Saturday, 14 June 2014

అహోబిలం










అహోబిలం
నవ నారసింహ క్షేత్రాలు




హిరణ్యకశిపుడిని సంహరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి.

జ్వాల నరసింహ స్వామి
అహోబిల నరసింహ స్వామి
మాలోల నరసింహ స్వామి
వరాహ నరసింహస్వామి (క్రోడా)
కారంజ నరసింహస్వామి
భార్గవ నరసింహస్వామి
యోగానంద నరసింహస్వామి
చత్రవట నారసింహస్వామి
పావన నరసింహ స్వామి

జ్వాలా నరసింహ క్షేత్రము
నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది. పూర్వం యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసిమ్హమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసింహుడు, యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట. స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.

వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు, కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.

అహోబిల నరసింహ స్వామి
నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని స్థల పురాణం చెబుతుంది. హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు.

ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. ఈ అహోబిలానికి దేవతలు స్తుచించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు. ఈ నరసింహా స్వామిని పూజించిన వారికి గురుగ్రహా దోషాలు నివారణ అవుతాయి.

మాలోల నరసింహ స్వామి
వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మిలోల యనగ "ప్రియుడు" అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక. ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.

వరాహ నరసింహస్వామి (క్రోడా)
వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి.

కారంజ నరసింహస్వామి
కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు. పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.

గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.

భార్గవ నరసింహస్వామి
పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరంలో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును.

యోగానంద నరసింహస్వామి
యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును.

చత్రవట నారసింహస్వామి
పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును.

పావన నరసింహ స్వామి
పరమపావన ప్రదేశంలో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.



అహోబిలం - నవ నారసింహక్షేత్రం


అహోబిలం - నవ నారసింహక్షేత్రం

ఆంధ్రదేశంలోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ ల దూరంలోను, నంద్యాల నుండి 65కి.మీ, దూరంలోను నల్లమల అడవుల్లో ప్రకృతి రామణీయకత మధ్య వెలసిన నరసింహుని దివ్య ధామమిది.

స్థలపురాణం :
“ఇందుగల డందు లేడని సందేహము వలదని,హితవు పలికి – చక్రి సర్వోప గతుండని ప్రకటించిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానకి, స్ధంభం నుండి ఆవిర్భవించి హిరణ్య కశిపుని మట్టుపెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది.

ఇచ్చట హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చిసంహరించిన సమయంలో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు ---- अहोवीर्यं अहोशौर्यं अहोबाहुपराक्रमं नारसिंहं परं दैवम् अहोबिलं अहोबलं!  అని కీర్తించారట.

అప్పటి నుంచి ఈక్షేత్రం అహోబలం అని పిలువబడుతోందని స్ధల పురాణం. ఎగువ అహోబిలంలోని గుహలో స్వయంభువుగా వెలసిన ఉగ్ర నరసింహుని ఆరాధించి సాక్షాత్కరింపజేసుకొని దివ్యానుభూతికి లోనైన గరుడుడు స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో!బిలం అన్నాడట. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని ఒక ఐతిహ్యం.

హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం ఇంకా చల్లారని ప్రతాపంతో నరసింహుడు అరణ్యంలోగర్జిస్తూ, క్ష్వేళిస్తూ, పలు ప్రదేశాల్లో సంచరించాడని, అలా సంచరిస్తున్నప్పుడు ఆయనలో విరిసిన వివిధ భావాలకు రూపాలే నవనారసింహ రూపాలని భావించబడుతోంది.

వీర రసావతార రూపుడైన తన నాధుని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మిగా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకోవడానికి చాల శ్రమించవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ చెంచెతను స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చి, అలరించారని, ఆరూపాలే నవ నారసింహులు గా వెలసి స్వామి ఇప్పుడు భక్తులను అను గ్రహిస్తున్నాడని భక్తులు సంతోష పారవశ్యంతో చెంచులక్ష్మీ నరసింహుల కథలను చెప్పుకుంటుంటారు. జానపద గీతాలు పాడుకుంటుంటారు. ఇచ్చటి గిరిజనులు చెంచెతను మహాలక్ష్మిగా పూజిస్తూ, లక్ష్మీనరసింహ కళ్యాణాన్ని చాల గొప్పగా జరిపిస్తారు.

నరసింహుడు హిరణ్యకశిపుని సంహరణానంతరంఅరణ్యం లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించడానకే స్వామి నవరూపాల్లోదర్శనమిచ్చాడు. మరొక కథ ను అనుసరించి గరుత్మంతుడు విష్ణువు నునరసింహ రూపుని గాదర్శన మీయ వేడుకున్నాడు.ఆనాడుగరుడునికి స్వామిసాక్షాత్కరించిన తొమ్మిది రూపాలే నవ నారసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి అని,గరుడాచలం అని, గరుడశైలం అని కూడ పిలుస్తారట.

“ ज्वालाङोबिल मालोल क्रोड करंज भार्गव योगानंद छत्रवट पावन नवमूर्तय: !!

జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ,కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావననార సింహఅనుతొమ్మిది రూపాలు గా స్వామి అహోబిలం మీదకొలువు తీరి ఉన్నాడు. ఎగువ అహోబిలం లో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా. దిగువ అహోబిలం లోలక్ష్మీనరసింహుడు శాంత మూర్తి యైభక్తులను అనుగ్రహిస్తున్నారు. చుట్టూ 5 కి.మీ పరిధి లో మిగిలిన ఆలయాలను కూడ మనం దర్శించవచ్చు.

నవరూపులుగా వెలసిన ఈ దివ్య మూర్తులను దర్శించడం వలన వాని ఫలితాలు కూడవేరు వేరుగా ఉంటాయని స్థలపురాణం చెపుతోంది. అంటే భక్తులు ఏ ఫలితాన్నికోరుకుంటున్నారో ఆ స్వామి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాథించుకొని, సఫలీకృత మనోరధులు కావచ్చునన్నమాట. ఇది నారసింహ తత్త్వము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కూర్మ పురాణం, పద్మపురాణం, విష్ణుపురాణా లలో ఫ్రస్తావించబడింది. హిరణ్యకశిపుని వృత్తాంతం బ్రహ్మండ పురాణం లో కన్పిస్తుంది.

ఆలయాల ప్రత్యేకత:

శ్రీ భార్గవనరసింహ స్వామిదిగువ అహోబిలానికి 2.5 కి మీ దూరంలో కొండపై ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడే ”అక్షయ తీర్థం” ఉంది. ఈ అక్షయ తీర్థం లో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని ఛెప్పబడుతోంది. .పరశు రాముడు ఈ ప్రదేశం లోనే తపస్సు చేశాడు.అందువలన ఈ అక్షయ తీర్థాన్నే”భార్గవ తీర్థమని”కూడ పిలుస్తారు.

శ్రీ యోగానంద నరసింహ స్వామివీరు దిగువ అహోబిలానికితూర్పు దక్షిణం గా 2 కి.మీ దూరం లో వేంచేసియున్నారు.స్వామిప్రహ్లాదునకు ఇక్కడ ఎన్నోయోగ శాస్త్ర మెళకువ లనునేర్పారని. అందువలన స్వామి కి ఆపేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం తపస్సునకు అత్యంత అనువైన ప్రదేశంగా పేరెన్నిక కన్నది.కష్టాల్లో ఉన్న భక్తులు ఈ స్వామి ని సేవిస్తేస్వామి కష్టాలను కడతేర్చి, సౌ భాగ్యాన్ని కల్గిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు.

శ్రీ ఛత్రవట నరసింహస్వామిఈ స్వామి దిగువ అహోబిలానికి 3కి.మీ దూరం లోవట వృక్షచ్ఛాయ లో కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తా యని చెపుతారు. లలితకళలనుఅభ్యసించేవారు ఈ స్వామిని సేవిస్తే సత్ఫలితాలను పొంద గలుగుతారు .

శ్రీ అహోబిల నరసింహస్వామినవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహమని కూడ పిలుస్తారు. ఎగువ అహోబిలం లో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలుమతిమాంద్యాలు, ఈ స్వామిని సేవించడం వలన పటాపంచలౌతాయి.

శ్రీ వరాహ నరసింహస్వామిఎగువ అహోబిలానికి 1 కి .మీ పైన లక్ష్మీ దేవి తో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలు తొలగి,కార్య సాఫల్యత కల్గుతుంది. ఈయన నేక్రోడ నరసింహ స్వామిఅని కూడ పిలుస్తారు.

శ్రీ మాలోల నరసింహస్వామి:ఈస్వామి ఎగువ అహోబిలానికి 2.కి మీ ఎగువున ఉన్నాడు.ఈఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీపర్వతం గా పిలుస్తారు. మా- అనగా లక్ష్మిమా –లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము. ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను సేవిస్తే ఇహ,పరలోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది.

శ్రీ జ్వాలా నరసింహస్వామిఈ స్వామి ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరంలో దర్శన మిస్తాడు. ఈ పర్వతాన్ని“అచలాచయ మేరు” అని కూడ పిలుస్తారు. హిరణ్యకశిపుని తనవాడియైన గోళ్లతో చీల్చి చెండాడిన నరసింహస్వామి ఇక్కడ కన్పిస్తాడు. ఈస్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమౌతాయి. పెళ్లిళ్లు కుదురుతాయి. కార్తీకమాసంలో నేతి దీపాన్ని స్వామి సన్నిథిలో వెలిగించి ఆరాథిస్తే, సమస్త పాపాలు తొలగి, కీర్తిప్రతిష్టలు లబిస్తాయి. మిగిలిన ఎనిమిది ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరు కోవడమే మిక్కిలి శ్రమతో కూడిన పని. ఇక్కడ “రక్తకుండం“ అనే అరుణ వర్ణ పుష్కరిణి ఉంది. ఇందులో నీరు ఎల్లప్పుడూ ఎఱ్ఱగానే ఉంటాయి. కారణం నరసింహస్వామి హిరణ్య కశిపుని సంహరించిన తరువాత రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణిలోనే కడుక్కున్నాడట. అందువల్ల ఆ నీరు ఎఱ్ఱగా ఉండిపోయింది.

శ్రీ పావన నరసింహస్వామిఎగువ అహోబిలానికి 6 కిమీ దూరం లో పావన నదీ తీరాన ఈ స్వామి కొలువు తీరిఉన్నాడు. నవ ఆలయాల్లోఈ ప్రదేశం అత్యంత ప్రశాంతమైంది. అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నమని పిలుస్తారు. ఈయనకే పాములేటి నరసింహస్వామి అని కూడ పేరు. ఈయనను సేవిస్తే ఈ జన్మలోను, పూర్వజన్మల్లోను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీతొలగి పోతాయని చెపుతారు. ఈస్వామి భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితంగా సగం స్వీకరించి మిగతా సగం ప్రసాదంగా ఇచ్చివేస్తాడని ప్రతీతి.

