Showing posts with label Uttar Pradesh. Show all posts
Showing posts with label Uttar Pradesh. Show all posts

Sunday, 7 May 2017

సీతామడి









సీతామడి
(ఇప్పుడు బీహార్‌లో ఉంది)



రామాయణం ప్రకారం ఈ ప్రాంతం జనకుడి పాలనలో ఉండేది. పునౌరా (ఇప్పుడు పునరాధాం)లో జనకుడి నేలను దున్నుతుంటే తనకు సీత దొరికింది. దేవుడిచ్చిన బిడ్డగా తీసుకెళ్లి పెంచుకుంటాడు. జనకుడి నివాసంగా పేర్కొనే జనక్‌పూర్ ఇప్పుడు నేపాల్‌లో ఉంటుంది. అది ఈ సీతామడికి దాదాపు 60 కిలోమీటర్ల దూరం. ఈ సీతామడి జిల్లా సరిహద్దులు కూడా నేపాల్‌తో కలిసే ఉంటాయి. సీత దొరికిన స్థలంలో చాలామంది భక్తులు పూజలు చేస్తుంటారు.

ఉత్తరప్రదేశ్‌లోనూ వారణాసి, అలహాబాద్ మధ్యలోనూ ఓ సీతామడి ఉంది. అయితే అది కొత్తగా వెలిసిన ప్రాంతంలా కనిపిస్తుంది. దాన్ని సీత స్వచ్ఛందంగా భూమాత ఒడిలోకి వెళ్లిపోయిన స్థలంగా భక్తుల నమ్మకం. ఇదీ కథ.



సీతామడి
లవకుశుల జననం తరువాత సీతామహాసాధ్వి పిల్లలను శ్రీరామునకు అప్పగించి తాను తన తల్లి అయిన భూమాతను చేరుతుంది. ఆ క్రమములో సీతాదేవి భూమాతను ప్రార్ధించి భూప్రవేశము చేసిన స్థలమే ఈ సీతామడి. అలహబాద్ - వారణాసి రహదారిలో అలహాబాద్ నుండి సుమారు 50 కిలోమీటర్లు వచ్చిన తర్వాత, రహదారి నుండి 12 కిలోమీటర్లు లోపలికి వెళ్తే సీతామడి వస్తుంది. వారణాసి నుండి ప్రయాగ వెళ్ళే దారిలో 20 కిలోమీటర్లు లోపలికి ఈ ప్రదేశము కలదు. ఆ ప్రాంతములో వాల్మీకి ఆశ్రమము ఉండేదిగా చెబుతారు. అక్కడ 108 అడుగుల హనుమంతుని విగ్రహము, దాని కింద పవనపుత్రుని ఆలయము సీతాదేవి ఆలయమునకు రక్షణగానా అన్నట్లు ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆలయం సొరంగమార్గాలతో వైవిధ్యంగా ఉంటుంది. దాని ఎదురుగా సీతాదేవి ఆలయం ఒక నదిపాయ మధ్యలో ఎంతో సుందరముగా ఉంటుంది. అక్కడగల సీతాదేవి విగ్రహము చూస్తూ ఉంటే భక్తిభావముతో చూపు మరల్చుకోలేము. ఇక్కడ ఏర్పాటు చేసిన సీతాదేవి విగ్రహం అత్యంత సహజసిద్ధంగా ఉండి, చూపరులను కట్టి పడేస్తుంది. సీతమ్మ అవతార పరిసమాప్తి కావించిన ఈ స్థానంలో గుండె బరువెక్కిపోతుంది.



