Tuesday, 7 June 2016

సాహసికులకు స్వాగతం

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అని అందరికీ తెలిసిన విషయమే... అదొక్కటే కాకుండా భారత్ - నేపాల్ సరిహద్దులన్నీ హిమాలయాల మయమే..! అందువల్ల ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అనడంలో ఆశ్చర్యమేముంది..! అలాంటి ప్రఖ్యాత ట్రెక్కింగ్ స్పాట్‌లలో కొన్ని మీకోసం...



ఎవరెస్ట్ ప్రాంతంలో సెలవులు గడపటానికి వెళితే, అక్కడ మంచుతో బాగా కప్పబడిన హిమాలయాల దర్శనం, కొన్ని మంచి షెర్పా పల్లెలను చూస్తూ సాగే అందమైన, స్పూర్తి ప్రదాయకమైన ప్రయాణం, ప్రాచీన బౌద్ధరామాలు వంటి వాటిని చూడగలగడం, ఇంకా చూపు తిప్పుకోనివ్వని శిఖరాలు మీరా, ఐలాండ్, పోకల్డే శిఖరం, ఇంకా మరెన్నో చూడవచ్చు. ప్రపంచ ప్రసిద్దమైన ట్రెక్కింగ్ ప్రదేశం అన్నపూర్ణ ప్రాంతం. ఇక్కడ మూడు ముఖ్యమైన ట్రెక్కింగ్ దారులు ఉన్నాయి. ఇవి ఉత్తరంగా నేపాల్ మధ్యలోకి వచ్చేలా ఉంటాయి. అవి... జామ్సం, అన్నపూర్ణ శాంక్చురీ, అన్నపూర్ణ ప్రాంతమే వలయాల్లా ఉం టుంది. ఇక్కడి విభిన్న సంప్రదాయాలు, ప్రజలు, దీనిని మం చి ట్రెక్కింగ్ ప్రదే శంగా చేశాయి. ఇక్కడ మీరు అద్బుతమైన పర్వతాల అందాలు చూడగలరు. అందులో ధులగిరి, అన్నపూర్ణ, మనస్లు, లమ్జంగ్ హిమాల్ మంచాపుచ్చారే, టుకుచే శిఖరం, టిలిచో శిఖరం, నీలగిరి ముఖ్యమైనవి.

కాళి గండకి:
అన్నపూర్ణ, ధులగిరిల మధ్యగా వెళుతున్న కాళి గండకి ప్రపంచంలోనే లోతై నది. హిందువుల నుండి బౌద్ధుల వరకు, ఆర్యుల నుండి మంగోలుల వరకు, గొప్ప గోర్ఖా సైనికులు, పల్లెలు, లోయలు, బాగా వర్షం పడే ప్రాంతాలు, నేపాల్ లోని వర్షం పడనివ్వని ప్రాంతాలు ఇలా అన్నీ నేర్తిగా విభిన్నంగా ఉండే విషయాలు, మీ నడకను ఒక ప్రత్యేక అనుభవంగా చేస్తాయి. ఈ మధ్య మోడర్న్ మెచ్యూరిటీ (యూయస్ఏ) వారు చేసిన సర్వే ప్రకారం, ఈ ప్రాంతం ప్రపంచం లోనే అత్యద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతంగా గుర్తించబడినది. పోఖరా ది సిటీ అఫ్ లేక్స్ ఈ అన్నపూర్ణ ప్రాంతంలో ట్రెక్కింగ్ మొదలు పెట్టే ప్రాంతం కానీ, లేదా ముగించే ప్రాంతం కానీ అవుతుంది. సహజ సౌందర్యంతో, చిత్రవిచి త్రంగా కనిపించే ఈ పట్టణం 3000 అడుగుల ఎత్తులో, గొప్ప హిమాలయ పర్వతాల ఒడిలో ఉంది. పర్యాటకులకు స్వర్గధామం అయిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.