శ్రీకరంజ నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 1 కిమీ దూరంలో ఈ స్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం క్రింద కొలువు తీరిన స్వామి కాబట్టి ఈయన కరంజ నరసింహస్వామి అయ్యారు. ఈ స్వామిని మనసా వాచా కర్మణా త్రికరణ శుధ్ధి గా సేవిస్తే జీవితంలో అభివృధ్ధిని సాధిస్తారని, కోరిన కోరికలన్నీ తీరుతాయనిచెపుతారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి;;--ఈ తొమ్మిది రూపాలు కాక దిగువ అహోబిలం లో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు . ఇది మూడు ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. శ్రీరాజ్యలక్ష్మీ దేవి, శ్రీఆండాళ్. ఆళ్వారుల సన్నిథికూడ ఉపాలయాలుగా మనకు దర్శనమిస్తాయి. నవ గ్రహాలకు ఈ నవ నారసింహ రూపాలకుగల సంబంధాన్ని కూడ భక్తులువిశ్లేషించుకుంటున్నారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామిదిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప సంప్రదాయంతో అలరారుతుంటుంది. ముఖ మండపం, రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతుల తోనయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ స్థంభాల మీద చెంచులక్ష్మీ నరసింహుల విలాసాలు మనకు కన్పిస్తాయి. పట్టాభి రాముడు, దశావతారాలు, వివిథ దేవతాకృతులు, నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువు తీరికనువిందు చేస్తాయి. ఈ శిల్పాకృతులను చూస్తుంటే అహోబిలం! అనడమేకాదు అహోశిల్పం! అనాలనిపిస్తుంది. ఆలయానికి బైటకూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి. ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నంగా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వంగా దర్శించవచ్చు. కాకతి శ్రీ ప్రతాపరుద్ర చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహునకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది. కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు ఈ ఆలయంలో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధిలోఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవితో తన కళ్యాణానికి ముందులక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలంలో స్వామి ఉగ్రరూపుడై ఉండటంతో దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తిగా ఆయనే ప్రతిష్టించినట్లు చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణంగా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.

ఉగ్ర స్థంభం:
ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరంలో ఈ ఉగ్రస్థంభం ఉంది. దీని నుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీని దర్శనం, స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ ఉగ్రస్థంభమే ప్రజల వాడుకలో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు.

उग्रं वीरं महाविष्णुं ज्वलंतं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रंमृत्युर्मृत्युं नमाम्यहम्.!!
అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు.
ఉగ్ర స్థంభం


ప్రహ్లాదమెట్టు: 
ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికిమధ్య లోని ఒక గుహలో ప్రహ్లాదుని రూపందర్శన మిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొనియాడబడుతున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.

అహోబిల మఠం:

ఆథ్యాత్మిక వికాసం కోసం, వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్ర శాస్త్ర సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒక మఠం స్థాపించబడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు. అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను, దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు ఆ బాలుని శిష్యునిగా స్వీకరించాడు.

చెంచులక్ష్మీ నరసింహుల స్థంభ శిల్పం


ఈ బాలునికి సాక్షాత్తు స్వామియే యోగిరూపంలో వచ్చి, అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యునిగా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు శఠగోపయతిగా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యంలో వివిధ సేవా, అభివృద్ధి మత ప్రచార, సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తంగా ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.

ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచుగా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలోవారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చట గా ఉంటుంది.

శ్రీ పెనుశిల లక్ష్మీనృసింహస్వామి


శ్రీ నవ నారసింహ పుణ్యక్షేత్రములలో శ్రీ పెనుశిల లక్ష్మీనృసింహస్వామి క్షేత్రము మిక్కిలి ప్రసిద్దమయినది. ఈ క్షేత్రము నెల్లూరు జిల్లా, రాపూరు మండలము, గోనుపల్లి గ్రామమునకు 7 కీమీ దూరమున, నెల్లూరు పట్టణమునకు పశ్చిమభాగమున 80 కీమీ దూరంలో ఉంది . ఇక్కడ లక్ష్మి నారసింహ ఒకరిగా పిలవబడుతున్నారు . శ్రీ స్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై నిరాకార రూపమున స్వయంభువుగా వెలిసి ఉన్నారు. అల్లంత దూరాన ఆదిలక్ష్మి అమ్మవారునూ స్వయంభువుగా వెలిసి ఈ దేవ దేవేరుల భక్తాభిష్టఫలప్రదులై బ్రోచవారలను కరుణించి వారి కోరికలు నెరవేర్చుచున్నారు.

దశవతారాలలో మేటియై, కౄతయుగంలో అవతరించిన నాల్గవ అవతారం నృసింహ అవతారం. ఈ అవతారంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణలు అనగా దుష్ట రాక్షసుడయిన హిరణ్యకశిపుని వధ, భక్తప్రహ్లద రక్షణ చేసి తనచే సృజించబడు ముక్త జీవులను తరింపజేయుటకు ఇలపై నవ నారసింహులుగా స్థిరమయినారు. ఇట్టి క్షేత్రాలలో ఈ ఛత్రవటి నారసింహ క్షేత్రం అత్యంత మహిమాన్వితమయింది. నృసింహ అవతారంలో హిరణ్యకశిపుని వధ అనంతరం ఉగ్రరూపుడైన నారసింహుడు 'సర్వం విష్ణుమయం జగత్' అను రీతిగా ఈ జగత్తునంతటా సర్వవ్యాప్తియే భక్తుల అభీష్టం మేరకు అచ్చటచ్చట అవతరించినారు. కృతయుగంలో, వైషాఖమాసంలో, స్వాతినక్షత్రంలో సాయంసంధ్య సమయంలో స్వామివారు ఆవిర్భవించారు.

ఈ క్షేత్రము చెంచురాజులకు నిలయమైనందున ఉగ్రరూపుడయిన నారసింహుడు సుందరాంగి అయిన చెంచువనిత చెలిమితో శాంతించి చెంచు రాజులకు కప్పము చెల్లించి, చెంచుపట్టిని చేపట్టి వివాహం చేసుకుని, ఆ సుందర వనితను పెనవేసుకుని నిరాకార శిలరూపమున ఇక్కడ స్థిరమయినట్లు చరిత్ర వలన తెలుస్తోంది.

శిలరూపంలో కుడి భాగమంతా నారసింహస్వామిగానూ, ఎడమ భాగమంతా చెంచులక్ష్మి అమ్మవారిగానూ, వక్షస్థలంలో బిలరూపంలొ ఉన్న రంధ్రం వైకుంఠానికి మార్గంగాను, ఆ మార్గం గుండా రాత్రాది కాలలందు దేవతలు వచ్చి స్వామివార్లను అర్చిస్తారని భక్తుల ప్రగాడ విశ్వాసం. స్వామివారు ఉగ్రరూపం దాల్చి కిందకు వచ్చినందుకు గుర్తుగా చంద్రాయుధం గీచినటువంటి గీం ఇప్పటికీ కనిపిస్తుంటుంది.

ఈ క్షేత్రం తూర్పు కనుమల మధ్య పర్వత పాదమున, సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ స్వయమవాతారమూర్తి వెనుక భాగంలో మహాశిలగిరి (గొప్ప పర్వతరాజం) ఉంది. ఇది పన్నగాకృతిగా నెల్లూరూ, కడప జిల్లాల మధ్యభాగంలొ, హిమగిరి తూర్పూ పశ్చిమ సముద్రాలకు కొలబద్దమానముగ ఉన్నట్లు, ఉత్తర దక్షిణముగా, శ్రీశైల వరాహ (వేంకటాచల) క్షేత్రమునకు కొలబద్ద వలె కనిపిస్తుంది. ఈ సర్పాకృతి గల పర్వతముల యొక్క శిరోభాగంలో వరాహ క్షేత్రమున వేంకటేశ్వరుడు వెలిశాడు. కటి భాగమున ఈ క్షేత్రమున (శ్రీ పెనుశిల క్షేత్రం) చత్రవటి నారసింహుడు వెలసి, స్థితికారకుడై తనను ఆరాధించు భక్తులకు వరాలను ఇస్తూ, లయచక్రవర్తి అయిన పార్వాతీశుడు శ్రీశైల క్షేత్రమున వాల (అంత్య) భగమున వెలిసి ఆర్తులను ఆరాధింపచెయుచున్నడు.

మంగళగిరి - త్రి నారసింహ క్షేత్రం

మంగళగిరి త్రి నారసింహ క్షేత్రం


మంగళగిరి:
నవ నారసింహ క్షేత్రాలలో మంగళాద్రి క్షేత్రం ప్రముఖమైంది. అత్యంత ప్రాచీనమైంది. దీనిని త్రి నారసింహ క్షేత్రంగా కూడా చెబుతుంటారు. ఇక్కడి కొండపై స్వయంభువుగా వెలిసిన స్వామిని యుగయుగాల దేవుడిగా పరిగణిస్తున్నారు. మంగళగిరి పట్టణానికి ఈశాన్యంగా హ్రస్వశృంగి పర్వతం పేరుతో ఉన్న కొండకు దక్షిణ నైరుతికి మధ్యస్తంగా శ్రీ పానకాల నృసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. కొండకు దిగువన ధర్మరాజు ప్రతిష్టితమైన శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం, కొండకు పూర్తి పైభాగంలో జ్వాలా నృసింహస్వామి పేరుతో శిఖరం లేని గూడు మాదిరి ఆలయం ఉన్నాయి. దీంతో మంగళగిరిని త్రి నారసింహ క్షేత్రంగా వ్యవహరిస్తారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం తరువాత రెండో అతిపెద్ద ఆలయం మంగళాద్రి క్షేత్రమే. రాజధానికి అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద వైష్ణవ క్షేత్రం ఇదే. ప్రస్తుతం జిల్లాలో పెదకాకాని శివాలయం తరువాత ఎక్కువ ఆదాయం కలిగిన క్షేత్రం మంగళాద్రే. ఈ ఏడాది ఆదాయం రూ.మూడున్నర కోట్లను మించిపోయింది. మరో రెండేళ్లలో జిల్లాలో మిగతా అన్ని ఆలయాలకన్నా మంగళగిరి నృసింహుని ఆదాయమే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

పానకం ఒలికినా..
భక్తులు భగవంతునికి నివేదించే ద్రవ్యాన్ని స్వయంగా ఆరగించే లీలా విన్యాసం భువి పై ఒక్క మంగళగిరి క్షేత్రంలోనే చూడగలుగుతాము. పానకాల నృసింహస్వామికి భక్తులు మొక్కుబడి ప్రకారం నివేదించే పానకం ఎన్ని బిందెలయినప్పటికీ అందులో సగ భాగాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తారు. మిగతా భాగాన్ని తన ప్రసాదంగా కక్కివేస్తారు. ఇదే ఈ క్షేత్ర విశిష్టత. స్వామికి నివేదించే పానకాన్ని ఆలయ సన్నిధిలోనే ప్రత్యేక మండపంలో రోజూ డ్రమ్ముల కొద్దీ విరివిగా తయారు చేస్తారు. ఇక్కడ ఎంత పానకం ఒలికిపోయినా ఈగ వాలదు, చీమ కనిపించదు. ఇక్కడ ఆలయ దర్శనం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే. ఆ తరువాత ఆలయ ద్వారం బంధనం చేస్తారు. అప్పటి నుంచి తిరిగి తలుపులు తెరిచేంత వరకు దేవతలు స్వామివారిని అర్చిస్తుంటారని ప్రతీతి.