Saturday, 26 March 2016

Accommodation in Varanasi









Mutts & Ashrams In Varanasi






వారణాసిలో యాత్రికుల కోసం రూమ్స్ చాలానే ఉన్నాయ్ . కాస్త అటు ఇటు లో దేవాలయానికి దగ్గర్లోనే ఉన్నాయి. వారణాసి లో దేవాలయం చుట్టూ సుమారు 2-3 కిలో మీటర్లు దూరం వరకు వీధులాన్ని చాల ఇరుకుగా ఉంటాయి. కొత్తగా వెళ్ళేవాళ్ళకి అడ్రస్ కనుక్కోవడం ఇబ్బంది కరంగానే ఉంటుంది. ఎక్కువమంది వెళ్తే కనుక అందరు వస్తున్నారో లేదు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి . ఇక తెలుగు వాళ్ళకోసం ప్రత్యేకంగా ఆశ్రమాలు / సత్రాలు ఉన్నాయి . మీరు కనుక రైల్వేస్టేషన్ నుంచి మన తెలుగు వాళ్ళు ఉన్న ప్లేస్ కి వచ్చేసరంటే సగం కాశి ప్రయాణం ఏ ఇబ్బంది లేకుండా జరిగినట్టే . ఆలయ విశేషాలు , చుట్టూ ప్రక్కల చూడవలసిన క్షేత్రాలు తరువాత చెబుతాను . పైన హెడ్డింగ్ రూమ్స్ కోసం అని పెట్టానుగా.

అక్కడ మన భాష కాని వారికంటే తెలుగు వచ్చిన వారితోనే మనం జాగ్రత్తగా ఉండాలి . ఎందుకంటున్నాను అంటే మీకు ఈ పాటికే తెలుసు ఉంటుంది . కాశి లో ఆంధ్ర ఆశ్రమం ఒకటుంది అని . అదే పేరుతో కొత్తగా తెలుగు తెలిసిన మేధావులు Ganga Yogi Lodge అనే దాన్ని శ్రీ రామ ఆంధ్ర ఆశ్రమం గా పేరు మర్చి ఆటో వాళ్లతో బేరాలు కుదుర్చుకుని ఆంధ్ర ఆశ్రమం అంటే ఇదే ఆంధ్ర ఆశ్రమం అని విరి దగ్గరకు తీస్కుని వచ్చేలా చేస్కోన్నారు. కొత్తగా వెళ్లినవారికి ఎలా తెలుస్తుంది . ఆంధ్ర ఆశ్రమం పేరు శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం . వీరు తెలివిగా తారక తీసి వేసి బోర్డు పెట్టారు.



రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో ముందుగా రూమ్ బుక్ చేస్కోవడానికి లేదు. మీరు వెళ్లి అడిగితే ఉంటే ఇస్తారు. 80% రూమ్ దొరుకుతుంది. రూమ్ రెంట్ 100, 300, 350 వసూలు చేస్తున్నారు. రూమ్స్ బాగున్నాయి . a/c రూమ్స్ కూడా ఉన్నాయి రెంట్ తెలియదు. మధ్యాహ్న భోజనం రాత్రి టిఫిన్ పెడతారు. వాటికి ఛార్జ్ ఏమి ఉండదు. కాకపోతే ముందుగా రాయించుకోవాలి.



ఆంధ్ర ఆశ్రమం పక్కనే సైకిల్ బాబా ఆశ్రమం ఉంది. తెలుగు వాళ్ళదే ఆశ్రమం. 400/- ఛార్జ్ చేస్తున్నారు నలుగురు ఉండవచ్చు. ఇక్కడ కూడా భోజనం, టిఫిన్ పెడతారు.



Sri Rama Taraka Andhra Ashram
B 14/92, Varanasi H O,
Varanasi - 221002,
Manasorovar
+(91)-542-2450418
----
Sri Sringeri Shnkar Math,
B-14/111 Kedargrghat,
Varanasi, Uttar Pradesh
PIN Code - 221 001
Telephone No 0542- 2452768

Branch in charge : Ramakrishna Prasad
--
Sri Kanchi Kamakoti Peetam Sri Sankara Mutt
Varanasi Branch
B 4/7, Hanuman Ghat,
Varanasi - 221001
--
Kumara Swamy Mutt
Near Kedar Ghat
Tel No. 0542 2454064


Click Here For :
Accommodation in Varanasi
Varanasi Yatra Video 
Varanasi Local Temples
Varanasi Surrounding Temples




బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...