లంగ్ టంగ్:
ఖాట్మండు లోయ నుండి ఇది కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు రోడ్డు మార్గం ద్వారా కానీ లేదా విమానంలో కానీ తేలికగా చేరుకో వచ్చు. లంగ్‌టంగ్ ప్రాంతం ఆశ్చర్యపరిచే ప్రకృతిని తిలకించడానికి సరైన ప్రదేశం! ఇది మరొక అత్యంత ప్రత్యేకమైన ట్రెక్కింగ్ స్థానం. ఇది ఉత్తర ఖాట్మండులో, హిమాలయాల మధ్యలో, టిబెటన్ సరిహద్దుపై, తేలికగా చేరుకునేలా ఉంది. ఈ ప్రదేశం ఎన్నో రకాల మొక్కలకు, హిమాలయాల రెడ్ పాండాతో సహా ఎన్నో రకాల జాతులకు చెందిన జంతు వులకు, ఆలవాలంగా ఉన్నది. పికా, దుప్పి, హిమాలయాల నల్ల ఎలుగుబంటి మొదలైనవి ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల యాత్రికులకు ఇది ఒక చక్కటి సెలవుల విడిదిగా పేరుగాంచింది. ఉత్తర ఖాట్మండులో ఉన్న హేలంబు, అద్భుతమైన షెర్పా, తమంగ్ పల్లెలతో ట్రెక్కింగ్‌కు చాలా చాలా అనువుగా ఉంటుంది. గోసాయి కుండ అనేది ఒక చక్కటి సరస్సు. ఇది తనతో పాటుగా ఉన్న ఇతర చక్కటి సరస్సులతో సహా పేరు పొందినది.

పర్వతారోహణము:
800 ల కిలోమీటర్ల నేపాల్‌లోని హిమాలయముల పంక్తి మౌంట్ ఎవరెస్ట్‌తో సహా 8,000 మీటర్లకు పైగా ఉన్న ఎనిమిది పర్వత శిఖరములు, ప్రపంచ ములోనే గొప్పవి. 1994లో దేశము ఈ పర్వత శిఖరములు ఎక్కడానికి అనుమతించినప్పటినుంచి, నేపాల్ హిమాలయములు పర్వతారోహణకు ఆల వాలము అయింది మరియు అందులో విజయము, అపజ యము వేలమంది స్త్రీలు, పురుషులకు అక్కడకు చేరడము అనే సవాలులో నెగ్గాలన్న తపనను పెంచింది. ఈ నేపాల్ హిమాలయములు సాధువులు, తత్వవేత్తలు, పరిశోధ కులు లేదా సాహస ములు చేసేవారు వంటి ఎంతో మందికి ఆకర్షణియముగా ఉన్నాయి.

చూపుతిప్పుకోనివ్వని సోయగాలు:
బర్డ్ వాచింగ్ నేపాల్ పక్షి ప్రేమికులకు మొత్తము 646 జాతులతో(దాదాపు ప్రపంచములో 8% శాతము) స్వర్గధామము, మరియు వాటిలో దాదాపు 500ల జాతులు ఒక్క ఖాట్మండు లోయలోనే చూడవచ్చు. జాతీయ అభయా రణ్యములైన ఫుల్ చోకి, గోదావరి, నాగార్జున్, బాగమతి చెరువు, టౌడహాలు పక్షులను చూసే ప్రదేశములలో బాగా పేరు పొందినవి. మీ బైనాక్యులర్స్ కూడా తెచ్చుకుని ఒక అద్భుతమైన, సంతృప్తికరమైన అనుభవము కొరకు ఎదురు చూడండి.

