనేత్రే నిమీల్యైవ ధృతా కాత్యాయనీ వపుః
గంగాప్లావ సముద్విగ్నా సైకతం లింగమాశ్రితా
భక్తానామిష్టదా నిత్యం కామాక్షీ కాంచికాపురే
ఏకామ్రనాధ గృహిణీ శుభం - కుర్యాన్మహేశ్వరీ!!

అష్ట దశ శక్తి పీఠాల్లో రెండో శక్తిపీఠం కామాక్షి అమ్మవారి ఆలయం, తమిళనాడు రాష్ట్రం, కాంచీపురంలో ఉంది. ఈ ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో పల్లవ వంశ రాజులు నిర్మించారని, ఆ తరువాత కాంచీపురాన్ని పాలించిన రాజులు అమ్మవారి ఆలయ విస్తరణకు అనేక పనులు చేపట్టి అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి శక్తి పీఠాన్ని నాభి స్ధాన శక్తి పీఠం అని పిలుస్తారు. ‘క’ అంటే సరస్వతీ రూపం, ‘మా’ అనేది లక్ష్మీ రూపం, ‘అక్షి’ అంటే నేత్రం అని అర్ధం. ఈమేరకు కంచిలో లక్ష్మి, సరస్వతిగా కామక్షి అమ్మవారు దర్శనిమిస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే లలిత సహస్ర నామ జపమే అనువైన మార్గం అని భక్తులు నమ్ముతారు. కంచి రెండో శక్తిపీఠంగా గుర్తింపు పొందింది.

మూడు రూపాల్లో... కామాక్షి అమ్మవారి ఆలయాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు కామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ఏటా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను మొదటి మూడు రోజులు అమ్మవారిని దుర్గా దేవిగా, తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవిగా, చివరి మూడు రోజుల్ని సరస్వతీదేవిగా అలంకరించడం ఆనవాయతీ.

శృంఖలాదేవి

విశృంఖలా స్వయం దేవీ - భక్తానుగ్రహకారిణీ
భక్తానాం శృంఖలా హర్త్రీ - స్వయంబద్దాకృపాపరా
శృంఖలాకటి బద్దా చ - జగన్మాతా యశస్వినీ
మాంగల్య దా శుభకరీ - వేదమార్గాను పాలినీ
ప్రద్యుమ్నే శృంఖలాదేవి బుష్యశృంగ సమర్చితా
శుభం తనో తు సా దేవీ - కరుణాపూర వాహినీ!!

పశ్చిమ బంగ, హుగ్లీ జిల్లా, పాండువా గ్రామంలో శృంఖలాదేవి శక్తి పీఠం ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది 3వ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి ఉదరభాగం పడిందని చెబుతారు. శృంఖలా అంటే సంకెల అని అర్థం. మాతృమూర్తిగా, అప్పుడే ప్రసవించిన బాలింతరాలుగా, నడుము వద్ద ఉండే నడికట్టును శృంఖల అంటారు. అదేవిధంగా అప్పుడే ప్రసవించి, చంటి బిడ్డకు పాలిస్తున్నట్లుగా ఉండే అమ్మవారి రూపానికి శృంఖలానామం వచ్చిందంటారు. క్షేత్రంలోని మూర్తి మాతృప్రేమను ప్రతిబింబించేలా ఉంటుంది.

సతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలు ఒక్క బంగా(వంగ)లోనే పదికి పైగా ఉన్నట్లు స్థానికుల వాదన. పైగా మొదటినుంచీ వంగలో శక్తి ఆరాధన అధికం అనడానికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి. వంగలో శక్తిగుడిలేని గ్రామం అంటూ ఏదీ లేదని చెప్పొచ్చు. అంగ, వంగ కళింగ దేశాలు మూడు శక్తి ఆరాధనకు ప్రసిద్ధి చెందినవే! ఎన్ని ఆలయాలు ఉన్నా...శృంఖలాదేవి శక్తిపీఠంగా ప్రజలు విశ్వసిస్తున్నారు.

చాముండేశ్వరి

మహిషం సంహృత్యదేవి కంటకం త్రిషు జన్మసు
చండీ కాళీ స్వరూపేణ దుర్గా రూపేణ శాంకరి!
స్థితాసి లోక రక్షార్ధం చాముండా క్రౌంచపట్టణే
దేవి త్వం ప్రసీదాస్మాన్‌ సర్వదా సర్వదా శుభే!!

భారత ఉప ఖండంలో వెలసిన అష్టాదశ శక్తి పీఠాల్లో చాముండేశ్వరి ఆలయాన్ని 4వ శక్తి పీఠంగా చెబుతారు. ఇక్కడ అమ్మవారి కేశాలు పడ్డాయంటారు. మైసూరు, చాముండి కొండల్లో వెలసిన చాముండిదేవికి ఈ దసరా పర్వ దినాల్లో వైభవంగా పూజలు జరుగుతాయి. కర్ణాటక, మైసూరులో ప్రస్తుతం మనకు తెలిసిన చాముండి కొండను ఒకప్పుడు మహాబల గిరిగా పిలిచేవారు. 1659 వరకు అతితక్కువ సదుపాయాలున్న ఈ దేవాలయాన్ని ఆ తరువాతి కాలంలో మైసూరును పాలించిన దొడ్డ దేవరాజ ఒడెయార్‌ అభివృద్ధి చేశారు. క్రమంగా మైసూరు రాజ వంశస్థుల కులదేవతగా, మైసూరుకు నాడ దేవత(గ్రామ దేవత)గా చాముండి దేవి నిత్య పూజలు అందుకుంటోంది.

ఏటా మైసూరు మహారాజు వంశస్థులతోపాటు, ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. చాముండి అమ్మవారికి చండీ హోమం, వెండి రథోత్సవాలు యథావిధిగా కొనసాగుతాయి. కాళికాదేవి ప్రతిరూపంగా ఉండే చాముండి దేవి తామస గుణ వదనంతో కనిపిస్తుంది. అష్టకరముల్లో ఆయుధాలను ధరించిన దేవిని చంపక పుష్పాలతో అలంకరిస్తారు. ఈ నవరాత్రులలో రోజు సాయంత్రం మహారాజుల కుటుంబ సభ్యులు అత్యంత నిష్టగా పూజలు చేస్తారు.

జోగులాంబ

అలంపురం మహాక్షేత్రం- తుంగాచోత్తర వాహినీ!
బాల బ్రహ్మేశ్వరో దేవః - జోగులాంబా సమన్వితః!!
తీర్థం పరుశురామస్య- నవ బ్రహ్మ సమన్వితం!
అలంపురే జోగులాంబా- విశాలాక్ష్యా సమాస్మృతా!!
భువికా శ్యా సమక్షేత్రం- సర్వదేవ సమర్చితం!
సదానఃపాతు సా దేవీ- లోకానుగ్రహ తత్పరా!!

సతీదేవి ఊర్ధ్వ దంత భాగం పడిన చోటే అలంపూర్‌. ఈ ప్రాంతంలోనే అమ్మవారు జోగులాంబగా అవతరించింది. ఇది ఐదోశక్తి పీఠం. ఈ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉండేది. ప్రత్యేక తెలంగాణ విభజించిన అనంతరం ఆ జిల్లా విడిపోవడం, అమ్మవారి పేరే కొత్త జిల్లాకు పెట్టారు. ఇది తెలంగాణాలో ఏకైక శక్తిపీఠం. ఇప్పుడు అలంపూర్‌ జోగులాంబ జిల్లాలో ఉంది. ప్రధానంగా నరఘోష, దృష్టి దోషం కలగకుండా అమ్మ ఆదర్శమూర్తిగా దర్శనం ఇస్తుంది. అత్యంత శక్తిమంతురాలిగా జోగులాంబని అభివర్ణిస్తారు. అమ్మవారు పీఠాసన రూపంలో మహాతేజోవంతమై దర్శనమిస్తుండటం విశేషం. అమ్మవారి కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. అలంపూర్‌ జోగులాంబ దర్శనం భక్తులకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తుంది. 14వ శతాబ్దంలో బహమని సుల్తాన్‌ కాలంలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసం కావడంతో అమ్మవారి మూల విగ్రహాన్ని స్వామి వారి ఆలయంలో నైరుతి భాగంలో ఏర్పాటు చేశారు. తరువాత 2005లో మళ్లీ అమ్మవారి ఆలయాన్ని పునః నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేశారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది. అందుకే అమ్మవారి పీఠం అడుగున జలగుండం ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి వారోత్సవ పూజలు... అమావాస్య, పౌర్ణమికి చండీహోమాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దసరా పండగనాడు తుంగభద్ర నదిలో పెద్దఎత్తున తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది.

భ్రమరాంబిక

భ్రమరై రరుణం హత్వా భ్రామ్యన్తీ శ్రీగిరౌ స్థితా
భక్తాను కంపినీ దేవీ మల్లికార్జున తోషిణీ సుందరీ !!
శివనుగ్రహ సంధాత్రీ భక్తరక్షణ తత్పరా
సానః పాయాత్‌ సదా మాతా శ్రీశైలే భ్రమరాంబికా!!

సతీదేవి మెడభాగం పడిన ప్రాంతమే శ్రీశైలం. ఈ మహాక్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన భ్రమరాంబాదేవి పద్దెనిమిది మహాశక్తుల్లో ఒకరు. ఈ అమ్మవారి క్షేత్రం ఆరో శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. అరుణాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారు తుమ్మెద రూపంలో అవతారమెత్తింది. దాంతో అమ్మవారికి భ్రామరీశక్తిగా పేరు వచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక అరుణాసురుడి సంహారం తరువాత అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి, భూలోకంలోనే ఉండదలిచి సరైన ప్రదేశం కోసం అన్వేషించసాగింది. ఆ సమయంలో సహ్యాద్రి పర్వత పంక్తుల వెంట తిరుగుతుండగానే, అద్భుతమైన మల్లె పొదల వాసన ఆమెను (తుమ్మెద రూపంలో ఉన్న ఆ దేవతను) ఆకర్షించింది. అక్కడ మల్లికార్జునరూపుడై ఉన్న జ్యోతిర్లింగాన్ని గుర్తించింది. ఇక అక్కడే ఉండిపోదలచి, ఆ లింగానికి పశ్చిమాన కొంచెం ఎత్తుగా ఉన్న చోట స్థిరనివాసం ఏర్పరచుకుంది. అందుకే ఆ అంశని ‘భ్రమరాంబ’గా రుషులు, దేవతలు స్తుతించారు. అలా శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారు శ్రీ మల్లికార్జున స్వామికి ఇల్లాలై భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడ నిత్యం అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. దసరా సమయంలో నిత్యాభిషేకాలు, హోమాలు ఉంటాయి. శరన్నవరాత్రుల్లో రోజుకో అలంకారంతో పూజలు అందుకుంటుంది భ్రమరాంబికా దేవి. శ్రీశైల క్షేత్రంలో నిత్యం అమ్మవారికీ, స్వామికీ కల్యాణం జరుగుతుంది.

కొల్హాపురి మహాలక్ష్మి

శ్లో: కోల్హతపః ప్రీతాదేవీ వరదాన మహోజ్జ్వలా
మహాలక్ష్మీర్మహామాతా లోకానుగ్రహ కారిణీ!
దత్తాత్రేయాది సుప్రీతా నానాతీర్థ నిషేవితా
కరవీర సుమారాధ్యా కోల్హ సద్గతిదాయినీ!
భవానీ చామలాదేవీ కరవీర సువాసినీ
కొల్హాపురే మహాలక్ష్మీర్మమాస్తు శుభదాయినీ!!

శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీమహాలక్ష్మీ ఆలయం, మహారాష్ట్ర, కొల్హాపూరులో ఉంది. క్రీస్తు శకం 600-700 సంవత్సరాల మధ్య చాళుక్యుల నాటి కాలంలో ఏడవ శతాబ్దంలో పంచగంగా నది ఒడ్డున నిర్మించిన ఆలయమిది. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి రూపంలో కొలువై ఉంటుంది. ఇది ఏడో శక్తిపీఠం. సతీదేవి కళ్లు ఇక్కడ పడ్డాయని అంటారు. అమ్మవారు విష్ణుమూర్తి సమేతంగా దర్శనమిస్తుంది. ఈ శక్తిపీఠానికి కొల్హాపూర్‌తోపాటు కరవీరం అనే పేరు కూడా ఉంది. ఇక్కడ ఎన్నో తీర్థ ఘట్టాలు, దేవతా ప్రతిష్టలు ఉన్నాయి. దత్తాత్రేయ మహర్షి ప్రతిరోజూ అ అమ్మవారి వద్ద భిక్ష స్వీకరించేవాడని చెబుతారు. వింధ్య పర్వత గర్వాన్ని అణచిన అగస్త్యమహర్షి తిరిగి ఉత్తరాపధం వెళ్లకుండా దక్షిణాదిన సంచరిస్తూ ఇక్కడే శ్రీమహాలక్ష్మి సాక్షాత్కారం పొందినట్లు చరిత్రలో ఉంది. గర్భాలయంలో మూడు అడుగుల ఎత్తులో అమ్మవారి విగ్రహం దర్శనమిస్తుంది. ప్రతిరోజూ అమ్మవారి పాదముద్రలకు కుంకుమార్చన చేస్తారు. అలాగే ఈ పూజలన్నింటినీ పురుషులతోనే చేయిస్తారు. ఏ ఆలయమైనా తూర్పు ముఖంగానే నిర్మించి ఉండటం సహజం. కానీ ఈ ఆలయం మాత్రం పశ్చిమముఖంగా ఉంటుంది.

అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది. పైన ఉన్న కుడిచేతిలో పెద్ద గద, మరో చేతిలో మాదీఫలం, ఎడమచేతిలో డాలు, మరో చేతిలో పానపాత్ర ఉంటాయి.

జనవరి 31, ఫిబ్రవరి ఒకటి, రెండు తేదీలు సహా నవంబరు 9,10, 11 తేదీల్లో ఈ ఆలయంలో జరిగే అద్భుతాన్ని ‘కిరణ్‌ ఉత్సవ్‌’గా పిలుస్తారు. ఆ రోజుల్లో సాయంకాలపు సూర్య కిరణాలు అమ్మవారి విగ్రహం, పాదాలపై పడతాయి. ఈ రోజులను ప్రత్యేక దినాలుగా భావించి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తండోప తండాలుగా వచ్చే భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంది.

మహారాష్ట్ర ఏకవీరికాదేవి

శ్లో: దత్తాత్రేయ సమారాఢ్యా అనసూయాత్రి సేవితా
ఏకవీరా మహాదేవీ మస్తకే నైవ శోభినీ!
రేణుకా మాతా మాయా సంహార రూపిణీ
కృపయా పాతు నస్సర్వాన్‌ మాయూరే ఏకవీర్యకా!!

అష్టాదశ శక్తి పీఠాల్లో ఏకవీరికా దేవి ఆలయం ఎనిమిదో శక్తిపీఠం. దత్తాత్రేయస్వామి జన్మక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన మాహోర్‌ క్షేత్రం మహారాష్ట్రలో ఉంది. నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో ఈ శక్తిపీఠ క్షేత్రం ఉంది. ఏకవీరికా ఆలయం వల్ల శక్తిపీఠంగా గుర్తించారు. ఈ ప్రదేశంలో మూడు కొండ శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరంపై అత్రి-అనసూయలు, మరో శిఖరంపై దత్తాత్రేయస్వామి నెలకొని ఉండగా - మూడో శిఖరంపైన ఏకవీరికాదేవి విగ్రహం ఉంది. ఈ అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది. ఈ శక్తిపీఠ క్షేత్రంలో సతీదేవి కుడి చేయి పడిందని చెబుతారు. కేవలం తల మాత్రమే ఇక్కడ శక్తిగా ఆరాధించబడుతోంది. మెడ కూడా ఉండదు. పైగా ఈ ముఖం రౌద్రం మరింత పెరుగుతోందా అన్నట్లుగా గంగ సింధూరం పూత పూస్తారు. ఈ అమ్మవారిని తుల్జాపూర్‌ భవానీ అని కూడా పిలుస్తారు. ఈ మాతను శివాజీ చక్రవర్తి ఆరాధించాడని ప్రతీతి. ఈ అమ్మవారికి కొంతకాలం వరకూ జంతువుల్ని బలిచ్చేవారు. ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది. అమ్మవారి ముఖమే గర్భగుడి పైకప్పును, పక్కన గల గోడలను తాకేటంత పెద్దదిగా ఉండటం ఈ క్షేత్రంలో చూడొచ్చు. మహామంత్ర శక్తి గల అమ్మవారని ప్రసిద్ధి.

ఉజ్జయినీ మహంకాళీ

శ్లో: త్రిపురాసుర సంహర్తా మహాకాలో త్రవర్తతే
యస్యాట్ట హాస సందగ్థం దుస్సహం తత్‌ పురత్రయమ్‌!
పురీసాస్యాదుజ్జయినీ మహాకాళీ చ సామతా
ఉజ్జయిన్యం మహాకాళీ భక్తానామిష్టదాసదా !!

అష్టాదశ శక్తిపీఠాల్లోని తొమ్మిదో శక్తిపీఠం ఉజ్జయినీ మహంకాళి. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లో ఉంది. హరసిద్ధిమాత, అన్నపూర్ణాదేవితో కలిసి అమ్మవారిని సేవించే చోటు ఇదే. సప్తమోక్ష పురాలలో ఇదొకటి. అమ్మవారు మహాకాళి కాగా, అయ్యవారు మహాకాళేశ్వరుడు, జ్యోతిర్లింగమూర్తి. సతీదేవి పై పెదవి ఇక్కడ పడినట్లు చెబుతారు. ఎక్కడైతే మహాకాళి ప్రకాశిస్తుందో ఆ పురమే అవంతిక (రక్షించేది), ఉజ్జయిని (జయించేది), అదే (యజ్ఞాలకు యోగ్యమైన) కుశస్థలి. ఇవన్నీ ఉజ్జయినీ నగరానికి మారుపేర్లు. ఈ క్షేత్రాన్ని భూమికి నాభిస్థానం అని అంటారు. మహాకవి కాళిదాసుకు బీజాక్షరాలను ప్రసాదించిన శక్తి ఈ కాళీమాతే.

నగరానికి కొద్ది దూరంలో క్షిప్ర/సిప్ర, ఖాన, సరస్వతి నదుల సంగమం ఉంది. ఇక్కడ ఇదే త్రివేణి సంగమ స్థలం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగాన్ని ఎవరికి వారే అభిషేకించే అవకాశం ఉంది. ఇక్కడ సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతాయి. అయితే దేవీ నవరాత్రుల్లో జరిగే ఉత్సవాలు మాత్రం భారీస్థాయిలో ఉంటాయి.

పురూహూతికా దేవి

శ్లో: ఏలర్షి పూజిత శ్శంభుః- తస్మై గంగా మదాత్‌ పురా
రురావ కుక్కుటో భూత్వా- భగవాన్‌ కుక్కుటేశ్వరః!!
దేవీ చాత్ర సమాయాతా- భర్తృ చిత్తానుసారిణీ
పురుహూత సమారాద్దా- పీఠాయాం పురుహూతికా!!

అమ్మవారి పిరుదు భాగం పడిన ప్రాంతం పిఠాపురం. ప్రసిద్ధ క్షేత్రాలన్నింటిలో ప్రత్యేకతగల ఆలయం పిఠాపురం పాదగయ క్షేత్రం. దక్షిణకాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో పిఠాపురం దశమ శక్తిపీఠం. దసరా సందర్భంగా అమ్మవారికి ఆలయంలో కుంకుమార్చనలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనేది భక్తుల నమ్మకం. మహిళలు ఉపవాసంతో ఈ కుంకుమార్చన చేస్తారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పురూహుతికా అమ్మవారికి తొలిరోజు కలశస్థాపన, ప్రతిరోజు ఉదయం శ్రీచక్ర నవార్చన, ఛండీ సప్తపతి పారాయణ, మధ్యాహ్నం చండీ హోమం, సాయంత్రం లక్ష కుంకుమార్చన జరుగుతాయి. పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి భవానీ దీక్ష చేపట్టిన భక్తులు 9 రోజులపాటు ఈ క్షేత్రంలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. అలానే శతచండీయాగం, కుంకుమ పూజలు ఇక్కడ ప్రత్యేకతం.

గిరిజదేవి

శ్లో: ఓఢ్యాణే గిరిజాదేవీ పిత్రర్చన ఫలప్రదా
బిరజా పర పర్యాయా స్థితా వైతరణీతటే
త్రిశక్తీనాం స్వరూపా చ లోకత్రాణ పరాయణా
నిత్యం భవతు సా దేవీ వరదా కులవర్థినీ

ఓఢ్యాణం అంటే... ఓఢ్రదేశం. నేటి ఒడిశా. కటక్‌కి దగ్గర్లోని వైతరణీ నదీతీరంలో ఉన్న ఒక గ్రామం పేరు కూడా వైతరణే. జాజ్‌పూర్‌ రోడ్డుకు సుమారు 20 కి.మీ. దూరంలో ఉంది పదకొండో శక్తిపీఠం. అదే గిరిజాదేవి ఆలయం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంశలతో కూడిన శక్తిపీఠంగా ఇక్కడి గిరిజాదేవిని మహర్షులు గుర్తించారు. ఇక్కడ శ్వేతవరాహ రూపంలో ఉన్న శ్రీహరి, గిరిజాదేవి పాదాలను దూరం నుంచే అర్చిస్తూంటాడు. అంటే ఇక్కడికి సమీపంలో శ్వేతవరాహమూర్తి అయిన విష్ణువు ఆలయం ఉందని అర్థం! జీవి శరీరం వదిలాక ముందుగా ఆ జీవిని స్వర్గానికి పంపాలా? నరకానికి పంపాలా? అనే విషయాన్ని వైతరణీ నది తేల్చేస్తుంది. యమలోక ప్రయాణపు దారిలో వచ్చే ఈ నది, న్యాయనిర్ణేత అన్నమాట. జాజ్‌పూర్‌ రోడ్డు చేరువలో ఉన్న ఈ వైతరణి ఆ నదీ అంశతో జన్మించింది కాబట్టి, పితృదేవతలకు - పిండ ప్రదానాలకు ఇది ప్రశస్తమైందని పురాణాలు వర్ణించాయి. అందుకే ఇక్కడ అంతా పిండ ప్రధానం చేస్తారు. స్థానికులు ఇక్కడి శక్తి పీఠాన్ని బిరజాదేవి అనీ వ్యవహరిస్తున్నారు. వైతరణి లేదా విరజా నదీ తీరంలో వెలసినందున వంగ/ఒరియా భాషల్లో విరజ, బిరజగా మార్పుచెంది, స్థానికుల నోట బిరజగా రూపాంతరం చెంది ఉండొచ్చు. త్రిశక్తి రూపిణిగా పూజలందుకొంటూ ఉన్న ఇక్కడి అమ్మవారికి తలనీలాలు అర్పించడం అనేది ఒక విశేషమే!

క్షేత్ర విశిష్టత
ఇక్కడి అమ్మవారు (గిరిజ) సింహాన్ని వాహనంగా కలిగి, ఒక చేత్తో ఖడ్గం, మరో చేతితో మహిషాసురుని తోక పుచ్చుకున్నట్లుగా దర్శనం ఇస్తుంది. దసరా పర్వదినాల్లో అమ్మవారికి రథయాత్రను జరుపుతారు. ఒడిశాలోని మరో పుణ్యక్షేత్రం పూరీలో కూడా రథయాత్రకు ప్రాముఖ్యం ఉంది. అదే తరహాలో ఈ దేవతకు కూడా రథయాత్ర నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ నదిలోని ఒక దీవిలో శ్వేతవరాహరూపుడైన విష్ణుమూర్తి ఆలయం నిర్మించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వెళ్లే రైలు మార్గంలో, కటక్‌ నుంచి మూడు గంటల బస్సు ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చు.

మాణిక్యాంబ

శ్లో: స్వయం భూరస్తి భీమేశః మాణిక్యాంబా త ధైవచ
సప్తర్షి భి స్సమానీతం సప్తగోదావరం శుభం
సూర్యేణ సేవితః పూర్వం భీమేశో జగదీశ్వరః
భక్త్త రక్షణ సంవ్యగ్రా మాణిక్యా దక్ష వాటికే!!

సతీదేవి నాభిభాగం పడిన చోటే ద్రాక్షారామ. సంస్కృతంలో నాభిని మణిపూర్వకచక్రం అంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబగా అవతరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ద్రాక్షారామ అష్టాదశ పీఠాల్లో ఒకటిగానే కాకుండా శ్రీశైల భ్రమరాంబ, కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, ద్రాక్షారామ మాణిక్యాంబలను కలిపి అంబికాత్రయంగా చెబుతారు. దాక్షాయని ఆత్మాహుతి చేసుకొన్న ఇక్కడే పరమేశ్వరుడు భీమేశ్వరుడి రూపంలో స్వయంభువుడై వెలసినట్టు స్థలపురాణం చెబుతోంది. ద్రాక్షారామలో మాణిక్యాంబ అమ్మవారు దక్షిణాభిముఖంగా సాలగ్రామ శిలతో నిర్మితమైన శ్రీచక్రంపై ఉంటుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ రూపాన్ని పునఃప్రతిష్ఠించించారు. అష్టాదశ పీఠాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారు శ్రీచక్రంపై నిలబడి ఉంటుంది. శ్రీచక్రానికి ఏకకాలంలో పూజలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ అమ్మవారికి ప్రత్యేకమైన రూప అలంకరణలు ఉండవు. దసరా శరన్నవరాత్రుల్లో ప్రతిరోజూ ప్రదోష కాలంలో ప్రత్యేకంగా రజిత, సువర్ణ, విశేష పుష్పార్చనలు నిర్వహిస్తారు. అనంతరం పంచహారతులు, నీరాజన మంత్రపుష్పాలు జరుగుతాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామ చేరుకోవడానికి రైలుమార్గం ద్వారా అయితే రాజమహేంద్రవరం, సామర్లకోటలో దిగి బస్సుల ద్వారా చేరుకోవచ్చు. రాజమహేంద్రవరం నుంచి 60 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.

కామాఖ్యాదేవి

కామాఖ్యే కామదే దేవి - నీలాచల నివాసిని
కామస్య సర్వదే మాతః - మాతృ సప్తక సేవితే!!
జామదగ్న్యస్య రామస్య మాతృహత్యా విమోచని
పంచ శంకర సంస్థానా భక్తపాలన తత్పరా !!
కల్యాణ దాయినీ మాతా విప్ర దర్శిత నర్తనా
హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా భవ సర్వదా !!

ఇది అసోం రాష్ట్రంలోని గువహటిలో ఉంది. సతీదేవి యోగాగ్నిలో దగ్ధం అయ్యాక, అమ్మవారి యోనిభాగం ఇక్కడ పడిందని అంటారు. ఇది పదమూడో శక్తిపీఠం. కామాఖ్యదేవి అనేక మహిమలు చూపిస్తుందని స్థానికులు నమ్ముతారు. ఈ ఆలయ సమీపంలోనే ఊర్వశీ (ఊర్చసి) కుండం ఉంది. ఈ కుండంలో స్నానం చేసిన తరువాతే ఆలయంలో ప్రవేశించాలి.

ఇక్కడ ఆలయం కిందకు ఉంటుంది. మెట్లు దిగి వెళ్లాలి. కామాఖ్య పీఠ దర్శనం చేసి, అక్కడి జలధారను తీర్థంగా స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు ప్రతీ ఏటా రజస్వల అవుతుంది. ఆ సమయంలో ఈ పీఠంలోని జలధార ఎర్రగా మారుతుంది. ఈ సమయాన్ని ‘అంబుబాషిమేళ’ అంటారు. ఈ కాలంలో మూడు రోజులపాటు అమ్మవారి ఆలయాన్ని, సమీపంలోని ఇతర ఆలయాలను మూసివేస్తారు.  అమ్మవారికున్న వస్త్రాలు కూడా ఎర్రగా మారతాయంటారు. నాలుగో రోజు అమ్మవారికి శిరః స్నానం చేయించి ఆలయాలు తెరుస్తారు. భక్తులు మాత్రం అమ్మవారిని కామేశ్వరి అని కూడా పిలుస్తారు. మహా త్రిపుర సుందరిగా పరిగణిస్తారు. దసరా సమయంలో వైభవంగా పూజలు నిర్వహిస్తారు.


మాధవేశ్వరి

త్రివేణీ సంగమోద్భుతా- త్రిశక్తీ నాం సమాహృతిః
ప్రజాపతి కృతా శేష - యాగమాలాభివందితా!!
బృహస్పతి కరాంత స్థ- పీయూష పరిషేచితా
ప్రయాగే మాధవీదేవీ - సదా పాయాత్‌ శుభాకృతి!!