స్థల పురాణం ఇదీ..
మంగళాద్రి క్షేత్రాన్ని గురించి బ్రహ్మ వైవర్త పురాణంలో వివరించారు. కృతయుగంలో నమూచి అనే రాక్షసుణ్ని సంహరించేందుకు మహావిష్ణువు సుదర్శన చక్ర రూపంలో వెంబడించగా ఆ రాక్షసుడు ఇక్కడి కొండపై వున్న ఓ చిన్న బిలంలో దాగినాడట! శ్రీ విష్ణువు సుదర్శన చక్రంలో సూక్ష్మ రూపాన్ని ధరించి బిలంలో ప్రవేశించి ఆ రాక్షసుడ్ని సంహరించినట్టు పురాణ కథనం. ఆనక ఉగ్రరూపంలో ఉన్న మహావిష్ణువును శాంతింపజేసేందుకు శ్రీమహాలక్ష్మితో కలిసి దేవతలందరూ స్తోత్రం చేస్తూ శ్రీవారికి అమృతాన్ని నివేదించారట. ఇక్కడ శ్రీ స్వామివారు ఉగ్రరూపంలో దర్శనమిచ్చి దేవతాది మునుల అభ్యర్థన మేరకు శాంతించి బిలం ముఖద్వారం వద్ద రెండువైపులా శంకుచక్రాలతో స్వయం వ్యక్తమై భక్తుల పూజలందుకుంటున్నట్టు బ్రహ్మ వైవర్త పురాణం వివరిస్తోంది. శ్రీ మహావిష్ణువు ఉగ్రరూపం నృసింహరూపమే అయినందున స్వయం వ్యక్తమై ఉన్న ఈ స్వామిని నృసింహస్వామిగా వ్యవహరిస్తున్నారు. త్రేతాయుగంలో ఆవుపాలు, ద్వాపర యుగంలో నేయి, కలియుగంలో బెల్లం పానకాన్ని స్వామివారు నైవేద్యంగా స్వీకరిస్తున్నట్టు చెబుతారు. ఆ కారణంగానే ఈ స్వామికి పానకాల నృసింహస్వామిగా పేరువచ్చింది.

నవ నారసింహ క్షేత్రాలు


అహోబిలమ నరసింహ స్వామి దేవాలయం - అహోబిలం


నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటయిన అహోబిల నరసింహ స్వామి దేవాలయం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కిమీ దూరంలో ఉంది. నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని స్థల పురాణం చెబుతుంది. హిరణ్యకశపున్ని చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడరటా. అందుకీ ఈ క్షేత్రానికి అహోబిలమ నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు. బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు ఉగ్రనారసింహ అవతారంలో స్థంబం నుంచి ఉద్బవిన్చినట్లు చెప్పే స్థంబాన్ని కూడా అహోబిలంలో చూడవచ్చు.

దిగువ అహోబిలం : లక్ష్మి నరసింహ స్వామి శాంతి మూర్తి ఆయె వెలసిన క్షేత్రం ఇది.8 KM ఎత్తున కొండ పైన ఎగువ అహోబిల నరసింహుని చుడవొచ్చు . హిరణ్య కసపుడిని సంవరించి వికట హట్ట్ హాసాలు చేస్తూ అహోబిలమ కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి.

(1) భార్గవ నరసింహ స్వామి
(2) యోగానంద నరసింహ స్వామి
(3) చత్రపట నరసింహ స్వామి
(4) ఉగ్ర నరసింహ స్వామి
(5) వరాహ నరసింహ స్వామి
(6) మాలోల నరసింహ స్వామి
(7) జ్వాల నరసింహ స్వామి
(8) పావన నరసింహ స్వామి
(9) కారంజ నరసింహ స్వామి
నవ నరసింహ క్షేత్రాలు . ఫాల్గుణ మాసంలో ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి .

లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం - యాదగిరి గుట్ట
నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహ స్వామికి ఘనమైన చరిత్ర ఉంది . పూర్వం ఋష్య శ్రున్గుని కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహా విష్ణ్వు ప్రత్యక్షమవ్వగా తనకు నరసిమ్హును మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసిమ్హుండు,యోగానంద నరసిమ్హుండు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొన్దపిఅన వెలసాడట . స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.ఇప్పుదు ఈ ప్రదేశాన్ని తొలచి ఇంకా విశాలంగా తిర్చిదిద్దరట. లోనికి దిగేముందు పంచముఖ ఆంజనేయ స్వామి కోవెల ఉంది . ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ పై గండబేరుండ నరసింహమూర్తి ఉంది గర్బ గుడి లో జ్వాల నరసింహ,యోగానంద నరసింహ మూర్తులు ఉన్నాయి . కొండపైన స్వామి వారి పుష్కరాని కూడా ఉంది . ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు, రోగాలు నాయమయిపోతాయని బక్తుల నమ్మకం . " నమో నరసింహయనంహ"

మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం - మాలకొండ
అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపమాచరించగా లక్ష్మి నారసింహుడు జ్వాల రూపుడై దర్శనమిన్చ్చాదని ,జ్వాల నరసిమున్హి గ కొండ పైన వెలిసారు అని పురాణం గాథ . మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కందుకూరు - పామూరు రోడ్డు లో వలేటివారిపాలెం మండల పరిధి లో ఉండే ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారం లో ఉండటం తో ఈ ప్రాంతానికి మాలకొండ , మాల్యాద్రి అని పేరు వచ్చాయి . ప్రకృతి శోబకు నిలయమైన మాలకొండ ఏకశిలా నిర్మితం కావడం విశేషం . జ్వాల నరసింహుని పూజించిన మారకందేయ ముని సమీపం లోని యేరు లో స్నానం ఆచరించారని అదే మార్కండేయ నది అని చెబుతారు .

4.నరసింహ స్వామి దేవాలయం - సింహాచలం
విశాకపట్టననికి 16 కి మీ దూరం లో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున గల కొండ పైన వెలసిన నరసింహ క్షేత్రం ఇది . నవ నరసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి . ఈ దేవాలయాన్ని సుమారు 9 వ శతాబ్దమ లో నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి . గర్భాలయం లో స్వామీ వారు వరాహ ముఖం , మానవాకారం ,సింహపు తోక కలిగి ఉంటారు . వరాహ -నరసింహ మూర్తుల సమ్మేళనం లో వెలసిన ఈ స్వామి ని సింహాద్రి అని పిలుస్తారు . ఈ గుడి ముఖ మండపం లో ఒక స్థంబం ఉంది . దానిని కౌగిలించుకొని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నేరువేరుతాయని భక్తుల విశ్వాసం . అద్బుతమైన శిల్ప సంపద ,అందమైన చెక్కడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి.
"ఓం నమో నరసింహయనంహ "


వరాహ పుష్కరాని
ఈ పుష్కరాని కొండ క్రింద ఆడవి వరం గ్రామం లో ఉంది . ప్రతి సంవత్సరం పుష్యమాసం లో స్వామి వారు తన దేవేరుల సమేతంగా కొండ దిగి వచ్చి పుష్కరాని లో ఉన్న భైరవ స్వామి ని దర్శించి అనంతరం కొండ కి చేరి స్వామిని దర్శనం చేసుకోవాలని చరిత్ర చెబుతుంది .

5.లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం - ధర్మపురి
ధర్మపురి కి పొతే యమపురి ఉండదు అని చెబుతుంటారు . రాష్ట్రము లో ప్రసిద్ది గాంచిన నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కరీంనగర్ పట్టాన కేంద్రానికి 75 కి మీ దూరం లో ఉంది . పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం , శ్రీ రామలింగేస్వరలయం , మసీదులు ప్రక్క ప్రక్కనే ఉంది అనాది నుంచి శైవ,వైష్ణవ ,ముసిలం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉంది . ఇక్కడ స్వామి వారు యోగానంద నారసింహ స్వామి గ భక్తుల అభిస్తములు నేరవేరుస్తున్నాడు . యమలోకం లో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి లో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం నివాసం ఎర్పర్చుకున్నట్లు పురాణం గాథలు చెబుతున్నాయి . ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది . యమ ధర్మరాజు ని దర్శించుకొని నృసింహుడిని దర్శించుకోవడం ఆనవైతి . పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గం లో నడిపించి నలుగు పాదముల ధర్మం తో ఈ క్షేత్రాన్ని పరిపలించినందుకు ధర్మపురి ని పేరు వచ్చింది అని పురాణాలూ చేబుతునంయి

6. వేదాద్రి నరసింహ స్వామి దేవాలయం - వేదాద్రి
నవ నరసింహ క్షేత్రాలల లో ఒకటైన నరసింహ క్షేత్రం కృష్ణ నది ఒడ్డున చిలకల్లు కి 10 కి మీ దూరం లో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి లో ఉంది . ఈ క్షేత్రం లో నరసింహ స్వామి వారు 5 అవతారాల్లో కనిపిస్తాడు . జ్వాల నరసింహ స్వామి వ, సలిగ్రంహ నరసింహ స్వామి,యోగ నంద నరసింహ స్వామి , లక్ష్మి నరసింహ స్వామి , వీర నరసింహ స్వామి అవతారాల్లో దర్శనమిస్తారు . అద్బుతమైన కట్టడాలు,యోగముద్రలో ఉన్న నరస్మిహర్ స్వామి వారు భక్తులకు కనువిందు చేస్తారు . ఇక్కడ జరిగే స్వామి వారి ఉత్సవాలు ఎంతో రమణీయంగా ,కనుల పండుగగా జరుగుతాయి .

7. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం - అన్త్రవేది
పరవళ్ళు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అన్త్రవేది చేరుకోవొచ్చు . చాల పురాతనమైన ఆలయం లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వెలసిన ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . త్రేతా యుగం లో రావణ బ్రహ్మ ను సంహరించి శ్రీ రాముడు బ్రహ్మ హత్య పాతకం నుంచి విముక్తి ని పొందడానికి ఈ క్షేత్రాన్ని ధర్సించాడని పురాణాలూ చెబుతున్నాయి . అలాగే ద్వాపర యుగం లో అర్జనుడు తీర్థ్ యాత్రకు వెళ్తూ ఆగిన తీర్థం అన్త్రవేది . మాగా మాసం లో స్వామి వారికి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగ గ జరుగుతాయి .

