Thursday, 11 February 2016

పర్యాటక స్వర్గధామం ఉత్తరాఖండ్‌

మనదేశంలోని అతిశీతల...ఆహ్లాదకర ప్రదేశాలలో ప్రముఖంగా చెప్పుకునేది డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ రాజధాని అయిన ఈ ప్రదేశం దేశీయ, విదేశీ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. కేవలం డెహ్రాడూన్ మాత్రమే కాదు నైనిటాల్, ముస్సోరీ, అల్మోరా, కౌసని, భిత్మల్, రాణీకత్, పితోర్‌గఢ్ లాంటి ప్రదేశాలు కూడా పర్యాటకులకు స్వర్గధామాలుగా ఉన్నాయి. చెప్పాలంటే... హిమలయ పర్వత శ్రేణి పాదాల చెంత పరుచుకున్న పచ్చదనంతో ఉత్తరాఖండ్ రాష్ట్రమంతా అందమైన పర్యాటేక కేంద్రాలతో, ఆధ్యాత్మిక కేంద్రాలతో అలరారుతుంది.


హిమాలయాల ఒడిలో పర్యాటకుల మనసు దోచుకుంటున్న ఉత్తరాఖండ్ విహారం... పర్యాటకుల మదిలో చిరకాలం గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరాఖండ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది డెహ్రాడూన్. కానీ, ఇప్పటిదాకా బయటపడని ఎన్నో అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను పరవశుల్ని చేయడమే కాదు సంస్కృతీ సాంప్రదాయల్లో కూడా ఉత్తరాఖండ్ ఎంతో పేరెన్నికగన్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కుంభమేళా... అంతేకాకుండా మనదేశంలో గోల్ఫ్ ఆటకు అనువైన ప్రదేశాలలో ఉత్తరాఖండ్ కూడా ఒకటి.
కార్బెట్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్... అంతరించిపోతున్న మన జాతీయ జంతువు పెద్దపులికి ఇష్టమైన నివాసం. అంతేకాకుండా పర్వాతారోహలకు ఎంతో ఇష్టమైన పర్వతశిఖారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాంటి వాటిలో నందాదేవి పీక్ ప్రముఖమైనవి. జాతీయ వింతలు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నందాదేవీ జాతీయ ఉద్యానవనం లాంటి ప్రదేశాలు తప్పకుండా చూసి తీరాల్సిందే. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లుగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందువరుసలో నిలుస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సందర్శకుల మనసుదోచే ఇలాంటి పర్యాటక కేంద్రాలు ఇక్కడ అనేకం ఉన్నాయి.

శక్తిస్వరూపిణి ఆవాసం... నైనిటాల్
సరస్సుల నగరంగా గుర్తింపు పొందిన నైనిటాల్‌లో ఒకప్పుడు సుమారు 60కి పైగా చెరువులు, సరస్సులు ఉండేవట. ఇందులో నైనీ అనే సరస్సు ఎంతో పేరుగాంచింది. ఇక్కడ మహాఋషులు, మునులు నివాసం ఉన్నట్టు స్కందపురాణంలో ఉంది. నైనిటాల్ సరస్సును ట్రై రిషి సరోవర్ (ముగ్గురు ఋషుల సరోవరం) కూడా పిలుస్తారు. అత్రి, పులస్త్య, పులహ అనే మహా ఋషులు... నీరు దొరకకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నైనిటాల్‌లో ఒక సరస్సు నిర్మించాలని తలపెట్టారు. అలా ఒక లోతైన గుంతను తవ్వి... టిబెట్ దగ్గర ఉన్న పవిత్ర మానస సరోవరం నుండి నీటిని తెచ్చి నింపారని ప్రతీతి. అలా ఏర్పడిందే నేడు మనం చూస్తున్న నైనిటాల్ సరస్సు. ఈ సరస్సులో స్నానం చేస్తే సాక్షాత్తు ఆ మానస సరోవరంలోనే స్నానమాచరించినంత పుణ్యం దక్కుతుందట.

దేశంలో ఉన్న 64 శక్తిపీఠాలలో నైనిటాల్ కూడా ఒకటి. 64 ముక్కలైన పార్వతీ దేవి శరీరభాగాల్లో ఆమె కన్ను ఈ ప్రాంతంలో పడిందట. అలా ఈ ప్రాంతానికి నైనిటాల్ (హిందీలో నయన్ అంటే కన్ను) అనే పేరు వచ్చిందని ప్రతీతి. అందుకే ఆ శక్తి స్వరూపిణిని ఇక్కడ నైనాదేవి పేరుతో పిలుస్తారు. నైనాదేవీ ఆలయం దేశంలోని శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పర్యాటకులు ఇక్కడి చేరుకోవాలంటే... దగ్గరి విమానాశ్రయం పంత్‌నగర్. ఇది నైనిటాల్‌కు 71 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి రోడ్డు మార్గం గుండా వెళ్లవచ్చు. రైలుమార్గం ద్వారా చేరుకునే పర్యాటకులు కథ్‌గోదామ్ రైల్వే స్టేషన్ గుండా వెళ్ళవచ్చు (ఈ స్టేషన్ నైనిటాల్‌కు 31 కి.మీ).




ప్రముఖల తాత్కాలిక విడిది... ఆల్మోరా
ఉత్తరాఖండ్‌లో పచ్చదనంతో మైమరిపించే మరో ప్రదేశం ఆల్మోరా. ఇక్కడి ప్రకృతి పచ్చదనానికి పరవశించని పర్యాటకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రశాంత వాతారణంతో కొండకోనలతో అలరారుతున్న ఈ ప్రాంతాన్ని చూస్తే ప్రకృతీమాత తన నైపుణ్యాన్నంతటినీ రంగరించి మరీ తీర్చిదిద్దిందా అనిపిస్తుంది. కోశీ, సుయాల్ నదుల ప్రవాహం ఆల్మోరాకు మరింత అందాన్ని చేకూర్చింది. ఆల్మోరా ప్రకృతి అందాలతోనే కాదు, ప్రముఖుల నివాసాలతో ప్రసిద్ధిగాంచింది. స్వామీ వివేకానంద తన హిమాలయాల పర్యటనలో ఆల్మోరాను తాత్కాలిక విడిదిగా ఎంచుకున్నారట. అలా ఆయన కొన్నాళ్ళు ఇక్కడే గడిపాడట. అంతేకాకుండా స్వాత్రంత్య సమరయోధుడు గోవింద్ వల్లభ్ పంత్, ప్రముఖ హిందీ విద్వాంసుడు సుమిత్రానందన్ పంత్, నోబెల్ గ్రహీత సర్ రొనాల్డ్ రాస్‌లకు జన్మస్థలం ఆల్మోరా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా తన బాల్యంలో కొంతకాలాన్ని ఇక్కడే గడిపాట. ధోని తండ్రికి రాంచీలో స్థిరపడక మునుపు ఇక్కడ ఫామ్‌లు ఉండేవట. ఇక్కడి చేరుకోవాలంటే నైనిటాల్‌కు మాదిరిగానే పంత్‌నగర్ విమానాశ్రయం నుండి చేరుకోవాలి. రైలుమార్గం గుండా వచ్చే పర్యాటకులు కోథ్‌డామ్ రైల్వేస్టేషన్ నుండి చేరుకోవచ్చు.