సతీదేవి కుడిచేతి నాలుగు వేళ్లు ప్రయాగ (అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్లు చెబుతారు. అక్కడే మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం వెలసింది. ఇది పద్నాలుగో శక్తిపీఠం. ఈ క్షేత్రంలోని గంగానది నీరు స్వచ్ఛంగా తెల్లగా ఉంటే, యమున నీరు మాత్రం నల్లగా ఉంటుంది. యమున విష్ణు భక్తురాలు. విష్ణుపాదోద్భవ అయిన గంగలో కలిసిపోయే క్షేత్రం కనుక, దీనికి మాధవక్షేత్రం అని పేరు వచ్చింది. ఆ కారణంతోనే ఈ శక్తిపీఠాన్ని మాధవేశ్వరీ పీఠంగానూ పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బింధుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ, సూర్యుడు అమ్మవారిని ఆరాధించే క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రమనీ కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. మూడు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పులో నలుచదరంగా ఉన్న ఒక పీఠం మాత్రమే కనిపిస్తుంది. ఆ పీఠం మధ్యలో గుంట ఉంటుంది. అక్కడే అమ్మవారి చేతి వేళ్లు పడిన చోటు అని చెబుతారు పురోహితులు. దాన్ని ముట్టుకుంటే చేతికి తడి తగులుతుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి అడుగున ఊయల మాదిరి కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్లు తృప్తి చెందుతారు. కానుకలను ఊయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంది.

వైష్ణవీదేవి

కాలాధర సర్వతాగ్రే జ్వాలా రూపాను భాససే
జ్వాలాముఖీతి విఖ్యాతా జ్యోతి ర్మూర్తినిదర్శనా!!
రాధే శ్యామేతి నా దేన వర్థమానా త్విషాంతతిః
జ్వాలాయాం వైష్ణవీ దేవి సదారక్షతు శాంకరీ!!



ఈ జ్వాలాక్షేత్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా వద్ద ఉంది. అమ్మవారి నాలుక నిట్టనిలువుగా ఈ ప్రాంతంలో పడిందని ప్రతీతి. ఈ ఆలయం కాలంజర పర్వతంపై ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. జ్వాలారూపిణిగా దర్శనం ఇస్తుంది. అమ్మవారి ఆలయం గుహలో ఉంటుంది. ప్రవేశద్వారానికి ఎదురుగా మూడు అడుగుల ఎత్తున్న గూట్లో ఆరు అంగుళాల పొడవున అగ్ని జ్వాల కనిపిస్తుంది. దాన్నే అమ్మవారి శక్తిపీఠంగా భావిస్తారు. ఇక్కడ నిరంతరం ఏడు జ్వాలలు వెలుగుతూంటాయి. ఇక్కడ అమ్మవారిని జ్వాలాముఖి, వైష్ణవీదేవి, విద్యేశ్వరీ దేవి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ గర్భాలయానికి రెండు అడుగుల చదరం ఆకృతిలో ఒక ప్రవేశ ద్వారం ఉంది. దీనిలోంచి తల మాత్రం దూర్చి ఆ జ్వాలను చూడొచ్చు. రాధేశ్యాం అని మనం ఎంత బిగ్గరగా అరిస్తే అంత ఎత్తున జ్వాల ఎగిసిపడటం ఇక్కడి ప్రత్యేకత. ఇది పదిహేనో శక్తిపీఠం.

సర్వమంగళాదేవి

గదాధర సహదోరి గయాగౌరి నమోస్తుతే
పితృణాంచ స కర్తృణాం దేవి సద్గతిదాయిని!!
త్రి శక్తి రూపిణీ మాతా సచ్చిదానంద రూపిణీ
మహ్యం భవతు సుప్రీతా గయా మాంగళ్య గౌరికా!!



సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్లుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరి దేవీ... స్థలపురాణానికి తగ్గట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు. పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండే చోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా పిలుస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. సర్వమంగళాలను దేవి ప్రసాదించడంతో, ఈ తేజోమూర్తిని దేవతలు, మునులు సర్వమంగళాదేవిగా కీర్తించారు. ఈ క్షేత్రంలో శ్వేత, మధుర, ఫల్గుణి అనే మూడు నదులు సంగమిస్తూ ఉండటంతో ఈ క్షేత్రానికి ప్రయాగతో సమానమైన ఖ్యాతి ఉంది. ప్రస్తుతం మధుర, శ్వేతానదులు కనిపిస్తున్నాయి. ఫల్గుణీ నది అంతర్థానమై అంతర్వాహిని మారిపోయింది. ఈ శక్తి పీఠంలో యాభైరకాల దానాలతో కూడిన శ్రాద్ధకర్మలు చేస్తారు. ఇది వైష్ణవక్షేత్రం కూడా. మంగళగౌరీ దేవిని విష్ణు మూర్తి భక్తులు చెల్లెలుగా పరిగణిస్తారు. ఇది పదహారో శక్తిపీఠం.



కాశీ విశాలాక్షీ

కాశీంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం
విశ్వేశం దేవ మాలోక్య ప్రీతి విస్తారితే క్షణా!!
సానురాగా చ సా గౌరీ దద్యాత్‌ శుభపరంపరాం
వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణా పరాకృతిః!!
అన్నం జ్ఞాన చ దదతీ సర్వాన్‌ రక్షతి నిత్యశః
త్వత్ప్ర సాదా న్మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే!!

అష్టాదశ శక్తిపీఠాల్లో పదిహేడో శక్తిపీఠం శ్రీవిశాలాక్షీ దేవి. కాశీ విశ్వేశ్వరుడి గుడికి కొంత దూరంలోనే విశాలాక్షీ అమ్మవారి క్షేత్రం ఉంది. ఈ గుడి గోపురం అంతా దక్షిణాది సంప్రదాయంలో ఉంటుంది. సప్తమోక్ష పురాణాల్లో ఒకటిగా కాశీకి విశిష్టస్థానం ఉంది. ఇది సతీదేవి మణికర్ణిక (చెవి కుండలం) పడిన ప్రదేశం. ఆలయం బయటి నుంచి చూడ్డానికి చిన్నగానే ఉంటుంది. కానీ ఈ శక్తి పీఠంలోని విశాలాక్షీ అమ్మవారు గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకటి పెద్దది. మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైంది. స్వయంభువు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షీ అనే పేరు వచ్చిందని ప్రతీతి.

కాశ్మీరే షు సరస్వతి

సరస్వతి నమస్తుభ్యం సర్వవిద్యాస్వరూపిణి
రాగద్వేషాది యుక్తాయ మనశ్శాంతిం ప్రయచ్ఛసి!!
కాశ్మీర దేశ వద్రమ్యా విశదా భవదా కృతిః
సాంత్వయన్తీ మహాదేవీం త దుక్త్యా శారికా అభూః!!
ప్రసన్నతాం సమాంబుద్ధిం విశదాం పాండితీం శుభాం
విద్యా వృద్ధిం సదా దద్యాత్‌ కాశ్మీరే షు సరస్వతీ!!

సరస్వతీదేవిని కశ్మీరు పురవాసినిగా పిలుస్తారు. అక్కడి ప్రజలు ‘‘నమస్తే శారదా దేవీ కశ్మీరు పురవాసినీ-త్వాం హం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే’ అని భక్తితో పూజిస్తారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫ్ఫరాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో నీలం నది పక్కన శారద అనే గ్రామంలో ఈ శక్తి పీఠం ఉంది. సతీదేవి కుడిచేయి ఇక్కడ పడటం వల్ల ఈ పీఠం ఏర్పడిందని చెబుతారు. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చాలాసార్లు శిథిలమైంది. పందొమ్మిదో శతాబ్దంలో కశ్మీర్‌ రాజు మహారాజా గులాబీసింగ్‌ ఈ ఆలయాన్ని చివరిసారిగా మరమ్మతులు చేయించారు. 1948లో భారత్‌ పాకిస్థాన్‌ యుద్ధంతో ఈ ప్రాంతం ఫస్తూన్‌ తెగల ఆక్రమణకు గురై వాళ్ల ఆధీనంలో ఉండిపోయింది. ఆపై ఆక్రమిత కశ్మీర్‌ వశంలోకి చేరింది. మరోసారి 2005లో జరిగిన అతిపెద్ద భూకంపంతో చాలా భాగం శిథిలమైపోయింది. అప్పటి నుంచి ఈ ఆలయానికి మరమ్మతులు లేవు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు దర్శించి అర్చించారని శంకర విజయకావ్యం ద్వారా తెలుస్తోంది. అప్పుడప్పుడు పాకిస్థానీ హిందువులు దేవాలయాన్ని సందర్శిస్తారు. అలానే జమ్మూ కశ్మీరులో అమ్మవారిని కీర్‌ భవాని సరస్వతి శక్తి పీఠంగా భావిస్తారు చాలామంది. ఇది తుళుముల అనే ప్రదేశంలో (శ్రీనగర్‌కు దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో) ఒక చెరువు మధ్యలో ఉంది. పాలతో చేసిన అన్నం పాయసం ఇక్కడ ప్రసాదం.


>

Sunday, 5 August 2018

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు అష్టాదశ శక్తిపీఠాలు

State Name12 Jyotirlingas18 Shakti Peethas
1.Maharastra - మహారాష్ట్ర్ర 1) Grishneshwar -Near Aurangabad-గ్రిష్ణేశ్వర్
2) Triambak- Near Nashik- త్రయంబక్
3) Bhimashankar -భీమశంకర్ Near Pune
1) Ekaveerika/Renukadevi -Mahur ఏకరవీరికా దేవి,మహూర్
2) Mahalaskhmi - Kolhapur మహాలక్ష్మీ, కొల్హాపూర్
2.Gujarath గుజ‌రాత్ 4)Somnath-సోమనాధ్
5) Nageshwar -నాగేశ్వర్ Near Dwaraka
3.Madya Pradesh మధ్యప్రదేశ్ 6) Mahakaleshwar- Ujjain మహాకాశేశ్వర్, ఉజ్జయిని
7) Omkareshwar ఓంకారేశ్వర్
3)Ujjain – ఉజ్జయిని


4.Jammu & Kashmir జమ్ము,కాశ్మీర్ 4) Vishnodevi-వైష్ణోదేవి Jammu-Katra
5.Himachal Pradesh హిమాచల్ ప్రధేశ్ 5) Jwalamukhi - జ్వాలాముఖి – Kangra
6.Uttarakhand ఉత్తరాఖండ్ 8) Kedharnath కేధార్ నాధ్ (Temple Closing Times up to Ukimat)
7.Uttara Pradesh ఉత్తరప్రధేశ్ 9) Vishwanath Temple -Kasi/Varanasi విశ్వనాధ ఆలయం,కాశి 6)Madhaveshwari-Allahabad మాధవేశ్వరి, అలహాబాదు
 7) Vishalakshi- Kasi/Varanasi విశాలక్ష్మీ, కాశి
8.Bihar బిహార్ 8) Sarwa Mangala Devi-Gaya సర్వమంగళదేవి,గయ
9.Jharkhand జార్కండ్ 10) Baidyanath, Deogarh బైధ్యనాధ్, థియోగర్
10.West Bengal వెస్ట్ బెంగాల్ 9)Srinkala-Pandua (Present Minar) శ్రుంకళ- పాండువ
10) Kalika Mandhir, Kalighat, Kolkata కాళికమందిర్,కలకత్తా (Adi Shakti Peetha)
11.Assam అస్సాం 11) Kamarupadevi, కామరూపదేవి,గౌహతి Kamakhya – Guwahati
12.Orissa ఒరిస్సా 12) Girijadevi-Jaipur గిరిజాదేవి, జైపూర్ 
13) Bhimaladevi-Puri భీమల(Adi Shakti Peetha)
14) TaraTarani-తారతరణి బెర్హంపూర్ Berhumpur (Adi Shakti Peetha)
13.Andhra Pradesh ఆంధ్రఫ్రదేశ్ 11) Mallikarjuna Swamy, Srisailam మల్లిఖార్జున,శ్రీశైలం 15) Puruhutika devi -పురుహుతిక - పిఠాపురం
16) Manikyamba Devi -మానిక్యాంబదేవి(ద్రాక్షారామం)
17) Bramarambika- భ్రమరాంభిక- Srisailam
14.Telangana తెలంగాణ 18) Jogulamba-జోగులాంబ- అలంపూర్
15.Tamilnadu తమిళనాడు 12) Rameshwaram రామేశ్వ‌రాల‌యం , రామేశ్వరం 19) Meenaskshi-Kanchi మినాక్షి – కంచి
16.Karnataka కర్ణాటక 20) Chamuneshwari-చాముండేశ్వరి- Mysore

Saturday, 14 April 2018

విజయదశమి - విజయిూభవ






విజయిూభవ

విజయదశమి’... విజయాల పండుగ.
జగన్మాత దుర్గాదేవి మహిషాసురమర్దినిగా పూజలందుకున్న వేళ...
అర్జునుడు జమ్మిచెట్టు మీద నుంచి ఆయుధాలు తీసిన రోజు...
శరన్నవరాత్రుల్లో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులను అలరించే ఘడియ...
లక్ష్మీపూజ... సరస్వతీపూజ... ఆయుధ పూజ... శమీపూజ... అన్నీ శుభాలే.
మది నిండా సంతోషాలతో...
దసరా సరదాలతో...
తెలుగింటి ‘నవదుర్గల’ ఆశీస్సులతో...
విజయీభవ!

దేవీ జ్ఞానప్రసూనాంబికే!
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వాయులింగేశ్వరుని ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వరుని దేవేరి జ్ఞానప్రసూనాంబ ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శన భాగ్యం కల్పిస్తారు. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో, 2వ రోజు బ్రహ్మచారిణీ దేవి, 3వ రోజు చంద్రఘంటాదేవి, 4వ రోజు కూష్మాండదేవి, 5వ రోజు స్కంధమాతాదేవి, 6వ రోజు కాత్యాయనీదేవి, 7వ రోజు కాళరాత్రీ దేవి, 8వ రోజు మహాగౌరీదేవి, 9వ రోజు సిద్ధిధాత్రి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. 10వ రోజున విజయదశమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు.

కరుణా సముద్ర.. కనకమహాలక్ష్మి
విశాఖలో కొలువుదీరిన శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు. శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ దేవస్థానం 24 గంటలు తెరిచే ఉంటుంది. ఏ సమయంలోనైనా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. విజయదశమి పర్వదినం సందర్భంగా స్వర్ణాభరణ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన నిర్వహిస్తారు.

భక్తిముక్తిదాయిని భ్రమరాంబిక
ద్వాదశ జ్యోతిర్లంగాల్లో ఒకటిగా మల్లికార్జునుడు, అష్ఠాదశ శక్తుల్లో ఒకరిగా భ్రమరాంబాదేవి వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఏటా శ్రీశైల దేవస్థానం మల్లికార్జునస్వామివారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, భ్రమరాంబదేవికి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. భ్రమరాంబదేవి అమ్మవారి గర్భాలయం స్వామివారి ఆలయానికి వెనకభాగాన కొంత ఎత్తులో ఉంటుంది. తొమ్మిదిరోజులపాటు నవదుర్గ అలంకారాల్లో విశేషపూజలు అందుకునే భ్రమరాంబదేవి పదవ రోజు విజయదశమి పర్వదినం నాడు నిజాలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది.

శ్రీచక్రంపై మాణిక్యాంబ
అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ శక్తి పీఠం ద్రాక్షారామ మాణిక్యాంబ అమ్మవారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో మాణిక్యాంబ అమ్మవారిని దక్షిణాభి ముఖంగా, సాలగ్రామ శిలతో నిర్మితమైన శ్రీచక్రం బిందువుపై ఆదిశంకారాచార్యులు పున:ప్రతిష్ఠించారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఎక్కడా జరుగని విధంగా అమ్మవారికీ, శ్రీచక్రానికీ అర్చన ఏకకాలంలో జరగడం ఇక్కడి విశేషం. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో మాణిక్యాంబ అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. నిత్య చండీహోమం జరుగుతుంది. విజయ దశమి రోజున శమీపూజ అనంతరం గజ వాహనంతో నగరోత్సవం జరుగుతుంది.

శుభాల దేవి!
జయశంకర్‌ జిల్లాలోని కాళేశ్వరం త్రివేణీసంగమ క్షేత్రం. ఇక్కడి శ్రీకాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో అష్టతీర్థాలు ఉన్నాయి. ఒకే పానవట్టంపై కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు అరు రెండు లింగాలు ఉండడం ఈ ఆలయ విశిష్టత. పైగా ముక్తీశ్వరుడు ఉన్న చోట శుభానందదేవికి, సరస్వతీదేవికి ప్రత్యేక ఆలయాలు ఉండడం విశేషం. శుభాలను కలిగించేటువంటి ఈ అమ్మవారిని శుభానందదేవిగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో దసరా ముందు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

ఉజ్జయినీ మహాకాళి!
నగరాన్ని కలరా వ్యాధి నుండి కాపాడిన మహిమాన్విత సికింద్రాబాద్‌లో వెలిసిన శ్రీ ఉజ్జయినీ మహాకాళి. 1813లో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌ వాస్తవ్యుడైన సురిటి అప్పయ్య ఆర్మీ డోలీ బేరర్‌గా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ టవర్‌కు బదిలీ అయ్యారు. బదిలీ అయిన కొన్ని రోజులకు ఉజ్జయినిలో కలరా వ్యాధి సోకి వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో అప్పయ్య, ఆయన అనుచరులు ఉజ్జయినిలోని శ్రీ మహాకాళి దేవిని దర్శించి, కలరా వ్యాధి నుండి కాపాడవలసిందిగా ప్రార్థించారు. పరిస్థితులు అనుకూలించిన తర్వాత సికింద్రాబాద్‌లోనే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయించారు.

భక్తుల కొంగు బంగారం
వరంగల్‌ జిల్లాలోని భద్రకాళి అమ్మవారు స్వయం వ్యక్తం. ఈ జగన్మాత మహా దుర్గాష్టమి వేళ భూ మండలం మీద భద్రకాళిగా అవతరించిన ప్రదేశం ఓరుగల్లు మహానగరమని ప్రతీతి. మహాష్టమి అని పిలిచే దుర్గాష్టమి వేళ జనగ్మాత కోటి యోగిని గణాలతో భద్రకాళి రూపంలో ఆవిర్భవించినదని దేవీ భాగవతం చెబుతోంది. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే శరన్నవరాత్రి వేడుకల్లో అమ్మవారి జన్మ నక్షత్రమైన దుర్గాష్టమినాడు తెలంగాణ నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రతి రోజు వివిధ ఆకారాల్లో అమ్మవారిని అలంకరించి, వాహన సేవలు నిర్వహించే ఈ వేడుకలు అమ్మవారి కల్యాణోత్సవంతో ముగుస్తాయి.

అన్నపూర్ణకు ప్రతిరూపం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దివ్యక్షేత్రం అతిపెద్ద శైవక్షేత్రాల్లో ఒకటి. శ్రీరాజరాజేశ్వరస్వామివారు ఈ క్షేత్రంలో ప్రధాన దేవతామూర్తి. ప్రధాన ఆలయంలో శ్రీస్వామివారికి కుడివైపున శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారు, ఎడమవైపున శ్రీలక్ష్మీగణపతిస్వామివారు కొలువై ఉంటారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారు నవదుర్గల రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. దుర్గాష్టమి రోజున మహిషాసురమర్దినిగా అమ్మవారికి మహాపూజ నిర్వహిస్తారు. కాశీ క్షేత్రంలోని అన్నపూర్ణదేవి ప్రతిరూపం వేములవాడ క్షేత్రంలో ఉందనీ, అదే కారణంగా ఈ క్షేత్రానికి దక్షిణ కాశిగా పేరువచ్చిందని ప్రతీతి.

మహా ‘శక్తి’ స్వరూపిణి
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉత్తర వాహిని తుంగభద్రానదీ తీరంలో కొలువైంది జోగులాంబ అమ్మవారు. 18 శక్తిపీఠాల్లో జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో ఉన్న ఐదవ శక్తిపీఠం జోగులాంబదేవి. క్రీ.శ 17వ శతాబ్దంలో ఆదిశంకరుడు శ్రీచక్రప్రతిష్ఠ చేసి జోగులాంబదేవిని ప్రతిష్ఠించారని చెబుతారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది. జోగులాంబ దేవాలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరణ చేస్తారు. 9వ రోజున తుంగభద్రా నదిలో హంసతూలిక పడవలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి భక్తులకు కనువిందు చేస్తారు.






Friday, 16 March 2018

పిఠాపురం – పీఠికాపురము – పురుహూతికాపురము





పిఠాపురం – పీఠికాపురము – పురుహూతికాపురము

మూడూ ఒక క్షేత్ర నామాలే! అదే తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం. ఈ క్షేత్రానికి గల మరో పేరు పాంచాలపురము. ఈ క్షేత్రానికి పలు విశేషాలున్నాయి. పాద గయ, స్వయంభూ శివ క్షేత్రం, శక్తి పీఠం మరియూ శ్రీపాద శ్రీవల్లభ స్వయంభూ అవతార మూర్తి.

పాద గయ
కృతయుగంలో విష్ణు భక్తుడైన గయాసురుడు విష్ణుమూర్తి కృపను ఆపేక్షించి, ఎన్నో దివ్య సంవత్సరాలు తపస్సు చేసి, స్వామిని మెప్పించి ఈ పృథివీ మండలము మీద ఉన్న అన్ని పుణ్య క్షేత్రాల కన్నా తన దేహము పవిత్రము అగునట్టు వరమును పొందాడు. ఇక అతనిని దర్శించిన ఎంతటి పాపాత్ముడైనా చివరకు అతని శరీరము పై నుంచి వీచే గాలి సోకినంత మాత్రానే క్రిమి కీటకాది జన్మలెత్తిన పాపత్ములు కూడా తరించిపోయేవారు. అతను ఎన్నో అశ్వమేధాది పూణ్య క్రతువులు చేసి ఇంద్ర పదవిని కూడా పొందాడు. పదవీచ్యుతుడైన దేవేంద్రుడు తిరిగి తన పదవి పొందేందుకు త్రిమూర్తులను గూర్చి కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేసి వారిని మెప్పించి ఆతనిని వారే వధించే వరం పొందాడు. గయాసురుడు ధర్మాత్ముడైనప్పటికీ, దుష్టులైన అతని అనుచరులు ధర్మ విరుద్ధమైన పనులు యధేచ్ఛగా చేస్తుండడంతో ఇలా జరిగింది.

ఇక ముగ్గురు త్రిమూర్తులు బ్రాహ్మణ వేష ధారణలో ఆతని వద్దకు వెళ్ళి ఒక గొప్ప యాగముకొరకు అతిపవిత్రమైన అతని శరీరాన్ని ఒక ఏడు రోజుల పాటు యజ్ఞ వేదికగా పొందారు. కానీ ఆ యజ్ఞము పూర్తయ్యేవరకు అతడు కదలకూడదని, కదిలితే సంహరిస్తామని చెబుతారు. అందుకు అతను మనఃపూర్తిగా అంగీకరిస్తాడు.

గయాసురుడు మహిమా శక్తిచేత తన దేహమును బీహారు రాష్ట్రంలోనున్న గయా క్షేత్రంలో శిరస్సు ఉండునట్లు, నాభీ స్థానము నేటి ఒరిస్సా రాష్ట్రంలోనున్న జాజిపూర్ నందు ఉండునట్లు, పాదములు పీఠికాపురంలో ఉండునట్లు విస్తరించాడు.

అలా ఆ దివ్య యజ్ఞం ఆరు రోజులు నిర్విఘ్నంగా జరిగిపోతుంది. కానీ ఏడో రోజు విష్ణుమూర్తి ప్రేరేపణచేత శివుడు లింగోద్భవ కాలంలో అంటే అర్ధరాత్రి, కోడిరూపము దాల్చి, కోడి కూత ధ్వని చేస్తారు. ఈ మాయ తెలియని గయాసురుడు  ఏడు రోజులు పూర్తయిందని తన దేహాన్ని కదిలిస్తాడు. యజ్ఞము పూర్తి కాకుండానే తన దేహాన్ని కదిల్చాడని అందుచేత సంహరిస్తామని పలికి, త్రిమూర్తులు ఆతని చివరి కోర్కె తెలుపమని ఆడుగుతారు.

అప్పుడు గయాసురుడు, తన శరీరంలోని మూడు భాగాలు తన పేరిట గయా క్షేత్రములుగా వెలిసి, వాటియందు త్రిమూర్తులూ వసించాలని వరము పొందుతాడు. ఆ మూడు క్షేత్రములు శక్తి పీఠలుగా కూడా విరాజిల్లుతాయి. మానవులు చనిపోయిన తమ పితరులను ఉద్దేశించి చేయు శ్రాద్ధ కర్మలు ఈ గయా క్షేత్రాలలో చేస్తే, విశేషమైన ఫలితముంటుంది.

క్లుప్తంగా ఇది, పాదగయ వెనుకనున్న వృత్తాంతం. అంత పెద్ద శరీరం కుదురుతుందా? తవ్వితే భారీ అస్తికలు దొరుకుతాయా అంటూ ప్రశ్నలు మాత్రం వేయకండి. సాధారణంగా ఇతరత్రా విశేషాలు, ఇలా తేలికగా బోధపడే విధంగా తెలియ జెప్పడం మన పురాణాల్లో ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది.

శిరోగయ = గయ క్షేత్రం బీహారు  ఫల్గునీ నదీ తీరం; విష్ణు క్షేత్రం; మంగళగౌరీ దేవి శక్తి పీఠం.
నాభిగయ = జాజిపూర్ క్షేత్రం ఒరిస్సా  యజ్ఞవేదికా స్వరూప బ్రహ్మ; గిరిజాదేవి శక్తి పీఠం
పాదగయ = పిఠాపుర క్షేత్రం ఆంధ్రప్రదేశ్ 
– కుక్కుటేశ్వరలింగరూపంలో ఈశ్వరుడు; పురుహూతికా శక్తి పీఠం

స్వయంభూ శివ క్షేత్రం
సర్వలో శుభంకరుడైన శంకరుడు లోకకళ్యాణార్ధము గయసురుని సంహారార్థమై కోడి రూపము ధరించి కోడి కూత ఇక్కడే చేశారు కాబట్టి, ఆతని కొరికమేర కోడి / కుక్కుట రూపంలో లింగారూపుడై స్వయంభువమూర్తియై శ్రీ కుక్కుట లింగేశ్వర స్వామిగా ఈ క్షేత్రంలో విరాజిల్లుతుంటారు. ఇక్కడి అర్చకులను అడుగగా, ముందు ఇక్కడి శివలింగం కోడి ఆకృతిలో ఉండేదని, అభిషేకాలవల్ల ఆ రూపు కొద్దిగా గుండ్రంగా మారిందని చెప్పారు.


శక్తి పీఠం
కృతయుగంలో, దక్ష ప్రజాపతి పరాశక్తిని గూర్చి గొప్ప తపస్సుచేసి, అంబను మెప్పించి తన కూతురుగా పొందుతాడు. ఆవిడే సతీదేవి లేదా దక్షుని కూతురగుటవలన దాక్షాయని. కొన్ని కారణాల వల్ల దక్షుడు నిరీశ్వర యాగం చేయాలని సంకల్పిస్తాడు. పిలవకుండానే, అమ్మవారు తన తండ్రి తలపెట్టిన యాగానికి చేరుకుంటుంది. ఈశ్వర ద్వేషాన్ని సంహించలేక, దాక్షాయని అని ఇక పిలిపించుకోవటం ఇష్ట పడక, తల్లి యోగాగ్నిలో తన తనువును చాలిస్తుంది. మరణించిన సతీదేవియందు తనకు గల ప్రేమ చేత  శివుడు ఆమె మృత కళేబరాన్ని భుజాన ధరించి విరాగియై లోక సంచారము చేస్తుంటాడు. అప్పుడు పరాశక్తి ఆజ్ఞమేర శ్రీ మహా విష్ణువు సతీ మృత దేహాన్ని తన సుదర్శన చక్రంతో ఖండిస్తారు. ఆ దేహ భాగములు భూమిపై పడి 108 శక్తి పీఠాలుగా విరాజిల్లాయి.  వాటిలో 101 విశేషముగానూ, 52 పీఠములు ముఖ్యమైనవిగాను, అందులో ముఖ్యాతి ముఖ్యమైనవిగా 18 భాగాలు అష్టాదశశక్తి పీఠాలుగా పిలువబడుతున్నాయి.