8.పానకాల నరసింహ స్వామి దేవాలయం - మంగళగిరి
నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహ స్వామి దేవాలయం గుంటు జిల్లా మంగళగిరి లో ఉంది .చాల పురాతనమైన దేవాలయం ..దెవలయ గురుంచి మనకు బ్రహమైథ వార్త పురాణం లో వివరించాదం జరిగింది . కొండ మీద వెలసిన పానకాల నరసింహ స్వామి ఎంత పాత్రా తో పానకం పోసిన అందులో సగం త్రాగి సగం వేలకి క్రక్కటం జరుగుతుంది . కొండ గిగువన లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఉంది . దీని ముందు ఎత్తైన గాలి గోపురం ఉంటుంది.

9. లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం - పెంచలకోన
నెల్లూరు జిల్లా లోని రాపూర్ మండల కేంద్రం లో గల పెంచల కోన క్షేత్రం లో లక్ష్మి నరసింహ స్వామి స్వయంభూగా వెలసిన క్షేత్రం. నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటి ఆయన పెంచలకోనలో స్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై స్వయంభూగా వెలసి ఉన్నాడు. భక్తుల పాలిట ఇలవేల్పు అయి, కోరికలు తీర్చే కొంగు బంగారంమయాడు . హిరణ్యకస్యపున్ని సంహరించి మహౌగ్ర రూపంతో వెళ్తుంటే దేవతలు అందరు బయపదిపోయారు. అలా శేష చలం కొండల్లో సంచరిస్తుండగా ఆయనకు చెంచు రాజు కుమార్తె ఆయన చెంచు లక్ష్మి కనిపించింది . ఆమె జగన్మోహన సౌందర్యం స్వామిని శాంతింప చేసింది . ఆ తరువాత ఆమెని వివాహం చేసుకొని పెంచలకోన ప్రాంతంలో వెలిసాడు అని స్థల పురాణం చెబుతుంది.





నరసింహ జయంతి
వైశాఖ చతుర్దశి రోజున నరసింహజయంతిని భక్తి ప్రపత్తులతో జరుపుకుంటాము.దశావతారాల్లో నాల్గవదే నరసింహావతారం.నరసింహ జయంతి అనగా మహావిష్ణువు బాలభక్తుడైన ప్రహ్లాదుని మాటనిలపడంకోసం, క్రూరుడైన హిరణ్యకశ్యపుని చంపి మానవులను,విష్ణు భక్తులైన మునులనూ కాపాడటంకోసం , హిరణ్యకశ్యపుని వరాలకు అతీతమైన అవతారం ఎత్తాడు.అదే నరసింహావతారం.

హిరణ్యకశ్యపుడు విష్ణుద్వేషి.తన సోదరుడైన హిరణ్యాక్షుడు దేవతలనూ,మానవులనూ, మునులను సైతం బాధిస్తూ , బలగర్వంతో భూమిని పైకెట్టి సముద్రంలో వేస్తాడు. మునుల ప్రార్ధనతో విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి భూమిని కాచి, అతడ్ని సం హరిస్తాడు.దానికి కోపోద్రిక్తుడైన హిరణ్యకశ్యపుడు బ్రహ్మను గురించీ తపస్సుచేసి నరులవలన, స్త్రీపురుషులవలనా, ఏఆయుధంవలనా , పగలు, రాత్రి ,నేలపైనా, ఆకాశంలో ఎక్కడా మరణం లేనివరం పొదుతాడు.అందువలన విష్ణుమూర్తి ,ఆవరాలకు అతీతమైన అవతారం ఎత్తవలసి వచ్చింది.నడుంవరకూ సింహం పంజాతో ఉండేవిధంగా అవతరించి పగలు రాత్రికాని సాయంసమయంలో , గుమ్మమ్మీద కూర్చుని తనవడిలో హిరణ్య కశ్యపుని ఉంచుకుని సిం హం గోళ్ళతో కడుపుచీల్చి సమ్హరిస్తాడు.అందువలన మానవ+ సిమ్హ రూపం గనుక నరసిమ్హావతారంగా పేరు వచ్చింది.

Wednesday, 9 April 2014

కేదార్ నాథ్






ఒక శైవ క్షేత్రం, ఒక విలయం మరియూ ఒక BUTTERFLY EFFECT


ఎక్కడో ఒక సీతాకోక చిలుక రెక్క కదలికల్లో పుట్టే ప్రకంపనలు అలా అలా సాగి మరెక్కడో ఉత్పాతానికి కారణం కావొచ్చు … The Butterfly effect.

డెహ్రాడూన్ లో మామూలుగానే వర్షాలు ఎక్కువ. 2013 జూన్ లో ఓ మూడు రోజులు తెగని వాన కురిసింది. అప్పుడు మేము మరోసారి గంగోత్రి, గోముఖ్ వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. ఇంతలోనే వాన మొదలైంది. నింగీ నేలా ఏకం. ఇంకేం చేసేది లేక నీటి గొడుగుల్నీ, మడుగుల్నీ చూస్తూ, ఇంట్లోనే చేతులు కట్టుకుని కూర్చున్నాం. మూసీ నదిలాగే మురికిగా బద్ధకంగా మా ఇంటి దగ్గర్లోనే ప్రవహించే రిస్పానా నది ఒక్కసారిగా ఒడ్డులొరిసి పారుతుంటే దానిని ఆనుకునున్న మురికివాడ భయంగా మేలుకునే ఉండిపోయింది. నాలుగో రోజునుండి కేదార్ నాథ్ లోయ వరదల్లో కొట్టుకుపోయిందనీ, చాలా మంది యాత్రికులు చనిపోయారనీ వరసగా టీవీలో వార్తా ప్రసారాలు… ఊళ్లు తుడిచిపెట్టుకు పోయి, కుటుంబాలు ఛిన్నమై, కొందరు కళ్ళముందే కొట్టుకుపోయి, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు సైన్యం సాయంతో కొండలు దిగి… ఇలా ఆ ఉత్పాతం అంతా టీవీలో చూసి చూసి కళ్ళూ, మనసూ అలసిపోయాయి. అంతకు ముందటేడు మేము చేసిన కేదార్ యాత్ర సంరంభం మదిని వదలనే లేదు ఇంతలోనే ఈ ఘోరం. తండోపతండాలుగా తనని దర్శించుకోవటానికి వచ్చే యాత్రికులను నిరామయంగా చూస్తూ వుండే కేదారేశ్వరుడు ఎందుకో విసుగ్గా కనుబొమ్మ ముడిచి తల విదిలిస్తే, జటాజూటంలోంచి ఓ పాయ విడివడి, మందాకిని ఉత్సాహంగా కిందకు దూకి పరవళ్ళు తొక్కి, లోయంతా విహారం చేసినట్టయింది. శైవక్షేత్రం శ్మశానమయ్యింది.

కార్చిచ్చుకు కాననమే లక్ష్యం.
బడబాగ్నికి సలిలం లక్ష్యం.
దేహాగ్నికి దేహమే లక్ష్యం.
ప్రళయాగ్నికి ప్రపంచాలు లక్ష్యం.
నీ మాయాగ్నికి నన్ను గురి కానీకు గుహేశ్వరా ! — అల్లమప్రభు.


కేదార్ నాథ్ ఆలయం వెనుక మహోన్నతంగా కనిపించే చౌరాబరీ గ్లేసియర్ మందాకిని జన్మస్థానం. గ్లేసియర్ సరస్సు వానలతో నిండి, మంచు కూడా కరిగి ప్రవహించటంతో తొణికి, దూకి, అక్కడే పుట్టిన మందాకినితో కలసి, అడ్డొచ్చిన గండ శిలల్ని అలిగిన పిల్లాడు గోళీకాయల్ని విసిరికొట్టినట్టు కొట్టి, లోయ స్వరూపాన్నే మార్చేసింది. లక్షలకొద్దీ యాత్రికులు వెళ్ళే దారిలో వానా, దానివల్ల వచ్చే ప్రమాదం గురించి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. యాత్ర ఆగలేదు. విధ్వంసం తప్పలేదు.

జరగాల్సిన నష్టం అంతా జరిగిన తరువాత, ఇది ప్రకృతి విలయమా మనుషుల స్వయంకృతమా అనే విశ్లేషణ చాలానే జరిగింది. హిమాలయ పర్వతాలు వయసులో చిన్నవి. పైగా గ్లేసియర్లు కదులుతూ, పెరుగుతూ, తరుగుతూ భూగర్భ శాస్త్రవేత్తలకు ఎప్పుడూ పని పెడుతూ ఉంటాయట. ప్రకృతిలోని ఈ చిన్నా పెద్దా కదలికలకు తోడు ఆ కొండల్లో ‘చార్ ధామ్ యాత్ర’ పేరుతో మన కదలికలు కూడా ఎక్కువైపోయాయి. కేదార్ నాథ్ కొండల్లో లక్షలాది మనుషులు వేసిన అడుగుల్లో నావి కూడా ఉన్నాయి. 2012 మే లో, అంటే ఈ విలయానికి ఒక సంవత్సరం ముందు, కేదార్ నాథ్, బదరీనాథ్, గంగోత్రి.. ఈ మూడు క్షేత్రాలు దర్శించటానికి మా అన్నయ్య ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. మొత్తం 15 మంది బయలుదేరాం. మాతోపాటు, డ్రైవర్, వంటమనిషి, అతని సహాయకుడు. రావు ట్రావెల్స్ బస్సులో బయలుదేరాం.

ఢిల్లీ నుండి బయలుదేరి, హరిద్వార్, ఋషికేష్ చూశాక రుద్రప్రయాగ, దేవ ప్రయాగల మీదుగా గుప్త కాశీ చేరుకున్నాం. దేవ ప్రయాగ దగ్గర అలకనంద, మందాకినీ నదుల సంగమం ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. హిమాలయాల్లోనే పుట్టిన ఈ రెండు హిమానీ నదాలు, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్లా దేవ ప్రయాగ సంగమం దగ్గర రెండు రంగుల్లో తమ భిన్నత్వాన్ని చూపిస్తాయి. మందాకిని ఆకుపచ్చని నీలపు రంగులో ఉంటే, అలకనంద మట్టి రంగులో ఉంది.

గుప్త కాశీ చేరుకున్నాక అక్కడినుండి మాలో ఆరుగురు హెలికాప్టర్ లో కేదార్ నాథ్ వెళ్ళిపోయారు. మిగతా తొమ్మిదిమందితో మా బస్సు 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న గౌరీకుండ్ కు పొద్దునే బయలుదేరింది. పదిగంటలలోపు గౌరీకుండ్ చేరిపోతే అక్కడినుండి మరో 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్ నాథ్ కు నడుచుకుంటూ సాయంత్రం ఆరు గంటల లోపు చేరిపోవచ్చునని లెక్కలు వేసుకున్నాం. కానీ సగం దూరం తరువాత బస్సు కదిలితేగా!! ముందంతా ముసురుకున్న వాహనాలు. పే…ద్ద ట్రాఫిక్ జామ్. ఇంతలో మమ్మల్ని వెక్కిరిస్తూ బస్సులోకి ఒక ఈగల దండు వచ్చేసింది. అక్షరాలా ఈగలు తోలుకుంటూ మధ్యాన్నం నాలుగ్గంటల దాకా బస్సులోనే ఈసురోమని, చివరకు గౌరీకుండ్ చేరాం. (అక్కడి జనం సందడి చూస్తుంటే ముంబైలో దాదర్ రైల్వే స్టేషన్ గుర్తువచ్చింది నాకు. “వానచినుకుల మధ్యనుండీ గుర్రాన్ని నడపటం ఏం గొప్ప? జనం ఆఫీసులకు వెళ్ళే సమయాల్లో పక్కవాడి చెమటచినుకులు ఒంటికి అంటకుండా దాదర్ స్టేషన్ నుంచి బైటికి రా చూద్దాం” అని నకులుడిని సవాలు చెయ్యొచ్చు).