గోల్ఫ్ కోర్స్‌ల చిరునమా... రాణీఖేత్
మనదేశంలో గోల్ఫ్ ఆటకు సంబంధింన మైదానాలకు మారుపేరు రాణీఖేత్. ఎటుచూసిన పచ్చని తివాచీ పరిచనట్లుండే ఈ ప్రాంతంలో 9 మౌంటేన్ గోల్ఫ్ లింక్‌లు ఉన్నాయి. ఓక్ అడవుల్లో విస్తరించి ఉన్న ఈ గోల్ఫ్ కోర్స్‌లు పర్యాటకులను ఇట్టే కట్టిపడే స్తాయి. చలికాలంలో మంచు దుప్పటి పరుచుకున్న ట్లుండే ఈ ప్రదేశం వేసవిలో మాత్రం సైనిక స్థావరంగా సేవలందిస్తుంది. ఇవేకాకుండా ఝులా దేవి ఆలయం, చౌభాటియా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. సమీపంలోని కథ్‌గోదామ్ రైల్వేస్టేషన్ గుండా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. దూర్రపాంతం నుండి వచ్చే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయం... పంత్ నగర్. ఇది రాణీఖేత్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

స్విట్జర్‌లాండ్ ఆఫ్ ఇండియా... కౌసని
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన పూలలోయ కౌసనికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 10 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పుతో పరుచుకున్న ఈ ఫ్లవర్ వ్యాలీ చూపరులను కట్టిపడేస్తుంది. దీనిని సాక్షాత్తు దేవభూమిగా పిలుస్తారు. ఇవేకాకుండా పంచ్ కేదార్, క్యారీ పాస్, బిన్సర్, ముక్తేశ్వర్, రూప్‌కుండ్‌లు కౌసని ని దేశంలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మలిచాయి. ఇప్పుడిప్పుడే అడ్వెంచర్ టూరిజం ఇక్కడ ఊపందుకుంటుంది. ప్రకృతి అందాలకు నెలవైన ఈ ప్రదేశంలో రివర్ రాఫ్టింట్, పారా గ్లైడింగ్, మౌంటెనేరింగ్, ట్రెక్కింగ్ లాంటి సదుపాయాలు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ హిందీ కవి సుమిత్రనందన్ పంత్ జన్మస్థలం అయిన కౌసనిలోని హిల్ స్టేషన్లు, కఫ్నీ హిమనీ నదాలు, సుందర్‌దూంగా, సోమేశ్వర్, పినాకేశ్వర్, బైజ్‌నాథ్, లక్ష్మీ ఆశ్రమ్ వంటి వాటితో ఇండియన్ స్విట్జర్‌లాండ్‌గా పేరుగాంచింది.

మినీ కాశ్మీర్... పితోర్‌గఢ్
చాంద్ రాజుల కాలంలో దేవలయాల నగరంగా విరాజిల్లిన ఈ ప్రాంతంలో కనువిందు చేసే అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని సోర్ వ్యాలీ... అని, మినీ కాశ్మీర్ కూడా పిలుస్తారు. అశుర్ చులా, ఆస్కోట్ శాం క్చరీలు... చందక్ పర్వత సానువులు... మను, ధ్వజ్, తల్ కేదార్, నకులే శ్వర (దేశంలో నకుల సహదేవుల ఏకైక ఆలయం) దేవాలయాలు... లాంటి అనేక ప్రదేశాలతో, చుట్టూ పచ్చదనంతో అలరారుతోంది పితోర్‌గఢ్.

ఎడోబ్ ఆఫ్ గాడ్స్
వేల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ప్రదేశంలో ఎంతోమంది ఋషులు, మునులు నివసించారని ప్రతీతి. అంతేకాకుండా సకల పాపాలను దూరంచేసే పవిత్ర గంగా యమున మహానదులకు పుట్టినిల్లు ఉత్తరాఖండ్. ఏటా గంగోత్రి, యమునోత్రి ప్రదేశాలను సందర్శించే యాత్రికుల సంఖ్య లక్షల్లో ఉం టుంది. ఈ నదుల పరీవాహక ప్రదేశాలైన బద్రీనాథ్ (విష్ణుమూర్తి ఆలవాలం), కేదార్‌నాథ్ (శివుడి నివాసం) లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలతో అలరారుతుంది. అంతేకాదు, ఋషికేష్, ప్రయాగ, హరిద్వార్ లాంటి ప్రదేశాల గురించి చెప్పాల్సిన పనిలేదు.

దేశంలో అతిపెద్ద హిందూ ఉత్సవంగా పేరుగాంచిన మహాకుంభ మేళా ఇక్కడ హరిద్వార్ లోనే జరుగు తుంది. ప్రతి పన్నెండు ఏళ్ళ కొకసారి జరిగే ఈ ఉత్సవానికి దేశంలోని అన్ని ప్రాంతాలనుండే కాకుండా ప్రపంచం నలుమూల నుండి భక్తులు తండో పతండాలుగా విచ్చేస్తారు. ఇలా ఆధ్యా త్మిక ప్రదేశాలకు ఆలవాలంగా ఉన్న ఈ ప్రదేశాన్ని దేవతల నివాసంగా పిలుచు కుంటారు. వేలాది సంవత్సరాలుగా భక్తులను ఆకర్షి స్తున్న పుణ్య క్షేత్రాలు బద్రీనాథ్, కేదార్ నాథ్, ఋషికేష్ లాంటి పుణ్యక్షేత్రాలే కాకుండా బ్రిటీష్‌కాలం నుండి ముస్సోరీ, ఆల్మోరా, రాణీకేత్ లాంటి పర్యాటకకేం ద్రాలు సందర్శకులకు మంచి ఆకర్షణలుగా అభివృద్ధి చెందాయి. ఉత్తరా ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమైన ఆర్థికవనరు ఆ రాష్ట్ర టూరిజం అంటే అతిశయోక్తికాదు.

గేట్‌వే ఆఫ్ గంగోత్రి... ముస్సోరీ
పవిత్ర గంగా, యమునా నదుల జన్మస్థలాలైన గంగోత్రి, యమునోత్రిలకు వెళ్ళాలంటే ఈ ముస్సోరీ నుండే వెళ్ళాలి. అందుకే దీనిని గేట్‌వే ఆఫ్ గం గోత్రి, యమునోత్రి అని పిలుస్తారు. ముస్సోరీ అనే పేరు చెట్ల నుండి వచ్చింది. ఎటు చూసినా ఇక్కడ ముస్సోరీ వృక్షాలు కని పిస్తాయి. ఇక్కడ అన్ని టికంటే చెప్పు కోవాల్సిన ప్రదే శం గన్‌హిల్ దేశంలోనే రెండో ఎత్తైన పర్వతసాణువు ఇది. గన్ హిల్‌పై రోప్ వే ప్రయాణం జీవితంలో మరిచి పోలేని మధురా నుభూతిని అందిస్తుంది. ఇవేకా కుండా నాగ్ దేవత ఆల యం, ముస్సోరీ సరస్సు, సర్ జార్జ్ ఎవరెస్ట్ హౌజ్, భట్టాపాల్, కెంఫ్టీ ఫాల్ ఇక్కడ చూడ దగ్గ ప్రదేశాలు. ఢిల్లీ, డెహ్రా డూన్‌ల నుండి ఇక్కడి రవాణా సదుపాయాలున్నాయి.

హిమశిఖరం.....ఉత్తరాఖండ్

 
హిమాలయాల ఒడిలో పర్యాటకుల మనసు దోచుకుంటున్న ఉత్తరాఖండ్ వేసవి విహారం... వారి మదిలో చిరకాలం గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరాఖండ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది డెహ్రాడూన్. కానీ, ఇప్పటిదాకా భయటపడని ఎన్నో అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను పరవశుల్ని చేయడమే కాదు సంస్కృతీ సాంప్రదాయల్లో కూడా ఉత్తరాఖండ్ ఎంతో పేరెన్నికగన్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కుంభమేళ. అంతేకాకుండా మనదేశంలో గోల్ఫ్ ఆటకు అనువైన ప్రదేశాలలో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. 'కోర్బట్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్'... అంతరించిపోతున్న మన జాతీయ జంతువు పెద్దపులికి ఇష్టమైన నివాసం. అంతేకాకుండా పర్వాతారోహలకు ఎంతో ఇష్టమైన పర్వతశిఖారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాంటి వాటిలో 'నందాదేవి పీక్' ప్రముఖమైనవి. జాతీయ వింతలు 'వాలీ ఆఫ్ ఫ్లవర్స్', 'నందాదేవీ జాతీయ ఉద్యానవనం' లాంటి ప్రదేశాలు తప్పకుండా చూసి తీరాల్సిందే. 'యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్'లు గా గుర్తింపు సంపాదించుకున్న ఈ ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందువరుసలో నిలుస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సందర్శకుల మనసుదోచే ఇలాంటి పర్యాటక కేంద్రాలు ఇక్కడ అనేకం ఉన్నాయి.