1. ఎడమ చెవి – శ్రీలంక – క్యాండీదంబులా – శాంకరీ దేవి
2. కుడి కన్ను – కాంచిపురం (తమిళనాడు) – కామాక్షీ దేవి
3. కుడి చేయి – ప్రద్యుమ్నం (చోటిల్లా, గుజరాత్) – శృంఖలా దేవి
4. ఎడమ చేయి – క్రౌంచపట్టణము (కర్నాటక) – చాముండేశ్వరి దేవి
5. కుడి చెవి – ఆలంపుర్ (కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్) – జోగులాంబ దేవి
6. కుడి కాలు – శ్రీశైలం (కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్) – భ్రమరాంబికా దేవి
7. ముక్కు – కోల్హాపూర్ (మహరాష్ట్ర) – మహాలక్ష్మీ దేవి
8. కంఠము – మాహూర్ (మహరాష్ట్ర) – ఏకవీరా దేవి
9. నాలుక – ఉజ్జయిని (మధ్య ప్రదేశ్) – మహాకాళీ దేవి
10. పిరుదులు – పిఠాపురం (ఆంధ్రప్రదేశ్) – పురుహూతికా దేవి
11. కటి భాగము – జాజిపూర్ (ఒరిస్సా) – గిరిజా దేవి
12. నాభి – దక్షారామము (ఆంధ్రప్రదేశ్) – మాణిక్యాంబ దేవి
13. హృదయం – హరిద్వార్ (ఉత్తరాంచల్) – మానసా దేవి
14. ఎడమ కాలు – అలహాబాదు (ఉత్తర్ ప్రదేశ్) – మాధవేశ్వరి దేవి
15. నోరు – జమ్ము (జమ్మూ కాశ్మీర్) – వైష్ణో దేవి
16. స్తనములు – గయ (బీహార్) – మంగళగౌరి దేవి
17. ఎడమ కన్ను – వారణాశి (ఉత్తర్ ప్రదేశ్) – విశాలాక్షి దేవి
18. కపాలం – కాశ్మీర్ (జమ్మూ కాశ్మీర్) – సరస్వతి దేవి





Tuesday, 30 May 2017

అలంపూర్‌ జోగుళాంబ






అలంపురం జోగుళాంబ

అలంపురం జోగులాంబ (యోగులాంబ యోగాంబ) అష్ఠాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం. సతీదేవి ఊర్ధ్వదంత పంక్తి ఈ ప్రదేశంలో పడింది. ఈమె బాల బ్రహ్మేశ్వర స్వామి శక్తి.

జోగులాంబ మహాదేవి / రుద్రవీక్షణ లోచన //
అలంపురీస్థితా మాతా / సర్వార్ధఫలసిధ్ధిద //

అలంపూర్ ఎక్కడ ఉంది?హైదరాబాదు నుండి కర్నూలు వెళ్ళే దారిలో కర్నూలుకి 12 కి.మి ముందు వచ్చే అలంపూర్ అడ్డరోడ్ నుండి 10కి.మి ఎడమకు ప్రయాణిస్తే అలంపూర్ అనే చిన్న గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో వాయువ్య దిక్కున తుంగభద్రానది ఒడ్డున జోగుళాంబ అమ్మవారి గుడి ఉంది.

పాతకాలం నాటి జోగులాంబ గుడి 14వ శతాబ్దంలో బహమని సుల్తాన్ల దాడిలో శిధిలమయినది. కాగా, అమ్మవారి విగ్రహాన్ని మరియు అమ్మవారి శక్తులయిన చండి మరియు ముండి విగ్రహాలను బాల బ్రహ్మేశ్వర స్వామి గుడిలో 2005 వరకు భద్రపరిచి ఉంచారు. ప్రస్తుతము శిథిలం కావించబడిన ప్రదేశంలోనే తిరిగి అమ్మవారి గుడిని పునర్నిర్మించారు. క్రొత్త గుడి చాల చక్కగా, అందంగా నిర్మించారు. అమ్మవారి గుడి చుట్టూ ఒక నీటి కోనేరు కట్టారు. ఆ గ్రామస్తులు చెప్పేదాని ప్రకారం జోగులాంబ అమ్మవారు చాలా ఉగ్రమయిన శక్తి స్వరూపిణి. కాబట్టి ఆ కోనేరు ఆమెను శాంత పరుస్తూంటుంది.

అలంపురం జోగులాంబ విగ్రహం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈమె కుర్చోని ఉంటుంది. తలలో చాలా జుట్టు ఉంటుంది. ఆ జుట్టులో బల్లి, తేలు, గబ్బిలం మరియు మనిషి పుఱ్ఱె ఉంటాయి.

సప్తమాతృకల విగ్రహాలు, విఘ్నేశ్వరుడు, మరియు వీణాపాణి వీరభధ్రుడు విగ్రహాలు గుడిలో ఉన్నాయి. పూర్వకాలపు చండి మరియు ముండి విగ్రహాలు బాల బ్రహ్మేశ్వర స్వామి గుడిలోనే ఉంచారు. క్రొత్తవాటిని తయారు చేసి అమ్మవారి గుడిలో ప్రతిష్టించారు.

అలంపురంను City of Temples అని పిలుస్తారు. ఈ ఊరులో పురాతనమయిన గుళ్ళు చాలా ఉన్నాయి. ఆ గుళ్ళు అన్ని కూడా శిల్పకళకు ప్రసిధ్ధి గాంచాయి. ప్రస్తుతం ఆ గుళ్ళు అన్నీ కూడా ఆర్కియాలజి డిపార్ట్ మెంట్ వారి ఆధీనంలో ఉన్నాయి. అన్ని గుళ్ళు కూడా తుంగభద్రా నది ఒడ్డున ఉన్నాయి. వాటిలో నవబ్రహ్మ ఆలయాలు మరియు కంచి కామక్షి అమ్మవారి గుళ్ళు ముఖ్యమైనవి.



అదిగో అలంపురం

తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అలంపూర్‌ జోగుళాంబ ఆలయం. ఇది గద్వాల్‌ పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల చేరువలో ఉంది. ఇక్కడి శిల్పసౌందర్యాన్ని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడం విశేషం. అన్ని క్షేత్రాలకు, ఆలయాలకు సంప్రదాయాలకు భిన్నంగా షణ్మతాలకు నిలయంగా అలంపురం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దక్షిణకాశీ, పరశురామ క్షేత్రం, భాస్కర క్షేత్రంగా భాసిల్లుతోంది.

నవబ్రహ్మ ఆలయాలు ఇవి
ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అలంపూరంలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన విగ్రహాలు ఉండటం, వాటికి నిత్యం ఆగమ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించడం కూడా విశేషం. భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే వారణాశి, (కాశీ)ని సందర్శించిన ఫలితం లభిస్తుందని స్కాంద పురాణం చెప్తోంది. నవబ్రహ్మల ఆలయాలన్నీ శివాలయాలే. బ్రహ్మ ప్రతిష్ఠించిన కారణంగా ఆ పేరు వచ్చింది.

ప్రధాన ఆలయంలో శ్రీ బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతామూర్తి. కాశీలో విశ్వేశ్వరుడు, అలంపూర్‌లో బాలబ్రహ్మేశ్వరుడు వెలసి ఉన్నారు. అక్కడ కాశీ... ఇక్కడ హేమలాపురం. అలంపురం పూర్వనామం హేమలాపురం. అయితే ఇది కాలక్రమేణా రూపాంతరం చెందుతూ హేమలాపురం, హతంపురం, యోగుళాపురం, జోగుళాపురం అని రూపాంతరం చెందుతూ ప్రస్తుతం అలంపురం క్షేత్రంగా వ్యవహారంలోకి వచ్చింది. కాశీలో ఉత్తరవాహిని గంగానది... అయితే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్రా నది. కాశీలో ఉన్నట్లే అలంపురంలో కూడా 64 స్నాన ఘట్టాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా జోగుళాంబ దేవి అలంపురంలో వెలసి ఉన్నారు.

గోష్పాద ముద్రిత లింగం!
సర్వసాధారణంగా లింగాలు స్థూపాకారంగా ఉంటాయి. కానీ అలంపుర క్షేత్రంలో మాత్రం బాలబ్రహ్మేశ్వరుడు గోష్పాద ముద్రిత రసాత్మక లింగంగా వెలసి ఉన్నాడు. ఆవుపాదం మోపితే ఎలాంటి ఆకృతి ఉంటుందో అదే ఆకృతిలో ఇక్కడ విగ్రహం వెలసి ఉంటుంది. పూర్వం ఈ విగ్రహంలో అనేకమైన రసాలు వెలువడుతుండగా రస సిద్ధులు కొందరు ‘పరశువేది’ అనే మూలిక సహాయంతో ఆ రసాలను మిళితం చేస్తూ ఈ విగ్రహంలో నుండి బంగారాన్ని తయారు చేశారు. తద్వారా ఆ బంగారంతో ప్రధాన ఆలయానికి

శైవక్షేత్రాలకు తలమానికంగా ఉన్న శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంలో అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్దవటం వెలసి ఉన్నాయి. దాదాపు 14 వందల సంవత్సరాల క్రితం 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల వంశంలో రెండవ పులకేశి ఈ ఆలయాలను నిర్మించినట్టు ఇక్కడ లభించే శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. షణ్మతాలకు నిలయంగా ఇక్కడ సౌర, శాక్తేయ, కౌమార, గాణపత్య, ౖÔð వ, వైష్ణవ వైదికాలకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి.

బాలబ్రహ్మేశ్వరుడు
పూర్వం బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేయడం ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించాడు. బ్రహ్మకారణం చేత పరమేశ్వరుడు వెలసినందుకు ఈ స్వామిని బ్రహ్మేశ్వరుడు అని, విగ్రహం చిన్నదిగా ఉన్నందున బాలబ్రహ్మేశ్వరుడు అని పిలుస్తారు. ఈ విగ్రహానికి ఆనుకుని విష్ణువుకు ప్రతిరూపమైన సాలగ్రామం వెలసింది. అందుకే శివాయ విష్ణు రూపాయ... శివరూపాయ విష్ణవే...అంటూ ఈ శైవæక్షేత్రంలో ధనుర్మాస పూజలు కూడా నిర్వహిస్తారు.

పాప వినాశి తీర్థం!
అలంపురానికి దక్షిణాన అరమైలు దూరంలో 24 ఆలయాల సముదాయమైన పాపనాశిని తీర్థం ఉన్నది. అది అష్టాదశ తీర్థాలలో ఎంతో ప్రాముఖ్యతగలది. మిగిలిన తీర్థాలు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. 24 ఆలయాల సముదాయం... ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికతలో తులతూగుతోంది. ప్రధాన ఆలయానికి చుట్టూ చిన్న, చిన్న గుడులు నిర్మించారు. ద్రావిడ, వేసర సంప్రదాయాలకు చెందిన ఆలయాలుగా వీటిని గుర్తించారు. ఈ ఆలయానికి ఉత్తర, దక్షిణ మూలలలో చక్కని ఆలయాలు, మంటపాలు ఉన్నాయి. వాటిలో స్తంభాల పైన రామాయణ గాథ శిల్పాలు, క్షీరసాగర మథనం, అపూర్వ రమణీయతలను చాటుతున్నాయి. ఈ తీర్థం శ్రీశైలం ప్రాజెక్టు మునకలో పోయినందున అక్కడి నుండి కిలోమీటర్‌ దూరంలో ఈ పాప వినాశిని పునః నిర్మాణం చేశారు.

లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం
ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం 

అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్తుతించిన స్తోత్రంలో ఈ ధ్యాన శ్లోకాన్ని పేర్కొన్నారు.

పూర్వం దక్షప్రజాపతి నిర్వహించిన నిరీశ్వర యాగంలో అందరి ముందు శివనింద చేయడంతో అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్ని కల్పించుకుని తాను దేహత్యాగం చేసుకుంటుంది. ఈ విషయాన్ని పరివారగణం ద్వారా తెలుసుకున్న పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడై వచ్చి అక్కడి యాగాన్ని సమూలంగా నాశనం చేసి మరణించిన సతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన భుజ స్కందంపై వేసుకుని రుద్రతాండవం చేస్తాడు. పరమేశ్వరుడి కోపాగ్ని చల్లార్చేందుకు శ్రీ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 శకలాలుగా విభజిస్తారు. ఆ భాగాలు వేర్వేరు ప్రదేశాలలో పడగా ఆది శంకరాచార్యుల వారు వాటికి ప్రాణప్రతిష్ఠాపన చేశారు. అవే నేడు 18 శక్తి పీఠాలుగా ఉద్భవించాయి. అందులో అలంపూర్‌లో దంతపంక్తి పైభాగం పడింది. అదే జోగుళాంబ శక్తిపీఠం.

నవబ్రహ్మ ఆలయాలు
ప్రధాన ఆలయ ఆవరణలోనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఇందులో బాల, కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, పద్మ, సర్గ బ్రహ్మేశ్వర ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల మీద అష్ట దిక్పాలకులు, శివ, విష్ణు అవతారాలు, నటరాజు, పురాణ కథా శిల్పాలు, ముగ్ధ మనోహరంగా భావ గాంభీర్యం చెడకుండా సృష్టించబడ్డాయి. ఈ శిల్ప సౌందర్యం దేశ విదేశ విద్వాంసులు నుంచి ప్రశంసలు పొందింది. గరుడ, గంధర్వ, కిన్నెర కింపురుషాది మూర్తులు చూపరులకు రమణీయంగా నిలిచాయి. ఇక్కడి శిల్పాల పైన మానవ మిథునాలు, పంచతంత్ర కావ్య కథా శిల్పాలు ఆదిత్యహృదయం, రామాయణ, మహాభారత శిల్పాలు కనువిందు చేస్తాయి. ఈ దేవాలయాల మీద శ్రీమార , నయన, ప్రియన్, శ్రీ కంఠాచార్యన్‌ తదితర శిల్పాచార్యుల పేర్లు నేటికి కనబడుతాయి.

సమీపంలో...
యోగనారసింహస్వామి ఆలయం ఉంది. దీనిని ప్రహ్లాద రాయలు నిర్మించారు. లక్ష్మీదేవి, గణపతి, ఆళ్వారులు, అనంత పద్మనాభస్వామి, ఆంజనేయస్వామి వెలసి ఉన్నారు. 14వ శతాబ్దంలో నిర్మించిన సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది.

దిండిగల్‌ ఆనంద్‌శర్మ



అలంపురం - తెలంగాణ శక్తిపీఠం

లంబస్తనీం వికృతాక్షీం ఘాెర రూపాం మహాబలాం,
ప్రేతాసన నమారూఢం జోగుళాంబాం నమామ్యహం

భారతదేశంలో అత్యంత పవిత్రమైన అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమే అలంపురము. బాలబ్రహ్మేశ్వర స్వామి ప్రధాన దైవతంగా నవబ్రహ్మాలయాలు నెలకొని ఉన్న పుణ్యక్షేత్రం అలంపురం, శిల్పరీత్యా, చరిత్ర రీత్యా, పౌరాణిక రీత్యా కూడా ఇదొక పవిత్ర క్షేత్రం. ఉత్తర వాహినియై ప్రవహిస్తున్న తుంగ భద్రాతీరంలో వెలసిన ఈ క్షేత్రానికి మరొక ప్రశస్తి ఉంది. జోగుళాంబాదేవిగా కొలువై ఉన్న అమ్మవారి పేరుతో కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పరమశివుని భార్య సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో ఖండించినప్పుడు మన పవిత్ర భారత భూమిపై ఆ శరీరపు పదునెనిమిది ఖండములు పడిన చోటు లే అష్టాదశ శక్తిపీఠములు. ప్రసిద్ధమైన యీ శక్తిపీఠములు మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్నట్లు పురాణ ఆధారాలను బట్టి తెలుస్తున్నది. దేశంలోని అపూర్వశక్తి సంపన్నమైన శక్తి పీఠాలలో ఇది ఒకటి అన్న విషయం లోక విదితము.

జోగుళాంబా అమ్మవారి ఆలయం ప్రాచీనమైనది. క్రీ. శ. 7వ శతాబ్దంలో యీ ప్రాచీనాలయం నిర్మించారని చారత్రకుల భావన. 9వ శతాబ్దంలో శ్రీ శంకర భగవత్పాదుల వారు శ్రీ చక్ర ప్రతిష్ఠ చేసినట్టు తెలుస్తున్నది. 14వ శతాబ్దంలో జరిగిన ముస్లిం దండయాత్రల కాలంలో ఈ ప్రాచీన దేవాలయం ధ్వంసం అయినందువల్ల అమ్మవారి మూల మూర్తిని బ్రహ్మేశ్వ రాలయంలోని ఒక మూలలో ప్రతిష్టించి పూజలు జరిపించారు. ఇంకా అనేక ఆలయాలు ధ్వంసం కాకుండా విజయనగర చక్రవర్తి రెండో హరిహరరాయల కుమారుడు మొదటి దేవరాయలు తన తండ్రి ఆజ్ఞ పాటించి ఆ ముస్లిం సైన్యాన్ని పారగొట్టి దేవాలయాల్ని రక్షించాడు. ఇటీవలె తిరిగి ఆ స్థలంలోని ప్రాచీన ఆలయ వాస్తు రీతిలో నూతన ఆలయం నిర్మించి తిరిగి అమ్మవారి ప్రతిష్ఠ జరిపించడం విశేషం.

ఈ నూతన ఆలయం పైకప్పుపై పద్మం, నాగంవంటివి మిగతా ఇక్కడి ఆలయాల్లో ఉన్నట్టే చెక్కడానికి ప్రధాన కారణం నాగం కుండలినీ శక్తికి, పద్మం సహస్రారానికి సంతాేలు కావడమేనని పెద్దల అభిప్రాయం. ఆలయ స్తంభాలపై అష్టాదశ, శక్తిపీఠాలలో కొలువైన అమ్మవార్ల శిల్పాలు కూడా చెక్కి ఈ శక్తి పీఠ ప్రాశస్త్యాన్ని మరింత శక్తివంతం చేశారు.

బాలబ్రహ్మ కుమార కర్క వీరో విశ్వశ్చ తారకః
గరుడ స్వర్గ పద్మాశ్రీ నవబ్రహ్మా ః ప్రకీర్తితాః

అన్న పౌరాణిక ప్రమాణాలను బట్టి ఇక్కడ నవబ్రహ్మల ఆలయాలన్నట్లు తెలుస్తున్నది. బ్రహ్మ పరమేశ్వరుని గురించి తపస్సు చేసిన పవిత్ర స్థలం కావడం వల్ల ఇక్కడ ప్రధాన శివాలయమైన బాల బ్రహ్మేశ్వరాలయంతో బాటు, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ ఆలయాలు ప్రత్యేకంగా ఉండటం, ఇక్కడ క్షేత్ర పవిత్రతను మరింత పెంచాయి. ఈ శివాలయాలపై ఉన్న అనేక శిల్పాలు పౌరాణిక గాథలతో ూడి ఒక అద్భుత ప్రపంచాన్ని మనకు దృశ్యమానం చేస్తాయి. ఎందరెందరో దేశ విదేశ చరిత్రారులకు స్ఫూర్తినిచ్చేవిధంగా యీ దేవాలయాల నిర్మాణం జరిగింది. బ్రహ్మ తపోభూమిలో వెలసిన శివుడు కనుక ప్రతి శువుని చివరక బ్రహ్మ శబ్దం జోడించబడింది. దేవాలయ వాస్తును అధ్యయనం చేయాలనుకున్న జిజ్ఞాసువుల ఆలయాలు గొప్ప విద్యాంద్రాలని చెప్పవచ్చు.

ఇక్కడి ఆలయాలన్నీ ఒ కాలంలో నిర్మించినవి కాక పోవచ్చునని పరిశోధకుల భావన. తెలుగు నేలపై బాదామీ చాళుక్య రాజుల పాలన సాగిన 200 సంవత్సరాల కాలంలో వీటి నిర్మాణం జరిగినట్లు భావిస్తుంటారు. భారతీయ వాస్తు శిల్ప రీతులను, వేద ధర్మ వికాసాన్ని, చారిత్రక విశేషాలను అధ్యయనం చేయాలనుకున్న పరిశోధకులకు ఇవి గొప్పగా ఉపయోగపడే ఆలయాలు. మహాద్వారం మొదలుకొని వరుసగా కనిపించే ఈ నవ బ్రహ్మాలయాలు భక్తులకు, చరిత్ర విజ్ఞాన సముపార్జన చేయాలనుకున్న వారికి శిల్పరీతులను తెలుసుకొన గోరే వారికి ప్రధాన ంద్రాలై విరాజిల్లుతున్నాయి.

దీనికి దక్షిణా కాశిగా సంభావిస్తుంటారు. అట్లా గుర్తించడానికి అనేక పురాణాంతర్గత సాక్ష్యాలున్నాయి. ఇది శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వారం. శ్రీశైలానికి తూర్పున త్రిపురాంతకం. దక్షిణాన సిద్ధవటం, పశ్చిమాన అలంపుర, ఉత్తరాన ఉమామహేశ్వరం అనే ప్రముఖ శైవ క్షేత్రాలున్నాయని స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం చెబుతున్నది.

బ్రహ్మేశోయం సవిశ్వేశః సాకాశీ హేమలాపురీ సాగంగా తుంగ భద్రే7యం సత్యమేతన్న సంశయః

కాశీ మహాక్షేత్రంలో విశ్వేశ్వరుడైతే ఇక్కడ బ్రహ్మేశ్వరుడు, అక్కడ గంగ ఉత్తరవాహిని, ఇక్కడ తుంగభద్ర ఉత్తర వాహిని అదికాశి, ఇది హేమలాపురం అంటూ చెప్పిన శ్లోకంలోనే దీనిని దక్షిణ దిశలోని కాశి అనడానికి ఏ సంశయమూ లేదని యీ శ్లోకం సాక్ష్యమిస్తున్నది. పైగా కాశీక్షేత్రంలో ఉన్నట్లు ఈ క్షేత్రంలోనూ పాపవినాశిని, మణి కర్ణిక మొదలైన 54 ప్రధాన ఘట్టాలున్నాయి. అక్కడికి దగ్గర్లో త్రివేణి సంగమం ఉంటే ఇక్కడికి దగ్గర్లో కృష్ణా, తుంగ భద్రల సంగమం ఉంది. అక్కడి దేవత కాశీవిశాలాక్షి అయితే ఇక్కడి అమ్మవారు జోగుళాంబాదేవి.

ఈ క్షేత్రానికి వైదిక మత రీత్యా ఎంతో ప్రాధాన్యం ఉంది. శైవ, వైష్ణవ, శా్తయ, గాణాపత్య, సైర, స్కాందగా సంభావించిన షన్మణతాలకు సంబంధించిన దేవతా మూర్తులు ఈ క్షేత్రంలో మనకు కనిపిస్తాయి. ప్రధాన ఆలయమైన బ్రహ్మశ్వరాలయం రససిద్ధులచే నిర్మించబడిందనీ, ఇక్కడి శివలింగం మహా మహిమాన్వితమైందని భావిస్తుంటారు. స్కాంద పురాణంలోని శ్రీశైలఖండంలోని రెండు అధ్యాయాలు, సంస్కృతంలోని ఒక ప్రత్యేక స్థల పురాణం ఈ క్షేత్రం మహాత్మ్యాన్ని తెలిపే ప్రధాన ఆధారాలు. ఇది బ్రహ్మచే ప్రతిష్టితమైన శివలింగం. ఇది జ్యోతిర్వ్యాలామయమైనదని కూడా దీనికి ప్రశస్తి ఉంది. ఇక్కడ జమదగ్ని ఆశ్రమం ఉండేదని, జమదగ్ని మహర్షి భార్య రేణుకను కుమారుడు పరశురాముడు సంహరించిన స్థలంగా దీన్ని భావించడానికి ఇక్కడ తలలేని భూదేవి విగ్రహం ఉండటం కూడా ప్రమాణమని ఐతిహ్యం ఉంది.

ఇక్కడి పాప వినాశని తీర్థంలోని గదాధర విగ్రహ సన్నిధిలో శ్రాద్ధకర్కల నాచరించడం శ్రేష్టమని భావన. ఈ క్షేత్ర మహాత్మ్యం తెలుగులో ప్రసిద్ధి చెందిన పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర కూడా విస్తృతంగా వర్ణించింది. ఇక్కడి అనేక తీర్థాలను ప్రస్తావించింది. బ్రహ్మకు విగ్రహం ఉండటం ఈ క్షేత్రంలోని మరో విశేషం. మనకు అరుదుగా కనిపించే బ్రహ్మ విగ్రహం ఇక్కడ ఉండటానికి ఇది బ్రహ్మతపస్సు చేసి ఇక్కడి శివలింగాన్ని స్థాపించాడన్నదే ప్రధాన కారణంగా చెబుతారు.

ఇక్కడి శివుణ్ణి గోష్పాద ముద్రిత రసాత్మక లింగమూర్తేః అని వర్ణించడానికి కారణం ఇక్కడి లింగం పై భాగం ఆవు గిట్ట పడినట్లుగా ఉంటుంది. అదే దీనికి కారణం పరిమా ణంలో చాలా చిన్నదైన బ్రహ్మేశ్వర లింగం పై భాగం ఇట్లా ఉండటం ఒక ప్రత్యేక విశేషం.

అలంపురానికి గొప్ప చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి శాసనాల్లో దీని పేరు హలంపుర, హతంపుర, హేమలాపురంగా పిలువబడిన ఈ గ్రామం ఇక్కడి ఉర్దూ రికార్డుల్లో అల్పూరుగా అలంపూరుగా పేర్కొనబడింది.

శతాబ్దం నాటి ఇక్ష్వాకుల శాసనాల్లో హలంపుర ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడి పరిసరాల తవ్వకాల్లో ప్రాచీన కాలపు అవశేషాలు అనేకం లభించాయి. శిలాయుగం నాటి అవశేషాలు కూడా వీటిలో ఉన్నట్లు గుర్తించారు. రాకాసి గుళ్ళు గా పిలుచుకునే పరిసర గ్రామాల్లోని సమాధులు తవ్వి చూస్తే అనేక ఆధారాలు లభించాయి.

మౌర్యులు, శాత వాహనులు, బాదామీచాళుక్యలు, రాష్ట్ర ూటులు, కల్యాణీ చాళుక్యులు, కాకతీయులు, విజయ నగర రాజులు, సుల్తానులు ఎందరెందరో పాలకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా శాసన ప్రమాణాలు, నిర్మాణ విశేషాలు సూచిస్తున్నాయి.

ఇదొక ప్రాచీన విద్యా పీఠంగా చెప్పడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. మహాద్వారం, కంచికామాక్షి ఆలయాలతో బాటు అనేక ఆలయాలున్న ఈ అలంపుర దేవాలయంలో అద్భుత శిల్పకళారీతు లు భారతీయ సంస్కృతికి పట్టు కొమ్మలు. ప్రాచీన కళాఖండాల సంరక్షణ కోసం ఏర్పరచిన మ్యూజియం మిక్కిలి ప్రసిద్ధం. ఇక్కడి దేవాలయాల ఆవరణలో ఉన్న షా అలీ పహిల్వాన్‌ దర్గా సుప్రసిద్ధమైంది.

కీ.శే. గడియారం రామకృష్ణ శర్మగారు ఈ క్షేత్రంపై విశేష పరిశోధనలు చేసిన పండితకవి. శ్రీ శైలం జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌లో మునిగిపోకుండా పోరాటం చేసి నిలబెట్టిన మహామనిషి. ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపుకు గురైన ప్రాంతాల్లోని అనేక ఆలయాలు ఇక్కడ పునర్మించినిలబెట్టారు.

తెలంగాణాలోని ఏకైక శక్తిక్షేత్రం, అద్భుత చారిత్రక నిర్మాణాలు చోటు చేసుకున్న ప్రాంతం. కాశీతో సమంగా వెలిగే దక్షిణకాశీ క్షేత్రం. దీన్ని పరిరక్షించి మరింత శోభను సమూర్చి మన ప్రాంతపు ప్రాచీన చరిత్రను ప్రపంచం ముందు నిలబెట్టి వెలిగించే బాధ్యత మనమీదే ఉందన్న సత్యం విస్మరించరానిది.








హరహర మహదేవ శంభో శంకర

మహశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు "హరహర మహదేవ శంభో శంకర", "నమః శివాయ" అనే శివనామస్మరణతో మారుమోగుతుంది. శివనామస్మరణం సకల పాపాలకు హరణం అని భక్తుల నమ్మకం ఉండడంతో ఎటుచూసిన శివనామస్మరణమే వినిపిస్తుంది.

మహశివరాత్రి సమయన్న భక్తులు తుంగభధ్రనదిలో పుణ్యస్నానాలు ఆచరించి దక్షిణకాశీగా పిలువబడే ఐదవశక్తి పీఠం జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలతో పాటు నవబ్రహ్మదుల దేవాలయాలను దర్శించుకుంటారు.

ఐదవశక్తిపీఠం అలంపూర్‌కు తూర్పుదిక్కున, ఆరవ శక్తిపీఠం శ్రీశైలానికి ఉత్తరదిశన వెలసిన ఉమామహేశ్వరుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తారు.  అటవీ ప్రాంతంలోని కొండల మధ్య వెలసిన ఉమామహేశ్వరుడి దర్శనంతో పాటు, పాలధార పంచదార దగ్గర వస్తున్న జలపాతంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు.

శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు ఉమామహేశ్వరంలోని ఉమామహేశ్వరుడిని దర్శించుకోవడానికి రావడంతో ఆ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగుతుంది.

దట్టమైన నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో వెలసిన మల్లెలతీర్థంలోని శివలింగం దర్శనం కోసం భక్తులు కిలో మీటర్ల మేర కాలినడకన నడిచివచ్చి లోయలో జలపాతంలో వెలసిన సాక్షాత్తు పరమేశ్వరుడిని భక్తులు దర్శించుకుని, జలపాతంలో ఉన్న శివలింగంపై పడుతున్న నీటిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి తరించిపోతారు.

ఆరు వందల సంవత్సరాల నాటి శివాలయాల్లో ప్రత్యేక పూజలు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణపేట డివిజన్‌ కేంద్రంలో వెలసిన ఆరు వందల సంవత్సరాల నాటి శివాలయాల్లో భక్తులు శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరు వందల సంవత్సరం క్రితం నిర్మించిన బారంబావి శివాలయం, లింగయ్య దేవాలయం, తీర్థంబావి, మార్కండేయ దేవాలయం, నాగరేశ్వర దేవాలయం, బసవేశ్వర దేవాలయం, నారాయణ దేవాలయం, నీలకంఠేశ్వర దేవాలయం, శివాజీనగర్, మడి ఏరియాల్లో గల ఈశ్వర్ మందిర్ శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసదీక్షలను చేపట్టారు.

పులకించిన దక్షిణకాశి ఆలయాలు
అలంపూర్: నవబ్రహ్మాలయాల దివ్యదామం, అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబదేవి ఆలయాలు భక్తులు చేసిన శివనామస్మరణతో పులకించి పోయాయి.

బాలబ్రహ్మ కుమార అర్క వీర విశ్వచ్చతారక గరుడ స్వర్గ పద్మర్శ నవబ్రహ్మ ప్రకోపితహః
అలంపూర్ క్షేత్రం నవబ్రహ్మాలయాల దివ్యదామంగా పిలవబడుతుంది. బాల, కుమార, అర్క, వీర, విశ్వ, గరుడ, తారక, స్వర్గా, పద్మబ్రహ్మాలయాలు ఇక్కడ 7వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్యకాలంలో చాళక్యులు నిర్మింప చేశారు.






Sunday, 19 March 2017

కామాఖ్యాదేవి ఆలయం

స్త్రీ శక్తికి... సృష్టి ఆవిర్భావానికీ సంకేతం.


అష్టాదశ శక్తిపీఠాలలో అగ్రగణ్యమైనది, శాక్తేయులకు అత్యంత ఆరాధనీయమైనదీ కామరూపాదేవి ఆలయం. పిలవని పేరంటానికి వెళ్లి, కన్నతండ్రి చేత ఘోరపరాభవం పొందిన సతీదేవి, అవమాన భారంతో ఆత్మత్యాగం చేస్తుంది. ఇది తెలిసి, అక్కడకు చేరుకున్న శివుడు విచలిత మనస్కుడై, ఆమె శరీరాన్ని భుజాలమీదకు ఎత్తుకుని రుద్రతాండవం చేస్తుంటాడు. సతీదేవి శరీరం అక్కడ ఉన్నంతసేపూ శివుడిని ఆపశక్యం కాదని తెలిసిన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు.

అవి 108 ఖండాలుగా భూలోకంలోని వివిధ ప్రదేశాలలో పడతాయి. ఆమె శరీరంలోని కీలకమైన భాగాలు పడిన ప్రదేశాలలో తిరిగి అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి, ఆలయాలు నిర్మించారు పూర్వులు. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధిచెందాయి. వాటిలో అమ్మవారి యోనిభాగం నీలాచలం కొండలపై పడింది. అదే కామాఖ్యా పీఠంగా గుర్తింపు పొంది, కామాఖ్యాదేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, ఛిన్నమస్త, భైరవి, ధూమావతి, కమలాంబిక, షోడశి, మాతంగి అనే పది వేర్వేలు ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయమూ ఒక్కో విద్యకు ప్రసిద్ధమైనది. ప్రధాన ఆలయం కామాఖ్యాలయమే.

మరో కథ:
సతీదేవి ఆత్మత్యాగానంతరం తీవ్రమైన వేదనతో తపస్సమాధిలో లీనమై ఉన్న పరమేశ్వరుని మనస్సును మార్చాలని దేవతలు సంకల్పిస్తారు. ఇందులో భాగంగా మన్మథుడు సమయం చూసుకుని, పూలబాణాలు వేసి, ఆయనకు తపోభంగం కలిగిస్తాడు. దాంతో ముక్కంటి తన మూడవకంటిని తెరచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. మన్మథుడికే కాముడు అనే పేరు. కాముణ్ణి దహించిన ప్రదేశం కనుక దీనికి కామాఖ్య అనే పేరొచ్చిందంటారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తిరిగి రూపాన్ని పొందాడు. అయితే కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే రూపంతో కనిపిస్తాడు. ఇక్కడి బ్రహ్మపుత్రానదిలో భస్మకూటమనే పర్వతం ఉండటం శివుడు మన్మథుని భస్మం చేయడం, తిరిగి ఆయన రూపం పొందాడనడానికి ప్రతీకగా నిలుస్తుంది.

ప్రత్యేకతలకు ఆలవాలం:
ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్యమతస్థుల దాడుల్లో ధ్వంసం కాగా, 17వ శతాబ్దంలో కుచ్‌ బీహార్‌ రాజు నరనారాయణుడు పునర్నిర్మించాడని శాసనాధారాలున్నాయి. తేనెపట్టు ఆకారంలో ఉన్న ఆలయ శిఖరం గణేశుడు తదితర దేవీ దేవతల శిల్పాలతో కనువిందు చేస్తుంది. మాంత్రికులకు, తాంత్రికులకు, వామాచారులకు, క్షుద్రపూజలు చేసేవారికి ఈ ఆలయమే ఆధారం. కారణం ఇది సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. కాబట్టి అమ్మవారు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. మూడు మంటపాలుగా నిర్మించి ఉంటుంది.

అందులో మొదటి ప్రాకారంలో గుహలా ఉండే గర్భాలయంలో యోనిచిహ్నం ఉన్న నల్లటి బండరాయి ఉంటుంది. దానికే పూజలు జరుగుతాయి. అయితే ఆ రూపం కనిపించకుండా భక్తుల దర్శనానికి ముందే పూలతో నింపేస్తారు. ఆ గుహలోపల రాతి మీద ఎప్పుడూ జల వూరుతూ ఉంటుంది. అందువల్ల మూలవిరాట్టు ఎప్పుడూ తడిగా ఉంటుంది. గర్భాలయం అంతా చిత్తడిగా, జారుడుగా ఉంటుంది. ఆలయం బయటే శీతలాదేవి సన్నిధి ఉంటుంది. దీర్ఘవ్యాధులు ఉన్నవారు ఈమెను సేవించుకుంటే వాటినుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. రెండవ మండపం చతురస్రాకారంలో, సువిశాలంగా ఉంటుంది. అదే అమ్మవారు కొలువై ఉన్న గుహాంతర్భాగంలోకి దారితీస్తుంది.

పూజలు – ఉత్సవాలు:
అమ్మవారికి రోజూ చేసే పూజలు గాక దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా దుర్గాపూజ జరిపిస్తారు. ఇవిగాక ఫాల్గుణ మాసంలో దుర్గాడియుల్‌ అని దుర్గాదేవికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా మానసాపూజ, పోహన్‌ బియా అంటే పుష్యమాసంలో కామేశ్వరుడికీ, కామేశ్వరీదేవికీ కల్యాణం జరిపిస్తారు. అదేవిధంగా చైత్రమాసం రాగానే, వసంత రుతు ఆగమనానికి సంకేతంగా వసంతపూజ జరుగుతుంది. ఇదే మాసంలో మదన డియుల్‌ అంటే కామదేవతకీ, కామదేవుడికీ పూజ జరుగుతుంది.

Monday, 23 January 2017

శిర్ఖండాదేవి - చంద్రవదనాదేవి






మంచు కొండల్లో మహాదేవి దర్శనం

హిమాలయ పర్వతాలు మహాదేవుడికే కాదు, మహాదేవికీ నిలయాలే అనడానికి నిదర్శనంగా నిలుస్తాయి ఉత్తరాఖండ్‌లోని శివాలిక్‌ శ్రేణుల్లోని శిర్ఖండాదేవి, చంద్రవదనాదేవి శక్తిపీఠాలు. అంటూ ఆ విశేషాలు చెప్పుకొస్తున్నారు పుణెకు చెందిన కర్రా నాగలక్ష్మి.

శిర్ఖండాదేవి

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో డెహ్రాడూన్‌ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ వేసవి విడిది మసూరీ రోప్‌వేలూ జలపాతాలూ బౌద్ధారామాలూ మాల్‌ రోడ్డూ మేఘాలను తాకుతున్నట్లుండే పర్వతాలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే వాటితోపాటు దాని చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు ఇంకేం ఉన్నాయా అని స్థానికుల్ని ఆరాతీయడంతో తెలిసినవే ఎన్నడూ వినని ఈ రెండు శక్తిపీఠాలు. ముందుగా శిర్ఖండాదేవిని దర్శించుకుందామని బయలుదేరాం. మసూరీకి 34 కిలోమీటర్ల దూరంలో ధనౌల్టీకి సమీపంలో సముద్రమట్టానికి సుమారు 2760 మీటర్ల ఎత్తులో ఉంది శిర్ఖండాదేవి ఆలయం. మసూరీ నుంచి అంతా ఘాట్‌ రోడ్డు ప్రయాణమే. చుట్టూ పైన్‌ చెట్లతో కూడిన దట్టమైన అడవి మధ్యలో మా ప్రయాణం సాగింది. రోడ్డు పక్క అక్కడో ఇల్లూ ఇక్కడో ఇల్లూ తప్ప మరేమీ లేవు. కద్దుఖల్‌ అనే గ్రామంలో ఓ చోట రెండు పాకలు వేసి ఉన్నాయి. నాలుగు గుర్రాలు కూడా ఉన్నాయి. కానీ మేం ఈ గ్రామం నుంచి నడిచి వెళ్లాలనుకున్నాం. అయితే చలి బాగా ఉండటంతో అక్కడి పాకలో వేడివేడి టీ తాగి నడక ప్రారంభించాం. మూడు కిలోమీటర్లు నడవడానికి మాకు గంటన్నర సమయం పట్టింది. అక్కడ దారి మెట్లు మెట్లుగా జారుడుగా ఉంది. కొన్ని మెట్ల తరవాత వంకలు తిరిగిన సన్నని కాలి బాట మొదలైంది. ఆ తరవాత దారి నిట్టనిలువుగా పైకి ఎక్కేలా ఉంది. చుట్టూ ఉన్న ప్రకృతి సోయగం ఆయాసాన్ని మరిపించినా అంత చలిలోనూ మాకు చెమటలు పట్టాయి. ఎట్టకేలకు మందిరం ప్రాంగణంలోకి అడుగుపెట్టాం. అక్కడ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన బోర్డు మీద మందిరం స్థలపురాణం వివరంగా రాసి ఉంది. వెళ్లగానే ముందు మందిరంలోకి వెళ్లాం. అది చాలా చిన్నగా ఉంది. అమ్మవారి విగ్రహం కూడా చాలా చిన్నది. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోగానే అక్కడేదో శక్తి ఉన్నట్లే అనిపించింది. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి మృతదేహంతో ఆ పరమశివుడు చేసిన రుద్రతాండవం కారణంగా ఆమె శిరస్సు శరీరం నుంచి వేరయి ఈ పర్వత శిఖరాల మీద పడిందట. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాల్నే శక్తిపీఠాలుగా పిలుస్తారు. అలా ఆమె శిరస్సు పడటం ద్వారా వెలసినదే ఈ శిర్ఖండా దేవి. ఇక్కడ దేవీ నవరాత్రులూ గంగా నవరాత్రులూ నిర్వహిస్తారు. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. మిగిలిన సమయాల్లో పెద్దగా ఉండరు. మేం వెళ్లినప్పుడు ఆ మందిరంలో ఇంకెవ్వరూ లేరు. అందుకే అక్కడ చాలాసేపు కూర్చుని స్తోత్రాలు చదువుకుని తిరుగుప్రయాణమయ్యాం.

చంద్రవదనాదేవి!
ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మంచుపడుతూ ఉంటుంది. వర్షాకాలంలో పర్యటించకపోవడమే మేలు. తిరుగుప్రయాణంలో మేం మసూరీకి కాకుండా స్థానికుల నుంచి సమాచారం తీసుకుని చంద్రవదనాదేవి పీఠానికి బయలుదేరాం. దేవ ప్రయాగ రోడ్డులో ప్రయాణం మొదలైంది.

దారి మొత్తం కొండ రోడ్డే. అడవిగుండానే సాగుతుంది. అక్కడక్కడా చిన్న చిన్న గ్రామాలూ మెట్ట వ్యవసాయం తప్ప మరేమీ లేవు. సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించాక జామనీఖాల్‌ గ్రామానికి చేరుకున్నాం. అక్కడ నుంచి సుమారు మరో ఏడు కిలోమీటర్లు ప్రయాణించి చంద్రవదనీ పర్వతానికి చేరుకున్నాం. అక్కడ నుంచి సుమారు ఓ కిలోమీటరు కొండమీదకి నడిచి చంద్రవదనాదేవి మందిరానికి చేరుకున్నాం. ఇది కూడా చాలా చిన్న మందిరం. మందిరం దగ్గర పూజారి తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. గర్భగుడి మధ్యలో ఎర్రని బట్ట పైనుంచి కట్టి ఉంది. పూజారిని అది తొలగిస్తే అమ్మవారిని దర్శించుకుంటామని అడిగాం. అయితే దాన్ని ఎప్పుడూ తొలగించమని ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాం. చంద్రవదనాదేవి అంటే అందమైనది అని అర్థం. అయితే ఆ మందిరంలో అసలు అమ్మవారి విగ్రహమే లేదట. మరక్కడ ఏమి ఉంటుందని అడిగితే ఆయనకూ సరిగ్గా తెలీదట. కానీ శ్రీచక్రం ఉండొచ్చు అన్నాడు. ఎందుకంటే రోజూ ఉదయమూ సాయంత్రమూ పూజారి కళ్లకు గుడ్డ కట్టుకుని ధూపదీపనైవేద్యాలు సమర్పించి ఇవతలకు వస్తారట. రుద్రతాండవం చేస్తోన్న శివుణ్ణి ఆపేందుకు విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె గుప్తాంగం చంద్రవదనీ పర్వతంమీద పడిందట. అమ్మవారి ప్రతిరూపమైన శ్రీచక్రాన్ని అంగం ఉన్న ప్రదేశంలో ప్రతిష్టించి ఉంటారనీ దాన్ని పరులెవరూ చూడకూడదనీ చెప్పారాయన. అక్కడ ఉన్న ఎర్ర బట్టను సైతం కళ్లకు గంతలు కట్టుకుని ఏడాదికోసారి మారుస్తారట. అందుకే మేం కూడా ఆ ఎర్రబట్టకు ఇవతల నుంచే పూజ ముగించి బయటకు వచ్చాం. దసరా నవరాత్రుల్లో చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. తిరుగుప్రయాణంలో సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించి దేవప్రయాగకు చేరుకున్నాం. అప్పటికే సాయంత్రం ఏడవడంతో ఆ రాత్రికి అక్కడే బస చేసి, అరుదైన శక్తి పీఠాలను దర్శించుకున్నామన్న సంతృప్తితో ఆ మర్నాడు పుణెకి తిరిగి వచ్చాం.

Friday, 10 June 2016

విశిష్ట నగరం... కొల్హాపూర్‌

భారతదేశంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన చారిత్రక నగరం ఉత్తర మహా రాష్ట్రలోని కొల్హాపూర్‌. ఇక్కడ ఉన్న మహాలక్ష్మి దేవాలయం బాగా ప్రసిద్ధి చెందినది. ఈ పట్టణం కొల్హాపూర్‌ చెప్పులకు కూడా ప్రసిద్ధి.

చూడవలసిన ప్రదేశాలు...
కొల్హాపూర్‌లో ముఖ్యంగా చూడవలసినవి మహాలక్ష్మి దేవాలయం, మహారాజ భవనం. మహాలక్ష్మి దేవాలయం "హేమాడ్‌ పంతి" నిర్మాణశైలిలో కట్టబడినది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది.

కొల్హాపూర్‌ మహాలక్ష్మి...
గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్‌ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని "అంబాబాయి" అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. 
ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా 5 కి.మీ. దూరంలో ఉన్న తెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. 
ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. 
గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది.

ఇక మహారాజ భవనం సుమారు రెండు వందల గదులతో మూడు అంతస్థులతో చక్కగా విశాలమైన మైదానం మధ్యలో ఉంటుంది. ఆనాటి రాజుల ఆయుధాలు, రాజరికపు సామగ్రి మొదలైనవి ఇందులో పొందుపరిచారు.

కొల్హాపూర్‌ సంస్థానం...
కొల్హాపూర్‌ బ్రిటిష్‌ కాలంలో బొంబాయి ప్రెసిడెన్సీలో ఒక ప్రముఖ సంస్థానం. ఆ కాలంలో నాలుగు ముఖ్యమైన సంస్థానాలలో ఒకటి; మిగిలిన మూడు బరోడా, గ్వాలియర్‌ మరియు ఇండోర్‌. దీని పాలకులైన బోంస్లే రాజ్యం 19 గన్‌ సెల్యూట్‌కు అర్హులు. కొల్హాపూర్‌ను పరిపాలించిన రాజులు, తంజావూరు, సతారాలను పాలించిన భోంసాలే వంశాల వలె మరాఠా భోంసాలే రాజవంశం నుండి ఉద్భవించారని చెప్పుకుంటారు. మరాఠా సామ్రాజ్య వారసత్వ విషయమై తలెత్తిన వివాదాల వలన సతారా మరియు కొల్హాపూర్‌ రాజ్యాలు 1707లో ఏర్పడ్డాయి. మరాఠా సామ్రాజ్యానికి వారసుడైన షాహూ శంభాజీని మొగలులు తొమ్మిదేళ్ళ వయసులో పట్టి బంధించి ఖైదులో ఉంచారు. షాహూ శంభాజీ తండ్రి, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ పెద్దకొడుకు శంభాజీ. శంభాజీ మరణం తర్వాత శివాజీ చిన్నకొడుకు రాజారాం ఛత్రపతి అయ్యాడు. 1700లో అనారోగ్యం వలన రాజారాం మరణించగా ఆయన భార్య మహారాణి తారాబాయి తన కొడుకు రెండవ శంభాజీని మహారాజుగా ప్రకటించి, తాను ప్రతినిధిగా పాలించింది. 1707లో మెగలులు కొన్ని షరతులతో షాహూను విడుదల చేశారు. విడుదలైన షాహూ తన వంశానుగతమైన రాజ్యాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేశాడు. ఖేడ్‌ వద్ద జరిగిన యుద్ధంలో షాహూ, తారాబాయి ఓడించి సతారాపై తన అధికారాన్ని స్థాపించాడు. ఓడిపోయిన రాణి తన కొడుకుతో కలిసి కొల్హాపూరులో స్థిరపడింది. 1710 కల్లా రెండు వేర్వేరు రాజ్యాలుగా పరిణమించాయి. దీన్ని 1731లో కుదుర్చుకున్న వార్నా సంధి ధృవీకరించింది.

Sunday, 13 March 2016

ఉజ్జయినీ కాళి





ఉజ్జయినీ కాళి
అనంత కల్పవల్లి

అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన మధ్యప్రదేశ్‌
లోని ఉజ్జయినిలో మహాకాళిగా అమ్మవారి రూపాన్ని వర్ణించడం జరిగింది. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళీశ్వరుని రూపం ఇక్కడ కనిపిస్తుంది. ఉజ్జయినిలో ఆ మహాకాళీదేవి హరసిద్ధి మాతగా ప్రసిద్ధి చెందింది. 

స్థల పురాణం ప్రకారం అంధకాసురుని వధించడానికి హరుడు వచ్చాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. ఆ రాక్షసునికి ఉన్న వరాల బలంతో మరణించకపోవడంతో మహంకాళిని పిలిచాడు శివుడు. ఆ తల్లి ప్రత్యక్షం అయి అంధకాసురుని సంహారానికి కారణం అయ్యింది. అలా రాక్షస సంహారం జరగాలన్న హరుని కోరిక సిద్ధింపజేయటం వలన ఆనాటి నుండి ఉజ్జయినీలోని మహాకాళిని ‘‘హరసిద్ధి’’ మాతగా కొలవటం ప్రారంభం అయ్యింది.

ఆ పరిసర ప్రాంతంలో ‘‘గడ్‌ కాళి’’ ఆలయం కూడా కనపడుతుంది. కొంతమంది ఈమెను మహాకాళిగా భావించటం కూడా కనిపిస్తున్నది. ఉజ్జయినీలో ఆ తల్లి రాత్రివేళ సంచరిస్తూ ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటుంది.

ఉజ్జయినిలోనే కాళిదాస మహాకవికి నాలుక మీద వాశ్చీజాన్ని వ్రాసింది మహాకాళి.
విక్రమార్కుని ఇంటి ఇలవేల్పు ఉజ్జయినీ కాళి. విక్రమార్కుని అనుగ్రహించి వెయ్యేళ్ళు రాజ్యాధికారాన్ని, అనంతమైన ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువుని ప్రసాదించింది.
భర్తృహరి కవి కూడా ఉజ్జయిని కాళి కోసం తపస్సు చేసి ఆమె అనుగ్రహాన్ని పొందినవారని తెలుస్తున్నది. ఇప్పటికీ ఉజ్జయినిలో భర్తృహరి తపస్సు చేసిన గుహలు ఉన్నాయి.
నాథ సంప్రదాయానికి ఆద్యుడైన మత్స్యేంద్రనాథుడు కూడా ఉజ్జయిని కాళిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని; కాళీమంత్ర సిద్ధిని పొందటం జరిగింది. ఉజ్జయినిలో మత్స్యేంద్రనాధుని సమాధిని కూడా స్థానికులు పూజించటం కనిపిస్తుంది.

ఇవాల్టికీ ప్రతిరోజు వేలమంది యాత్రికులు అక్కడికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకొని ఆమె అనుగ్రహంతో కష్టాలను తొలగించుకుంటున్నారు, కోరికలు తీర్చుకుంటున్నారు.
- మాతాజీ రమ్యానందభారతీ స్వామిని






Thursday, 11 February 2016

పర్యాటక స్వర్గధామం ఉత్తరాఖండ్‌

మనదేశంలోని అతిశీతల...ఆహ్లాదకర ప్రదేశాలలో ప్రముఖంగా చెప్పుకునేది డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ రాజధాని అయిన ఈ ప్రదేశం దేశీయ, విదేశీ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. కేవలం డెహ్రాడూన్ మాత్రమే కాదు నైనిటాల్, ముస్సోరీ, అల్మోరా, కౌసని, భిత్మల్, రాణీకత్, పితోర్‌గఢ్ లాంటి ప్రదేశాలు కూడా పర్యాటకులకు స్వర్గధామాలుగా ఉన్నాయి. చెప్పాలంటే... హిమలయ పర్వత శ్రేణి పాదాల చెంత పరుచుకున్న పచ్చదనంతో ఉత్తరాఖండ్ రాష్ట్రమంతా అందమైన పర్యాటేక కేంద్రాలతో, ఆధ్యాత్మిక కేంద్రాలతో అలరారుతుంది.


హిమాలయాల ఒడిలో పర్యాటకుల మనసు దోచుకుంటున్న ఉత్తరాఖండ్ విహారం... పర్యాటకుల మదిలో చిరకాలం గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరాఖండ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది డెహ్రాడూన్. కానీ, ఇప్పటిదాకా బయటపడని ఎన్నో అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను పరవశుల్ని చేయడమే కాదు సంస్కృతీ సాంప్రదాయల్లో కూడా ఉత్తరాఖండ్ ఎంతో పేరెన్నికగన్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కుంభమేళా... అంతేకాకుండా మనదేశంలో గోల్ఫ్ ఆటకు అనువైన ప్రదేశాలలో ఉత్తరాఖండ్ కూడా ఒకటి.
కార్బెట్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్... అంతరించిపోతున్న మన జాతీయ జంతువు పెద్దపులికి ఇష్టమైన నివాసం. అంతేకాకుండా పర్వాతారోహలకు ఎంతో ఇష్టమైన పర్వతశిఖారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాంటి వాటిలో నందాదేవి పీక్ ప్రముఖమైనవి. జాతీయ వింతలు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నందాదేవీ జాతీయ ఉద్యానవనం లాంటి ప్రదేశాలు తప్పకుండా చూసి తీరాల్సిందే. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లుగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందువరుసలో నిలుస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సందర్శకుల మనసుదోచే ఇలాంటి పర్యాటక కేంద్రాలు ఇక్కడ అనేకం ఉన్నాయి.

శక్తిస్వరూపిణి ఆవాసం... నైనిటాల్
సరస్సుల నగరంగా గుర్తింపు పొందిన నైనిటాల్‌లో ఒకప్పుడు సుమారు 60కి పైగా చెరువులు, సరస్సులు ఉండేవట. ఇందులో నైనీ అనే సరస్సు ఎంతో పేరుగాంచింది. ఇక్కడ మహాఋషులు, మునులు నివాసం ఉన్నట్టు స్కందపురాణంలో ఉంది. నైనిటాల్ సరస్సును ట్రై రిషి సరోవర్ (ముగ్గురు ఋషుల సరోవరం) కూడా పిలుస్తారు. అత్రి, పులస్త్య, పులహ అనే మహా ఋషులు... నీరు దొరకకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నైనిటాల్‌లో ఒక సరస్సు నిర్మించాలని తలపెట్టారు. అలా ఒక లోతైన గుంతను తవ్వి... టిబెట్ దగ్గర ఉన్న పవిత్ర మానస సరోవరం నుండి నీటిని తెచ్చి నింపారని ప్రతీతి. అలా ఏర్పడిందే నేడు మనం చూస్తున్న నైనిటాల్ సరస్సు. ఈ సరస్సులో స్నానం చేస్తే సాక్షాత్తు ఆ మానస సరోవరంలోనే స్నానమాచరించినంత పుణ్యం దక్కుతుందట.

దేశంలో ఉన్న 64 శక్తిపీఠాలలో నైనిటాల్ కూడా ఒకటి. 64 ముక్కలైన పార్వతీ దేవి శరీరభాగాల్లో ఆమె కన్ను ఈ ప్రాంతంలో పడిందట. అలా ఈ ప్రాంతానికి నైనిటాల్ (హిందీలో నయన్ అంటే కన్ను) అనే పేరు వచ్చిందని ప్రతీతి. అందుకే ఆ శక్తి స్వరూపిణిని ఇక్కడ నైనాదేవి పేరుతో పిలుస్తారు. నైనాదేవీ ఆలయం దేశంలోని శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పర్యాటకులు ఇక్కడి చేరుకోవాలంటే... దగ్గరి విమానాశ్రయం పంత్‌నగర్. ఇది నైనిటాల్‌కు 71 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి రోడ్డు మార్గం గుండా వెళ్లవచ్చు. రైలుమార్గం ద్వారా చేరుకునే పర్యాటకులు కథ్‌గోదామ్ రైల్వే స్టేషన్ గుండా వెళ్ళవచ్చు (ఈ స్టేషన్ నైనిటాల్‌కు 31 కి.మీ).




ప్రముఖల తాత్కాలిక విడిది... ఆల్మోరా
ఉత్తరాఖండ్‌లో పచ్చదనంతో మైమరిపించే మరో ప్రదేశం ఆల్మోరా. ఇక్కడి ప్రకృతి పచ్చదనానికి పరవశించని పర్యాటకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రశాంత వాతారణంతో కొండకోనలతో అలరారుతున్న ఈ ప్రాంతాన్ని చూస్తే ప్రకృతీమాత తన నైపుణ్యాన్నంతటినీ రంగరించి మరీ తీర్చిదిద్దిందా అనిపిస్తుంది. కోశీ, సుయాల్ నదుల ప్రవాహం ఆల్మోరాకు మరింత అందాన్ని చేకూర్చింది. ఆల్మోరా ప్రకృతి అందాలతోనే కాదు, ప్రముఖుల నివాసాలతో ప్రసిద్ధిగాంచింది. స్వామీ వివేకానంద తన హిమాలయాల పర్యటనలో ఆల్మోరాను తాత్కాలిక విడిదిగా ఎంచుకున్నారట. అలా ఆయన కొన్నాళ్ళు ఇక్కడే గడిపాడట. అంతేకాకుండా స్వాత్రంత్య సమరయోధుడు గోవింద్ వల్లభ్ పంత్, ప్రముఖ హిందీ విద్వాంసుడు సుమిత్రానందన్ పంత్, నోబెల్ గ్రహీత సర్ రొనాల్డ్ రాస్‌లకు జన్మస్థలం ఆల్మోరా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా తన బాల్యంలో కొంతకాలాన్ని ఇక్కడే గడిపాట. ధోని తండ్రికి రాంచీలో స్థిరపడక మునుపు ఇక్కడ ఫామ్‌లు ఉండేవట. ఇక్కడి చేరుకోవాలంటే నైనిటాల్‌కు మాదిరిగానే పంత్‌నగర్ విమానాశ్రయం నుండి చేరుకోవాలి. రైలుమార్గం గుండా వచ్చే పర్యాటకులు కోథ్‌డామ్ రైల్వేస్టేషన్ నుండి చేరుకోవచ్చు.