మౌంటైన్ ఫ్లైట్ భూమి పైన ఎత్తౖన పర్వత శిఖరములు చేరడము అనే అనుభవమునకు దగ్గరగా రాగలిగింది కేవలము భయానకమైన నిశ్శబ్దము మాత్రమే. పర్వత శిఖరములు మౌంట్ ఎవరెస్ట్,కాంచెనగంగ మరియు టిబె టన్ ప్లేటుల దగ్గరి విహంగ వీక్షణము ఇస్తాయి. పర్వతశిఖరములు అన్ని రక ముల ప్రయాణికులకు నచ్చుతాయి మరియు నేపాల్ పర్యాటకములో పేరు పొందిన ఆకర్షణ అయ్యాయి. సమయాభావంతో లేదా వేరే ఇతర ఏ కారణ ముల వలన అయినా కానీ ఇలా వెళ్ళలేని వారికి, ఈ శిఖరములు హిమాలయ ములకు నాలుగు దిక్కులా ఉన్న అధ్బుతమైన సౌందర్యమును ఒక్క గంటలోనే చూపిస్తాయి.రాక్ క్లైమ్బింగ్ అక్కడ ఉన్న క్లిఫ్ హంగర్స్ కు, ఖాట్మండ్‌లోని రాళ్ళ గోడల పంక్తి ఒక మంచి జీవిత అనుభవము అవుతుంది. ఆలస్యముగా అయినా, ఖాడ్మండ్‌లో రాక్ క్లైమ్బింగ్‌కు అనువుగా ఉన్న కొన్ని భయంకరమైన ప్రదేశముల వలన ఇది పేరు పొందిన ఆట అయింది. మీరు ఈ ఆట కోసము చూడదగిన ప్రదేశములలో నాగార్జున్, బలాజు, శివ్ పురి మరియు బుధానిల్ కంత వంటివి ముఖ్యమైనవి.

Friday, 3 June 2016

పితోరాగఢ్ - మన దేశంలో మరో కాశ్మీరం

ఉదయం వేళ హిమగిరుల ధవళకాంతుల ధగధగలు కనువిందు చేస్తాయి. చుట్టూ కనుచూపు మేరలో అంతా విస్తరించుకున్న ఆకుపచ్చదనం ఆనంద పరవశులను చేస్తుంది. ఘనచరిత్రకు సాక్షీభూతంగా నిలిచి ఉన్న కోట... వీర సైనికులకు నివాళిగా వెలసిన తోట... ఎన్నెన్నో గాథలు చెబుతాయి. పరిసర ప్రాంతాల్లో పురాతన దేవాలయాలు, మందిరాలు వాతావరణానికి పవిత్రతను అద్దుతూ ఉంటాయి. ఇలాంటి చాలా వింతలు, విశేషాలు గల ప్రదేశం పితోరాగఢ్. పర్వతశిఖరాల నడుమ వెలసిన ఈ పట్టణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. వేసవి యాత్రలో విహార, వినోదాలతో పాటు కొంత విజ్ఞానం, కొంత పరమార్థం కూడా కావాలనుకుంటే పితోరాగఢ్‌కు వెళ్లాల్సిందే!

హిమాలయాల దిగువన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చందక్, ధ్వజ్, కుమ్దార్, తల్ కేదార్ కొండల నడుమ వెలసిన పట్టణం పితోరాగఢ్. ఉదయం వేళ ఇక్కడి నుంచి చూస్తే హిమాలయాల్లోని పంచ్‌చులి, నందాదేవి, నంద కోట్ శిఖరాలు తెల్లగా తళతళలాడుతూ కనువిందు చేస్తాయి. ఈ మూడు శిఖరాల నడుమనున్న లోయను స్థానికంగా ‘సోర్’లోయ అంటారు. అంటే చల్లని లోయ అని అర్థం. ఈ లోయ పరిసరాలన్నీ కశ్మీర్ లోయను తలపిస్తాయి. అందుకే ఈ లోయలో కాళీనది ఒడ్డున వెలసిన పితోరాగఢ్‌ను ‘మినీ కశ్మీర్’గా అభివర్ణిస్తారు. ట్రెక్కింగ్ చేసే యాత్రికులు ఇక్కడి నుంచి కైలాస పర్వతానికి, మానస సరోవరానికి చేరుకోవచ్చు. అందుకే దీనిని ‘హిమాలయాలకు ప్రవేశమార్గం’గా కూడా అభివర్ణిస్తారు.