గౌరీకుండ్ నుంచి నా స్నేహితురాలు లక్ష్మీ, మరో ఇద్దరూ గుర్రాలు ఎక్కి ప్రయాణం సాగించారు. సాయంత్రం అయిదు గంటలకు కర్రలు చేత పట్టుకుని నేనూ, జయసూర్యా, మా తమ్ముడు శంకర్, మరదలు జానకి, మేనల్లుడు కాశ్యప్ నడక మొదలు పెట్టాం. మరో బుజ్జి మేనల్లుడు ఏడేళ్ళ కౌశిక్ ని చిన్ని బుట్టలో ఎక్కించాం. ఇలా బుట్టల్లో యాత్రికులను వీపున మోస్తూ తీసుకెళతారు కొంతమంది. అచ్చంగా హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తున్నట్టే అనిపించింది. అక్కడ వాహనాలు దూసుకుంటూ మీదకొస్తాయి. ఇక్కడ గుర్రాలు, డోలీలు… వీటిని తప్పించుకుంటూ, కాస్త విశాలంగానే ఉన్నా, యాత్రికుల ట్రాఫిక్ తో ఇరుగ్గా అనిపించిన దారిలో ఏడు కిలోమీటర్లు నడక సాగించి, ‘రాం బాడా’ అనే ప్రదేశానికి చేరుకునేటప్పటికి రాత్రి సుమారు తొమ్మిదయింది. బురదలో, వాన చినుకుల్లో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని రెండు టార్చిలైట్ల సాయంతో అక్కడికొచ్చాక ఇక ఆ చీకట్లో ముందుకి సాగలేమని అర్ధమయింది. దారిపక్కన ఒక చిన్న ధాబాలాంటిది కనిపించింది. దాని యజమాని మనిషికో వంద రూపాయలిస్తే మాకు పడుకోవటానికి చోటు చూపిస్తానన్నాడు. ఒక పరదా వెనుక మాకు చెక్క మంచాలమీద పరుపులతో పక్కలు అమర్చి ఇచ్చాడు. అక్కడ వేడిగా రొట్టెలూ, అన్నం, పప్పుతో భోజనం కానిచ్చి రజాయిల్లో దూరాం. పక్కనే భీషణంగా నది చేస్తున్న రొద. నాకు ఒకంతట నిద్ర పట్టలేదు. పొద్దునే అయిదు గంటలకు మళ్ళీ బయలుదేరిపోయాం. కేదార్ నాథ్ చేరటానికి మరో ఏడు కిలోమీటర్ల దూరం ఉంది. హెలికాప్టర్ లో, గుర్రాలమీదా వెళ్ళినవాళ్ళు ముందురోజే చేరిపోయి, మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే రోజు మళ్ళీ అందరం కేదార్ నాథ్ నుంచి వెనక్కు వచ్చెయ్యాలి. నడుస్తూ వెళితే, కేదార్ చేరేసరికి ఆలస్యం అవుతుందనిపించి, గుర్రాల మీద బయలుదేరాం.. రాం బాడా నుంచీ కొండ దారి విశాలమయింది. రాగాలు తీస్తున్న పిట్టలు… బద్ధకాన్ని వదిలించుకుంటున్నట్టు తలలు విదిలిస్తూ, అడుగులు చురుగ్గా వేస్తూ గుర్రాలు… విరిసిన అడవి పూలు… సన్నగా చెవుల్లోంచి దూరి మెదడును చేరి, నిద్ర మత్తును వదిలిస్తున్న చలిగాలి. ఆ సమయంలో వాన వెలిసి, ఖాళీగా ఉన్న తడిసిన దారిలో మెత్తటి లేయెండలో రామ్ బాడా నుంచి కేదార్ నాథ్ ప్రయాణం ఓ అందమైన పాటలాగా సాగింది. సరిగ్గా మరో ఏడాదికి, 2013 జూన్ లో విరుచుకుపడిన కేదార్ నాథ్ వరదల్లో ఆ చిన్నగ్రామం ‘రాం బాడా’ తుడిచిపెట్టుకు పోయింది. అలాగే గౌరీకుండ్ కూడా. ఆ రాత్రి రాం బాడాలో మాకు ఆశ్రయం ఇచ్చిన ధాబా, అక్కడి మనుషులూ, ఆ గుర్రాలూ, అన్నీ ఏమయాయోనని ఆలోచిస్తే మనసు కలుక్కుమంటుంది.

కేదార్ నాథ్ చేరాక అప్పటికే అక్కడికి చేరిపోయిన మావాళ్ళందరూ మమ్మల్ని చూసి తేలిక పడ్డారు. గౌరీకుండ్ నుండి ఇక సిగ్నల్స్ లేక మొబైల్ ఫోన్లు పనిచెయ్యలేదు. ఎవరి దారి వారిదే. ముందు రాత్రి మేము ఎక్కడ ఆగిపోయామో వాళ్ళకు తెలియలేదు. “మేమంతా గుడికి వెళ్లి వచ్చేశాం. మీరూ తొందరగా దర్శనం చేసుకుని వచ్చేయండి. సాయంత్రానికి మళ్ళీ గుప్త కాశీ చేరిపోవా”లన్నారు. స్నానాలు కానిచ్చి గుడికి పరుగెత్తాం. అక్కడ రద్దీ చూడాలీ… దర్శనం కోసం పెద్ద పెద్ద వరుసల్లో వేలాడుతున్న మనుషులు. హెలికాప్టర్లు దిగి వచ్చిన వాళ్లకు మాత్రం ప్రత్యేక హోదా. ఎందుకంటే వాళ్ళు దర్శనం కానిచ్చి వెంటనే ఎగిరి వెళ్లిపోవాలి. ఏమి చెయ్యాలో అర్ధం కాక తిరుగుతున్న మా మీదకు ఓ పూజారి వల విసిరాడు. “మనిషికో వెయ్యి రూపాయలు ఇచ్చెయ్యండి. ఎలాగోలా లోపలికి పంపించేస్తాన”న్నాడు. “ఈ బేరాలేమిటి, దర్శనం లేకపోతే పోయిందిలే వెనక్కు పోదా”మనిపించి, చిన్నగా నస మొదలుపెట్టానుగానీ, జయసూర్య భక్తి పారవశ్యంలో నా సణుగుడు అణిగిపోయింది. దైవ దర్శనంతో అడ్డదారిన తలా కాస్తా పుణ్యం మూట కట్టుకుని బైటపడ్డాం. దర్శనం అయాక గుడి ఆవరణలో మమ్మల్ని కూర్చోబెట్టి పూజా కార్యక్రమం కానిచ్చి, రేటు మరి కాస్త పెంచి, మనిషికో పదిహేను వందల చొప్పున పండిట్ జీ సొమ్ము చేసుకున్నాడు.

శ్రీశైలంలో చెంచులు చక్కగా అలంకారాలు చేసుకుని ఆటలు, పాటలతో శివుణ్ణి అలరిస్తారు. ఇక్కడ అలాంటి పూజలేమైనా ఈ గఢవాలీలు కూడా చేస్తారేమోనని ఆశించాను గానీ, సోమరిగా కూర్చుని భంగు కొట్టే సాధువులే తప్ప, జాతరల జాడలేవీ నాకు కనిపించలేదు.

ఊహించినట్టే కేదారేశ్వరుడి గుడి పురాతనత్వం ఉట్టిపడుతూ ఉంది. ఆ రాతి గోడల మీదుండే చాళ్ళు (striations) ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాలపాటు మంచులో కూరుకుపోయి ఉందని చెప్తున్నాయని కొంతమంది భూగర్భ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. తరువాత గ్లేసియర్ వెనక్కు జరగటంతో ఆలయం బైటపడి ఉండవచ్చు. ఇది పాండవులు శివుడిని పూజించిన చోటని చెప్తారు. ఎనిమిదో శతాబ్దంలో శంకరాచార్యుడు ఈ ఆలయ నిర్మాణం చేశాడని చరిత్ర. మొన్న జరిగిన విలయంలోనూ గుడి చెక్కు చెదరలేదు. కొట్టుకొచ్చిన గండ శిలలు ఆలయ ప్రాంగణం బైటనే ఆగిపోయాయట. కేదార్ నాథ్ ఊరంతా సిమెంట్ భవనాలు కనిపిస్తుంటే, ఇది కూడా ఓ పెద్ద వేసవి విడిది కావటానికి ఎక్కువ కాలం పట్టదని అప్పుడు అనిపించింది కానీ ఇప్పుడా కట్టడాలన్నీ వరదలో సమాధి అయాయి. ఇక్కడే కాదు, ఉత్తరాఖండ్ లోని ఈ చార్ ధామ్ దారంతా కొండ వాలుల్లో సిమెంట్ అంతస్తులు ప్రమాదకరంగా, వికారంగా కనిపిస్తుంటాయి. సాంప్రదాయక కట్టడాలను టూరిజం కోసం పూర్తిగా బలి పెట్టిన చోటు గడ్ వాల్.

మధ్యాహ్నం ఒంటిగంటకు మా బృందం గౌరీకుండ్ వైపు నడక ప్ర్రారంభించాం. ఈ సారి లక్ష్మి కూడా నడక మొదలుపెట్టింది. అలిసిపోయే వరకూ నడిచి, అక్కడి నుండి గుర్రం మాట్లాడుకుంటానంది. మనుషుల మీది నుండి కళ్ళను తప్పించి పక్కకు దృష్టి సారిస్తే, విశాలంగా మెత్తటి పష్మీనా శాలువాలా తెల్లని మంచును ధరించిన హిమాలయాల వరకూ అడ్డు లేకుండా దూసుకెళ్ళాయి చూపులు. కేదార్ నాథ్ లోయ మహా విశాలం. యాత్రికులకోసం మంచి రహదారి ఏర్పాటు చేసేశారు. చుట్టూ ప్రకృతినీ, యాత్రికుల సంరంభాన్నీ చూస్తూ నడవటమే. చేతుల్లో ప్లాస్టిక్ బాటిల్స్ తో మంచినీళ్ళు పట్టుకుని, బట్టలూ తిండీ మూటగట్టి భుజాన వేసుకుని పయనం కట్టిన గ్రామీణులు… డోలీల్లో, బుట్టల్లో కదలకుండా కూర్చుని అలసిపోతున్న పట్నవాసులు… నిజంగా అలా కూర్చోవటం పెద్ద శిక్షే. ఏమాత్రం కదిలినా మోసే వాళ్ళకి కుదురు తప్పి కింద పడిపోతామేమో అని భయం వేస్తుంది.