సరస్సుల నగరంగా గుర్తింపు పొందిన నైనితాల్ లో ఒకప్పుడు సుమారు 60కి పైగా చెరువులు, సరస్సులు ఉండేవట. ఇందులో 'నైనీ' అనే సరస్సు ఎంతో పేరుగాంచింది. ఇక్కడ మహాఋషులు, మునులు నివాసం ఉన్నట్టు స్కందపురా ణంలో ఉంది. నైనితాల్ సరస్సును 'ట్రై రిషి సరోవర్' (ముగ్గురు ఋషుల సరోవరం) కూడా పిలుస్తారు. అత్రి, పులస్త్య, పులహ అనే మహాఋషులు... నీరు దొరకకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నైనితాల్‌లో ఒక సరస్సు నిర్మించాలని తలపెట్టారు. అలా ఒక లోతైన గుంతను తవ్వి... టిబెట్ దగ్గర ఉన్న పవిత్ర మానస సరోవరం నుండి నీటిని తెచ్చి నింపారని ప్రతీతి. అలా ఏర్పడిందే నేడు మనం చూస్తున్న నైనితాల్ సరస్సు. ఈ సరస్సులో స్నానం చేస్తే సాక్షాత్తు ఆ మానస సరోవరంలోనే స్నానమాచరించినంత పుణ్యం దక్కుతుందట. దేశంలో ఉన్న 64 శక్తిపీఠాలలో నైనితాల్ కూడా ఒకటి. 64 ముక్కలైన పార్వతీ దేవి శరీరభాగాల్లో ఆమె కన్ను ఈ ప్రాంతంలో పడిందట. అలా ఈ ప్రాంతానికి నైనితాల్ (హిందీలో నయన్ అంటే కన్ను) అనే పేరు వచ్చిందని ప్రతీతి. అందుకే ఆ శక్తి స్వరూపిణిని ఇక్కడ నైనాదేవి పేరుతో పిలుస్తారు. నైనాదేవీ ఆలయం దేశంలోని శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పర్యాటకులు ఇక్కడి చేరుకోవాలంటే... దగ్గరి విమానాశ్రయం పంత్‌నగర్. ఇది నైనితాల్‌కు 71 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి రోడ్డు మార్గం గుండా వెళ్లవచ్చు. రైలుమార్గం ద్వారా చేరుకునే పర్యాటకులు కథ్‌గోదామ్ రైల్వే స్టేషన్ గుండా వెళ్ళవచ్చు (ఈ స్టేషన్ నైనితాల్‌కు 31 కి.మీ).

 
ఉత్తరాఖండ్‌లో పచ్చదనంతో మైమరిపించే మరో ప్రదేశం ఆల్మోరా. ఇక్కడి ప్రకృతి పచ్చదనానికి పరవశించని పర్యాటకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రశాంత వాతారణంతో కొండకోనలతో అలరారుతున్న ఈ ప్రాంతాన్ని చూస్తే ప్రకృతీమాత తన నైపుణ్యాన్నంతటినీ రంగరించి మరీ తీర్చిదిద్దిందా అనిపిస్తుంది. కోశీ, సుయాల్ నదుల ప్రవాహం ఆల్మోరాకు మరింత అందాన్ని చేకూర్చింది. ఆల్మోరా ప్రకృతి అందాలతోనే కాదు, ప్రముఖుల నివాసాలతో ప్రసిద్ధిగాంచింది. స్వామీ వివేకానంద తన హిమాలయాల పర్యటనలో ఆల్మోరాను తాత్కాలిక విడిదిగా ఎంచుకున్నారట. అలా ఆయన కొన్నాళ్ళు ఇక్కడే గడిపాడట. అంతేకాకుండా స్వాతంత్య్ర సమరయోధుడు గోవింద్ వల్లభ్ పంత్, ప్రముఖ హిందీ విద్వాంసుడు సుమిత్రానందన్ పంత్, నోబెల్ గ్రహీత సర్ రొనాల్డ్ రాస్‌లకు జన్మస్థలం ఆల్మోరా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా తన బాల్యంలో కొంతకాలాన్ని ఇక్కడే గడిపాట. ధోని తండ్రికి రాంచీలో స్థిరపడక మునుపు ఇక్కడ ఫామ్‌లు ఉండేవట. ఇక్కడి చేరుకోవాలంటే నైనితాల్‌కు మాదిరిగానే పంత్‌నగర్ విమానాశ్రయం నుండి చేరుకోవాలి. రైలుమార్గం గుండా వచ్చే పర్యాటకులు కోథ్‌డామ్ రైల్వేస్టేషన్ నుండి చేరుకోవచ్చు.

మనదేశంలో గోల్ఫ్ ఆటకు సంబంధింన మైదానాలకు మారుపేరు రాణీఖేత్. ఎటుచూసిన పచ్చని తివాచీ పరిచనట్లుండే ఈ ప్రాంతంలో 9 మౌంటేన్ గోల్ఫ్ లింక్‌లు ఉన్నాయి. ఓక్ అడవుల్లో విస్తరించి ఉన్న ఈ గోల్ఫ్ కోర్స్‌లు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి. చలికాలంలో మంచు దుప్పటి పరుచుకున్నట్లుండే ఈ ప్రదేశం వేసవిలో మాత్రం సైనిక స్థావరంగా సేవలందిస్తుంది. ఇవేకాకుండా ఝులా దేవి ఆలయం, చౌభాటియా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. సమీపంలోని కథ్‌గోదామ్ రైల్వేస్టేషన్ గుండా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. దూరప్రాంతం నుండి వచ్చే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయం... పంత్ నగర్. ఇది రాణీఖేత్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అందమైన ప్రకృతి ప్రాంతం పట్టిసీమ

పట్టిసీమ గ్రామం నుంచి కొద్ది దూరంలో గోదావరిలో దేవకూట పర్వతంపై వెలసిన వీరభద్రస్వామి, భావనారాయణ స్వామి వార్ల ఆలయాల వల్లే ఈ ఊరికి పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

ఆలయ విశేషాలు : 
పాపికొండల మధ్య సాగే గోదావరి నది ఒడ్డున ఉన్న చిన్న కొండపై ఈ వీరభద్రస్వామి దేవస్థానం కొలువై ఉంది. చుట్టూ గోదావరి మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం గంభీరంగానూ, అందంగానూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే దాదాపు అన్ని కాలాల్లో ఇక్కడ సినిమా షూటింగ్‌లు సైతం జరుగుతుంటాయి. పట్టిసం అని, పట్టిసీమ అని రెండు రకాలుగా పిలిచే ఈ ఊరిలో వెలసిన వీరభద్రస్వామి ఆలయం మరీ అంత పెద్దది కాకపోయినా సమీప గ్రామాల్లో ఈ ఆలయం అంటే విశేషమైనదిగానే పేరు పొందింది. ఏడాది మొత్తంలో జరిగే చిన్నా చితకా ఉత్సవాలతో పాటు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఐదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు చుట్టూ ఉన్న ఊర్ల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.

వసతి సౌకర్యాలు :
కొంతకాలం క్రితం వరకు ఈ వీరభద్రస్వామి దేవస్థానం అంతగా అభివృద్ధి చెందని కారణంగా ఇక్కడ సౌకర్యాలు సైతం అరాకొరగానే ఉండేవి. అయితే ఇటీవలి కాలంలో దేవస్థానంకు రాబడి పెరిగిన కారణంగా విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా దేవాలయం ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఇక్కడ భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

రవాణా సౌకర్యాలు: 
తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ నగరమైన రాజమండ్రి నుంచి ఈ పట్టిసీమ దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుంచి పట్టిసీమకు ఎల్లప్పుడూ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రకృతినీ ఆస్వాదిస్తూ వెళ్లాలనుకునే వారికి రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య ప్రవహించే గోదావరిపై ప్రయాణించే లాంచీలు కూడా అందుబాటులో ఉన్నాయి.