గోల్ఫ్ కోర్స్‌ల చిరునమా... రాణీఖేత్
మనదేశంలో గోల్ఫ్ ఆటకు సంబంధింన మైదానాలకు మారుపేరు రాణీఖేత్. ఎటుచూసిన పచ్చని తివాచీ పరిచనట్లుండే ఈ ప్రాంతంలో 9 మౌంటేన్ గోల్ఫ్ లింక్‌లు ఉన్నాయి. ఓక్ అడవుల్లో విస్తరించి ఉన్న ఈ గోల్ఫ్ కోర్స్‌లు పర్యాటకులను ఇట్టే కట్టిపడే స్తాయి. చలికాలంలో మంచు దుప్పటి పరుచుకున్న ట్లుండే ఈ ప్రదేశం వేసవిలో మాత్రం సైనిక స్థావరంగా సేవలందిస్తుంది. ఇవేకాకుండా ఝులా దేవి ఆలయం, చౌభాటియా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. సమీపంలోని కథ్‌గోదామ్ రైల్వేస్టేషన్ గుండా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. దూర్రపాంతం నుండి వచ్చే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయం... పంత్ నగర్. ఇది రాణీఖేత్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

స్విట్జర్‌లాండ్ ఆఫ్ ఇండియా... కౌసని
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన పూలలోయ కౌసనికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 10 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పుతో పరుచుకున్న ఈ ఫ్లవర్ వ్యాలీ చూపరులను కట్టిపడేస్తుంది. దీనిని సాక్షాత్తు దేవభూమిగా పిలుస్తారు. ఇవేకాకుండా పంచ్ కేదార్, క్యారీ పాస్, బిన్సర్, ముక్తేశ్వర్, రూప్‌కుండ్‌లు కౌసని ని దేశంలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మలిచాయి. ఇప్పుడిప్పుడే అడ్వెంచర్ టూరిజం ఇక్కడ ఊపందుకుంటుంది. ప్రకృతి అందాలకు నెలవైన ఈ ప్రదేశంలో రివర్ రాఫ్టింట్, పారా గ్లైడింగ్, మౌంటెనేరింగ్, ట్రెక్కింగ్ లాంటి సదుపాయాలు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ హిందీ కవి సుమిత్రనందన్ పంత్ జన్మస్థలం అయిన కౌసనిలోని హిల్ స్టేషన్లు, కఫ్నీ హిమనీ నదాలు, సుందర్‌దూంగా, సోమేశ్వర్, పినాకేశ్వర్, బైజ్‌నాథ్, లక్ష్మీ ఆశ్రమ్ వంటి వాటితో ఇండియన్ స్విట్జర్‌లాండ్‌గా పేరుగాంచింది.

మినీ కాశ్మీర్... పితోర్‌గఢ్
చాంద్ రాజుల కాలంలో దేవలయాల నగరంగా విరాజిల్లిన ఈ ప్రాంతంలో కనువిందు చేసే అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని సోర్ వ్యాలీ... అని, మినీ కాశ్మీర్ కూడా పిలుస్తారు. అశుర్ చులా, ఆస్కోట్ శాం క్చరీలు... చందక్ పర్వత సానువులు... మను, ధ్వజ్, తల్ కేదార్, నకులే శ్వర (దేశంలో నకుల సహదేవుల ఏకైక ఆలయం) దేవాలయాలు... లాంటి అనేక ప్రదేశాలతో, చుట్టూ పచ్చదనంతో అలరారుతోంది పితోర్‌గఢ్.

ఎడోబ్ ఆఫ్ గాడ్స్
వేల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ప్రదేశంలో ఎంతోమంది ఋషులు, మునులు నివసించారని ప్రతీతి. అంతేకాకుండా సకల పాపాలను దూరంచేసే పవిత్ర గంగా యమున మహానదులకు పుట్టినిల్లు ఉత్తరాఖండ్. ఏటా గంగోత్రి, యమునోత్రి ప్రదేశాలను సందర్శించే యాత్రికుల సంఖ్య లక్షల్లో ఉం టుంది. ఈ నదుల పరీవాహక ప్రదేశాలైన బద్రీనాథ్ (విష్ణుమూర్తి ఆలవాలం), కేదార్‌నాథ్ (శివుడి నివాసం) లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలతో అలరారుతుంది. అంతేకాదు, ఋషికేష్, ప్రయాగ, హరిద్వార్ లాంటి ప్రదేశాల గురించి చెప్పాల్సిన పనిలేదు.

దేశంలో అతిపెద్ద హిందూ ఉత్సవంగా పేరుగాంచిన మహాకుంభ మేళా ఇక్కడ హరిద్వార్ లోనే జరుగు తుంది. ప్రతి పన్నెండు ఏళ్ళ కొకసారి జరిగే ఈ ఉత్సవానికి దేశంలోని అన్ని ప్రాంతాలనుండే కాకుండా ప్రపంచం నలుమూల నుండి భక్తులు తండో పతండాలుగా విచ్చేస్తారు. ఇలా ఆధ్యా త్మిక ప్రదేశాలకు ఆలవాలంగా ఉన్న ఈ ప్రదేశాన్ని దేవతల నివాసంగా పిలుచు కుంటారు. వేలాది సంవత్సరాలుగా భక్తులను ఆకర్షి స్తున్న పుణ్య క్షేత్రాలు బద్రీనాథ్, కేదార్ నాథ్, ఋషికేష్ లాంటి పుణ్యక్షేత్రాలే కాకుండా బ్రిటీష్‌కాలం నుండి ముస్సోరీ, ఆల్మోరా, రాణీకేత్ లాంటి పర్యాటకకేం ద్రాలు సందర్శకులకు మంచి ఆకర్షణలుగా అభివృద్ధి చెందాయి. ఉత్తరా ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమైన ఆర్థికవనరు ఆ రాష్ట్ర టూరిజం అంటే అతిశయోక్తికాదు.

గేట్‌వే ఆఫ్ గంగోత్రి... ముస్సోరీ
పవిత్ర గంగా, యమునా నదుల జన్మస్థలాలైన గంగోత్రి, యమునోత్రిలకు వెళ్ళాలంటే ఈ ముస్సోరీ నుండే వెళ్ళాలి. అందుకే దీనిని గేట్‌వే ఆఫ్ గం గోత్రి, యమునోత్రి అని పిలుస్తారు. ముస్సోరీ అనే పేరు చెట్ల నుండి వచ్చింది. ఎటు చూసినా ఇక్కడ ముస్సోరీ వృక్షాలు కని పిస్తాయి. ఇక్కడ అన్ని టికంటే చెప్పు కోవాల్సిన ప్రదే శం గన్‌హిల్ దేశంలోనే రెండో ఎత్తైన పర్వతసాణువు ఇది. గన్ హిల్‌పై రోప్ వే ప్రయాణం జీవితంలో మరిచి పోలేని మధురా నుభూతిని అందిస్తుంది. ఇవేకా కుండా నాగ్ దేవత ఆల యం, ముస్సోరీ సరస్సు, సర్ జార్జ్ ఎవరెస్ట్ హౌజ్, భట్టాపాల్, కెంఫ్టీ ఫాల్ ఇక్కడ చూడ దగ్గ ప్రదేశాలు. ఢిల్లీ, డెహ్రా డూన్‌ల నుండి ఇక్కడి రవాణా సదుపాయాలున్నాయి.

Thursday, 12 November 2015

హింగ్లాజ్ దేవీ ఆలయం

బెలూచిస్థాన్ లోని హింగ్లాజ్ దేవీ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలోని ఒక శక్తి పీఠం.
సతీవియోగ దుఃఖం తీరని పరమశివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. సతీ దేవి బ్రహ్మరంధ్రం ఇక్కడ పడినట్టు చెప్పుకుంటారు. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.  ఇక్కడ భైరవుడు భీమలోచనుడనే పేర పిలువబడుతున్నాడు. 



రామాయణం ప్రకారం, రావణ వధ తర్వాత రాముడు బ్రహ్మహత్యదోష నివారణ కోసం హింగ్లాజ్ దేవిని సందర్శించాడు.
హింగుళా దేవికి చెందిన ఈ మంత్రం దధీచీవిరచితంగా భావిస్తారు.

ఓం హింగుళే పరమ హింగుళే అమృతరూపిణీ తనుశక్తి
మనః శివే శ్రీ హింగుళాయ నమః స్వాహా

Tuesday, 15 September 2015

పిఠాపురం - శక్తిపీఠాల్లో సుప్రసిద్ధ (తూర్పు గోదావరి జిల్లా)


తూర్పుగోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో పిఠాపురం పౌరాణికంగా, చారిత్రకంగా ప్రసిద్ధమైనది. దాక్షాయణీ దేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతికి పాల్పడినప్పుడు ఆమె శరీరంలోని భాగాలు దేశంలోని పలు ప్రాంతాల్లో పడ్డాయనేది పౌరాణిక గాథ. దాక్షాయణీదేవి పీఠభాగం ఈ ప్రాంతంలో పడటం వల్ల ఈ పట్టణానికి పీఠికాపురంగా పేరొచ్చింది. దిన క్రమంగా పిఠాపురంగా మారింది. అష్టాదశ శక్తి పీఠాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి అమ్మవారి పేరు పురూహుతిక దేవి. పురూహుతికా దేవి ఆలయం ఎదురుగానే కుక్కుటేశ్వరస్వామి ఆలయం ఉంది. కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయంలోని శివలింగం స్వయంభూ శివలింగం. దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించింది ఇక్కడేనన్నది పురాణ కథనం. పిఠాపురం దేశంలోని త్రిగయ క్షేత్రాల్లో ఒకటి. గయాసురుడనే రాక్షసుడు విష్ణువు కృప కోసం తపస్సు చేశాడు. తన దేహం పవిత్రమైనదిగా చేయాలని అతడు వరం కోరాడు. అతడి కోరిక ప్రకారం అతడి దేహంపై ఇక్కడ యజ్ఞాన్ని ఆరు రోజులు నిర్వహించారు. విష్ణువు వరం ప్రకారం అతడి పాదభాగం పిఠాపురంలో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి పాదగయ అని పేరు వచ్చింది.

అలాగే, పిఠాపురం వైష్ణవ క్షేత్రం కూడా. ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కోసం ఐదు ప్రాంతాల్లో విష్ణాలయాలను నిర్మించి ఆరాధించాడన్నది పురాణ కథనం.ఈ ఐదు క్షేత్రాల్లో మాధవ స్వామి ఆలయాలు వెలిశాయి. వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం,ప్రయాగలో వేణు మాధవస్వామి ఆలయం,పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయం, రామేశ్వరంలోని సేతుమాధవస్వామి ఆలయం, అనంతపద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి. పిఠాపురం సంస్థానాధీశులు ఎంతో మంది కవులను ప్రోత్సహించారు. సాంఘిక సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చారు. పిఠాపురం రాజావారి పేరిట కాకినాడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా కాలం క్రితమే నెలకొల్పారు. పిఠాపురంలో క్రైస్తవ మెడికల్‌ సెంటర్‌ ఏర్పాటును పిఠాపురం రాజా ప్రోత్సహించారు. అలాగే, పిఠాపురంలో సూర్యరాయ తెలుగు నిఘంటువు రూపకల్పనకు చేయూత నిచ్చారు. పిఠాపురంలో సూర్యా ఆయుర్వేద నిలయం దశాబ్దాలుగా వైద్య సేవలను అందిస్తోంది.ఈ సంస్థ శాఖలు ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమంలో పిఠాపురానికి చెందిన ఎంతో మంది చురుకుగా పాల్గొని జైలుకి వెళ్ళారు.శ్రీవీర వెంకట సత్యనారాయణస్వామి వేంచేసి ఉన్న అన్నవరం క్షేత్రం ఇక్కడికి బాగా దగ్గరే. పిఠాపురం రాజమండ్రికి 62 కిలో మీటర్లు, సామర్లకోటకు 12 కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రధానమైన రైళ్ళు అన్నీ పిఠాపురంలో ఆగుతాయి. ఇవి కాక, జిల్లా కేంద్ర మైన కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యం ఉంది.శక్తిపీఠాల్లో ఒకటి అయిన పిఠాపురాన్ని సందర్శించడం వల్ల కుక్కుటేశ్వరస్వామి, కుంతీమాధవస్వామి ఆలయాలనే కాక, పాదగయను కూడా సందర్శించవచ్చు. పాత తరానికి చెందిన సినీ గేయరచయిత, సుప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి పిఠాపురం సమీపంలోని చంద్రంపాలెంలో పుట్టి పిఠాపురంలో విద్యాభ్యాసం చేశారు. అలాగే, మరో సుప్రసిద్ధ కవి ఆవంత్స సోమసుందర్‌, పాత తరం ఐఎన్‌టియుసి నాయకుడు భావనాచారి, వెనుకటి తరానికి చెందిన సినీ నేపధ్య గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు వంటి ఎందరో ప్రముఖులు ఈ పట్టణానికి చెందినవారే.పిఠాపురం నాగేశ్వరరావు ఊరుపేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని ప్రాచుర్యాన్ని పొందారు. సాహిత్య, సాంస్కృతిక,విద్యా, కళా రంగాల్లో పిఠాపురం స్వాతంత్య్రానికి పూర్వమే ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది.

Friday, 22 August 2014

అష్టాదశ శక్తిపీఠాల



అష్టాదశ (18) శక్తిపీఠాల క్షేత్ర వివరణ



లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండీ క్రౌంచపట్టణే |
అలంపురీ జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మి మహూర్యే ఏకవీరికా ||
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే |
హరిక్షేత్ర కామరూప ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరికాః ||
వారణస్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతి…

1. లంకాయాం శాంకరీదేవి :

”లంకాయాం శాంకరీదేవి”, అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటిది. భారతదేశమునకు పొరుగున గల సింహళద్వీపం (శ్రీలంక) నందు ఉండేది. శ్రీలంక ద్వీపం నందు తూర్పు తీరప్రాంతములో ట్రింకోమలిపుర (ట్రింకోమ్‌లీ) పట్టణము వుంది. ఇది సతీదేవి కాలిగజ్జెలు పడిన ప్రదేశముగా ప్రసిద్ధి. ఇక్కడ శాంకరీదేవి మందిరము ఉండేది అని పూర్వీకుల వాదన. బౌద్ధమతం, క్రైస్తవమతం అభివృద్ధితో హిందూమతమునకు రాజపోషణ కరువయింది. దీనితో ప్రజల ఆదరణ కూడా క్షీణించింది. కొంతకాలమునకు హిందూ దేవాలయములు శిథిలముగా మారినాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. శాంకరీదేవి మందిరము కూడా కాలగర్భంలో కలిసిపోయి వుండవచ్చును. నేడు శ్రీలంకను శోధిస్తే, ఎక్కడా శాంకరీదేవి ఆలయం కనిపించుటలేదు. ప్రస్తుతం శాంకరీదేవి దర్శనం దుర్లభమే. శ్రీలంకలో తమిళులపై దాడులు హింసాత్మకమవటంతో, వాటిని తట్టుకోలేక పారిపోయి కెనడా, ఇండియా మొదలగు దేశములకు చేరిన హిందువుల సంఖ్య అధికం. క్రమక్రమంగా శ్రీలంకలో హిందూమతమునకు, హిందూ దేవాలయములకు ఆదరణ కరువయింది.

త్రేతాయుగంలో రావణాసురుడు, లోకనాథుడైన పరమేశ్వరునితో పాటు శాంకరీదేవిని నిత్యం పూజించినట్లు పురాణ కథనం. ట్రింకోమలీ నందు శాంకరీదేవి ఆలయ దర్శనం నేడు శూన్యం అయినా, క్షేత్ర మహాత్యం, క్షేత్ర దర్శనము ఆనందదాయకమే. కొలంబో పట్టణము పశ్చిమతీరంలో వుండగా, ట్రింకోమలీ పట్టణము తూర్పుతీరంలో వుంది. రెండు పట్టణముల మధ్య రవాణా సదుపాయములు కలవు. మహాపట్టణం, గలోయపట్టణం మీదుగా శ్రీలంక ప్రభుత్వ రైలు మార్గం వుండగా, కాండిపట్టణం, గలోయ పట్టణముల మీదుగా రోడ్డు మార్గం కలదు. భారతీయులకు శ్రీలంకలోని పర్యాటక స్థలసందర్శనకై రూ. 35,000/- లు పైగా ఖర్చు అవుతుంది.

2. కామాంక్షీ కాంచికాపురే :
కాంచీపురం మోక్షదాయకమైన పట్టణాలలో ఒకటిగా ప్రసిద్ధి. కామాక్షీదేవి పీఠం అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీ కామాక్షి అమ్మవారు రెండవ పీఠంగా పరిగణింపబడుతుంది. సతీదేవి కంకాళము పడినచోటుగా ప్రసిద్ధి. ”కామాక్షీ కామదాయినీ” అని లలితా సహస్రనామాలు పేర్కొన్నాయి. తన కరుణామయైన కంటి చూపుతోనే భక్తుల కోర్కెలను తీర్చగలిగే మహాశక్తి. అమ్మను ఆరాధించి మూగవాడైన భక్తుడు వాక్కును సంపాదించుకొని అయిదు వందల శ్లోకాలతో అమ్మను కీర్తించాడు.

పురాణ కాలంలో పార్వతీదేవి, పరమశివుని కనులు తన హస్తములతో మూయగా ప్రపంచమంతా చీకటితో నిండిపోయింది. పాప పరిహారానికై మట్టితో శివలింగము తయారుచేసి పూజించెను. అంతట శివుడు పార్వతిని అనుగ్రహించాడు. నాటినుంచి కాంచీపురమున ఫాల్గుణమాసంలో పార్వతీదేవి కళ్యాణం అత్యంత వైభముగా జరుపుచున్నారు. కాంచీ క్షేత్రమును సత్యవ్రతక్షేత్రమని, భాస్కరక్షేత్రమని, తేజసక్షేత్రమని, శివశక్తి క్షేత్రమని, శక్తి క్షేత్రమని పేర్కొనబడింది. క్షేత్రంలో వెలసిన శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ దేవాలయములు భారతీయ కళా సంస్క ృతికి ప్రతీకలుగా నిలిచాయి.

శ్రీ కామాక్షి దేవాలయము నందు అమ్మవారి గర్భాలయము వెనుక భాగమున శ్రీ ఆదిశంకరుల ప్రతిమ ప్రతిష్ఠించబడింది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు కాంచీపురము నందు శంకరమఠమును క్రీ.పూ. 482 సంవత్సరములో స్థాపించారు. శ్రీ ఆదిశంకరాచార్యులు తొలి పీఠాధిపతి. భారతీయ ధార్మిక జీవనంలో అవ్యవస్థ నెలకొన్నప్పుడు అజ్ఞానం ముసురుకొన్నప్పుడు, ఆచార కొండల పేరిట ఆర్భాటాలు తోడయినప్పుడు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు ఉదయించారు. కేరళ రాష్ట్రంలోని, త్రిచూర్‌ సమీపమున, పవిత్ర పూర్ణానది తీరంలో గల కాలడి గ్రామం నందు జన్మించారు శ్రీ శివగురు, ఆర్యాంబ దంపతులకు లేకలేక కలిగిన సంతానం జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు. శ్రీ శంకరుడు సకల విద్యలనూ నభ్యసించి, దేశం నలుదిక్కులా మూడుమాట్లు పర్యటించి, అద్వైత ప్రభలను ఉజ్జ్వలంగా నిలిపారు. భారత ఖండంలో నాలుగువైపుల నాలుగు పీఠాలు స్థాపించారు. ఉత్తరాన గల హిమాలయ పర్వతాల్లో జోషీమఠమును, అలకనంద తీర్థమున గల బదరికాశ్రమం నందు స్థాపించారు. ఇచ్చట శ్రీ నారాయణుడు మరియు శ్రీ పున్నాకరీ అమ్మవారి దర్శనం లభ్యమవుతుంది. దక్షిణాన కర్ణాటక రాష్ట్రంలోని తుంగానది తీరం నందు శ్రీ శృంగేరీ మఠమును స్థాపించారు. ఇచ్చట శ్రీ ఆది వరాహమూర్తి మరియు శ్రీ కామాక్షి అమ్మవారు కొలువైనారు. తూర్పున ఒరిస్సా రాష్ట్రంలోని, పూరి క్షేత్రము నందు మహారధి తీర్థమున గోవర్ధన మఠమును స్థాపించారు. క్షేత్రం నందు శ్రీ జగన్నాథుడు మరియు శ్రీ విమలాదేవిని దర్శించగలము. పడమరన గుజరాత్‌ రాష్ట్రమున ద్వారకా క్షేత్రం నందలి గోమతి నదీ తీరంలోగల శ్రీ ద్వారకాధీశుని ఆలయమునకు ఎడమవైపున శ్రీ శారదాపీఠం స్థాపించారు. ఇచ్చట శ్రీ సిద్ధేశ్వరుడు మరియు శ్రీ భద్రకాళి అమ్మవారు వెలిశారు. ఇవిగాక సన్యాసీ సంప్రదాయంతో సుమారు 1200 మఠాలున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ ఆదిశంకరాచార్యులు దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలను దర్శించి, శ్రీ చ్రకములను స్థాపించారు.

3. ప్రద్యుమ్నే శృంఖలాదేవి :
ఒక సాధువు ఆరాధ్యదైవముగా వెలసిన తారమాత, బెంగాలు నివాసులతోపాటు దేశంలోని వారందరికి ఆరాధ్య దైవమయింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమయింది. నమ్మినవారికి కొండంత శక్తిని ప్రసాదించే శక్తి స్వరూపిణి. ప్రతి నిత్యం యాత్రికులతో క్రిక్కిరిసి వుంటుంది. తారనది తీరంలో, కొంత ఎత్తైన ప్రదేశములో అమ్మవారి ఆలయం వుంది. బస్‌ హాల్ట్‌ నుంచి సుమారు అరకిలోమీటరు నడక ప్రయాణము చేయగా తారమాత దర్శనమిస్తుంది. ఆలయ రహదారి నిండా పూజా సామాగ్రీలు విక్రయించు షాపులు, పండాల నివాసములతో నిండి వుంటుంది. ఆలయం నందు పూజలు, హోమాలు మొదలగునవి పండాలు నిర్వహించుతారు. తారామాతకు భక్తులు భక్తిశ్రద్ధలతో పాలకోవా, మందారపువ్వులు మొదలగునవి సమర్పించుకుంటారు.

ఆలయము నందు అమ్మవారి స్వరూపం దేదీప్యమానంగా, తేజోవంతంఆ దర్శనమిస్తుంది. అమ్మవారి నాలుక బయటకు వచ్చి నోరంతా రక్తపుమరకలతో నిండి వుంటుంది. తారమాత నిజరూపం మరోవిధముగా వుంటుంది. నల్లటి రాతిమీద ఒక దృశ్యం కానవచ్చును. దానవులతో యుద్ధంచేసి శక్తిహీనుడైన పరమేశ్వరుడుని, శక్తిరూపిణియగు ఆదిశక్తి తన ఒడిలో పరుండపెట్టి చన్నుబాలు నిచ్చి తిరిగి శక్తివంతుడ్ని చేయు దృశ్యమును చూడగలము. తిరిగి రాత్రి 8 గంటలకు నిజరూప దర్శనము లభ్యమవుతుంది. భక్తులు అమ్మవారికి అభిషేకములు, కానుకలు మొదలగునవి సమర్పించుకుంటారు. పండాలు నిజరూప దృశ్య వివరణ భక్తులకు తెలియచేస్తారు. నిజరూప దర్శనాంతరము పండాలు అమ్మవారిని అలంకరించుతారు.

ఆలయ ప్రాంగణములో శివాలయం, గణపతి మందిరము, సాధువు మూర్తి విగ్రహం, వాసుదేవ మందిరము కలవు. అమ్మవారికి ఎదురుగా మూడు మండపములు కలవు. మొదటి మండపమునందు భక్తులు మాత తారను దర్శించుటకు, రెండవ మండపము నందు హోమం మొదలగునవి నిర్వహించుటకు, మూడవ మండపమునందు బలిపీఠమునకు సదుపాయములు కలవు. వీటితోపాటు పూజా సామాగ్రీలు విక్రయించుశాలలు కూడా కలవు. తారమాతను మొదటి మండపము నుంచి దర్శించుకుంటారు. నిజరూప దర్శన సమయము నందు అమ్మవారికి కుడివైపున గల ద్వారం నుంచి గర్భాలయములోనికి ప్రవేశము కల్పిస్తారు.

శంథియ రైలు జంక్షన్‌కు పశ్చిమవైపుగా సియూరి మీదగా అండల్‌ వరకు బ్రాంచి రైలు మార్గము కలదు. శంథియ రైలు జంక్ష్‌కు 19 కి.మీ. దూరమున సియూరి రైలు స్టేషన్‌ వస్తుంది. దీనికి పశ్చిమంవైపుగా, సుమారు 15 కి.మీ. దూరమున బక్రేశ్వర్‌ క్షేత్రం కలదు. ఇది శక్తి పీఠంగా ప్రసిద్ధి. సతీదేవి అమృత హృదయం పడిన ప్రదేశంగా ఖ్యాతి చెందినది. అహ్మద్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కూడా బస్సులో ప్రయాణము చేయవచ్చును. శంథియ రైల్వే జంక్షన్‌కు దక్షిణం వైపున 14 కి.మీ. దూరమున అహ్మదాపూర్‌ రైల్వే జంక్షన్‌ వస్తుంది. దీనికి పశ్చిమం వైపుగా బక్రేశ్వర్‌ క్షేత్రం కలదు.
బర్ధమాన్‌ జిల్లాలో రెండు శక్తిపీఠాలున్నాయి. మొదటి లాభపూర్‌ – ఖాట్వారోడ్‌ మార్గములో లాభపూర్‌కు 35 కి.మీ. దూరమున కేతుగ్రామ్‌ అను క్షేత్రం నందు కలదు. క్షేత్రంలోని శక్తిరూపమును దేవిబహులుగా పిలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో మూడవ పీఠముగా పరిగణించబడుతోంది. సతీదేవి ఎడమ భుజముపడినట్లుగా ప్రతీతి. ఆలయమునకు ఎదురుగా మండపము వుంది. పందాలు మండపము నందు హోమములు మొదలగునవి నిర్వహించుతారు. ఆలయమునకు మండపమునకు మధ్యన బలిపీఠం వుంది. విజయదశమి మొదలగు పర్వదినముల నందు అమ్మవారికి పశుబలి సమర్పించుకుంటారు.

4. చాముండీ క్రౌంచ పట్టణే :
కర్ణాటక రాష్ట్రమునకు ప్రధాన నగరం బెంగుళూరు. దీనికి సుమారు 140 కి.మీ. దూరమున ఆగ్నేయం వైపున మైసూరు పట్టణం వుంది. ఇది ఒడయార్‌ వంశీయులకు రాజధానిగా వుండేది. చక్కటి తోటలు, గొప్ప భవనములతో కూడిన మైసూరు పట్టణము పర్యాటకుల మనస్సును ఆహ్లాదం కలిగిస్తుంది. మైసూర్‌ పట్టణమునకు సుమారు 13 కి.మీ. దూరమున చాముండీ పర్వతం వుంది. సతీదేవి దివ్యాభరణాలు పడిన ప్రదేశముగా ప్రసిద్ధి. మార్కండేయ పురాణంలో దేవి ఉత్పత్తిని గురించి ప్రస్తావించబడింది. మాత మూడవ అవతారంలో మహామాయ, మహాసరస్వతీ రూపిణిగా శుంభ, నిశుంభలనే రాక్షసులను వధించింది. ఆమె దేహం నుంచి వెలువడిన కాళికాదేవి చండు, ముండులను సంహరించి ”చాముండి”గా ప్రసిద్ధి పొందినది.