మలుపులు తిరుగుతూ, అలా అలా మళ్ళీ సన్నబడ్డ లోయ, ‘గరుడ చట్టీ’ దగ్గర, చీమల బారును శ్రద్ధగా వంగి చూస్తున్న పిల్లవాడిలా, యాత్రికుల వరుసలని వంగి గమనిస్తున్న కొండల బారు. లయబద్ధంగా అడుగులు వేస్తూ ఊపిరి తీస్తూ, డోలీల్లో మనుషుల్ని మోసుకు పోతున్నవాళ్ళు… వీళ్ళను తప్పించుకుంటూ సాగే గుర్రాల ప్రయాణం… వీటి మధ్యలో కౌశిక్ తో పాటు నేనూ పరుగులు తీశాను. ఈ తిరుగు ప్రయాణంలో వాడు బుట్ట ఎక్కలేదు. నడుస్తానన్నాడు. నున్నగా అరిగిపోయిన ఆ రాళ్ళ దారిలో ఇద్దరం చాలాసార్లు జారిపడుతూ, నవ్వుకుంటూ పరుగెత్తాం. కౌశిక్ చేతిలోంచి జారిపోతున్న పెద్ద ఊతకర్ర వాడికంటే పొడవుగా ఉంది. దానికి తోడు చిన్నగా పరుగులు తీస్తూ మీద మీద కొస్తున్న గుర్రాలు. వీడు వాటి కాళ్ళ కిందకు ఎక్కడ వెళ్ళిపోతాడోనని నాక్కాస్త ఆందోళన.

మొత్తానికి ప్రమాదాలేవీ లేకుండా రామ్ బాడా వరకూ వచ్చాక, ఇక ఇలా నడుస్తూ ఉంటే గౌరీకుండ్ చేరేసరికి బాగా రాత్రయిపోతుందని శంకర్ అనటంతో మళ్ళీ అయిదుగురం గుర్రాలు తీసుకున్నాం. రాం బాడా చెక్ పోస్టు దగ్గరా, కేదార్ నాథ్ లోనూ గుర్రాల సంఖ్య చూస్తే వేలలో ఉన్నట్టు అనిపించింది. మే నుండి అక్టోబర్ వరకూ జరిగే ఈ యాత్రలో గుర్రాల మీద మనుషులను గమ్యం చేరుస్తూ కాస్త డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఎంతోమంది. అవి వరుసలు తీరి కాలకృత్యాలు తీర్చుకోవటం… పెద్ద సిమెంట్ తొట్లదగ్గర ఆగి నీరు తాగి మళ్ళీ అడుగులు వెయ్యటం… వీపు మీద మనుషులు లేనప్పుడు హుషారుగా దౌడు తియ్యటం… శివ తత్వమేదో అర్ధం అయినా కాకపోయినా, ‘అద్దె గుర్రాల జీవన విధానం’ మాత్రం కాస్త అర్ధమయింది.

నేనూ, జానకీ ఎక్కిన గుర్రాలను ఒకే మనిషి నడిపిస్తున్నాడు. అవి రెండూ అల్లరివే. అతని మాట ఏమాత్రం వినటం లేదు. కొండ అంచువెంటనే నడవటం వాటికి ఇష్టం. మా మోకాళ్ళు రాళ్ళకీ, విద్యుత్ స్తంభాలకీ రాసుకుపోతుంటే నేను కాస్త భయంతో బిగుసుకున్నాను. ఇంతలో ఎదురుగా వస్తున్న గుర్రాన్ని నా గుర్రం ఏమాత్రం లెక్క చెయ్యకుండా ధీమాగా రాసుకుంటూ పోయింది. దీనితో నేను ఓ పక్కకు వాలిపోయి పడిపోబోయాను. ఈ అల్లరి గుర్రంతో ఇక సాహసం చెయ్యలేక, దిగి నడుస్తానని పట్టు పట్టేశాను. గట్టిగా ఒక పది నిముషాలు కూడా గుర్రం మీద వెళ్ళక పోయినా, గుర్రాల యజమానులకు మొదట అనుకున్న డబ్బు మొత్తం ఇచ్చి, నాతోపాటు మిగిలిన వాళ్ళు కూడా గుర్రాలు దిగిపోయారు. అందరం మళ్ళీ పరుగు లాంటి నడక మొదలు పెట్టాం. గౌరీకుండ్ చేరేసరికి ఏడు గంటలైంది. అప్పటికే చీకటి పడిపోయింది.

కేదార్ నాథ్ లో బయలుదేరినప్పుడే లక్ష్మి “నేను నెమ్మదిగా నడుస్తాను. మీరంతా ముందు నడవండి. నడవలేనని అనిపిస్తే గుర్రం తీసుకుంటాన”ని చెప్పటంతో మేమంతా తొందరగా నడిచాం. తను కొంత దూరం తరువాత కనిపించలేదు. దారిలో కూడా ఎక్కడా తగల్లేదు. ‘గుర్రం ఎక్కి మాకంటే ముందే చేరిపోతుందిలే’ అనుకున్నాం కానీ, మేము గౌరీకుండ్ చేరి అరగంట గడిచింది. గంట గడిచింది. తన జాడ లేదు. గౌరీకుండ్ ఒక పెద్ద సంతలా ఉంది. ఆ జనంలో తనని వెదకటం కష్టం. అప్పటికే నడకతో ఒళ్ళు అలిసిపోయి, అందరం తనకోసం ఎదురు చూస్తూ ఒకచోట కూలబడ్డాము. హెలికాప్టర్ లో వెళ్ళినవాళ్ళు గుప్త కాశీ చేరిపోయారు. మేమందరం మా బస్సులో అక్కడికి చేరాల్సి ఉంది. మళ్ళీ పొద్దునే నాలుగ్గంటలకు అందరం కలిసి గుప్త కాశీ నుంచి బదరీ నాథ్ కు బస్సులో బయలుదేరాలి. మొబైల్ ఫోన్లు ఏవీ పని చెయ్యటం లేదు. ఆఖరుకు నేనూ, జయసూర్యా లక్ష్మి వచ్చేవరకూ అక్కడే వుంటాం అని, మిగతా వాళ్ళనందర్నీ వెళ్ళిపొమ్మని చెప్పాం. ఇంకేం చేసేదిలేక వాళ్ళంతా బస్సులో వెళ్ళిపోయారు. మనసులో ఆందోళన. ఒళ్ళంతా చితక్కొట్టినట్టు నొప్పులు. కడుపు ఖాళీ. ఎదురుగా అన్నీ తినటానికి దొరుకుతున్నా, ఏమీ తోచనితనంతో అక్కడక్కడే నీరసంగా తిరుగుతున్నాం. ఇలా గౌరీకుండ్ ఇంకా చేరనివాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడున్న చిన్న పోలీస్ అవుట్ పోస్ట్ లో వాళ్ళగురించి అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళలో తెలుగువాళ్ళ పేర్లు కొన్ని వినిపించాయి. మేము కూడా పోలీసుల చేత అనౌన్స్ చేయించి, మైక్ లో మేమూ అరుస్తూ, ఎంతసేపు ఎదురు చూసినా ఫలితం లేదు. లక్ష్మి కొంత అనారోగ్యంతో ఉంది. అయినా చాలా ధైర్యస్తురాలు. సమయస్ఫూర్తి కూడా ఎక్కువే. “దారిలో గుర్రం మీదనుంచి పడిపోయిందా? ఆ చీకటిలో ఎవరైనా చూశారా లేదా? ఆసలెలా ఉందో, ఎక్కడుందో?” ఇలా ముసురుతున్న మా ఆలోచనలు… దారిలో ఏవయినా హెల్త్ సెంటర్ లు ఉంటే అక్కడ తనగురించి కనుక్కోమని పోలీసులను అడిగాము. వాళ్ళు చాలా ఓపిగ్గా వీలైనంతవరకూ తప్పిపోయిన వాళ్ళ ఆరా కనుక్కుంటూనే ఉన్నారు. దారిలో ఉన్న రెండు హెల్త్ సెంటర్ లకు చేరిన వాళ్ళలో తను లేదని చెప్పి, మాకు ధైర్యం చెప్పారు. కాలం నెమ్మదిగా ఆవులిస్తూ రాత్రి పది గంటల్ని కూడా మింగింది. జనం బాగా పల్చబడ్డారు. రాత్రంతా ఇక్కడ ఉండాల్సి వస్తే ఏం చెయ్యాలీ ఎక్కడుండాలీ అని మేమిద్దరం ఆలోచిస్తూ అక్కడక్కడే చిన్నగా అటూ ఇటూ తిరుగుతున్నాం.. ఇంతలో హఠాత్తుగా ప్రత్యక్షం అయింది లక్ష్మి. నోరంతా ఎండిపోయి, కళ్ళు వాలిపోతూ, మొహం పీక్కుపోయి, అయినా ధైర్యపు ఛాయ మొహం మీదనుంచీ కొంచెమైనా తొలగకుండా… కొంచెం నీళ్ళు తాగాక స్థిమితపడి తను పడ్డ పాట్లన్నీ చెప్పుకొచ్చింది. జీను సరిగ్గా లేని గుర్రం ఎక్కటం, దానిమీదనుంచీ పడిపోవటం, పెద్దగా దెబ్బలు తగలకపోవటం, మళ్ళీ లేచి నడుచుకుంటూ రావటం.. ఇంకో గుర్రం ఎక్కటం… ఇలా … మొండిధైర్యంతో మమ్మల్ని ఎలాగైనా చేరటమే లక్ష్యంగా పెట్టుకుని, నోట్లో మంచినీళ్ళు పోసుకొనే సోయి కూడా లేకుండా పడుతూ లేస్తూ వచ్చేశానని చెప్పింది. అప్పటిదాకా భయంతో వణుకుతున్న నా గుండె తనని చూశాక కాస్త స్థిరంగా కొట్టుకోవటం మొదలెట్టింది. అక్కడున్న ఫలహారశాలలో కాస్త తిని, గుప్తకాశీ ఇప్పుడు ఎలా చేరగలమా అని చూస్తుంటే, ఒక ఇన్నోవా కనిపించింది. దానిలో ముగ్గురం బైలుదేరి గుప్తకాశీలోని మా వాళ్ళను చేరేసరికి రాత్రి పన్నెండు దాటింది. లక్ష్మిని చూసి అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉండే కేదార్ నాథ్ హిమాలయాల ఒడిలో ఒదిగిన మహా సౌందర్యం. కానీ, ఇంతలా కొండల్లో ట్రాఫిక్ జామ్ లు సృష్టించుకుంటూ, మళ్ళీ వాటిని తప్పించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందని నేను ఊహించలేదు. మన తెలుగువాళ్ళలో కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాలు దర్శించే అలవాటు ఈనాటిది కాదు. ఏ కాలం నుంచో కష్టాలకోరుస్తూ ఈ యాత్రలు చేసినవాళ్ళున్నారు. ఇప్పుడు తీర్థయాత్రలు కూడా ప్యాకేజీల్లో అమ్మకానికి వచ్చాక, ప్రయాస తగ్గి, పుణ్యం కొనుక్కోవటం ఎక్కువయింది. ఈ ఆధ్యాత్మిక వ్యాపారం ఎంతోమంది గుర్రాలు నడుపుకునే వాళ్ళకూ, డోలీలు మోసే వాళ్ళకూ, తిండి వస్తువులూ, పూజ సామాన్లూ అమ్ముకునే వాళ్ళకూ, వంట వాళ్ళకూ ఉపాధినిచ్చింది. ఏ స్థాయి టూర్ ఆపరేటర్లు ఆ స్థాయిలో దండిగా జేబులు నింపుకున్నారు. చిట్ ఫండ్ కంపెనీలు ఒక్కసారిగా దివాలా తీసినట్టు, ఈ యాత్రలన్నీ ఒక్కవరదతో కొట్టుకుపోయి ఉత్తరాఖండ్ ఆర్ధిక స్థితినే దెబ్బ తీశాయి. కనీసం ఇంకో అయిదేళ్ళ వరకూ కేదార్, బదరీ, గంగోత్రి దారులేవీ బాగుపడేటట్టు లేవు. కేదారేశ్వరుడు కూడా కొన్నాళ్ళు ప్రశాంతంగా నిద్ర పోతాడేమో!