 
పట్టిసీమ భావనారాయణ స్వామి
పంచ భావనారాయణ స్వామి క్షేత్రాలలో పట్టిసీమ భావనారాయణ స్వామికి ఎంతో విశిష్టత వుంది. ఇక్కడి భావనారాయణ స్వామికి యుగయుగాల నాటి చరిత్ర వుంది. శ్రీ మన్నారాయణుడి అనుగ్రహాన్ని కోరుతూ జాంబవంతుడు తపస్సు చేయగా, ఈ క్షేత్రంలో భావనారాయణ స్వామిగా అవతరిస్తానని స్వామి మాట ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కృతయుగంలో స్వామి వైకుంఠంలో అమ్మవారితో ముచ్చటిస్తూ వుండగా, ఒక ఏనుగు ఆర్తనాదం వినిపించింది. దాహం తీర్చుకోవడం కోసం ఒక ఏనుగు సరస్సులోకి దిగగా, దాని కాలును ముసలి గట్టిగా పట్టుకుంటుంది. తన శక్తినంతటిని ఉపయోగించి ఆ ఏనుగు దాని బారి నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తోంది. తన శక్తి నశిస్తూ ఉండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో శ్రీ మహా విష్ణువును ప్రార్ధిస్తుంది. ఆ అరుపులోని భావనను బట్టి ఆ ఏనుగు ఎంతగా బాధపడుతుందో శ్రీ మహావిష్ణువు అర్థం చేసుకున్నాడు. ఆ మూగ జీవాన్ని రక్షించాలనే తాపత్రయంతో శంఖు చక్రాలను కూడా మరిచిపోయి కంగారుగా ఆ సరస్సు దగ్గరికి చేరుకొని ఏనుగుకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆర్తుల మనసులోని భావనను బట్టి వారిని రక్షించే స్వామి కావడంతో భావనారాయణ స్వామిగా భక్తులు కొలుస్తుంటారు. ఏనుగును కాపాడే హడావిడిలో స్వామి ఉన్న సమయంలో, నారద మహర్షి ఆయన శంఖు చక్రాలను తీసుకు వచ్చి ఇచ్చాడు. ఏనుగును కాపాడే ఆదుర్దాలో స్వామి వాటిని అపసవ్యంగా ధరించాడు. నేటికీ స్వామి ఇదే ముద్రలో ఇక్కడ దర్శనమిస్తుంటాడు. జాంబవంతుడికి ఇచ్చిన మాటమేరకు స్వామి ఇక్కడ 'దేవకూట పర్వతం'పై శ్రీ భూనీలాదేవి సమేతుడై వెలిశాడు. ఇలా కృతయుగంలో ఆవిర్భవించిన స్వామి ఎందరో మహర్షులచే దేవతలచే పూజలందు కున్నాడు.

కలియుగంలో కూడా ఎందరో మహానీయులచే ఆరాధించబడిన స్వామికి చోళ రాజులు ఆలయాన్ని నిర్మించగా, రెడ్డి రాజులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. భక్తుల భావనను గ్రహించి వారి కోరికలను స్వామివారు సత్వరమే నెరవేరుస్తాడని స్థానికులు చెబుతుంటారు. ప్రతియేటా స్వామివారికి చైత్ర శుద్ధ ఏకాదశి రోజున కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరిస్తుంటారు.

మంచి కాఫీలాంటి మడికేరి

భారతదేశపు స్కాట్లాండ్‌గా పేరుగాంచిన కూర్గ్ లేదా మడికేరి, కొడగు జిల్లా కేంద్రంగా బాసిల్లుతూ ఉన్నది. సముద్ర మట్టానికి 1525 మీటర్ల ఎత్తున ప్రకృతి ఒడిలో ప్రభవించిన కూర్గ్, బెంగుళూరు నగరానికి 252 కి.మీ.ల దూరంలో ఉంది. ఏటవాలు పర్వతంపై చిక్కటి అరణ్యాన్ని పాదుకున్న కూర్గ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, దట్టమైన అడవి, వేల ఎకరాల మేర విస్తీర్ణంలో ఆవరించుకున్న టీ మరియు కాఫీ తోటలు, నారింజ తోటలు... ఊపిరి సడలనివ్వని సుందర దృశ్యాలతో మరిచిపోలేని విరామ విడిదిగా మడికేరి అలరారుతున్నది. అంతేకాదు... ఇక్కడ స్థానికంగా గల దర్శనీయ స్థలాలు మడికేరికి అదనపు ఆకర్షణను చేకూరుస్తున్నాయి.

సూర్యాస్థమయ వీక్షణం: 
శతాబ్ద కాలానికిపైగా చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న మడికేరి కోటలో దేవాలయం, ప్రార్థన మందిరం, చెరసాలలతో పాటు చిన్నపాటి పురావస్తు ప్రదర్శన శాల ఉన్నాయి. ఇక రాజాస్థానం గురించి చెప్పాలంటే, కొడగు రాజులు తమ సాయంత్రాలను ఇక్కడే గడిపేవారని వినికిడి. రాజాస్థానం నుంచి సూర్యాస్తమయాన్ని వీక్షించడం మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. మడికేరిలో ప్రత్యేకించి సందర్శించవలసినదిగా నాగర్‌హోళె జాతీయ ఉద్యానవనం పేరొందినది. ఏనుగులు, పులులు, చుక్కల జింకలు, అడవి దున్నపోతులు తదితర సమస్త జంతు జాలాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పర్యాటకుల సౌకర్యార్థం రాత్రిపూట కూడా బసచేసే ఏర్పాట్లు ఉద్యానవనంలో ఏర్పాటు చేశారు. మడికేరి సమీపంలో పర్యాటకులను, సినీజనాన్ని అమితంగా ఆకర్షించే అబ్బీ జలపాతం, భాగమండల మరియు కావేరీ నదీ జన్మస్థానమైన తలకావేరీలు పర్వతాలతో ఆవృతమై నేత్రానందం కలిగిస్తున్నాయి.

రామలక్ష్మణులు సంచరించిన ప్రాంతం: 
సీతాదేవిని వెదుకుతూ రామలక్ష్మణులు సంచరించినదిగా చెప్పబడే ఇరుప్పు జలపాతం, అటవీశాఖకు చెందిన ఏనుగులను పట్టుట మరియు శిక్షణా కేంద్రమైన దుబరే, ఇక్కడకు 30 కి.మీల దూరంలోని కావేరీ నదీ నిలువ నీళ్ళతో మనసుకు ఉల్లాసాన్ని కలిగించే వలనూర్, కావేరి, కనిక మరియు సుజ్యోతి నదులు సంగమించే భాగమండల, ప్రశాంతతకు ఆలవాలమైన నిసర్గధామ పర్యాటక స్థలాలు ప్రకృతి రమణీయతకు పట్టం కడుతున్నాయి.

వసతి సౌకర్యాలు : 
రోడ్డు మార్గం ద్వారా మాత్రమే ఇక్కడకు చేరుకోగలము. ఇక్కడకు రైలు మరియు విమాన సౌకర్యం లేదు. బెంగుళూరు, మైసూరు, మంగళూరు, కన్ననూరు మరియు తెల్లిచెర్రి నుంచి మడికేరికి బస్సు సౌకర్యం కలదు. సుందర పర్వత ప్రాంతమైన మడికేరిలో బస చేసేందుకు హోటళ్ళు ఉన్నాయి. కూర్గ్‌లో ఎటు చూసినా పచ్చదనం పరుచుకుపోయి కనిపిస్తుంది. గలగల పారే సెలయేర్లు, నదులు , కొండలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక జలపాతాలంటారా మనసును ఎక్కడికో తీసుకుపోతాయి. యువత ఇష్టపడే ట్రెక్కింగ్, రిఫ్టింగ్, వన్యప్రాణులు, రక రకాల పక్షులను ఇక్కడ చూడొచ్చు. దేవాలయాలు, బౌద్ధ ఆరామాలు, కోటలు కూర్గ్‌లో కనిపిస్తాయి. ఇన్ని అందాలకు నెలవైన కూర్గ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా...

 
అందమైన హిల్ స్టేషన్ కూర్గ్: 
దక్షిణ భారతదేశంలో కూర్గ్ అందమైన హిల్ స్టేషన్. బెంగుళూరుకు 252 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. సముద్రమట్టానికి 1525 మీటర్ల పైగా ఎత్తులో ఉండి దేశ విదేశాల నుంచి వస్తున్న పర్యాటకులనెందరినో ఆకట్టుకుంటోంది. కూర్గునే కొడగు అని కూడా అంటారు. నిజానికి దీనిని పూర్వం కొడైమాలనాడు అని పిలిచేవారు. ఎత్తౖన కొండమీదున్న దట్టమైన అడవులు అని దీని అర్థం. ఇది దాదాపు 3000 నుంచి 4000 అడుగుల ఎత్తు ఉంటుంది. కొడగు లేదా కూర్గ్‌కు మడికెరి హెడ్‌క్వార్టర్స్. పచ్చటి ప్రకృతి, జలపాతాలు, వన్యమృగాలు, పక్షులకు కూర్గ్ నిలయం. అంతేకాదు ఇక్కడ కాఫీ, టీ ప్లాంటేషన్లు కూడా బాగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తి ఇక్కడ నుంచే జరుగుతోంది. కొడగులో మూడు తాలుకాలున్నాయి. అవి మడికెరి, విరాజ్‌పేట్, సోమ్‌వారప్పేట్. ఈ ప్రాంతాలన్నీ పచ్చటి లోయలతో, ఎత్తౖనకొండలతో, సెలయేర్లతో కనులవిందు చేస్తాయి.