పురాణ కాలములో మహిషాసురుడు పాలించిన పురమును మహిషాసురపురముగా పిలిచెడివారు. కాలక్రమేణా మైసూరుగా మారిందని ప్రతీతి. మహిషాసురుడు మహాబలవంతుడు. మరణంలేని వరాన్ని కోరుతూ ఘోరతపము చేసెను. అది అసాధ్యమని బ్రహ్మ తెలుపగా అంతట మహిషాసురుడు స్త్రీని అబలగా భావించి, స్త్రీ తప్ప ఇతరుల చేతిలో మరణంలేని వరం పొందినాడు. బ్రహ్మ యిచ్చిన వర ప్రభావంతో ముల్లోకములను జయించి దేవతలను, ఋషులను బాధించసాగెను. దుష్టపాలనతో ప్రజాకంటకుడుగా మారిన మహిషాసురుడు సంహరించుటకు జగన్మాత చాముండేశ్వరిగా అవతారము దాల్చి, రాక్షస సంహారము చేసెను. రాక్షస సంహారానంతరం చాముండేశ్వరి మాత మహిషాసురమర్ధినిగా ఖ్యాతి పొందినది. చాముండేశ్వరిదేవి అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగవది. మాత మైసూరు ప్రభువులకు కులదైవము మరియు ఆరాధ్యదైవమయినది.

చాముండి పర్వతము సముద్ర మట్టానికి సుమారు 1200 మీటర్లు ఎత్తుగా వున్నది. కొండమీదకి మెట్లు మార్గంతోపాటు రోడ్డు మార్గము కూడా కలదు. మూడోవంతు మెట్టెక్కేసరికి సమున్నతరగా కనబడు ప్రదేశములో 16 అడుగుల ఎత్తుగల ఏకశిలా నిర్మితమైన నంది విగ్రహం వుంది. నందీశ్వర శిలా విగ్రహం చూపరులను విశేషముగా ఆకర్షించుతుంది. కొండపైకి మహిషాసుర విగ్రహమును చూడవచ్చును. వీటితోపాటు ఒడయారు మహారాజు, మహారాణి విగ్రహములు కూడా దర్శనీయం. నేటి చాముండేశ్వరాలయం 1827వ సంవత్సరములో పునరుద్ధరింపబడింది.

చాముండి పర్వతమున, తూర్పువైపుగా ”దేవకెరె” అను తీర్థం కలదు. దేవికెరెకు సంబంధించిన కథ ఒకటి గలదు. పాపహరిణియగు గంగానదిలో స్నానమాచరించిన భక్తులు పుణ్యం సంపాదించి, విష్ణులోకం చేరుకొనుచున్నారు. వారి పాపములను గంగామాత స్వీకరించి, తాను మాత్రము క్షీణించుచుండెను. ఒకనాడు గంగామాత బ్రహ్మతో తన బాధను మొరపెట్టుకుంది. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారము దక్షిణ భారతదేశమున, పవిత్రమైన కావేరినది ప్రాంతమున గల మహాబలాద్రి పర్వతమున జన్మించి, మహాబలేశ్వర లింగమును ఆరాధించి, తిరిగి స్వచ్ఛత తెచ్చుకుంది. ఇంతటి పుణ్యత గలిగిన జలము నందు స్నానమాచరించి, ఆషాడమాసంలోని కృష్ణపక్షము నందు, రేవతి నక్షత్రం వున్న శుక్రవారం దినమున శ్రీ చాముండేశ్వరి మాతను చంపకమాలతో ఆరాధించిన భక్తుల యొక్క సకలబాధలు తొలగి, వారి కోర్కెలు తీరగలవు. సూర్యుడు మేషరాశిలో వుండగా, శుక్లపక్ష సప్తమి దినమున పాతాళ వాహినిలో స్నానమాచరించి, మహాబలాద్రి క్షేత్రమున గల మహాబలేశ్వర స్వామిని ఆరాధించిన వారి కోర్కెలను స్వామి తీర్చగలడు. వైశాఖమాసం, శుక్లపక్ష, శుక్రవారం దినము పాతాళవాహినిలో స్నానమాచరించి రామనాధగిరిలోని స్వామిని ఆరాధించినా సర్వపాపములు తొలగి, సుఖసంతోషములతో జీవించగలరు. మాఘమాసం, శుద్ధపూర్ణిమ, ఆదివారం దినమున పాతాళగంగలో స్నానమాచరించి, రామనాధగిరిలోని స్వామిని ఆరాధించిన సూర్యలోకమును పొందగలరు.

పురాణ, ఇతిహాసకాలము నందు చాముండిపర్వతమును మహాబలాద్రి పర్వతముగా పిలిచెడివారు. దీనినే మహాబలగిరి అని కూడా సంబోధించేవారు. మహాబలద్రి పర్వతమున స్వయంభువ లింగముగా వెలసిన శ్రీ మహాబలేశ్వర ఆలయం కూడా పురాతనమైనది. శివాలయం నందలి లింగము చాల మహిమాన్వితమైనది. భక్తులు తమ కోర్కెల సాఫల్యం కోసం, నియమంగా స్వామిని ఆరాధించుదురు. వారి సర్వబాధలు తొలగి, సమస్యలకు పరిష్కారం లభించగలదు అని గట్టి నమ్మకం. శ్రీ చాముండేశ్వరి ఆలయమునకు కుడివైపున, కొంతదూరమున శ్రీ మహాబలేశ్వరాలయం వుంది. జీర్ణావస్థలో వున్నా, నిత్యం పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీ మహాబలేశ్వర దర్శనం పుణ్యదాయకం. శివాలయమునకు వెనుక భాగమున శ్రీ నారాయణ స్వామి ఆలయం కూడా కలదు. శ్రీ నారాయణస్వామి దర్శనము కూడా పుణ్యదాయకం.

5. అలంపురీ జోగులాంబా :
తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌జిల్లాలో అలంపురం క్షేత్రంనందు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ జోగులాంబాదేవి మరియు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి కొలువైనారు. క్షేత్రమున సతీదేవి శరీరాంతర్గత వజ్రాస్తికులు పడినట్లు ప్రతీతి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ పీఠముగా పరిగణించబడుతోంది. శ్రీ జోగులాంబను ”విశృంఖలా” అని లలితాసహస్రనామములో చెప్పబడింది. నిత్యానాధ సిద్ధుని ”రసరత్నాకరము” నందు అమ్మను యోగాంబాగాను, తాంత్రికుడగు మహాభైరవుడు తన ”ఆనందకరము”లో యోగేశ్వరిగాను పేర్కొన్నారు. శ్రీ బాల బ్రహ్మేశ్వరాలయమునకు ఆగ్నేయ దిశలో శ్రీ జోగులాంబా ఆలయం వుండేది. పూర్వకాలము నాటి ఆలయం శిథిలముకాగా, అమ్మవారి మూలవిగ్రహమును, శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయము నందు భద్రపరచినారు. శ్రీ జోగులాబా అమ్మవారి నూతన ఆలయమునకు దేవస్థానము వారు సంకల్పముచేసి, శ్రీశైలదేవస్థానము మరియు కంచి కామాక్షీపీఠం తాలూకా సహాయముతో ఆలయమును పూర్తిచేసినారు. శ్రీబాల బ్రహ్మేశ్వరాలయములోని శ్రీ జోగులాంబా మూల విగ్రహమును నూతన ఆలయం నందు తిరిగి ప్రతిష్ఠించినారు.

అలంపుర క్షేత్రంలోని ఆలయ సమూహం నందు శ్రీ జోగులాంబా ఆలయముతోపాటు బాలబ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ మరియు పద్మబ్రహ్మ అను నవబ్రహ్మాలయాలున్నాయి. వీటిలో తారకబ్రహ్మ ఆలయం ధ్వంసమైనది. ఆలయములోని శివలింగము రక్షింపబడినది. మిగిలిన ఎనిమిది ఆలయాలల్లో శ్రీ బాలబ్రహ్మేశ్వరాయలము ప్రధానమైనది. నవబ్రహ్మాలయముల నందు ప్రతిష్ఠించిన శివలింగాలు ప్రాచీనమైనవి. ఆలయ సమూహమునకు పశ్చిమదిశలో మహాద్వారం వుంది. శిల్పసృష్టితో మహాద్వారమును చాలా ప్రశస్తమైనది. నాటి ముస్లింపాలకులు పశ్చిమద్వారమును ఆక్రమించి, దర్గా నిర్మించినారు. శ్రీ బాల బ్రహ్మేశ్వరాలయమునకు చుట్టు కట్టబడిన ప్రాకారములపై, బండలమీద కొన్ని సంకేతములు చెక్కబడినవి. తాంత్రిక చిహ్నముల నెరిగినవాటి సంకేతముల భావములను గ్రహింపగలరు. ఆలయసమూహంలోని శిల్పాలు, కళాఖండాలు తాంత్రిక చిహ్నములు కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. ఆలయం బయట గల పురాతన వస్తు ప్రదర్శనశాల నందు మరికొన్ని దర్శించగలము. శ్రీ జోగులాంబా సిద్ధులకు ఆరాధ్యదైవం. మంత్ర సిద్ధిని పొందగోరినవారు, అలంపుర క్షేత్రమున జపమొనరించినా, సిద్ధి కాగలదని ఆర్యులు నమ్మకం.

శ్రీ జోగులాంబా అమ్మవారికి ప్రత్యేకముగా ఆలయం వుండేది. శ్రీ జోగులాంబా మహోగ్రురాలై యుండేది. శ్రీ ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రాన్ని తగ్గించుటకు తగిన ప్రక్రియ యంత్రశక్తిని స్థాపించి, అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించారని ప్రతీతి. 16వ శతాబ్దంలో బహమనీసుల్తాన్‌ శ్రీ జోగులాంబా ఆలయ విధ్వంసానికి పూనుకొన్నాడు. ధ్వంసమైన ఆలయంలో శ్రీ జోగులాంబా విగ్రహమును, శ్రీ బాలబ్రహ్మేశ్వరాలయములోని నవగ్రహములు సమీపమున శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించినారు. సుమారు 630 సంవత్సరములు తరువాత దేవస్థానంవారు, అదే పవిత్ర స్థలము నందు నూతన ఆలయం నిర్మించి, 13 ఫిబ్రవరి 2005వ సంవత్సరములో శ్రీ జోగులాంబా విగ్రహమును పునఃప్రతిష్ఠ చేశారు. నూతన ఆలయం చక్కటి ఆహ్లాదకరమైన ప్రాంతములో నిర్మించబడినది. ఆలయమంతా ఎర్రని ఇసుకరాయితో నిర్మించారు. ఆలయమండపము నందు అష్టాదశ శక్తి పీఠాలను పొందుపరచినారు. ఆలయం చుట్టూ చక్కటి ఉద్యాన వనము వుంది. తూర్పున 5 అంతస్తులు మరియు పశ్చిమాన 3 అంతస్తులు గాలిగోపురములు కలవు. శ్రీ జోగులాంబా కుడివైపున పవిత్రమైన తుంగభద్రానది మరియు ఎడమవైపున శ్రీ బాలబ్రహ్మేశ్వరాలయ సమూహం కలవు. అమ్మవారి ఆలయం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 8 గంటల వరకు తెరచివుండును. సర్వదర్శనము ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లభ్యమవుతుంది. అర్చనలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించుతారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక అర్చనలు మరియు 7 గంటలకు మహామంగళహారతి సేవ జరుగుతాయి. ఆలయం బయట పూజాసామాగ్రీలు విక్రయించు షాపులు కలవు. ఆశ్వయుజ మాసమున దేవీనవరాత్రులు, రథోత్సవాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం సేవలు విశేషముగా వుంటాయి.

6. శ్రీశైలే భ్రమరాంబికా
ఆంధ్రప్రదేశ్‌, కర్నూలు జిల్లా, నందికొట్కూరు తాలూకా, నల్లమల్ల అడవులతో నిండిన కొండల ప్రాంతము నందు శ్రీశైలం కలదు. ఇది పురాణ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవది అయిన శ్రీ మల్లిఖార్జున లింగము మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది అయిన శ్రీ భ్రమరాంబికా పీటమును శ్రీశైలం నందు దర్శించగలము. సతీదేవి కంఠభాగము పడినచోటుగా ప్రసిద్ధి చెందినది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవ పీఠముగా పరిగణించబడుతోంది. ఆలయ ప్రశస్తి స్కందపురాణం, శ్రీశైలఖండము, బ్రహ్మాండపురాణం, శివపురాణం, శేషధర్మము మొదలగు పురాణాల్లో వుంది. మార్కండేయ పురాణంలో, దేవి సర్వోత్పత్తి గురించి ప్రస్తావించబడింది. దేవి తన తొమ్మిదవ అవతారంలో అరుణుడు అనే రాక్షసుని భ్రమరాలు (తుమ్మెదలు) సహాయంతో వధించి, జగతికి శాంతి చేకూర్చినందున, భక్తులు దేవిని ”భ్రామరి”గా కీర్తించారు. ప్రకృతి రూపిణియగు పరాశక్తిని ”భ్రమారాంబికా”గా వర్ణించారు.

శ్రీశైల స్థలపురాణములు అనేకం. శిలాదుడు అను మహర్షి మహాశివభక్తుడు. అతనికి యిద్దరు కుమారులను పరమేశ్వరుడు అనుగ్రహించినాడు. వారే నందికేశుడు మరియు పర్వతుడు. వీరు కూడా గొప్ప శివభక్తులు. వారి కోర్కెల ప్రకారము నందికేశుడు స్వామివారికి వాహనము గాను, పర్వతుడు స్వామివారి నివాస స్థలముగాను సేవలు చేయుచున్నారు. స్వామివారు వెలిసినప్పటి నుంచి పర్వతుడు ”శ్రీ పర్వతము”గా ప్రసిద్ధిచెందినాడు. కైలాసం నందు విఘ్నేశ్వరునిచే పరాభవం పొందిన కుమారస్వామి కోపించి, శ్రీ పర్వతానికి చేరుతాడు. పుత్రుని ఎడబాటు సహించలేని ఆదిదంపతులు శ్రీ పర్వతము చేరి నివాసం ఏర్పర్చుకొంటారు.

మల్లిఖార్జున సామ్రాజ్యమును చంద్రగుప్తుడు అను రాజు పాలించుచుండెను. ఇతని కుమార్తె చంద్రావతి కూడా తండ్రివలె గొప్ప శివభక్తురాలు. యౌవనదశలో నున్న చంద్రావతిపై చంద్రగుప్తుడు అమానుష చర్యకు పూనుకొంటాడు. తండ్రి అమానుష చర్యకు భయపడి శ్రీశైలం చేరి, స్వామిని మల్లెపూలతో అర్చించి, అత్యంత ప్రీతిపాత్రమైనది. మల్లెపూలతో అర్చించుటవలన స్వామికి మల్లిఖార్జునుడుగా పేరు వచ్చింది. ఒకనాడు పరమేశ్వరుడు సాక్షాత్కరించి ఆమె ప్రార్ధనను అంగీకరించి, చంద్రమాంబ అనుపేరిట తన దేవేరిగా స్వీకరించాడు. చంద్రావతి శ్రీ భ్రమరాంబికాదేవే అని కొంతమంది వాదన.

పూర్వం నల్లమల్ల అడవులతో నిండిన కొండల ప్రాంతము నందు గల శివాలయం చుట్టుప్రక్కల చెంచుజాతివారు నివసించుచుండెడివారు. చెంచుజాతి వారి కన్యను స్వామి వివాహమాడాడని ఒక గాథ వుంది. చెంచుజాతి వారు స్వామిని చెంచు మల్లయ్యగా పిలుస్తారు. శివరాత్రి పర్వదినాన జరిగే ఉత్సవాలలో రథంలాగే కార్యక్రమమును చెంచుజాతివారు తమ వంతుగా చేపట్టి, తమ భక్తిని ప్రదర్శించుతారు. కర్ణాటక రాష్ట్ర ప్రాంతములో మరో గాథకలదు. వీరు మల్లయ్యను చెవిటి మల్లయ్యగా సంబోధించుతారు.

7. కొల్హాపురీ మహాలక్ష్మి
దక్షిణ మహారాష్ట్రము నందు కొల్హాపూర్‌ జిల్లా కలదు. జిల్లా ముఖ్యకేంద్రమైన కొల్హాపూర్‌ పట్టణం పంచగంగానది ఒడ్డున వుంది. ఇది దక్షిణకాశీగా ప్రఖ్యాతి చెందినది. ఒకానొప్పుడు మరాఠా రాజ్యానికి ప్రధాన రాజధానిగా విలసిల్లిన క్షేత్రరాజ్యం. ప్రాచీనకాలం నందు ఈ పట్టణము కరవీరపురంగా పిలిచేవారు. నేడు కొల్హాపూర్‌గా వ్యవహరించుచున్నారు. కొల్హాపూర్‌ అనగా కనుమలోయలోని పట్టణము అని అర్థం. క్షేత్రంలోని శ్రీమహాలక్ష్మి అష్టాదశ శక్తి పీఠాలల్లో ఏడవదిగా గణ్యత చెందినది. సతీదేవి వామహస్తం పడిన ప్రదేశముగా ప్రసిద్ధి గాంచినది. శక్తిరూపమైన శ్రీ మహాలక్ష్మితోపాటు శ్రీ మహాదేవలింగము కలదు. అమ్మవారితోపాటు శ్రీ మహాదేవ లింగమునకు ప్రాముఖ్యత వుంది. శ్రీ మహాలక్ష్మి ఆలయం 9వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయముపైన ఐదు గోపురాలు దర్శనమిస్తాయి. ప్రధానాలయమునందు శ్రీ మహాలక్ష్మికి ఇరువైపుల శ్రీమహాకాళి, శ్రీమహాసరస్వతి కొలువైనారు. వీరితోపాటు శ్రీమహాగణపతి దర్శనము కూడా లభ్యమవుతుంది. శ్రీ మహాదేవలింగమునకు ప్రత్యేకముగా, ఆలయ ప్రాంగణములో స్థానము వుంది. జగన్మాత మహాలక్ష్మి గర్భాలయ బయట, శ్రీయంత్రం వుంది. భక్తులు శ్రీయంత్రమునకు పూజలు నిర్వహించుతారు. అమ్మవారికి ఎదురుగా సింహవాహనము దర్శనమవుతుంది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి బంగారు పాదుకులున్నాయి. వీటిని భక్తులు దర్శించటానికి వీలుగా, బయటకు తీసి మరల అలంకరించడానికి వీలుగా వుండును. దేవి శిరస్సు మీద ఒక నాగపడగ, పడగనందు శివలింగము యోని ముద్ర వున్నాయి.

ప్రధానాలయం తెల్లవారి 4 గంటలకు తెరచి తిరిగి రాత్రి 10 గంటలకు మూయబడును. ప్రతి నిత్యము అమ్మవారికి ఐదు పర్యాయములు హారతి సేవ జరుగుతుంది. ఆలయం తెరచినప్పుడు జరుగు హారతి సేవ కాగడ హారతిగా పిలుస్తారు. ఉదయం 8 గంటలకు జరుగు మహాపూజ సమయంలో మంగళహారతి సేవ జరుగుతుంది. మధ్యాహ్నం 11 గంటలకు నైవేద్యం సమర్పించు సమయములో పరిమళమైన పుష్పములు, కుంకుమ, కర్పూరముతో హారతి సేవ జరుగుతుంది. అమ్మకు నైవేద్యంగా ఘనమైన వంటకాలు, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె మొదలగునవి సమర్పించుకుంటారు. నైవేద్య సేవ ప్రతి శుక్రవారం రాత్రి కూడ జరుగుతుంది. ప్రతి నిత్యం రాత్రి 7 గంటలకు జరుగు సేవను భోగహారతిగా పిలుస్తారు. రాత్రి 10 గంటలకు సేజ హారతి సేవ (పవళింపు హారతి సేవ) జరుగుతుంది. కర్పూర హారతి సేవ అనంతరము అమ్మవారి ఆభరణములు దేవస్థాన ఖజానాలో జమ చేయుదురు. ప్రతి గురువారం, శుక్రవారం మరియు పండుగలకు హారతి సేవల సంఖ్యయే అధికమవుతుంది.

8. మహూర్యే ఏకవీరికా
మహారాష్ట్రం నందలి నాందేడ్‌ జిల్లాకు ముఖ్యకేంద్రము నాందేడ్‌ పట్టణము. నాందేడ్‌కు ఈశాన్యంగా, సుమారు 135 కి.మీ. దూరమున మహూర్‌గడ్‌ అను క్షేత్రం కలదు. క్షేత్రరాజ్యం పర్వతారణ్యయ ప్రాంతములోని ఒక గ్రామం. మహూర్‌గడ్‌ నిత్యం భక్తులతో యాత్రికులతో కోలహాలముగాను, తిరునాళ్ళుగాను దర్శనమిస్తుంది. మహూర్‌ బస్‌స్టాండ్‌కు సుమారు 3 కి.మీ. దూరమున ఎత్తైన పర్వతము మీద శ్రీ రేణుకాదేవి శక్తిపీఠం వుంది. శ్రీ ఏకవీరికాదేవి శక్తి పీఠంగా భక్తులు కొలుస్తారు. అష్టాదశశక్తి పీఠములలో ఎనిమిదవదిగా ఖ్యాతి పొందినది. సతీదేవి కుడిస్తనం పడినచోటుగా భక్తులు భావించుతారు. మహారాష్ట్రములోని మూడున్నర శక్తిపీఠములలో ఒకటిగా ప్రసిద్ధి. మిగిలిన కొల్హాపూర్‌ నందలి శ్రీ మహాలక్ష్మిపీఠం, తుల్జాపూర్‌ నందలి శ్రీభవాని పీఠం మరియు నాసిక్‌ నందలి పంచవటి తీరమునగల శ్రీధరాదేవి పీఠం (అరశక్తిపీఠం) వీటిని మహారాష్ట్ర ప్రజలు భక్తి విశ్వాసములతో సందర్శించుకుంటారు.

మహూర్‌ బస్టాండ్‌ నుంచి 3 కి.మీ. ఘాట్‌రోడ్‌ మార్గములో ప్రయాణము. ఆలయ దిగువ భాగము వరకు రవాణా సదుపాయములు హెచ్చు సంఖ్యలో లభ్యమవుతాయి. దిగువ భాగము నుంచి 250 మెట్లు ద్వారా శ్రీ రేణుకాదేవి మందిరము చేరవచ్చును. మెట్లు మార్గమునకు రెండు ప్రక్కలా పూజా సామాగ్రీలు, అమ్మవారి చిత్ర పఠములు మొదలగునవి విక్రయించు షాపులు కలవు. శ్రీ ఏకవీరికాదేవి మందిరము చాల ప్రాచీనమైనది. ఆలయమంతా సింధూర రంగులో దర్శనమిస్తుంది. చిన్న ముఖద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేయాలి. ముందుగా శ్రీ పరశురామ్‌ గణేష్‌ దర్శనము చేయాలి. పిదప రేణుకామాత (ఏకవీరికాదేవి) దర్శనము చేసుకోవాలి. మెడగాని, భుజనాలు గాని లేని రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సింధూరం పూస్తారు. అమ్మవారి ముక్కు, నోరు, కళ్ళు స్పష్టముగా చూడవచ్చును. రేణుకాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది. మందిరంలో ఒక ప్రక్క యజ్ఞపీఠిక వుండగా, మరోప్రక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది. భక్తులు అమ్మవారి ప్రతిమకు కుంకుమార్చన మొదలగునవి జరుపవచ్చును.

శ్రీ ఏకవీరికా మాత దర్శనానంతరము ఆలయము బయటకు వస్తే ఆలయ ప్రాంగణము నందు శ్రీలక్ష్మి, శ్రీభవానీమాత మరియు శివలింగము మొదలగునవి దర్శనమిస్తాయి. రేణుకాదేవి (ఏకవీరికాదేవి) నూతన ఆలయ నిర్మాణములో వుంది. మహూర్‌గడ్‌ క్షేత్రం శ్రీ రేణుకాదేవి మందిరంతో పాటు శ్రీ దత్తపీఠం, శ్రీ అనసూయమాత మందిరములు చూడదగినవి. క్షేత్రము నందలి శ్రీ పరశురామమందిరం, శ్రీ సర్వతీర్థ, శ్రీకైలాసగిరి, శ్రీవనదేవి, శ్రీమహాకాళి మందిరము, శ్రీ చింతామణి మందిరం, శ్రీ మాతృతీర్థ, శ్రీగోముఖ, శివతీర్థ, శ్రీపాపహరణికుండ్‌, శ్రీఅమ్‌త్‌కుండ్‌, శ్రీఆత్మబోదకుండ్‌, శ్రీజమదగ్నిగుట్ట, పాండవులగుహ, కోఠిభూమి, సంగమేశ్వరం, శ్రీదేవదేవేరిమందిరం, మ్యూజియం మొదలగునవి కూడ చూడదగినవి. వీటిని సందర్శించుటకు స్థానిక రవాణా సదుపాయములు దొరుకుతాయి. 

9. ఉజ్జయిన్యాం మహాకాళీ
ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది అయిన శ్రీ మహాకాళీలింగము మరియు అష్టాదశ శక్తిపీఠాలలో తొమ్మిదవది అయిన శ్రీ మహాకాళీ శక్తిపీఠం అమరియున్న పవిత్రస్థలం. సతీదేవి మోచేయి పడిన ప్రదేశముగా ప్రసిద్ధిగాంచినది. మార్కండేయ పురాణం నందు దేవి ఉత్పత్తి గురించి ప్రస్తావించబడింది. శ్రీ మహాకాళీ రాక్షసులను వధించడానికి పదితలలతో, పదికాళ్ళతో నల్లనిరూపుతో అవతరించింది. ఉజ్జయిని క్షేత్రం నందు ఇటువంటి రూపం ఎక్కడ దర్శించలేము. పురాణం నందు నల్లగా నున్న శ్రీ మహాకాళిని, హంసలకన్నా తెల్లనిదిగా భావించి పూజించే ఉజ్జయిని నివాసులు అంటే అమ్మకు ప్రీతిపాత్రులు. ఉజ్జయిని నగరవాసులు శ్రీ మహాకాళీని హరసిద్ధిమాతగా కొలుస్తారు. ఉజ్జయిని రైల్వేస్టేషన్‌కు సుమారు 2 కి.మీ. దూరంలో శ్రీ మహాకాళేశ్వరాలయం వుంది. దీనికి వెనుక భాగమున, సుమారు 500 మీటర్లు దూరమున కొంత ఎత్తయిన ప్రదేశము నందు కలదు. ఆలయమునకు తూర్పు ముఖముగా, దక్షిణ ముఖముగా రెండు ముఖద్వారములున్నాయి. గర్భాలయము నందు హరసిద్ధిమాత ముఖం మాత్రమే దర్శనమిస్తుంది. మాత ముఖమంతా సింధూరం పూస్తారు. అమ్మ యొక్క శాంతి రూపము, చల్లని చూపులు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని పుష్కలంగా అనుగ్రహించగలదు. ఆలయ ప్రాంగణములో గౌరి, అన్నపూర్ణ మొదలగు శక్తి రూపములు దర్శనమవుతాయి. పరాశక్తి మాతకు ఈశాన్యంగా గణపతి మందిరం కలదు. గణపతి శరీరమంతా సింధూరం పూస్తారు. ఆలయ దక్షిణ ముఖద్వారము వద్ద పూజా సామాగ్రిలు విక్రయించబడును. శ్రీహరసిద్ధి మాత ఆలయమునకు ఎడమవైపున, కొంతదూరమున శ్రీరామమందిరము కలదు. వీరి సంరక్షణలో మంచి వసతి సదుపాయములు కలవు. యాత్రికులకు వసతి సదుపాయములు ఏర్పాటు చేయగలరు. శ్రీహరసిద్ధి మాత ఆలయము కుడివైపున అనేక మందిరాలున్నాయి. వీటికి సమీపంలో విక్రమాదిత్య మహారాజు నివాసమైన స్థలం కలదు. మహారాజు ఉపయోగించిన సామాగ్రిలు దర్శించవచ్చును.

10. పీఠికాయాం పురుహూతికా
ఆంధ్రలో ఈశాన్యం దిక్కుగా తూర్పుగోదావరి జిల్లా వుంది. పచ్చనిపైరులు, గలగలా పారుతున్న పంట కాలువలు, ఉధృతంగా ప్రవహించే గోదావరినది మరియు సముద్రతీర ప్రాంతాలతో నేత్రపర్వంగా జిల్లా దర్శినమిస్తుంది. సముద్రమూ, గోదావరి నది కలిసే ప్రదేశానికి అతిసమీపంలో నున్న ప్రాచీన పట్టణం ”కాకినాడ పట్టణం”. తూర్పు కోస్తా ప్రాంతపు రేవులలో కాకినాడ రేవు ప్రాచీనమైనది. పిఠాపురం సంస్థానాదీశులు కాకినాడ పట్టణమును ప్రణాళికాబద్ధమైన రీతిలో తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రమైన కాకినాడ పట్టణమునకు ఉత్తరదిశవైపుగా సుమారు 19 కి.మీ. దూరమున పిఠాపురం అను చిరుపట్టణము వుంది. ఇది చుట్టుప్రక్కల ప్రాంతములకు ముఖ్య కేంద్రం. పిఠాపురం సంస్థానాదీశుల పాలనలో వైభవముగాను, శోభాయమానంగా విలసిల్లిన రాజక్షేత్రం. నాటి మహారాజుల భవనములు కట్టడాలు చరిత్ర గర్భంలో కలిసిపోయినాయి. వీటితోపాటు శ్రీపురుహూతిక పీఠం కూడ కాలగర్భంలో కలిసిపోయి వుండవచ్చు. సతీదేవి యొక్క పీఠభాగము (పిరుదులు) పడిన ప్రదేశముగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం ప్రాచీనకాలము నందు శ్రీపీఠంగా, పురుహూతికాపురంగా, పురుహూతికా పట్టణముగా వాడుకలో వుండేది.