యాత్ర కళ కళ లాడే ఆ రోజుల్లో మేము సందడిగా, తొక్కిడిగా, ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా కేదార్ ప్రయాణం పూర్తి చేసుకుని ఆ జ్ఞాపకాల మూట మోసుకుని మరునాడు తెల్లారుజామునే బస్సులో బదరీనాథ్ బయలుదేరాం.



Saturday, 1 February 2014

తెలంగాణ శైవక్షేత్రాలు

ముక్తిమార్గ సోపానాలు ..
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్‌
ఉర్వారుకమివ బంధనాత్‌ మృత్యోర్ముక్షీయమామృతాత్‌

కష్టాల నుండి, మృత్యువు నుండి రక్షించమని పరమశివుడిని వేడుకుంటూ భక్తులు మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తారు. మన హిందూ దేవతల్లో శివుడు ఆదిదేవుడుగా కొలువబడుతాడు. హిందువుల ప్రధాన ఆరాధ్య దైవం పరమశివుడు. మనకున్న పండుగల్లో మహాశివరాత్రి ప్రధానమైంది. ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో మనం జరుపుకుంటాం, శివ పార్వతుల కల్యాణం జరిగిన రోజుగా కూడా భావిస్తారు. చాంద్రమానం ప్రకారం మాఘమాసంలో కృష్ణ చతుర్దశినాడు శివుని జన్మ నక్షత్రమున ఆరుద్ర నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం. శివుడు ఈరోజే లింగాకారంలో ఉద్భవించాడని శివపురాణంలో ఉంది. ప్రతిమాసంలో శివరాత్రి వస్తుంది. దీన్ని మాస శివరాత్రి అంటారు. కాని మాఘ మాసంలో వచ్చే ఈ శివరాత్రినే ‘మహాశివరాత్రి’ అంటారు.

ఈ పండుగను భక్తులు శివుడికి బిల్వదళాలతో, ఉపవాసాలతో, జాగరణలతో ప్రీతి కలిగించి అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. లింగోద్భవ కాలంలో ఏకాదశ రుద్రాభిషేకాలు, జాగరణ సమయంలో శివలీలల కథా పారాయణాలు చేస్తారు. ప్రధాన శైవ క్షేత్రాల్లో మూడు రోజుల ఉత్సవాలు, జాతరలు నిర్వహిస్తారు. పూజారులు, ఋత్విక్కులు పఠించే నమక, చమకాలు, మృత్యుంజయ మంత్రాల వల్ల శివరాత్రి పండుగ శక్తి అధికమై, భక్తులకు ఆ ఫలాలు అందుతాయి.

తపస్సు, యోగం, ధ్యానం వంటి వాటితో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తి మనలో పాజిటివ్‌ ఎనర్జీని పెంపొదిస్తుంది. శివుడి నుండే యోగసంప్రదాయం మొదలైంది. శక్తి స్వరూపుడు, కాల స్వరూపుడు, ఆదిమధ్యాంత రహితుడైన పరమశివుడిని ఆరాధిస్తే, మానవులకు, పశు పక్ష్యాదులకు మోక్షం తప్పక సిద్ధిస్తుందని పురాణ గాథలు, ప్రత్యక్ష అనుభవాలు మనకు ఎన్నో కనిపిస్తున్నాయి. అటు వంటి పరమశివుడు ఎక్కడ ఏ రూపంలోనైనా కొలువై ఉండవచ్చు. శక్తి సర్వాంతర్యామి. అతడికి ఒక కోవెల నిర్మించి అందు లో నిక్షిప్తం చేయడం మనకు సాధ్యం కాదు. కానీ మానవులందరి స్థాయి ఒకేవిధంగా ఉండదు. కొందరు పూజతో, కొందరు అర్చనతో, కొందరు స్తోత్రంతో, కొందరు జపంతో తమ భక్తిమార్గాన్ని, మోక్ష మార్గాన్ని ఎంచుకుంటారు. ఎవరి ఆనందం స్థాయిలో వారిని భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందుకే మన భారతదేశంలో లక్షలాదిగా శివుడికి దేవాలయాలు నిర్మించబడ్డాయి. తెలంగాణాలో కూడా వందలు, వేల సంఖ్యలో శివాలయాలు ఉన్నాయి. ప్రసిద్ధ, ప్రాచీన శైవక్షేత్రాలను ఈ సందర్భంగా దర్శించుకుందాం.

శ్రీశైల ఉత్తర ద్వారంగా విలసిల్లుతున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం ఉమా మహేశ్వరం. ఇది మహబూబ్‌నగర్‌ జిల్లాలో నల్లమల అడవి ప్రాంతంలో కొండలో కలిసిపోయి ఉంటుంది. సంవత్సరం మొత్తం కొండలో నుండి నీరు నిరంతరం ప్రవహిస్తూ ప్రకృతి రమణీయంగా కన్పిస్తుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుండి 100 కి.మీ. దూరంలో శ్రీశైలం వెళ్లే దారిలో ఈ క్షేత్రం ఉంది.

పురాణాల ప్రకారం పార్వతీదేవి పరమశివుడి గురించి తపస్సు చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా చాలామంది మహర్షులు వందల సంవత్సరాల పాటు శివుడి గురించి ఈ క్షేత్రంలో తపస్సు చేసినట్లు స్కంద పురాణం వల్ల తెలుస్తుంది. ఉమామహేశ్వరాన్ని దర్శించుకొని మాత్రమే శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలి. అప్పుడే శ్రీశైల యాత్ర పరిపూర్ణమైనట్లని పెద్దలు చెప్తారు.

ఉమామహేశ్వర స్వామి ఆలయం ఒక కొండమీద ఉంది. ఈ కొండ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దీనికి పక్కన పాపనాశిని ఉంటుంది. ఈ పాపనాశిని నుండి ఐదు ధారలుగా ఒకే చోటునుండి ప్రవహిస్తుంది. ఈ కొండ క్రింది ప్రాంతాన్ని భోగమహేశ్వరం అని పిలుస్తారు. ఇక్కడ ఐదు గుడులలో ఐదు శివలింగాలున్నాయి. వీటిని పంచలింగాలని అంటారు. అదేవిధంగా ఇక్కడ జంటలింగాల దేవాలయం కూడా ఉంది.

కొమురవెల్లి మల్లన్న, ఐనవోలు మల్లన్నవరంగల్‌ జిల్లా కొమురవెల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంది. ఇతర ఆలయాలకు భిన్నంగా ఇక్కడ ‘పుట్టమన్ను’చే స్వామి విగ్రహం ప్రతిష్టించబడింది. 500 సంవత్సరాల క్రితం తయారుచేయబడిన ఈ విగ్రహం నేటి వరకు చెక్కుచెదరకుండా భక్తుల పాలిట కల్పతరువై వెలిసి ఉంది. స్థానిక అర్చకుల కథనం ప్రకారం స్వామి విగ్రహం నాభి ప్రాంతంలో పుట్టు లింగం ఉందని ప్రతీతి. యాదవుల ఆడపడుచైన ‘గొల్ల కేతమ్మ’ను లింగ బలిజల ఆడపడుచైన ‘బలిజ మేడమ్మ’ను స్వామి వివాహం చేసుకున్నట్లు, ఆ కారణంగా స్వామికి ఇరుపక్కలా గొల్ల కేతమ్మ, బలిజ మేడమ్మల విగ్రహాలుంటాయి. స్వామి వారికి వీర శైవ ఆగమం ప్రకారం లింగ బలిజలు పూజలు నిర్వహిస్తారు.

ప్రతీ సంవత్సరం జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమయ్యే కొమురవెల్లి మల్లన్న జాతర ఉగాది వరకు కొనసాగుతుంది. సంక్రాంతి పండుగ ముందు రోజు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. జాతర సమయంలో ‘బోనం – పట్నం’ అనే మొక్కుబడులను భక్తులు చెల్లించుకుంటారు. జాతర చివర్లో, హోళీ పండుగ ముందు ‘పెద్ద పట్నం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో వీరశైవ పూజారులు వీరభద్రుడ్ని, భద్రకాళిని పూజించి రాత్రి వేళ చతురస్రాకారంలో టన్నుల కొద్దీ కట్టెలను పేర్చి అగ్ని ప్రతిష్ట చేస్తారు.

వరంగల్‌ పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఐనవోలు గ్రామముంది. ఇక్కడ కాకతీయులు కట్టించిన మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధమైంది. ఇక్కడి ప్రధాన దైవతం ‘ఐనవోలు మల్లన్నగా’ ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయాన్ని కాకతీ రెండవ ప్రోలుని కుమారుడు రుద్రదేవుడు నిర్మించినట్లు సిద్ధేశ్వర చరిత్ర వల్ల తెలుస్తోంది. ఆలయానికి తూర్పు, దక్షిణ దిశల్లో రెండు కీర్తి తోరణాలు నిర్మించబడ్డాయి.

ఐనవోలు మల్లన్న బ్రహ్మూెత్సవాలు ప్రతీ శివరాత్రి సందర్భంగా జరుగుతాయి. అశ్వ, నంది, పర్వత, రావణ వాహనాలను అధిరోహించి, చివరి రోజు రథారూఢుడై పుర వీధుల్లో స్వామి ఊరేగింపు జరుగుతుంది. అయిదవ రోజు అగ్ని గుండాల కార్యక్రమం, వసంతోత్సవం, పుష్పయాగం నిర్వహించబడతాయి.

కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం
హైదరాబాదుకు 30 కి.మీ. దూరంలో భవానీసమేత శ్రీ రామలిం గేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇది త్రేతాయుగం నాటిదని ఐతిహ్యం. పూర్వం త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా హనుమత్‌ సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చెనపుడు ఇక్కడి కొండలు, చెట్లు, ఆహ్లాదమైన ప్రకృతిని చూసి శివలింగం ప్రతిష్టించాలని సంకల్పించగా మహర్షులు ముహూర్తాన్ని నిర్ణయించారు. రాముడు హనుమంతుడిని శివ లింగాన్ని తీసుకురమ్మని వారణాసికి పంపెను. హనుమంతుడు కావల్సిన శివలింగాన్ని ఎంచుకోలేక సందిగ్ధావస్థలో 101 శివ లింగాలను తీసుకొచ్చాడట. కానీ ముహూర్త సమయం మించిపోవడంతో రాముడు వ్యాకలుడై ఉండగా, స్వయంగా శివుడే ప్రత్యక్షమై లింగ రూపాన్ని రాముడికి అందించాడట. హనుమంతుడు వచ్చే సరికి లింగ ప్రతిష్ట పూర్తి అయినది. రాముడు తాను తెచ్చిన లింగాలను ప్రతిష్టించలేదనే బాధతో లింగాలన్నింటినీ తోకతో చుట్టి విసిరివేశాడట. దాంతో కీసర గుట్ట పరిసర ప్రాంతాల్లో లింగాలన్నీ చెల్లాచెదురైనాయి. ఇప్పటికీ కీసర పరిసర ప్రాంతాల్లో మనకు చాలా శివ లింగాలు కనిపిస్తాయి.

వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరస్వామి దేవాలయంతెలుగుదేశాన్ని పాలించిన, పౌరుష పరాక్రమాలకు మారుపేరుగా నిలిచిన కాకతీయుల కాలంలో వేయి స్తంభాల గుడి నిర్మించబడింది. ఇందులో పరమ శివుడు రుద్రేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. విశిష్ట నిర్మాణ శైలితో కూడిన ఈ ఆలయాన్ని క్రీ.శ. 1138 – 1145 మధ్య కాలంలో కాకతి రుద్రదేవుడు నిర్మించాడు. ఆలయం చుట్టూ చెక్కబడిన శిల్పాలు, వాటిని చూడడానికి సుమారు పది అడుగుల ప్రదక్షిణా పథం ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తయిన ద్వారం నిర్మించబడింది. దీనికి ఎదురుగా సూర్య దేవాలయం, దక్షిణాభిముఖంగా వాసుదేవాలయం ఉన్నాయి. కాబట్టి ఈ వేయి స్తంభాల గుడి త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధిచెందింది. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన నంది విగ్రహం జీవం ఉట్టిపడేలా ఉంటుంది. హనుమకొండలో ఉన్న ఈ చారిత్రక రుద్రేశ్వర స్వామి దేవాలయం వేయి స్తంభాల గుడిగా కాకతీయుల కళా విభవానికి అద్దం పడుతుంది. కాకతీయ రాజులు ఇక్కడి నుంచి సొరంగ మార్గం ద్వారా భద్రకాళీ ఆలయానికి, వరంగల్‌ కోటకు, రామప్ప దేవాలయానికి వెళ్ళేవారని చెబుతారు. రుద్రేశ్వరాలయంలో నిత్య పూజలు, అభిషేకాలతో పాటు కార్తిక పౌర్ణమి, మహా శివరాత్రి, శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

వేములవాడ – కోడెమొక్కుల రాజరాజేశ్వరస్వామి దేవాలయంతెలంగాణలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో వేములవాడ అగ్రగణ్యమైంది. ప్రధాన దైవం శ్రీరాజరాజేశ్వరుడు. ఈ ఆలయాన్ని చాళుక్యవంశ రాజులు నిర్మించారు. జగత్పతి అయిన పరమేశ్వరుడు ఇక్కడ నివాసం ఉండడం వల్ల ఈ క్షేత్రం భక్తులకు పుణ్యస్థలంగా ప్రసిద్ధి పొందింది.

వృత్రాసురుని చంపిన ఇంద్రుడు బ్రహ్మ హత్యా దోషాన్ని నివారించు కునే ప్రయత్నంలో అనేక క్షేత్రాలను దర్శించినాడు. అయినా అతనికి ఫలితం లభించలేదు. దేవగురువు బృహస్పతి సూచన మేరకు రాజేశ్వర క్షేత్రాన్ని చేరుకొని, ధర్మకుండంలో స్నానం చేసి, దేవదేవుని దర్శించి బ్రహ్మహత్యాదోషం నుండి విముక్తుడైనాడు.

చాళుక్యరాజులలో గొప్పవాడు రెండవ అరికేసరి. ఇతడి తంత్ర పాలకుడు పెద్దనార్యుడు. రాజేశ్వరదేవుని వద్దకు వచ్చే భక్తులకు అన్నదాన సత్రాలు వేములవాడలో ఉండేవి. పెద్దనార్యుని కోరిక మేరకు సత్రాల నిర్వహణకు శతవర్తన విస్తారమైన భూమిని, 8 నివర్తనాల నీరునేలను దానమిస్తూ శాసనం వేయించాడు. ఈ శాసనం వల్ల వేములవాడ చాళుక్యుల చరిత్ర తెలుసుకోడానికి వీలవుతుంది.

వేములవాడలో ప్రధాన ఆలయమైన రాజేశ్వర స్వామి ఆలయం కాక అనేక ఇతర ఉప ఆలయాలున్నాయి. రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయం, కాశీ విశ్వేశ్వరాలయం, కోదండ రామాలయం, ఉమా మహేశ్వరాలయం, బాలా త్రిపురసుందరీ దేవి ఆలయం, బాల రాజేశ్వరాలయం, విఠలేశ్వరాలయం, సోమేశ్వరాలయం, భీమేశ్వరాలయం, కనకదుర్గ, మహాలక్ష్మి ఆలయాలు, బద్ది పోచమ్మ గుడి (శీతలాదేవి ఆలయం) ద్వాదశ లింగాలు, శివ పంచాయతనములు మొదలైన దేవతల ఆలయాలు వివిధ కాలాల్లో నిర్మించబడి నాటినుండి నేటివరకు పూజలందుకుంటున్నాయి.

కష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం వాడపల్లి. ఇది కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రదేశం. దీనికి మూడు వైపులా నీరు, ఒక వైపు భూభాగం ఉంది. ఇది నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఏకైక జలదుర్గం. దీనిచుట్టూ లోతైన కందకం ఉండి బలిష్టంగా నిర్మించబడింది.

వాడపల్లిలో రెండు ప్రాచీన, ప్రసిద్ధ శైవ, వైష్ణవ క్షేత్రాలు నిర్మించ బడినాయి. రాష్ట్ర రాజధాని నుంచి జహీరాబాదు వెళ్ళే మార్గంలో ఝరాసంగమనే గ్రామంలో పరమశివుడు సంగమేశ్వర స్వామిగా వెలసినాడు. ఈయననే కేతకీ సంగమేశ్వరుడని కూడా అంటారు. పూర్వం ఈ ప్రాంతం కేతకీ వనమని, శౌనకాది మునులు ఇక్కడ యజ్ఞ యాగాదులు నిర్వహించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడున్న గుండాన్ని ‘అమృత గుండం’ అంటారు.

కాళేశ్వరం – ముక్తేశ్వర, కాళేశ్వర స్వామి దేవాలయంభారతదేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం కాళేశ్వరాలయం ప్రత్యేకత. ఈ క్షేత్ర ప్రస్తావన స్కాంద, గౌతమీ పురాణాల్లో కనిపిస్తుంది. దేవాలయంలో మొదట కాళేశ్వరుడిని (యముడు) పూజించి తర్వాత ముక్తేశ్వరుడిని (శివుడు) పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీనికి ఒక కథ ప్రచారంలో ఉంది. ముక్తేశ్వర స్వామిని దర్శించిన భక్తులకు స్వామి ముక్తినివ్వడంతో యముడికి పని లేకుండా పోయిందట. ఆయన శివుడికి మొరపెట్టుకోగా తన పక్కనే యముడిని సైతం లింగాకారంలో నిల్చోమన్నాడట. తనని అర్చించి యముడిని అర్చించకుండా వెళ్ళే వారికి ముక్తి దొరకదు. అట్టి వారిని యముడు నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట.

ముక్తేశ్వర స్వామి లింగంలో విశేషంగా రెండు రంధ్రాలుంటాయి. వీటిలో నీటిని పోసి అభిషేకం చేస్తే మైలు దూరానికి ఆవల ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని చెబుతారు. చారిత్రకంగా వేంగి రాజైన విష్ణువర్ధనుడు కాళేశ్వర రాజ్యాన్ని జయించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం 26 కోనేరులను కలిగి పెద్ద పట్టణంగా విలసిల్లింది. కాకతి ప్రోలరాజు బంగారంతో తులాభారం తూగి స్వామికి అర్పించాడట. ముక్తేశ్వర, కాళేశ్వర స్వాములతో పాటు ఇక్కడ సరస్వతి ఆలయం, రామాలయం, ఆది ముక్తేశ్వర ఆలయం, బ్రహ్మాలయం కూడా ఉన్నాయి.

నల్లగొండ జిల్లాలో నల్లగొండ పట్టణానికి 3 కి.మీ. దూరంలో పానుగల్లు గ్రామం ఉంది. ఈ గ్రామం కందూరు చోళులు, కాకతీయులకు రాజధానిగా నిలిచింది. చారిత్రకంగా పానుగల్లుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రముఖ శివ కవి పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో పానగల్లును ప్రస్తావించడం జరిగింది. పానగల్లు నగరంలో శిథిల శివాలయాలు, నందీశ్వర విగ్రహాలు, పానవట్టాలతో కూడిన శివలింగాలు, శివుని పానవట్టం ఆకృతి కలిగిన రాళ్ళు ఈ ప్రాంతంలో లభించడం వలన ‘పానవట్టపు కల్లు’ క్రమంగా పానగల్లుగా మారి ఉండవచ్చని చారిత్రకుల కథనం.

పానగల్లులో ఎన్నో శిల్పకళా నిలయాలైన దేవాలయా లున్నాయి. వాటిలో ఛాయా సోమేశ్వరాలయం ముఖ్యమైంది. ఈ క్షేత్రాలే కాక ఇంకా తీర్థాల సంగమేశ్వరస్వామి ఆలయం, పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయం, సలేశ్వరం శివాలయం, భావిగి భద్రేశ్వరస్వామి ఆలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయం, రామప్ప, దేవాలయం, ఖాజీపేట మల్లికార్జున దేవాలయం…. ఇట్లా ఇంకా చాలా దేవాలయాలు అతి పురాతనమ్కెనవి, ప్రసిద్ధమైనవి తెలంగాణా అంతటా ఉన్నాయి.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...