ఏం చూడాలి?
చారిత్రక పట్టణమైన పితోరాగఢ్ రాజపుత్ర వీరుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఏలుబడిలో రాజధానిగా ఉండేది. పద్నాలుగో శతాబ్దంలో ఇదే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాల్ వంశపు రాజులు మూడు తరాల పాటు పరిపాలించారు. వారి తర్వాత నేపాల్‌కు చెందిన బ్రహ్మ వంశపు రాజులు, చాంద్ వంశపు రాజులు ఈ ప్రాంతాన్ని  పాలించారు. పాత కోట నాశనమైపోవడంతో చాంద్ వంశపు రాజులు 1790లో ఇక్కడ కొత్తగా కోటను నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న ఆ కోటను పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించుకుంటారు.

* చాంద్ వంశీకులు ఎక్కువకాలం పరిపాలించిన పితోరాగఢ్‌లో ఇప్పటికీ పలు చిన్నా చితకా కోటలు, పురాతన మందిరాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. అప్పటి కోటల్లో ఒకదాంట్లో ప్రస్తుతం ట్రెజరీ, తహశిల్ కార్యాలయాలు పనిచేస్తుండగా, మరో కోటను పడగొట్టి, ఆ స్థలంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను నిర్మించారు.
* కశ్మీర్‌లో మరణించిన వీర సైనికుల జ్ఞాపకార్థం ఇండియన్ ఆర్మీ ఈ పట్టణంలో నిర్మించిన మహారాజా పార్కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అరుదైన మొక్కలతో, పచ్చని పరిసరాలతో కనువిందు చేస్తుంది.
* పితోరాగఢ్‌కు 54 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 5412 అడుగుల ఎత్తున కుమావోన్ హిమాలయాల్లో ఏర్పాటు చేసిన ‘అస్కోట్ అభయారణ్యం’ మరో ప్రత్యేక ఆకర్షణ. మంచు చిరుతలు, హిమాలయన్ నల్ల ఎలుగులు, కస్తూరి మృగాలు, మంచు కాకులు, జింకలు వంటి అరుదైన వన్యప్రాణులను ఇక్కడ చూసి ఆనందించవచ్చు.
* పితోర్‌గఢ్‌కు 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న చకోరీ హిల్‌స్టేషన్ ట్రెక్కర్లకు స్వర్గధామంలా ఉంటుంది. మంచుకొండలు, కొండల దిగువన తేయాకు తోటలతో కనువిందు చేసే చకోరీ నుంచి మూడు ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి.
* వేసవి వినోదంతో పాటు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించుకోవాలనుకునే పర్యాటకులకు పితోరాగఢ్ చాలా అనువైన ప్రదేశం. ఇక్కడకు చేరువలోనే శైవ క్షేత్రాలైన పాతాళ భువనేశ్వర్, తల్ కేదార్, నకుల సహదేవులు నిర్మించారనే ప్రతీతి గల నకులేశ్వర ఆలయం, పురాతన ధ్వజ ఆలయం, కాళీ మందిరం వంటి పురాతన ఆలయాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.
* పితోరాగఢ్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని ఝులాఘాట్ పట్టణం షాపింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ పట్టణంలో కాళీ నదిపై నిర్మించిన వేలాడే కలప వంతెన నేపాల్‌ను కలుపుతుంది. ఈ వంతెన మీదుగా ఇక్కడి ప్రజలు నేపాల్‌కు, నేపాలీలు ఇక్కడకు రాకపోకలు సాగిస్తుంటారు.