హనీమూన్ జంటలకు కనువిందు: 
పొగమంచునిండిన పచ్చటి అడవుల అందాలు చెప్పనక్కర్లేదు. కూర్గ్ చరిత్ర కూడా ఎంతో విశిష్టమైంది. ఈ ప్రాంతాన్ని ఎందరో రాజవంశీయులు పరిపాలించారు. ముఖ్యంగా దక్షిణాదిన ఉన్న పలు రాజవంశస్థులు అంటే కదంబాలు, గంగాలు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హోయసలలు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించిన వారిలో ఉన్నారు. కూర్గ్ హానీమూన్ జంటలకు ఎంతో బాగుంటుంది. అలాగే వేసవిలో గడపడానికి వచ్చేవారికి కూడా ఇది మంచి ప్రదేశం. ఇక సెలవులను ఎంజాయ్ చేయడానికి వచ్చే కుర్రకారైతే ఈ ప్రదేశంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడి జలపాతాలను జులై సెప్టెంబరు నెలల మధ్యలో చూస్తే ఎంతో బాగుంటుంది. అలాగే ఇక్కడి మాన్‌సూన్ సీజన్ సాహసప్రియులకు ఎంతో అనుకూలమైనది. ఆ టైములో రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. కూర్గ్‌కి సమీపంలో బైలకుప్పె అనే ప్రాంతం ఉంది. ఇది దక్షిణాదిలోనే అతి పెద్ద టిబెట్ సెటిల్‌మెంట్. ఇది మడికెరి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కూర్గ్‌కు 94 కిలోమీటర ్ల దూరంలో నగర్‌హోలె నేషనల్ పార్క్ ఉంది. ఇది కూడా చూడాల్సిన ప్రాంతం. ఇది అతి పెద్ద వన్యప్రాణుల పార్కు. ఇక్కడ పులులు, ఏనుగులు, నీటిగుర్రాలు, తోడేళ్లు వంటివెన్నో జంతువులు కనిపిస్తాయి. అంతేకాదు 250 రకాల పక్షులు అందులో ఉన్నాయి. ప్రత్యేకంగా బర్డ్ వాచింగ్ చేసేందుకు ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఎందరో ఉన్నారు.

చూడాల్సిన ప్రదేశాలెన్నో : 
కూర్గ్ అందాలు వర్ణించలేనంత బాగుంటాయి. అక్కడ అడుగుపెట్టగానే భూలోకస్వర్గంలా అనిపిస్తుంది. దీన్ని స్కాట్‌లాండ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా అంటారు. బెంగుళూరు లేదా మంగళూరు నుంచి టాక్సీలో కూర్గ్‌కి వెడితే దారిపొడుగునా ఎన్నో ప్రకృతి అందాలను చూడొచ్చు. కూర్గ్‌లో ఎక్కడ చూసినా పచ్చదనమే. పొగమంచుతో కప్పబడిన కొండలు చూస్తుంటే మబ్బుల్లో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాదు అక్కడ చిక్కటి అడవులు దర్శనమిస్తాయి. అడవిలోని రకరకాల మూలికా వృక్షాల వాసనలు అంతటా వ్యాపించి ఉంటాయి. ఎటు చూసినా కాఫీ ప్లాంటేషన్లు కనుల విందుగా కనిపిస్తుంటాయి. అక్కడి ప్రకృతి ఎంత స్వచ్ఛమైనదో కూర్గ్‌లోని ప్రజలు కూడా అంత స్వచ్ఛమనస్కులు. అక్కడి కొడవాలు ఎంతో స్నేహంగా ఉంటారు. విందు వినోదాలంటే వారికెంతో ఇష్టం. .

కావేరీ జన్మస్థలం: 
కూర్గ్‌లో చూడాల్సిన మరో ప్రాంతం తలకావేరీ. కావేరి నదికి మూలం ఇదే. 4,500 అడుగుల ఎత్తు నుంచి ఇది ప్రవహిస్తుంది. ఇది మడికెరి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం కన్నులు చెదిరేంత అందంగా ఉంటుంది.

అబ్బీ ఫాల్స్ ఇంకొకటి. దీన్నే జెస్సీ ఫాల్స్ అని కూడా అంటారు. అబ్బి అంటే స్థానిక కొడగు భాషలో జలపాతం అని అర్థం. మడికెరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. కూర్గ్ హిల్‌స్టేషన్‌కు వచ్చిన పర్యాటకులు దీన్ని చూడకుండా వెళ్లరు. ఈ జలపాతంలో వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీని శబ్దం రోడ్డు మీదకు వినిపిస్తుంది.

ఇంకో ప్రసిద్ధి చెందిన జలపాతం ఇరుప్పు ఫాల్స్. నాగర్‌హోల్ వెళ్లే దారిలోని విరాజ్‌పేట నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. దానికి దగ్గరలోనే లక్ష్మీతీర్థ నది ప్రవహిస్తుంటుంది. ఇరుప్పు ఫాల్స్‌లో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని స్థానిక ప్రజల విశ్వాసం. శివరాత్రి రోజు తప్పనిసరిగా ఇక్కడకు వచ్చి స్నానాలాచరిస్తారు.

ఓంకారేశ్వర దేవాలయం: 
కూర్గ్‌లో చూడాల్సిన గుడి ఓంకారేశ్వర దేవాలయం. ఇందులో శివునికి పూజలు చేస్తారు. ఈ దేవాలయం ఇస్లామిక్, గోథిక్ స్టైల్ ఆర్కిటెక్చర్‌లో కట్టారు. గుడి గోపురం మీద వాతావరణాన్ని తెలిపే బంతి ఆకారంలో ఉన్న క్లాక్ నిర్మాణం ఉంటుంది.

ఇక రాజాస్ సీట్ వచ్చి అద్భుతమైన ప్రకృతి దృశ్యాల్ని ఆవిష్కరిస్తుంది. ఎంతో అందమైన వ్యూ పాయింట్ ఇది. దీని నుంచి చుట్టూరా పరచుకున్న అడవులు, అందమైన సూర్యాస్తమయం చూడాలంటే రెండు కళ్లు చాలవు. కొడగు రాజులు ఇక్కడకు వచ్చి సాయంత్రాలు విశ్రాంతిగా గడిపేవారట. భాగమందాలా ఇక్కడ చూడాల్సిన మరో ప్రాంతం. దీన్ని టెంపుల్ టౌన్‌గా కూడా పేర్కొంటారు. కావేరి, కనిక, సుజ్యోతులనే మూడు నదుల కలిసిన చోట భాగమందాలా ఉంది. ఇక్కడ మడికెరి ఫోర్టును కూడా చూడొచ్చు. ఈ కోటను 19వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ ఒక మ్యూజియం, జైలు, దేవాలయం, చర్చి ఉన్నాయి. కూర్గ్‌లో వెలనూర్ అనే అందమైన హామ్లెట్ ఉంది. ఇది దుబారే అడవికి సమీపంలో ఉంది. ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంటుంది.

అక్కడ ఒక వైపు అడవులుంటే మరోవైపు కావేరీనది ప్రవహిస్తుంటుంది. ప్రకృతి ప్రేమికులకు, ఫిషింగ్ ఇష్టపడేవారికి ఇది ఎంతో నచ్చే ప్రదేశం. మడికెరికి 22 కిలోమీటర్ల దూరంలో అవందూర్ ఫాల్స్ ఉన్నాయి. ఎన్నో చిన్న ఏరులు కలిసిన జలపాతం ఇది. ఈ జలపాతం అవందూర్ అడవిలో ఉంది కాబట్టి దీనికి అవందూర్ ఫాల్స్ అని పేరొచ్చింది. కోటెబెట్టా కొడగు జిల్లాలోని మరో అతిపెద్ద శిఖరం. సముద్రమట్టానికి 5,400 అడుగుల ఎత్తులో ఇది ఉంది. కోటెబెట్టా మడపూర్‌లో ఉంది. మడికెరికి 22 కిలోమీటర్ల దూరంలో మడపూర్ ఉంది. కూర్గ్‌లో ఇది ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలమైన ప్రదేశం. అక్టోబరు మార్చి నెలల మధ్యలో ఇక్కడ ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బైలకుప్పెతోపాటు చూడాల్సిన మరో ప్రదేశం సిద్దాపురా. బైలకుప్పెలో ఎన్నో బౌద్ధ ఆరామాలు ఉన్నాయి.