అష్టాదశ శక్తి పీఠములలో పదవపీఠం అయిన శ్రీ పురుహూతికా మూలస్థానము శ్రీ కుక్కుటేశ్వరాలయ ప్రాంగణము నందు ఈశాన్యం వైపుగా వుంది. గర్భగుడి నందు అమ్మవారు శాంతి రూపములో దర్శనమిస్తుంది. శ్రీ పురుహూతికాదేవిని ఇంద్రుడు మున్ముందుగా ఆరాధించారు. గయాసురుడు కూడ ఆరాధించిన శక్తిగా ప్రసిద్ధి చెందినది. అమ్మవారి మందిరము 1995 సంవత్సరము నందు జీర్ణోద్ధరణ జరిగింది. 1998 సంవత్సరం నందు ఆలయ పునర్నిర్మాణమునకు శంఖుస్థాపన జరిగింది. అమ్మవారికి నిత్యపూజలు జరుగుతుంటాయి. కుంకుమార్చనలు మొదలగునవి భక్తులు భక్తి శ్రద్ధలతో చేస్తారు. అమ్మవారి మంటపం నందు నాలుగు ప్రక్కల, గర్భగుడి గోడల మీద అష్టాదశ శక్తి పీఠములను పొందుపర్చినారు. ఆశ్వీజమాసంలో దేవి నవరాత్య్రుత్సవాలు ఘనంగా జరుగుతాయి. విజయదశమినాడు జమ్మి ఉత్సవం వైభముగా జరుగుతుంది.

పిఠాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేశంలోని ప్రాచీన పుణ్యతీర్థములలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచినది. క్షేత్రం నందలి శ్రీ కుక్కుటేశ్వరుడు స్వయంభూలింగముగా వెలిసారు. పిఠాపురం కాశీతో సమానమైనది. దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. శ్రీ వ్యాసభగవానులు సతీసమేతంగా కాశీనగరం విడిచి, దక్షిణకాశీ అయిన పిఠాపురం నందలి పాదగయ తీర్థమున స్నానముచేసి, శ్రీహుంకారిణి సహిత శ్రీకుక్కుటేశ్వరుని దర్శించుకున్నారు. శ్రీ అగస్త్యులు కూడా సతీసమేతంగా ద్వాదశ క్షేత్రయాత్ర సలుపుతూ భీమమండలం నందలి శ్రీ కుక్కుటేశ్వరస్వామిని మరియు శ్రీ పురుహూతికాదేవిని కొలిచినారు. 14వ శతాబ్దం వాడైన శ్రీనాథకవి సార్వభౌముడు తన కావ్యమునందు ఈ క్షేత్రమును పీఠికాపురం, పీఠాపట్టణము మరియు పిఠాపురముగా వర్ణించాడు. శ్రీకుక్కుటేశ్వరక్షేత్రం కాశీ, కేదార, కోణార్క, కుంభకోణములకు సాటియగు మోక్షదాయమని వర్ణించాడు. ఇక్కడ జరిపే దానం, హోమం, అధ్యయనం, శ్రాద్ధం, దేవతార్చనలు, వ్రతాలు మొదలగునవి కోటి రెట్లు ఫలితములిచ్చునని భీమేశ్వరపురాణం నందు వివరించాడు. కుక్కుటేశ్వర శతకం అను కావ్యమును శ్రీకూచిమంచి తిమ్మకవి స్వామివారికి అంకితమిచ్చాడు. శ్రీ వారణాసి వేంకటేశ్వరకవి, శ్రీ దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి కవి, శ్రీ ఓరుగంటి వెంకటశాస్త్రికవి మొదలగు కవులు తమ కవితా భక్తి కుసుమాలతో స్వామిని అర్చించుకుని ధన్యులైనారు.

11. ఓఢ్యాయాం గిరిజాదేవి
ఒరిస్సా రాష్ట్రమునకు ఈశాన్యదిశగా జాజ్‌పూర్‌జిల్లా కలదు. జిల్లా ముఖ్యకేంద్రము జాజ్‌పూర్‌ పట్టణం. ఈ క్షేత్రమున అష్టాదశశక్తి పీఠాల్లో పదకొండవదిగా గిరిజాదేవి పీఠం వుంది. మాతను విరజాదేవిగా పిలుస్తారు. స్థానికులు విరజాదేవిగా కొలుస్తారు. జాజ్‌పూర్‌ చాలా పురాతన పట్టణం. పవిత్రమైన వైతరణి నది ఒడ్డునగల జాజ్‌పూర్‌ను వైతరణి పట్టణముగా పిలుస్తారు. ప్రాచీన కాలం నందు జాజ్‌పూర్‌ పట్టణము, రాజుల మత రాజధానిగా శోభిల్లింది. కళింగ గాంగవంశము, దత్తవంశము, సోమవంశి వంశము మొదలగు రాజుల కాలంలో జాజ్‌పూర్‌ క్షేత్రం అభివృద్ధి చెందినది. ఈ క్షేత్రమును గదక్షేత్రం, నాభిక్షేత్రం, విరాజక్షేత్రం, బ్రహ్మక్షేత్రం, విరాజతీర్థం, వైతరణితీర్థం మొదలగు పేర్లతో భక్తులు కొలుస్తారు. జాజ్‌పూర్‌ నందు శక్తిపీఠంతో పాటు శైవమతమునకు చెందిన అనేక శివలింగాలు, వైష్ణవ మతమునకు చెందిన ఆలయాలు మరియు తీర్థాలు కలవు. ఈ క్షేత్రము తాంత్రికపీఠంగా కూడా ఖ్యాతి పొందినది. తంత్ర శాస్త్రమునకు సంబంధించిన పూజలు నిర్వహించేవారు. జాజ్‌పూర్‌ ప్రాంతములో హైందవమతంతో పాటు బౌద్ధమతం, జైనమతం కూడా అభివృద్ధి చెందినట్లు శాసనములు తెల్పుచున్నాయి. జిల్లాలోని రత్నగిరి, ఉదయగిరి బౌద్ధమతమునకు ముఖ్య కేంద్రములుగా ఉండేవి. 1360 మరియు 1568 సంవత్సరములలో మహమ్మదీయులు (బెంగాల్‌ నవాబులు) చేసిన దారుణ మారణకాండలో హైందవదేవాలయములు నేలమట్టం చేయగా, నేలమట్టమైన శకలాల మీద మరల కొన్ని ఆలయాలు పునరుద్ధరణ జరిగాయి. మరికొన్ని ఆలయాలు క్షీణదశ చేరగా, నరసింహదేవ్‌, సోమదత్త, ప్రతాపరుద్రదేవ్‌, యయాతి రాజు కాలములో వాటికి పునర్నిర్మాణములు జరిగినాయి.

జాజ్‌పూర్‌ బస్‌స్టాండ్‌ నుంచి సుమారు 2 కి.మీ. దూరమున బింజాపూర్‌ పోవు రోడ్డు మార్గమున బ్రహ్మకుండం వద్ద విరజాదేవి ఆలయం వుంది. నేటి ఆలయనిర్మాణం 18వ శతాబ్దంలో జరిగింది. ఆలయ ప్రాకారంలో నాభిగయ, ఇన్నైశ్వర్‌ శివాలయం, హనుమాన్‌ మందిరం, డోలమండపం, భైరవ, కార్తికేయ, గంగాధర్‌తోపాటు 108 శివలింగాలు, విష్ణురూపాలు దర్శించవచ్చును. ఆలయ గర్భగుడిలో విరజాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది. అమ్మవారి స్వరూపం దేదీప్యమానంగా, తేజోవంతంగా, శాంతిమూర్తిగా కనిపించి, మహామహిమోపేతమైన శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. సతీదేవి యొక్క నాభిస్థానం పడటం చేత, దీనిని మహాశక్తి పీఠంగా పరిగణిస్తారు. ఇది నాభిక్షేత్రంగా కూడా క్యాతి పొందినది. ఆలయప్రాకారం, సింహద్వారము శోభతో నయనానందకరంగా దర్శనమిస్తాయి. గుప్తుల కాలమునాటి విరజాదేవి విగ్రహం, రెండు చేతులు కలిగిన మహిషాసురమర్ధినిగా ఉంటుంది. రాక్షసశక్తి అయిన ఎనుబోతును, అమ్మవారు తన ఎడమకాలితో త్రొక్కి, కుడిచేతిలోని త్రిశూలమును ఎనుబోతు శరీరములో గ్రుచ్చి, ఎనుబోతు (మహిషాసుర) తోకను ఎడమచేతితో పుచ్చుకుని నిలుచుండెను. ఇటువంటి మహిషాసురమర్ధిని రూపం యొక్క నకలును జగన్నాథాలయ ప్రాకారం నందు, వాయువ్యవైపునగల ముక్తీశ్వర్‌ ఆలయం నందు కూడ చూడగలము. భారతదేశమున మరోచోట ఇటువంటి మహిషాసురమర్ధిని రూపమును దర్శించలేము.

12. మాణిక్యా దక్షవాటికే
ఆంధ్రప్రదేశ్‌ నందలి తూర్పుగోదావరి జిల్లా ముఖ్యకేంద్రం కాకినాడ పట్టణము. దీనికి సుమారు 28 కి.మీ. దూరమున ద్రాక్షారామమే పుణ్యక్షేత్రం వుంది. ఇక్కడ భీమేశ్వరుడు మరియు శ్రీ మాణిక్యాంబదేవి కొలువు దీరియున్నారు. భారతఖండములో విరసిల్లిన అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవదిగా మాణిక్యాంబది. సతీదేవి ఎడమ చెక్కిలి పడిన ప్రదేశంగా ప్రసిద్ధిగాంచినది. సతీదేవి తండ్రి అయిన దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశమును దక్షవాటికగా పిలుస్తారు. దక్షవాటిక దక్షరామం అని పిలువబడింది. కాలక్రమేణా ద్రాక్షారామంగా మారింది. దక్షవాటికన దాక్షాయిని (సతీదేవి) ఆత్మాహుతి చేసుకున్న స్థానమున, పరమేశ్వరుడు భీమరూపమున స్వయంభువుడైనాడు. స్వయంభువ లింగమును భీమేశ్వరునిగా కొలుస్తారు. ద్రాక్షారామం దక్షిణకాశిగా భాసిల్లుతుంది. దక్షిణ భారతదేశము నందు గల అతి ప్రాచీనమై మరియు పురాణ ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రాలలో ఒకటిగా ఖ్యాతి పొందినది. శ్రీశైలం – శ్రీకాళేశ్వరం – శ్రీ దాక్షారామం మధ్యగల భూమిని త్రిలింగ దేశముగా పిలుస్తారు. శ్రీభీమేశ్వరలింగము త్రిలింగములలో ఒకటిగా వర్ధిల్లుతోంది.

శ్రీ భీమేశ్వరాలయమునందు శ్రీ మాణిక్యాంబదేవికి ప్రత్యేక స్థానం కలదు. శ్రీ భీమేశ్వరాలయం రెండవ ప్రాకారములోని గర్భాలయమునకు నాలుగు ప్రక్కల మండపం వుంది. మండపం వరసలో స్వామివారి పరివార గణములతో పాటు మాణిక్యా శక్తిపీఠం కూడా కలదు. శ్రీ భీమేశ్వర లింగమునకు ఈశాన్యవైపున, దక్షిణముఖముగా శ్రీ మాణిక్యాంబ అమ్మవారు కొలువుతీరింది. తూర్పు చాళుక్యులు తమ ఇలవేల్పుగా మాణిక్యాంబను ఆరాధించారు. శ్రీ మాణిక్యాంబ దేదీప్యమానంగా, తేజోవంతంగా, మంగళకరముగాను భక్తులకు దర్శనమిస్తుంది. సమస్త దేవతలలో మాణిక్యాంబ సుప్రసన్నమూర్తి. భక్తుల యొక్క ఆశ్రిత కల్పవృక్షం శ్రీమాణిక్యాంబదేవి. శ్రీ ఆదిశంకరులు మాణికేశ్వరిని చక్రబిందువుపై ప్రతిష్ఠించారు. అమ్మవారికి నిత్యం కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుతారు. శ్రీ భీమేశ్వరాలయం బయటపూజా సామాగ్రిలు విక్రయించు షాపులు కలవు.

స్థలపురాణము
ద్రాక్షారామ భీమేశ్వరాలయం పంచారామాలలో ఒకటిగా ప్రాముఖ్యత పొందినది. పురాణాల కాలములో దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో శంకరుని కుమారుడైన శ్రీ కుమారస్వామితో తారకాసురుడు యుద్ధంలో తలపడ్డాడు. తారకాసురుని కంఠమునందు గల అమృతలింగమును ఐదు ఖండాలుగా కుమారస్వామి చేధించినాడు. అవి ఐదు క్షేత్రాలలో పడ్డాయి. వీటిని పంచారామాలుగా పిలుస్తారు. వీటిని అమరారామం, భీమారామం, క్షీరారామం, ద్రాక్షారామం మరియు కుమారారామంగా కొలుస్తారు. మహాశివరాత్రి పర్వదినాన అసంఖ్యాక యాత్రికులు ఈ ఐదు క్షేత్రాలను ఒక వరుసలో సందర్శించి పునీతులవుతారు.

13. హరిక్షేత్ర కామరూపా
భారతదేశమున, ఈశాన్యదిశగా అస్సాం రాష్ట్రం కలదు. పూర్వం దీనిని కామరూప దేశంగా పిలిచేవారు. అస్సాంలోని కామరూప జిల్లానందు కామాఖ్య ఆలయం కలదు. అస్సాం రాష్ట్రములోని ముఖ్యనగరమైన గౌహతి పట్టణమునకు సుమారు 10 కి.మీ. దూరమున గల నీలాచల పర్వతం మీద అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రధానమైన శ్రీ కామాఖ్య అమ్మవారి ఆలయం కలదు. నీలాచల పర్వతమును కామగిరి పర్వతం అని కూడా అంటారు. సముద్ర మట్టమునకు 535 అడుగల ఎత్తునగల కామాఖ్య ఆలయ ప్రాంతము ఎంతో రమణీయమైన ప్రకృతిశోభతో ఆహ్లాదకరముగా ఉంటుంది. కామాఖ్య శక్తిపీఠము ప్రాచీన కాలము నుండి ప్రసిద్ధ శక్తిపీఠంగాను మరియు తాంత్రిక విద్యలకు, పూజలకు కేంద్రం గాను ప్రఖ్యాతిగాంచినది. శ్రీమహావిష్ణుకు ముడిపడిన అనేక తీర్థములు ఈ క్షేత్రము నందు ఉన్న కారణముగా, ఈ ప్రాంతము హరిక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచినది. ప్రపంచంలోని అతి పెద్ద నదులలో ఒకటిగా ఖ్యాతిపొందిన బ్రహ్మపుత్రనది నీలాచల పర్వతాన్ని అంటి ప్రవహిస్తూ వుంటుంది.

సతీదేవి యోని భాగము పడిన ప్రదేశమే కామాఖ్య శక్తిపీఠంగా విరాజిల్లుతుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో పదమూడవదిగా పరిగణించబడుతుంది. ఇది కామాఖ్య తాంత్రిక పీఠంగాను, కామ్యాసిద్ధి పీఠంగాను ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. కామాఖ్య ఆలయంలోపల ఒక గుహలాంటిది కనబడుతుంది. గుహలోపల ఒకమూల, నల్లనిరాయిమీద ‘యోని’ రూపం చెక్కి ఉంటుంది. ఆ భాగమును (రూపాన్ని) భక్తులు పూజిస్తూ వుంటారు. ఆ కారణముగా కామాఖ్యపీఠం యోని పీఠంగా ఖ్యాతిపొందినది. యోనిని సృష్ఠికి, సృజనశక్తికీ సంకేతంగా భావిస్తారు. దీనివలన కామరూపాదేవికి ”భగవతి” అను నామం సార్ధకమైనది. భగము అనగా యోని అని అర్ధము. అమ్మవారి భగమును (యోని) పూజించేవారిని వామాచారులని పిలుస్తారు. వామాచార పూజలో ప్రధానపూజ జీవించివున్న స్త్రీ అవ్వడం గమనించదగినది.

నగరవాసులతోపాటు, చుట్టుప్రక్కలగల గిరిజన తెగలకు కూడా కామాఖ్య అమ్మవారు ముఖ్యఆరాధ్య దేవత. ఖాసీ అనే గిరిజన భాషలో కామాఖ్య అంటే జన్మనిచ్చే తల్లి అని అర్థం. తాంత్రికులను ఆకర్షించే ప్రధాన శక్తి పీఠాలలో కామాఖ్యపీఠం ముఖ్యమైనది. అమ్మవారు శక్తిరూపం గావున బలి, పూజాదులు మొదలగునవి జరుగుచుండేవి. ఇక్కడ తాంత్రిక ప్రజా విధానం జరుగుచుండేది. శ్రీ ఆదిశంకరాచార్యులు, తాంత్రిక పూజా విధానమునకు ప్రతిగా పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టినారు. దీనితో తాంత్రికధోరణుల వ్యాప్తి తగ్గిందని చెబుతారు. నేడు ఆలయము నందు పూజలు తాంత్రిక మరియు ఆగమపద్ధతిలో జరుగుతుంటాయి. భక్తులు పూజా, ఉపాసనలతో కుమారీ పూజ చేస్తారు. పూజానంతరము భోజనం పెట్టడం గొప్ప సంప్రదాయంగా సాగుతోంది. కుమారీపూజను కన్యపూజ అని కూడ అంటారు. నవరాత్రులలో ఆర్ధికముగా శక్తి వున్నవారు ప్రతిరోజు ఒక్కొక్క కన్యను ఆహ్వానించి, శాస్త్రోక్తంగా పూజించాలి. రెండేళ్ళ నుంచి ఏడేళ్ళ వయస్సు వున్న కన్యలే యిందుకు అర్హులు. ఒంటిమీద గాయాలు, మచ్చలు, కురుపులు వున్నవారు మరియు రోగగ్రస్తులు కన్యాపూజకు అర్హులుకారు. వీరిని అమ్మవారి మూర్తిగా భావించి, శ్రీయుక్తనామమంత్రాలతో పూజించాలి. కుమారీ పూజావిధానం దేవీ భాగవతం నందు ప్రశంస కలదు. వివాహం కాని స్త్రీలు వివాహం కావాలని కుమారిదేవిని ఆరాధిస్తారు.

కామాఖ్యమాతను తార, ఛండీ, సరస్వతి, దుర్గ, కాళీ మొదలగు రూపాలలో కూడ పూజిస్తారు. ఆలయము నందు ఈ రూపాలను దర్శించగలరు. ఉదయం 8 గంటల నుంచి కామాఖ్య అమ్మవారి దర్శనము ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఆలయమును మూసివేస్తారు. సంతానం లేనివారు సంతానం కోసం పూజిస్తారు. కామాఖ్య అమ్మవారి దర్శనముతో, తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. కామాఖ్య దేవిని సందర్శించుకునే ముందుగా, యాత్రికులు ఆలయమునకు ఉత్తరంవైపున గల సౌభాగ్యకుండ్‌ నందు స్నానమాచరిస్తారు. సౌభాగ్యకుండ్‌ ప్రాంతములో పండాలు తర్పణ, శ్రాద్ధ కర్మలను నిర్వహించుతారు.

14. ప్రయాగే మాధవేశ్వరీ
భారతదేశంనందలి పుణ్యక్షేత్రాలు, నదీతర ప్రాంతములో ఆవిర్భవించి భక్తుల పాపాలన్నీ కడిగివేసి నిష్కళంకులుగా తరింపచేస్తున్నాయి. సుజలపూర్ణమయిన సప్తనదులు అనగా గంగా, యమున, సరస్వతీ, గోదావరి, కావేరి, నర్మదా, సింధునదులు భారతపుణ్యభూమి మీదగా ప్రవహిస్తూ ఎన్నో పవిత్ర స్థలాలను అనుసంధిస్తున్నాయి. వీటితోపాటు బ్రహ్మపుత్ర, సరయూ, పల్గునీ, గోమతి, భీమ, తుంగభద్ర, పెన్న, మహానది, ఇంద్రావతి, తపతి, సబర్మతీ మొదలగు పెక్కు నదుల ప్రవాహంతో భూమాత సస్యశ్యామలంగా పునీతమవుతుంది. పవిత్ర నదులకు ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి పుష్కరోత్సవాలు జరుగుతాయి. అదేవిధముగా పుణ్యదాయకమైన నాసిక్‌, ఉజ్జయిని, హరిద్వార్‌ మరియు అలహాబాద్‌ క్షేత్రలములనందు కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. ఇవి ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి ఒక్కొక్క ప్రదేశములో వైభవంగా జరుగుతాయి. బృహస్పతి (గురుగ్రహము) వృషభరాశిలో నుండగా, సూర్యుడు మకర సంక్రమణమైనపుడు కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. ఇట్టి కుంభ పర్వకాలమునందు లక్షలాది యాత్రికులు అలహాబాద్‌ వద్ద గల త్రివేణి సంగమం నందు పవిత్రస్నానములు చేసి, పూజాది కార్యక్రమాలు మరియు పిండ ప్రదానాలు నిర్వహించుతారు.

ఉత్తరప్రదేశ్‌ నందలి అలహాబాద్‌ జిల్లా ముఖ్యపట్టణమైన అలహాబాద్‌ను ప్రయాగ, త్రివేణి అని కూడా అంటారు. ప్రయాగ తీర్థరాజమని పురాణములలో చెప్పబడినది. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమంతో ఈ ప్రాంతము త్రివేణిగా ప్రసిద్ధి చెందినది. ప్రయాగక్షేత్రం నందు త్రివేణి సంగమంతో పాటు అష్టాదశ శక్తి పీఠాలలో పదునాల్గవది అయిన శ్రీ మాధవేశ్వరి పీఠం. సతీదేవి హస్తాంగుళీయకం పడిన ప్రదేశముగా ప్రసిద్ధి. శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠం త్రివేణి సంగమం వద్ద వుండేది అని పురాణాలు చాటుతున్నాయి. ప్రయాగ క్షేత్రమున శ్రీమాధవేశ్వరి అనే నామంతో శక్తిపీఠం లేదు. క్షేత్రంలోని అలోపిదేవిని శ్రీమాధవేశ్వరి దేవిగా భక్తులు కొలుస్తారు. శ్రీఅలోపిదేవి విగ్రహరహితమై మరియు గుప్తగాను మందిరంలో ఉంటుంది. అలహాబాద్‌ రైల్వేస్టేషన్‌కు సుమారు 3 కి.మీ. దూరంలోగల ‘దారాగంజి’ అనే ప్రాంతము నందు గల అలోపిబాగ్‌లో అమ్మదర్శనము చేయవచ్చును. ఇది అలోపిశంకరి శక్తిపీఠంగాను, మహేశ్వరి పీఠంగాను ప్రసిద్ధి చెందినది. విశాలమైన ప్రాంగణంలో అమ్మవారి మందిరం వుంది. పీఠమునకు మధ్య ఒక రంద్రము దర్శనమిస్తుంది. దీనిపై అమ్మవారి ఊయల వ్రేలాడుతూ వుంటుంది. భక్తులు తెచ్చిన కొబ్బరికాయను పండాలు రంధ్రము నందు అమ్మవారికి సమర్పించుతారు. భక్తులు అమ్మవారి ఊయలను భక్తి శ్రద్ధలతో ఊపుతారు. మందిరం వెనుక భాగమున నవదుర్గలు, గణపతి, శివలింగాలు మొదలగు మూర్తులున్నారు. త్రివేణి సంగమం నుంచి కూడా అలోపిబాగ్‌ చేరవచ్చును.

అలోపిబాగ్‌ నుంచి సుమారు 4 కి.మీ. దూరంలో శ్రీ కళ్యాణి దేవి అర్థశక్తిపీఠం కలదు. మందిరంలోని కళ్యాణిదేవికి కుడివైపున పార్వతీదేవి మరియు ఎడమవైపున మహాకాళి దేవిని దర్శించగలం. ఇది అర్ధశక్తి పీఠంగా ఖ్యాతి పొందినది. ఆలయ ప్రాంగణములో శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ రాధాకృష్ణులు, శ్రీరామలక్ష్మణుల సమేత జానకీమూర్తులను సందర్శించవచ్చును.

కళ్యాణిదేవి మందిరమునకు సుమారు 6 కి.మీ.ల దూరమున మీర్‌పూర్‌ గ్రామము నందు శ్రీలలితాదేవి సిద్ధిపీఠం కలదు. ఆలయ ప్రవేశ ముఖద్వారం పశ్చిమముఖంగాను, శ్రీలలితాదేవి తూర్పుముఖంగాను ఉంటుంది. శ్రీ లలితాఅమ్మవారికి ఇరువైపుల శ్రీమహాలక్ష్మి మరియు శ్రీమహాసరస్వతి మూర్తులున్నారు. ఆలయ పూజారి శ్రీలలితాదేవిని ప్రయాగమాధవేశ్వరిగా వర్ణించుచున్నారు.

15. జ్వాలాయాం వైష్ణవీదేవి
భారతదేశమున వాయువ్యమూలంగా హిమవన్నగ పర్వత ప్రాంగణంలో ఒదిగియున్న ప్రదేశం హిమాచలప్రదేశ్‌, పరమశివుని వెండికొండగా పేర్కొనబడిన దివ్యధామం హిమాలయం. హిమాచల స్వరూప స్వభావాన్ని బట్టి ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విభజించవచ్చును. దక్షిణ ప్రాంతము కొంత ఉష్ణంగాను, ఉత్తర ప్రాంతము శీతలముగా వుంటుంది. చలికాలము నందు అతిశీతలమై, హిమపాతం జోరుగా పడుతూ వుంటుంది. హిమాచలప్రదేశం చాలాభాగము పర్వతప్రాంతమే. ప్రపంచములోనే అత్యధిక గ్రామీణ ప్రాంతములతో నిండిన రాష్ట్రం. భారతమాతను వసుంధరగా సస్యశ్యామలంగా మారుస్తూ, తమ విద్యక్తి ధర్మంగా ప్రవహించే జీవనదులు జన్మస్థలమైన పుణ్యస్థలి హిమాచలప్రదేశ్‌, ఉత్తరాన జమ్ము-కాశీర్మర్‌, ఆగ్నేయముగా ఉత్తరప్రదేశ్‌, దక్షిణాన హర్యానా, పడమట పంజాబు సరిహద్దు రాష్ట్రాలు మరియు తూర్పున టిబెట్టు సరిహద్దు రేఖలున్నాయి. చీనాట్‌, రావి, బియాన్‌, సట్లెజ్‌, యమున నదులు హిమాచలప్రదేశ్‌ను సస్యశ్యామలము చేస్తున్నాయి. చద్విక్‌ జలపాతం, కుఫ్రి, డల్హౌసి, కసౌలి, లాహపుల్‌, స్పితి, సిమ్లా, కులూ, మనాలి మొదలగు పర్యాటక స్థలాలతో నిండి ఉంటుంది. జ్వాలాముఖి, తారాదేవి, ధర్మశాల, రేణుక, నైనాఏవి, బైద్యనాథ్‌, మహాదేవ్‌, పార్వతీలోయ, త్రిజోకనాథ మొదలగు పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తాయి. గ్రామీణ ప్రాంత అందాలు, ప్రకృతి సౌందర్యాలు, పర్వత సోయగాలు, పర్యాటకులకు స్వాగతమిస్తున్నాయి.