గోల్ఫ్ కోర్సులు: 
ఇక అక్కడి ల్యాండ్‌స్కేప్ అందాలైతే చూడాల్సిందే గాని చెప్పలేం. సిద్దాపురా ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి. ఇక్కడి ప్రజలు కొడవ, కన్నడ, ఇంగ్లీషు భాషలు మాట్లాడతారు. ఇంకో విశేషమేమిటంటే కూర్గ్‌లో ఇండియా మొత్తంలో అధిక సంఖ్యలో గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. వీటన్నింటినీ మీకు చూడాలని ఉందా... మరెందుకు ఆలస్యం సెలవుల్లో కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి మరి....కూర్గ్‌కు ఏ సీజన్‌లోనైనా వెళ్లొచ్చు. కానీ బెస్ట్ టైమ్ అంటే మాత్రం సెప్టెంబరు, మార్చినెలల మధ్య సమయమే. అకామడేషన్‌కు కూడా ఇబ్బంది లేదు. అన్ని రకాల కస్టమర్లకు తగిన వసతి సదుపాయాలు అక్కడ లభ్యమవుతాయి. లగ్జరీ హోటల్స్‌తోపాటు హిల్ రిసార్ట్స్ కూడా ఉంటాయి. మధ్యతరగతివారికి వీలుగా మీడియం ధరలకే ఎకానమీ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా క్యాంప్స్, హోంస్టేస్ కూడా ఉన్నాయి.

చూడాల్సిన ప్రదేశాలు: 
రాజాస్ సీట్, ఓంకారేశ్వర టెంపుల్, మడికెరి కోట, అబ్బీ ఫాల్స్, గడ్డిగె, బైలెకుప్పె, తలకావేరి, బారాపోలె రివర్, సోమ్‌వారప్పేట్

కూర్గ్‌కు మార్గాలు
బెంగుళూరు నుంచి కూర్గ్‌కు దగ్గర.
హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు బస్ సౌకర్యం ఉంది. ప్రయాణం 14 గంటలు పడుతుంది. ఇండివిడ్యువల్ ట్రావలెర్స్‌కు ఇది సౌకర్యంగా ఉంటుంది.
వైజాగ్ నుంచి కూర్గ్‌కు దూరం 1282 కిలోమీటర్లు. రోడ్డు ద్వారా ప్రయాణం చేయడానికి 21 గంటలు పడుతుంది.

కూర్గ్‌కు దగ్గరలో మైసూర్ రైల్వే స్టేషన్ ఉంది. బస్సు, వాహనాల సౌకర్యం కూడా అందుబాటులో ఉంటాయి.
కూర్గ్ హైదరాబాద్‌కు 797 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ రైలు సౌకర్యం ఉంది. మైసూర్ రైల్వే స్టేషన్ నుంచి కూర్గ్ 117 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కూర్గ్‌కు నేరుగా ఫ్లైట్ సర్వీసులు లేవు. బెంగుళూరు లేదా మంగళూరు వరకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కూర్గ్‌కు సులభంగా చేరుకోవచ్చు. ఫ్లైట్‌లో వెళ్లాలను కుంటే హైదరాబాద్ నుంచి మంగళూరు వరకూ వెళ్లాలి. మంగళూరు నుంచి 140 కిలోమీటర్ల దూరంలో కూర్గ్ ఉంది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు ఫ్లైట్‌లో వెళ్లాలనుకునే వాళ్లకు టికెట్ ఖర్చు 2,291 రూపాయలతో మొదలవుతుంది. వైజాగ్ నుంచి కూర్గ్‌కు ఫ్లైట్ డిస్టెన్స్ 994 కిలోమీటర్లు. వైజాగ్ నుంచి మంగుళూరు ఫ్లైట్‌లో వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ 2,938 రూపాయల నుంచి ఉంటుంది. వైజాగ్ నుంచి బెంగుళూరు వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ 3,607 రూపాయల నుంచి ఉంటుంది.

లింగరాజు ఆలయం






లింగరాజు ఆలయం

ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని అతి పెద్ద దేవాలయం లింగరాజ దేవాలయం. లింగానికి రాజైన శివుని గుడి ఇది. ఇక్కడ శివుణ్ణి త్రిభువనేశ్వరుడనే పేరుతో పూజిస్తారు. దీనిని 1100 ఏళ్ల క్రితం నిర్మించారు. దీని ఎత్తు 180 అడుగులు. కళింగుల నిర్మాణశైలికి ఈ కట్టడం అద్దం పడుతుంది. ఒడిష గోల్డెన్ ట్రయాంగిల్‌ని విశ్లేషించడం అంటే...గోల్డెన్ ట్రయాంగిల్‌ని రూపొందించే మూడు ప్రసిద్ధ ఆలయాలు తెలుసుకోవాలి. అందులో ఒకటి భువనేశ్వర్ లోని లింగరాజ ఆలయం. తర్వాత పూరిలోని జగన్నాధ ఆలయం, కోణార్క్‌లోని సూర్యదేవాలయం ఒడిషలో ప్రముఖ పర్యాటక కారకాలుగా చెప్పుకోదగినవి.

ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ సోమ వంశీయుడయిన కేసరి అనే రాజు 11వ శతాబ్దంలో నిర్మించి ఉంటాడని భావిస్తున్నారు. చారిత్రక ఆధారాలను బట్టి కేసరి తన రాజధానిని జైపూర్ నుంచి భువనేశ్వర్‌కి మార్చినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం నాల్గు భాగాలుగా ఉంటుంది. వీటిలో ప్రధాన ఆలయం, యజ్ఞశాల, భోగ మండపం, నాట్యశాలలు ఉంటాయి.

లింగాలకు రాజు:
లింగరాజ అనగా లింగాలకు రాజు అనే అర్థము. ఈ ఆలయంలోని లింగమునకు త్రిభువనేశ్వర అనే పేరుగలదు. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు ముందర నిర్మించబడినది. కానీ ఈ ఆలయ నిర్మాణం 6వ శతాబ్దంలోనే జరిగిందని చెప్పడానికి ఆలయం వద్ద నున్న శిలాశాసనాలపై చెక్కబడిన సంస్కత లిపి సాక్ష్యంగా ఉన్నది.

నిర్మాణ శైలి:
లింగరాజ ఆలయం నిర్మాణ పటం - పై నుండి కిందికి విమాన (గర్భగుడి కలిగిన నిర్మా ణం), జగమే హన (అసెంబ్లీ హాల్), నటమందిర (వేడుకలు జరిపే గది) మరియు భోగమండప (సంతర్పణల గది) ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలోని అన్ని ఆలయాలలో కెల్లా పెద్దది. జేమ్స్ ఫెర్గుసన్ (1808 18 86), అనే చరిత్ర పకారుడి అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం భారతదేశంలోని గొప్ప హిందూ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం చుట్టూ విశాలమైన ప్రహరీ ఉన్నది.

ఒడిష గోల్డెన్ ట్రయాంగిల్:
గోల్డెన్ ట్రయాంగిల్‌ని రూపొందించే మూడు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి, భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయం, పూరిలోని జగన్నాధ ఆలయం, కోణార్క్‌లోని సూర్యదేవాలయం ఒడిషలో ప్రముఖ పర్యాటక కారకాలు. భువనేశ్వర్ యాత్ర ప్రయాణాన్ని ఒడిషలో ప్రారంభించడం ఖచ్చితమైన మార్గం. ఈ నగరం వందకంటే ఎక్కువ ఆలయాలను అందిస్తుంది వాటిలో అనేకమైనవి గొప్ప చారిత్రిక సంబంధం కలిగి ఉన్నాయి.

ఒడిష తరువాత పూరి మరో గమ్యస్థానం. పూరి భారత దేశంలోని పవిత్ర చార్‌దామ్‌లలో ఒకటి. మరో మూడు ద్వారకా, బద్రినాద్, రామేశ్వరం. ఆశక్తికరంగా, ఈ పవిత్ర భూమిని సందర్శిస్తే కనీస ప్రయత్నంతో ఎక్కువ ఫలితాలు పొందవచ్చని కూడా భక్తుల ప్రగాఢ నమ్మకం. ఒడిషలోని నిర్మాణ పరిపూర్ణ శైలిని ప్రతిబింబించే సూర్యదేవాలయంతో ఈ కోణార్క్ గ్రామం ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం శిధిలమై పోయింది, ఇప్పటికీ ఇది శిల్పాలు, చేక్కుల్లలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరుగాంచింది. ఒడిష దాని విస్మయ-స్పూర్తితో రాష్ట్రం మొత్తంలో నిర్మాణ శైలిలో పెరుగంచడమే కాకుండా, గర్వించదగ్గ అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. జైన్ స్మరక చిహ్నాలు, బౌద్ధ కేంద్రాలు, వన్య ప్రాణుల అభయారణ్యాలు ఒడిష సంపద ఎంత వైవిధ్యంగా ఉందొ తెలియచేస్తుంది. ఒడిష పట్టణ, గ్రామీణ పరిపూర్ణ సమ్మేళనం. జనాభాలో ఎక్కువమంది వ్యవసాయ కార్మికులు. ఎక్కువమంది నివాసితులు నగరాలకంటే గ్రామాలలోనే ఉంటున్నారు. రాష్ట్రము మొత్తం జనాభాలో దాదాపు ఒక వంతు గిరిజన వర్గాల వారు ఉన్నారు. ఈ కమ్యూనిటీలు ఇప్పటికీ వారి సంస్కౄతిని అనుసరిస్తున్నారు, అలాగే వారి సంప్రదాయాన్ని సంరక్షించుకుంటున్నారు. ఒరియా రాష్ట్ర అధికారిక భాష. అయితే హిందీ, ఇంగ్లీష్ వినియోగం వల్ల రాష్ట్ర అభివృద్ది కుంటుపడలేదు.

ఒడిష సంస్కతి, వంటకాలు సంప్రదాయాన్ని ఆదరించే రాష్ట్రం కావడంతో, రాష్ట్ర ప్రజలు వారి మతాన్ని, ఆచారాలను ఖచ్చితంగా అనుసరిస్తున్నారు. ఒడిస్సీ, ఒడిష శాస్త్రీయ నృత్య విధానం, ఇప్పటికీ ఇది రాష్ట్రంలో సజీవంగా ఉంది. దీనిని రాష్ట్రంలో వివాహాలు, ఇతర ఉత్సవాల సమయంలో నిర్వహిస్తారు. ఈ పండుగలే కాకుండా ఒడిషలో కోణార్క్ ఫెస్టివల్, రాజారాణి మ్యూజిక్ ఫెస్టివల్, ఇతర ముక్తేశ్వర్ నృత్య పండుగ వంటి సాంస్కృతిక, కళా వేడుకలు జరుపుకుంటారు.



త్రిమూర్తులు కొలువుదీరిన త్రయంబకం


పాపవిముక్తికోసం గౌతముడు స్నానమాచరించిన పవిత్రస్థలమది. జ్యోతిర్లింగరూపంలో త్రిమూర్తులు కొలువైన క్షేత్రమది. అన్నింటినీ మించి ప్రాచీనకాలం నుంచీ కుంభమేళాకు వేదికగా నిలుస్తోన్న ఆ త్రిసంధ్యాక్షేత్రానికి ఉన్న మరో పేరే త్రయంబకం...కార్తీక మాసంలో దర్శనీయ పుణ్యక్షేత్రం..

ఇక్కడ ఉన్న బ్రహ్మగిరి పర్వతాల మీద బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి నిర్మాణానికి అవసరమైన శక్తినీ సిద్ధినీ పొందాడట. అందుకే దీనికి బ్రహ్మగిరి అని పేరు అన్నది ఓ పౌరాణిక కథనం. ఈ బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అను ఐదు శిఖరాలు ఉన్నాయి. బ్రహ్మగిరిమీద ఉద్భవించిన గంగానది మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. తూర్పువైపు ప్రవహించే పాయని గోదావరి అనీ దక్షిణం వెపు ప్రవహించే నదిని వైతరణి అనీ, పడమటివైపు ప్రవహించే నదిని గంగ అనీ పిలుస్తారు. పడమటి వైపు ప్రవహించే గంగానది చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తుంది.

త్రయంబకం నాసిక్‌కు 28 కిలోమీటర్ల దూరంలోని త్రయంబక్ పట్టణంలో ఉంది. దేవాదిదేవుడయిన శంకరుని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇదీ ఒకటి. వేదకాలంనాటి గురుకుల పాఠశాలలూ, అష్టాంగమార్గాన్ని అనుసరించే ఆశ్రమాలూ అక్కడ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని క్రీ.శ.1755-1786 మధ్యకాలంలో నానాసాహెబ్ పేష్వా నిర్మించారట. చూడ్డానికి ఇదో నల్లని రాతి యంత్రంలా అనిపిస్తుంది. ఆలయం నలువైపులా 20 నుంచి 25 అడుగుల ఎత్తులో రాతిగోడలు ఉన్నాయి. పంచధాతువులతో నిర్మించిన ధ్వజస్తంభం ఈ మందిరంలోని మరో ఆకర్షణ.

గుడి ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివనామస్మరణ చేసే భక్తులతో ఆ ప్రాంతం మరో లోకాన్ని తలపిస్తుంది శివాలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని మందిరం గుండా గుడి అంతర్భాగానికి చేరుకుని, చిరుదీపకాంతిలో కనిపించే జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలు ఉన్నాయి. ఇలాంటి అద్వితీయమైన విశేషం ఇక్కడ ఒక్కచోటే కనిపించడం విశేషం.

స్వర్ణాభరణ భూషితుడు:
లింగానికి త్రిమూర్తుల రూపాలతో చేసిన బంగారుతొడుగుని తొడుగుతారు. దానిమీద రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని పెడతారు. పేష్వాల కాలం నుంచీ ఈ త్రయంబకేశ్వరుణ్ణి స్వర్ణాభరణ భూషితుడుగా అలంకరించడం విశేషం. ఆ ఆదిశంకరుని పంచముఖ బంగారు కిరీటం వజ్రవెఢూర్యాలతోనూ విలువైన రాళ్లతో సుందరంగా ఉంది. ఈ కిరీటం పాండవుల కాలం నాటిదని అంటారు. దీన్ని ప్రతీ సోమవారం, కార్తీకపౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో కుశావర్త తీర్థస్థలానికి తీసుకువెళతారు. తరవాత వూరేగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఒకప్పుడు నాసిక్ మణిగా పిలిచే నీలమణి కూడా దేవుడికి అలంకారంలో ఉండేదట. మరాఠాలు- ఆంగ్లేయుల మధ్య జరిగిన యుద్ధంలో అది లండన్‌కు చేరి ఆపై అనేక చేతులు మారింది.

కుంభమేళాకు ఆరంభ స్థలం: 
జ్యోతిర్లింగ దర్శనానంతరం- ప్రధాన ఆలయం నుంచి కాలినడకన ఐదు నిమిషాల్లో కుశావర్త తీర్థానికి చేరుకోవచ్చు. దీన్ని వోల్‌వోకర్ శ్రీరావ్‌జీ సాహెబ్ పాఠ్‌నేకర్ క్రీ.శ. 1690-91లో నిర్మించారు. ఈ కుశావర్త తీర్థం పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళాకి ఆరంభ స్థలం. ప్రపంచ నలుదిశల నుంచీ సాధువులు స్నానం చేయడానికి ఇక్కడికే వస్తారు. ప్రముఖులైన సాధువులు స్నానం చేశాకే సామాన్యులని అనుమతిస్తారు. గతంలో జరిగిన ఓ కుంభమేళా సమయంలో వైష్ణవులూ శైవులూ మధ్య తలెత్తిన వివాదంలో వందలాది మంది చనిపోయారట. ఆ సందర్భంగా ఎవరు ఎక్కడ ముందుగా స్నానం చేయాలనే నియమాన్ని పేష్వాలు విధించారట. వైష్ణవ సాధువులు పంచవటి దగ్గర ప్రవహించే రామ్‌కుండ్‌లో సాన్నమాచరిస్తే, శైవ సాధువులు కుశావర్త్‌లో పుణ్యస్నానం చేస్తారట.