హిమాచలప్రదేశ్‌ ఉత్తరప్రాంతమును క్రీ.శ. 550 సంవత్సరము పూర్వము నుంచి రాజపుత్రులు రాజ్యమేలారు. 2-5 శతాబ్దాల మధ్య గుప్తుల రాజ్యపాలనలో ఉండేది. హిందూరాజుల అంతఃకలహాల మూలంగా ఒక్కొక్క మెట్టూ పరాయిపాలకుల హస్తాలలోకి జారిపోయింది. మహమ్మద్‌ గజనీ దండయాత్ర చేసి దోచుకోగలిగినంత దోచుకున్నారు. టర్కీ సుల్తానులు, తురుష్కులు దండయాత్రలు చేసి సిరులన్నీ తరలించారు. ముస్లిం వంశీయులు వారి కోటలు నిర్మించి, తమ కోశాధికారులను నియమించారు. 16వ శతాబ్దంలో మొగలు వంశపు చక్రవర్తులు దండయాత్రలు చేసి, తమ సామ్రాజ్యంలోనికి తెచ్చారు. మొగలు పతనానంతరము సిక్కులు రాజ్యమేలారు. 18వ శతాబ్దంలో సిక్కురాజైన రాజారంజిత్‌సింగ్‌ మరణం తరువాత అనగా 19వ శతాబ్దంలో బ్రిటీష్‌వారి పాలనలోనికి వచ్చింది. 1947 సంవత్సరములో భారతస్వతంత్ర దేశంఅయిన పిమ్మట 32 సంస్థానాలు, రాచరికపు రాజులను విలీనం చేసి, కేంద్రపాలిత రాష్ట్రంగా ఏర్పాటుచేశారు. 1960వ సంవత్సరములో పంజాబులోని కొన్ని ప్రాంతాలు, అంతకు ముందున్న ప్రాంతములతో కలిసి హిమాచలప్రదేశ్‌గా ఏర్పాటు జరిగింది. ఉత్తర – పశ్చిమాన గల కాంగ్రా ప్రాంతము మొదటి నుంచి దృఢమైన రాజ్యంగా ఉండేది. రాజపుత్రులు, మొగలు వంశీయులు, సిక్కుల పాలనలో మహావైభవోపేతంగా, సిరులకు నిలయంగా తులతూగుచుండేది. కాంగ్రా పట్టణములోని దేవి వజ్రేశ్వరి ఆలయ సంపదను మహమ్మద్‌ గజనీ, తుగ్లక్‌లు కొల్లగొట్టుకుపోయినట్లుగా చరిత్ర చాటుతుంది. కాంగ్రా చుట్టుప్రక్కల ప్రాంతముల నందు అనేక హిందూ దేవాలయములు ఉండేవి. వీటిలో జ్వాలాముఖి ఆలయం పురాణ ప్రసిద్ధి చెందినది.

హిమాచలప్రదేశ్‌ ఉత్తర ప్రాంతమునందు కాంగ్రా జిల్లా కలదు. జిల్లా ముఖ్య కేంద్రముగా కాంగ్రా పట్టణము ఉంది. దీనికి సుమారు 35 కి.మీ. దూరమున జ్వాలాముఖి క్షేత్రం వుంది. ఇది సతీదేవి పిరుదులు పడిన ప్రదేశముగా ఖ్యాతి పొందినది. మరికొంతమంది సతీదేవి శరీరకలాల్లోని నాలుక తెగిపడిన ప్రదేశముగా భావించుచున్నారు. క్షేత్రం అష్టాదశశక్తి పీఠాలలో పదిహేనవదిగా ప్రసిద్ధి చెందినది. శివాలికి పర్వతశ్రేణిలో, కలిందర్‌ పర్వతం చెంత జ్వాలాముఖి ఆలయం వుంది. కొండమీదకు మెట్లు మార్గం నిర్మాణం జరిగింది. ఆలయంలో వేంచేసిన దేవిని విద్వేశ్వరీదేవిగా కొలుస్తారు. భక్తులు మాతను వైష్ణవీదేవిగా కూడా పిలుస్తారు. ఆలయం రాతిదర్వాజా గుండా చూస్తే వెలుగుతున్న మహాజ్వాలను చూడగలము. ఈ మహాజ్వాలను పాలు, నేయితో తయారుచేసిన పదార్ధాలను నివేదనగా సమర్పించుకుంటారు. ఆలయప్రాంగణములోని హోమగుండం నిరంతరం అగ్నితో ప్రజ్వరిలుతూంటుంది. భక్తులు అమ్మకు సమర్పించు నివేదనలు హోగుండమునకు సమర్పించుట ఆచారముగా వస్తుంది. నివేదనలు తిరిగి ప్రసాదంగా భక్తులకు పంచుతారు. ఆలయములోని జ్వాలల చుట్టూ ప్రదక్షిణలు జరిపి, భక్తి శ్రద్ధలతో జ్వాలాముఖిని ఆరాధించుతారు.

16. గయా మాంగళ్య గౌరికా
హిందువులకు, బౌద్ధలకు గొప్ప పవిత్రమైన యాత్రాస్థలం గయా క్షేత్రం. గయ క్షేత్రం నందు పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించి, పిండప్రదానం చేస్తే పితృ ఋణాన్ని తీర్చుకుని, ఇహపర సాధనలో మోక్షం పొందుతారు అని గట్టి నమ్మకం. వారణాశిలో మొదలయిన శ్రాద్ధవిధులు, గయా శ్రాద్ధవిధులతో పూర్తి అవుతుంది. గయలోని వటవృక్షము క్రింద పితృకర్మలు చేయించి, పిండ ప్రదానములు చేయిస్తారు. ఈ కర్మతో పితృదేవతలు శాశ్వత కైవల్యం పొందగలరని గాఢమైన విశ్వాసం. శ్రాద్ధవిధులు పండాలు మంత్రయుక్తంగా, శాస్త్రోక్తవిధిగా చేయిస్తారు.

గురుక్షేత్రం ఉత్తరభారతదేశంలోని బీహార్‌ రాష్ట్రములో వుంది. రాష్ట్ర ప్రధాన నగరమైన పాట్నాకు సుమారు 112 కి.మీ. దూరమున గయ పట్టణము కలదు. ఇది గయ జిల్లాకు ముఖ్య పట్టణము. ఫల్గునీ నదీతీరమున, అందమైన పర్వతశ్రేణుల మధ్య అమరియున్న పట్టణము. గయ క్షేత్రము పితృగయగా మరియు బుద్ధగయగా రెండు భాగములుగా ఉంటుంది. హిందువుల పురాతన ఆలయాలకు పితృగయ ప్రసిద్ధి. దేవాలయాలపై ఉండే శిల్పకళ ఎంతో శోభగా ఉంటుంది. బుద్ధ ఆశ్రమాలు, బౌద్ధ ఆలయాలకు బుద్ధగయ ప్రసిద్ధి. సిద్ధార్ధుడు తపస్సుచేసి, జ్ఞానాన్ని పొందిన పవిత్ర స్థలాలుగా బుద్ధ గయ ప్రఖ్యాతి చెందినది. వేదభూమి అయిన గయాక్షేత్రం పూర్వం మగధ సామ్రాజ్యంలో ఒక భూభాగంగా ఉండేది. మగధ గురించి వేదాల్లో, పురాణాల్లో ప్రసక్తి మరియు ప్రశస్తి వుంది. మగధ భూభాగంలో మౌర్యులు మరియు గుప్తుల పాలన కాలాలు స్వర్ణయుగంగా కీర్తించబడినాయి. బౌద్ధులకు ముఖ్య విహారంగా వుండి, విహార్‌ అనే నామంతో తేజరిల్లిన ప్రదేశం గయాక్షేత్రం.

అష్టాదశ శక్తిపీఠాలలో పదహారవ పీఠం అయిన శ్రీ మంగళగౌరి మహాశక్తి పీఠం గయాక్షేత్రం నందు కలదు. సతీదేవి యొక్క శరీరఖండం పడి, శక్తిపీఠం ఏర్పడింది. క్షేత్రంలోని విష్ణుపాద దేవాలయమునకు సుమారు 1 కి.మీ. దూరమున గల నారాయణ చుహ అనే ప్రాంతములో కొంత ఎత్తైన కొండమీద శ్రీ మంగళగౌరి పీఠం వుంది. కొండపైకి చేరుటకు మెట్లు మార్గంతోపాటు, కొండవెనుకభాగం నుంచి రోడ్‌ మార్గం కూడా కలదు. ఆటోరిక్షా, వేన్లు, టాక్సీలు మొదలగునవి కొండపైకి చేరుటకు వీలుగా వుంది. సతీదేవి యొక్క స్తనములు పడినచోటుగా ప్రసిద్ధి. సుమారు 3 అడుగుల ఎత్తుగల ద్వారం గుండా గర్భగుడిలోనికి ప్రవేశం దొరుకుతుంది. అమ్మవారి స్తనములు పోలిన శిలకు పూజలు జరుగుతాయి. భక్తులు కూడా స్వయంగా పూజలు చేయవచ్చును. ప్రతి మంగళవారం నాడు విశేషంగా అమ్మవారి దర్శనము కొరకు వస్తారు. విజయదశమి, చైత్రమాసంలో విశేషపూజలు, ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి మందిరమునకు వెనుక భాగమున పార్వతి, కాళీ మూర్తులు దర్శించగలం. అమ్మవారి మందిరం ఎదురుగా వున్న మండపం నందు హోమం మొదలగు కార్యక్రమాలు నిర్వహించుటకు వీలుగా వున్నది. దీని ప్రక్కనే శివాలయం కూడా కలదు. పూజకు కావలసిన సామాగ్రిలు విక్రయించుశాలలు కూడా వున్నాయి. ఆలయ ప్రాంగణము భక్తి భావంతో నిండి వుంటుంది.
మహిళలకు శ్రావణమాసం అత్యంత ముఖ్యమైనది. మహిళలు ఆచరించే మంగళగౌరి వ్రతం శ్రావణ మాసమునకు ప్రధానమైనది. దీనినే శ్రావణ మంగళవార వ్రతం మరియు మంగళగౌరి నోము అని కూడా అంటారు. వ్రతం ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. మహిమాన్వితమైన మంగళగౌరి వ్రతమును త్రిలోకసంచారి అయిన నారదుడు మహా పతివ్రత సావిత్రికి తెలిపి ఆచరింపచేసినట్లు, శ్రీకృష్ణపరమాత్మ ద్రౌపదికి తెలిపి స్వయంగా ఆచరింపచేసినట్లు మరియు త్రిపురాసుర సంహార సమయంలో శివుడు, మంగళగౌరిని పూజించి విజయం సాధించినట్లు మన పురాణాలు వెల్లడించాయి.

17. వారణాస్యాం విశాలాక్షి
భారతదేశమునందు ఉత్తరప్రాంతముగా వున్న భూమిని ఉత్తరప్రదేశ్‌గా పిలుస్తారు. ఇక్కడ వేదవాఙ్మయంలో పుట్టి పెరిగిన హైందవమతం, అహింసను ప్రబోధించిన బౌద్ధమతం యొక్క ప్రధాన వేదికలు, జైనమతం ఉజ్జ్వల శోభతో వెలిగి విస్తరిల్లాయి. రామాయణ, మహాభారత పురాణేతిహాసాల దివ్యపురుషుల నివాసం, ఈ పుణ్యభూమి మీద ఉండుట విశేషం. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నందు ఆగ్నేయం వైపుగా వారణాసి జిల్లా వుంది. జిల్లా ముఖ్య పట్టణము వారణాసి నగరం. ఈ పట్టణానికి అతి పురాతన నామం కాశికాపురి. కాశీ అనే పేరుకు అర్థం కాంతినిచ్చే స్థలం. హైందవులకు ఇది ముక్తి కాశిక. అనగా జ్ఞానజ్యోతినిచ్చే పురము. ఈ పట్టణము బెనారస్‌, వారణాసి అనికూడా పిలుస్తారు. కాశీక్షేత్రం వేదపురాణ కాలాల కంటే ముందే అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించిన విజ్ఞానకేంద్రం. క్షేత్రములో పావన గంగానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. గంగానదికి ఉత్తరంగా వరుణానది, దక్షిణాన అసి నదులు గంగానదిలో సంగమిస్తున్నాయి. ఈ రెండింటికి మధ్యనున్న పట్టణమవడం వల్ల వారణాసిగా ప్రసిద్ధి చెందినది. కాశీక్షేత్రంలోని మట్టి, గాలి, నీరు మొదలగునవి హైందవులకు అతి పవిత్రమైనవి. ఇక్కడ అడుగడుగునా తీర్థమే. జంతుజాలమూ, పక్షులూ కూడా మరణసమయం నందు విశ్వేశ్వరుని వల్ల తారకమంత్రోపదేశం పొంది ముక్తి నొందుతాయి. కాశీక్షేత్రం క్రిమికీటకాలు పొందే ఉత్తమపదవిని, వేరొక స్థలమున యోగులు కూడా పొందలేరు. ఇంతటి పవిత్ర, పుణ్యదాయకమైన కాశికాపురి, ఆది దంపతులకు నివాసస్థలము. ద్వాదవ జ్యోతిర్లింగములలో 9వది అయిన శ్రీవిశ్వనాధలింగము మరియు అష్టాదశ శక్తిపీఠాలలో పదిహేడవది అయిన శ్రీ విశాలాక్షి పీఠమును వారణాసి నందు దర్శించగలము.

శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయము, విశ్వనాథ ఆలయమునకు తూర్పుగా సుమారు 2 ఫర్లాంగుల దూరమున మీర్‌గాట్‌కు దగ్గరలో ధర్మేశ్వర్‌ అనుచోట కలదు. సతీదేవి వామహస్తం పడినచోటుగా ప్రతీతి. ఆలయం నందు విశాలమైన కన్నులు కలిగిన విశాలాక్షి స్వరూపం దర్శించగలరు. ఆమెరూపం స్వయంగా ఏకశిలలో వెలసినది. కాశీనగరంలో నవ గౌరీ మందిరాలున్నాయి. వీటిలో విశాలాక్షి గౌరీ మందిరమునకు ఎంతో ప్రాముఖ్యత కలదు. మిగిలిన వాటిలో మంగళగౌరి, విశాలాక్షి గౌరీ మందిరాలు ముఖ్యమైనవి. విశాలాక్షి మందిరములో జరిగే కుంకుమార్చన సుప్రసిద్ధం. అమ్మ తమ భక్తులకు సమస్త సంపదలనూ ప్రసాదిస్తుంది. భక్తుల కోరికలు నెరవేర్చగల జగన్మాతగా ప్రసిద్ధి. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారు ఆలయం నందు రెండు మూర్తులు దర్శనమిస్తాయి. ముందు భాగములో గల మూర్తిని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు స్థాపించినారు. వెనుకభాగంలో గల మూర్తి స్వయంభూమూర్తిగా ఖ్యాతిపొందినది. ప్రతి నిత్యం ఉదయం మరియు మధ్యాహ్నం నందు అమ్మవారికి అభిషేములు జరుగుతాయి. భాద్రపద శుక్ల పక్ష తదియ అమ్మవారి యొక్క జన్మదినం. నాడు విశేషాలంకరములు, ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి గర్భాలయం బయట చుట్టూ శివలింగాలు, గణపతి మొదలగు మూర్తులను దర్శించవచ్చును. అమ్మవారి ఎడమవైపున గల మందిరంలో అమ్మవారి వాహనములు, నవగ్రహమండపం ఉన్నాయి. అమ్మవారి దర్శనము కొరకు వచ్చు భక్తుల సంఖ్యలో, దక్షిణభారతదేశం నుంచి వచ్చువారి సంఖ్య అధికముగా ఉంటుంది. అమ్మవారి ఆలయమునకు ఎడమవైపుగా మీర్‌ఘాట్‌, కుడివైపున శ్రీ విశ్వనాధాలయంనకు చిన్న, చిన్న ఇరుకైన సందులలో ప్రయాణం.

18. కాశ్మీరేతు సరస్వతి
భారతమాత శిరోభాగాన వెలిగే పచ్చల కిరీటమే కాశ్మీరు భూప్రాంతము. ప్రకృతి అందాలన్నీ మూటగట్టి రాసిపోసిన సుందర దివ్య ఆరామం కాశ్మీర్‌. సుందర దృశ్యముగా కనిపించు మంచు పొగలతో నిండిన హిమాలయ పర్వతాలు, గలగల సాగే సెలయేళ్లు. నయనానందకరమైన సరస్సులు, మధురఫల వృక్షసంపద, పరిమళాలు విరజిల్లు పుష్పజాతులతో ప్రకృతిపరచిన సౌందర్యాల రాశిగా కాశ్మీరులోయ ఖ్యాతి గాంచినది. ప్రఖ్యాత వేసవి పర్వత విశ్రాంతి కేంద్రంగా గణతికెక్కింది.

అనాదికాలంలో కాశ్మీర్‌ పెద్ద జలార్ణవంగా ఉండేది. ఇది జలోద్భవానికి దానవుడు యొక్క నివాసం. జలాశయంలో ఉన్నంతవరకు చావులేకుండా వరం పొందినాడు. అందిన జీవరాశులను భక్షిస్తూండేవాడు. కశ్యప మహాముని దేవతల సాయంతో నాగలి సహాయంతో సరోవర ప్రాంతాన్ని దున్ని, నీటిని ఇంకింపచేశాడు. దానవుని మరణంతో జనవాసం ఏర్పడింది. ఈవిధముగా కాశ్మీర్‌ భూభాగము అవతరించినట్లు పురాణగాథ.

పురాణేతిహాసాల్లో కాశ్మీర్‌ ప్రశస్తి ఉంది. హిందు రాజులనేకమంది కాశ్మీర్‌ భూప్రాంతమును పరిపాలించారు. 3వ శతాబ్దంలో అశోకుని సామ్రాజ్యంలో ఒక భూభాగము ఉండేది. అక్బరు మహాచక్రవర్తి కాశ్మీర్‌ భూభాగాన్ని జయించి మొగలు సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ఆఫ్గనిస్తాన్‌ రాజు అహమ్మద్‌షా అబ్దాలి దండయాత్ర చేసి రాజ్యపాలనకు వచ్చాడు. 1819 సంవత్సరములో పంజాబు మహారాజు రాజారంజిత్‌సింగ్‌ ఆధిపత్యంలోనికి వచ్చింది. రంజిత్‌సింగ్‌ మరణం తరువాత సిక్కులతో యుద్ధంచేసి బ్రిటీష్‌వారు వశపరచుకొన్నారు. కాశ్మీర్‌ భూభాగము కొరకు పాకిస్తాన్‌ సైన్యము భారత సైనికులతో యుద్ధంచేసి, కొంత భూభాగమును వారి ఆధిపత్యంలోనికి తెచ్చుకొన్నారు. ఇప్పటికి సరిహద్దు సమస్య ఇరుదేశాలకు వుంది

కాశ్మీర్‌ రాజ్యపాలన చేసిన మహమ్మదీయులు నిరంకుశులై మత చాంధసత్వంతో హిందూ దేవాలయమును నేలమట్టము చేశారు. సికిందర్‌ (1389-1413) పానలో హిందూ దేవాలయములను కూలగొట్టడం ప్రభుత్వ నిత్యకృత్యాలలో ఒకటైంది. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వ విభాగం ఒకటి ఏర్పరచినారు. పరాస్పోర్‌, అవంతిపూర్‌, తాపార్‌ తదితర ప్రాంతాలలోని ప్రసిద్ధ దేవాలయములను కూల్చినట్లుగా పర్షియన్‌ చారిత్రక పత్రాల్లో స్పష్టంగా పేర్కొనబడింది. ఇస్లాంను స్వీకరించని హిందువులపై జిజియా పన్ను వేశాడు. ఇస్లాం మతం పుచ్చుకోని కాశ్మీర్‌ బ్రాహ్మణుల మెడలోని యజ్ఞోపవీతాన్ని సికిందర్‌ బలవంతముగా త్రెంచి, వాటిని తూకం వేస్తే అవి ఏడు మణుగులు బరువు తూగాయంట! అలీషా పాలనలో (1413) కాశ్మీర్‌లో మిగిలిన పండిత కుటుంబాలు కేవలం పదకొండు మాత్రమే. 1489లో ఫతేషా 24 వేలమంది కాశ్మీర్‌ హిందువుల మెడమీద కత్తిపెట్టి ఇస్లాంలోనికి బలవంతముగా మార్పించారు. తాను కూల్చిన కాళికాలయంలోనికి ప్రవేశించిన నేరానికి, కాశ్మీర్‌ పండితులందరికి ముక్కు, చెవులు కోసేయమని ఆజ్ఞ జారీచేశాడు. మొగలాయి షాదుషాల ఏలుబడిలో మతసహనం పాటించగా కొంత ప్రశాంతత ఏర్పడినది. తిరిగి ఔరంగజేబు కాలములో దేశవ్యాప్తముగా దేవాలయములను కూల్చివేయడానికి సంకల్పము చేశారు. ఇస్లాం మతచాంధసులు కాశ్మీర్‌లో అనేక హిందూ దేవాలయములను నేలమట్టం చేశారు. నేలమట్టమైన ఆలయాలలో శ్రీ సరస్వతీ ఆలయం కూడా ఉండవచ్చును. నేడు కాశ్మీర్‌ శోధిస్తే ఎక్కడా శ్రీ సరస్వతీ పీఠం కనిపించుటలేదు. శ్రీనగర్‌నందలి శ్రీ శంకరాచార్యుల పర్వతము మీద శ్రీ సరస్వతీ ఆలయం ఉండేది అని పరిశోధకులు భావించుచున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో పద్దెనిమిదవదిగా పరిగణించబడుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో చివరిది.
సతీదేవి కుడి చెంపభాగం కాశ్మీర్‌ ప్రాంతములో పడినట్లుగా పురాణాలు చాటుతున్నాయి. సరస్వతీపీఠం అనుపేరుతో ఎక్కడా దర్శించలేక పోవుచున్నాము. కాశ్మీర్‌ ప్రాంతములో అనేక శక్తిపీఠాలు కలవు. వాటిని ప్రతివారు సరస్వతీపీఠంగా చాటుతారు. వీటిలో ముఖ్యమైన స్థానం శారికాదేవి మందిరము. ఇది హరిపర్వతంపై వుంది. అమ్మ అద్భుతమైన మౌనశిల రూపములో దర్శనమిస్తుంది. ఇదే సరస్వతి పీఠంగా స్థానికులు కొలుస్తారు. మహాయోగులు, మహాత్ములు, పుణ్యపురుషులు హరిపర్వతం చేరి, అమ్మ సన్నిధిలో మౌనవ్రతం పాటించి, సిద్ధులు పొందుచున్నారు. ప్రతి శనివారం అద్భుత మౌనశిల నుంచి మౌనచక్రం బయటకు వచ్చి, సిద్ధులకు దర్శనమిస్తుంది. ఇది సృష్టిలో అద్భుతమైన చర్యగా భావించవచ్చును. మరో విషయము మౌనశిలలో ఒక మూలన గల గుంటలో నీరు ఉద్భవించుతుంది. దాని నుంచి ఎంతనీరు మనము తీసుకుంటే, అంత నీరు మళ్ళీ ఉద్భవించ గలదు. భక్తులు ఈ నీరును పవిత్రమైన గంగా జలంగా భావించి సేవించుతారు. యాత్రికులు మౌనంగా, దీక్షగా అమ్మను ప్రార్ధన చేస్తే వారి కోరికలు తప్పక తీరగలవు అని గట్టి నమ్మకం. ఆషాడమాసంలోని శుక్లనవమితో కూడిన శనివారం నాటి మౌనచక్రం యొక్క దర్శనం చాలా పుణ్యదాయకం. భక్తుల కోరికలు తీర్చగల మహిమతో నిండి ఉంటుంది. శ్రీనగర్‌ జనరల్‌ బస్‌స్టాండుకు ఈశాన్యంగా హరి పర్వత్‌ పోర్టు ఉంది. బస్‌స్టాండ్‌కు సుమారు 10 కి.మీ. దూరంలో గల హరిపర్వతం (హరిపర్బత్‌ కోట) చేరుటకు బస్‌ సర్వీసులున్నాయి. కొండ క్రింద నుంచి మెట్లు మార్గం.

శ్రీ శాంకరీదేవి ధ్యానం : ట్రింకోమలి (శ్రీలంక)
శ్రీ సతీ శాంకరీదేవీ త్రికోమలి పురస్థితా
ఉత్తమాంగ ప్రభాగౌరీ భక్తకామ ఫలప్రదా
 శ్రీ కామాక్షి దేవి ధ్యానం – కంచి (తమిళనాడు)
కాంచీపురశ్రితే దేవి కామాక్షి సర్వమంగళా
చింతాతన్మాత్ర సంతుష్టా చింతితార్థఫలప్రదా

శ్రీ శృంఖలాదేవి ధ్యానం – ప్రద్యుమ్నం (పశ్చిమబెంగాల్‌)
ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖలా నామ భూషితే
విశ్వవిమోహితే దేవీ శృంఖలా బంధనాశనీ

శ్రీ చాముండేశ్వరీ దేవి ధ్యానం – మైసూరు (కర్ణాటక)
క్రౌంచపుర స్థితామాతా చాముండా దుష్టనాశనీ
సర్వసిద్ధిప్రదాదేవీ భక్తపాలన దీక్షితా

శ్రీ జోగులాంబా దేవి ధ్యానం – అలంపురం (ఆంధ్రప్రదేశ్‌)
జోగులాంబా మహాదేవీ రౌద్రవీక్షణ లోచనా
అలంపురీ స్థితా మాతా సర్వార్ధ ఫల సిద్ధిదా

శ్రీ భ్రమారాంబా దేవి ధ్యానం – శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్‌)
శివ పార్శ్వ స్థితా మాతా శ్రీశైలే శుభపీఠకే
భ్రమరాంబా మహాదేవీ కరుణారస వీక్షణా

శ్రీ మహాలక్ష్మీ దేవి ధ్యానం – కొల్హాపూర్‌ (మహారాష్ట్ర)
మహాలక్ష్మ్యభిదా దేవీ కరవీర పురస్థితా
పురుషార్ధ ప్రదామాతా సంపూర్ణామృత వర్షిణీ

శ్రీ ఏకవీరా దేవి ధ్యానం – నాందేడ్‌ (మహారాష్ట్ర)
ఏకవీరా మహాశక్తి మహుగ్రామ గుహాస్థితా
భవాని వీర విఖ్యాతా ధర్మ రక్షణ తత్పరా

శ్రీ మహాకాళీ దేవి ధ్యానం – ఉజ్జయిని (మధ్యప్రదేశ్‌)
ఉజ్జయిన్యాం మహాకాళే మహాకాళేశ్వరేశ్వరీ
క్షిప్రా తీరస్థితామాతా వాంఛితార్థ ప్రదాయినీ
శ్రీ పురుహూతికా దేవి ధ్యానం – పిఠాపురం (ఆంధ్రప్రదేశ్‌)
పురుహూతీ సతీమాతా పీఠికాపుర సంస్థితా
పుత్రవత్పాలితా దేవి భక్తనుగ్రహదాయినీ
 శ్రీ గిరిజా దేవి ధ్యానం – కటక్‌ (ఒరిస్సా)
ఓధ్రదేశే భువనేశీ గిరిజానామ సంస్థితా
పాలికాఖిల లోకానాం వల్లవారుణ పాణినా

శ్రీ మాణిక్యాంబ దేవి ధ్యానం – ద్రాక్షారామం (ఆంధ్రప్రదేశ్‌)
ద్రాక్షావటీ స్థితాశక్తిః విఖ్యాతా మణికాంబికా
వరదా శుభదాదేవీ భక్త మోక్ష ప్రదాయినీ

శ్రీ కామరూపిణీ దేవి ధ్యానం – గౌహతి (అస్సాం)
కామరూపిణీ విఖ్యాత హరిక్షేత్రే సనాతనీ
యోని ముద్రాత్రిఖండేశీ మాసే మాసే నిదర్శితా

శ్రీ మాధవేశ్వరీ దేవి ధ్యానం – ప్రయాగ (ఉత్తరప్రదేశ్‌)
మాధవేశ్వరీ మాంగళ్యా ప్రయాగ స్థల వాసినీ
త్రివేణీ సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయినీ

శ్రీ వైష్ణవీ దేవి ధ్యానం – జ్వాలాకేతం (హిమాచల్‌ప్రదేశ్‌)
తుహినాద్రి స్థితామాతా జ్వాలాముఖీతి విశ్రుతా
జ్వాలా మాలా ప్రభాదేవీ జ్ఞాన వైరాగ్య వర్ధినీ

శ్రీ మాంగల్య గౌరీదేవి ధ్యానం – గయ (బీహార్‌)
సర్వ మంగళ మాంగల్యా గయా మాంగల్య గౌరీ
అర్ధదా మోక్షదాదేవీ అక్షయ్య ఫలదాయినీ

శ్రీ విశాలాక్షి దేవి ధ్యానం – వారణాశి (ఉత్తరప్రదేశ్‌)
విశాలాక్షీతి విఖ్యాత వారణాస్యాం శివాంతికే
నిరతాన్న ప్రదాతీచ నిర్భాగ్య జనతోషిణీ

శ్రీ సరస్వతీ దేవి ధ్యానం – (జమ్మూ, కాశ్మీర్‌)
జ్ఞాన ప్రదా సతీమాత కాశ్మీరేతు సరస్వతీ
మహావిద్యా మహామాయా భుక్తిముక్తి ప్రదాయినీ

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...