కుశావర్త్: 
గోదావరీ నది కుశావర్త్ నుంచి రామ్‌కుండ్‌లోకి ప్రవహిస్తుంది. అందువల్ల ఈ రెండు ప్రదేశాలూ కూడా పవిత్రమైనవే. అయితే భక్తులు సైతం కుశావర్త్‌లో స్నానమాచరించేందుకే మక్కువ చూపుతారు. భగవంతుడు సైతం తొలగించలేని పాపాలు ఇక్కడ మునకలేయడంవల్ల పోతాయని విశ్వసిస్తారు. అందుకే కుశావర్తాన్ని మహిమాన్విత క్షేత్రంగా చెబుతారు. గౌతమ మహర్షి తన గోహత్యా పాతకాన్ని ఈ కుశావర్త్‌లో స్నానమాచరించడంవల్ల పోగొట్టుకోగలిగారన్నది పురాణేతిహాసం. అప్పట్లో వర్షాభావంతో తీవ్రమైన కరవు ఏర్పడటంతో తన ఆశ్రమం చుట్టూ ఉన్న కొద్దిస్థలంలోనే ధాన్యం పండించి, రుషులకు భోజనం పెట్టేవాడట గౌతమమహర్షి. ఓసారి తన పొలంలో ఆవు మేస్తుంటే, దాన్ని తోలేందుకు ఓ దర్భను విసిరాడట. సూదిమొనగుచ్చుకుని అది ప్రాణం విడిచిందట. గోహత్యా పాతకాన్ని చుట్టుకున్న గౌతముడు, దాన్ని తొలగించుకునేందుకు గంగలో స్నానం చేయదలిచి, బ్రహ్మగిరిమీద తపస్సు చేయగా, శివుడు గంగను విడిచాడట. శివుణ్ణి వీడటం ఇష్టంలేని గంగమ్మ ముందుగా బ్రహ్మగిరిమీద ఉన్న గంగాద్వార్, త్రయంబక, వరాహ, రామలక్ష్మణ, గంగాసాగర... ఇలా అనేక చోట్ల ప్రత్యక్షమై మాయమైపోతున్నదట. దాంతో ఆ తీర్థాల్లో మునకలేయలేక ఒకచోట వెలసిన నీటి ప్రవాహం చుట్టూ గడ్డి వేసి ఎటూ వెళ్లకుండా చేసి స్నానం చేశాడట గౌతముడు. అదే కుశావర్తంగా వాడుకలోకి వచ్చింది.

మహిమాన్విత బ్రహ్మగిరి: 
పుణ్యస్నానం తరవాత బ్రహ్మగిరికి వెళతారు యాత్రికులు. ఇది సముద్రమట్టానికి 4248 అడుగుల ఎత్తులో ఉంది. అంటే త్రయంబకేశ్వర పట్టణం కన్నా 1800 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. ఈ పర్వతాన్ని శివస్వరూపంగా చెబుతారు.ఈ బ్రహ్మగిరి మీదే బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి నిర్మాణానికి అవసరమైన శక్తినీ సిద్ధినీ పొందాడట. అందుకే దీనికి బ్రహ్మగిరి అని పేరు అన్నది ఓ పౌరాణిక కథనం. ఈ బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అను ఐదు శిఖరాలు ఉన్నాయి. బ్రహ్మగిరిమీద ఉద్భవించిన గంగానది మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. తూర్పువైపు ప్రవహించే పాయని గోదావరి అనీ దక్షిణం వెపు ప్రవహించే నదిని వైతరణి అనీ, పడమటివైపు ప్రవహించే నదిని గంగ అనీ పిలుస్తారు. పడమటి వైపు ప్రవహించే గంగానది చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తుంది.

కైలాస ముఖద్వారం కేదారేశ్వరం


గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్, బదరీనాథ్ ఈ నాలుగు ప్రదేశాలను చార్‌ధామ్ అంటారు. యమునోత్రి, కేదారనాథ్, హరిద్వార్, రుషీ కేశ్ నుంచి వచ్చే అన్ని వాహనాలు గంగోత్రి ఆలయం ఉన్న ప్రదేశం వరకు వస్తాయి. బదరీనాథ్‌లో విష్ణు మూర్తి, కేదారనాథ్‌లో పరమ శివుడు స్వయంభువులుగా వెలసినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

కేదార్‌నాథ్ ఉత్తరాఖండ్‌లో ఉంది. హిమాలయ పర్వత సాణువుల్లో ఉన్న ఈ ఆలయాన్ని మే నుంచి సెప్టెంబరు (వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి) వరకు తెరిచి ఉంచుతారు. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 11, 760 అడుగుల ఎత్తులో ఉంది.

ప్రయాణం ఎలా చెయ్యాలి:
కేదార్‌నాథ్ ఉత్తరాఖండ్‌లో ఉంది. కేదార్‌నాథ్ క్షేత్రానికి చేరుకోవాలంటే ఢిల్లీ వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన హరిద్వార్, దేవప్రయాగ, రుద్ర ప్రయాగ మీదుగా రాంపూర్ చేరాలి. రాంపూర్ నుంచి సోన ప్రయాగ మీదుగా గౌరీకుండ్ చేరాలి. ఈ గౌరీకుండ్ గౌరీమాత జన్మస్థలం అని చెబుతారు. కేదార్‌నాథ్ పర్యాటకులు ఇక్కడ వేడినీటి కుండాలలో స్నానమాచరించి గౌరీమాతను దర్శించుకుని కేదార్‌నాథ్ పర్యటనను కొనసాగిస్తారు. గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ సుమారు 13 కి.మీలు ఉంటుంది. కాలి నడకన కాని, గుర్రాల మీద లేదా డోలీల్లో ప్రయాణించవచ్చు. వాతావరణాన్ని తట్టుకోవడం కొంచెం కష్టమే. విపరీతమైన చలి, అప్పుడప్పుడూ శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి. 13 కి.మీల దూరం ప్రయాణించడానికి ఏడెనిమిది గంటలు పడుతుంది. యాత్రికులు కేదారనాథుడి మీద నమ్మకంతో యాత్ర సాగిస్తారు. హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి.

హెలికాప్టర్ సదుపాయం:
పూర్తిగా ఒకటిన్నర రోజు ప్రయాణం. కేదారనాథ్‌లో ఆలయం ముందు నుంచి సుమారు ఒకటిన్నర ఫర్లాంగు పొడవున ఒక వీధి ఉంది. ఆ వీధిలో దుకాణాలు, ధర్మశాలలు ఉన్నాయి. అందులో కాలీ కమ్లి బాబా ధర్మశాల బాగా ప్రసిద్ధి. అందులో గది అద్దె రోజుకు సమారు 300 రూ ఉంటుంది. అన్ని అధునాతన సౌకర్యాలు ఉంటాయి. ఈ మధ్యనే కేదార్‌నాథ్‌లోని గుడి వరకు హెలికాప్ట్టర్ సౌకర్యం కూడా ఏర్పడింది. అక్కడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి మీకుంటే అక్కడ ఎన్ని రోజులయినా ఉండవచ్చు. మే మధ్య భాగం నుంచి నవంబర్ మధ్య వరకు ఏడాదికి ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయం తెరచి ఉంటుంది. హిమాలయాల్లో కురిసే విపరీతమైన మంచు కప్పి వేయడంతో, మిగిలిన ఆరు నెలలు ఈ ఆలయం మూసే ఉంటుంది. ఆలయాన్ని తెరిచే సీజన్ ప్రారంభం కాగానే, లక్షలాది యాత్రికులు కేదారనాథ్‌ను సందర్శిస్తారు. ఆలయానికి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉండే గౌరీకుండ్ ప్రాంతం దాకా బస్సులు, మోటారు వాహనాలు వెళ్ల గలుగుతాయి. అక్కడ నుంచి గుడి దాకా మిగిలిన దూరమంతా యాత్రికులు కాలినడకన వెళ్లాలి. లేదంటే, గుర్రాల మీద వెళ్లాలి.

స్వయంగా అభిషేకం: 
కేదారేశ్వర జ్యోతిర్లింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేయవచ్చు. ఆలయానికి వెనుక వైపు జగద్గురువు ఆదిశంకరాచార్యుల సమాధి ఉంది. సాధువులు ఒళ్లంతా విబూది పూసుకుని సంచరిస్తుంటారు. ఆధ్యాత్మిక వికాసానికి, పర్యాటక ఆహ్లాదానికి చక్కని వేదిక కేదార్‌నాథ్. కేదారేశ్వర జ్యోతిర్లింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేయవచ్చు. మందాకినీ నది పై భాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్ శివాలయం ఉన్న పుణ్యక్షేత్రం. గర్హ్వాల్ కోడల పై భాగంలో ఉంది. ప్రతి కూల వాతావరణం కారణంగా అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు భక్త సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. గుడి చేరడానికి రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుండి గుర్రాలు, డోలీలు, కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్ నాథ్ గుడి వెనుక భాగంలో ఆదింకరుల సమాధికి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాధ్‌లను చార్ ఉత్తరాఖండ్ ధామ్‌లుగా వ్యవహరిస్తారు.

చరిత్ర 
ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్దానంతరం సగోత్రీకుల హత్యాపాకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడూ భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవి ముక్తులైనట్లు పురాణ కధనం. తలభాగం నేపాల్‌లోని పసుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థలపురాణం చెబుతుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు.

ఆలయ ప్రాంగణంలో యాత్రికులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...