ఏం కొనాలి?
* పితోరాగఢ్‌లో స్థానికంగా తయారయ్యే సంప్రదాయ హస్తకళా వస్తువులు చౌకగా దొరుకుతాయి.
* ఇక్కడి బజారులో దొరికే ఉన్ని శాలువలు, కంబళ్లు, స్వెట్టర్లు, మఫ్లర్లు వంటివి కొనుక్కోవచ్చు.
* ఉద్యాన ఉత్పత్తులకు పితోరాగఢ్ పెట్టింది పేరు. ఇక్కడ స్థానికంగా పండే నారింజలు, ద్రాక్షలు, యాపిల్స్ రుచికరంగా ఉంటాయి. ఇక్కడ పండే భారీ దోసకాయలు నీటి శాతంలో పుచ్చకాయలను తలపిస్తాయి.

ఏం చేయాలి?
* సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉండే పితోరాగఢ్ పరిసర ప్రదేశాలన్నీ పర్వతారోహణకు అనువుగా ఉంటాయి. వేసవిలో ట్రెక్కింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది.
* చరిత్ర, వారసత్వ సంపద గురించి ఆసక్తి గల వారు ఇక్కడి పురాతన కోటలను, ఇతర కట్టడాలను సందర్శించుకోవచ్చు.
* తీర్థయాత్రలపై ఆసక్తి గల వారు పితోరాగఢ్ పరిసరాల్లోని ప్రాచీన ఆలయాలను సందర్శించుకోవచ్చు.

ఎలా చేరుకోవాలి?
ఇతర ప్రాంతాల వారు దేశ రాజధాని ఢిల్లీ లేదా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వరకు విమాన మార్గంలో లేదా రైలు మార్గంలో చేరుకోవచ్చు. ఢిల్లీ లేదా డెహ్రాడూన్ నుంచి మరో రైలులో హల్ద్వానీ లేదా తనక్‌పూర్ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. హల్ద్వానీ నుంచి, తనక్‌పూర్ నుంచి పితోరాగఢ్ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు తరచుగా తిరుగుతూ ఉంటాయి. ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.

శ్రీనగర్ - శ్రీన'హీ'గర!


శ్రీన'హీ'గర!
కశ్మీర్ అంటే కల్లోలాలు కాదు. ప్రకృతి అందాలకు నెలవు.
కశ్మీర్ అంటే అశాంతి కాదు. ఆనందాల కొలువు.
కశ్మీర్ అంటే తుపాకీ మోతలు, ఆర్తుల హాహాకారాలు కాదు. సరదాల సందళ్లు. సంతోషపు కేరింతలు.

సరిహద్దు తగాదాలతో అలజడితో ఉంటుందని కశ్మీర్‌కి పేరుంది. కానీ ఆ పేరును శ్రీనగర్ మార్చేసింది. వివాదాల వేడి సంగతి ఎంతా ఉన్నా... వేసవి వేడి మాత్రం శ్రీనగర్‌లో అడ్రస్ లేకుండా పోతుంది. మే నెలలో సైతం చల్లగాలులతో ఆహ్లాదాన్ని పంచుతుంది. నా పేరు శ్రీనగరం, నా దగ్గరుంటే నహీ గరం అంటుంది. మనోల్లాసాన్ని హద్దులు దాటిస్తాను రమ్మంటూ ఆహ్వానం పలుకుతుంది. అందమైన అనుభూతులను పంచిస్తానంటూ పిలుస్తుంది. మన దేశంలోని బెస్ట్ సమ్మర్ టూరిస్ట్ స్పాట్స్‌లో ఒకటైన శ్రీనగర్ పరిచయం... ఇప్పుడు మీకోసం!

ఏం చూడాలి?
శ్రీనగర్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన టూరిస్టు స్పాట్ దాల్ లేక్. ఈ సరస్సు 22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సరస్సు ఫిష్షింగ్, వాటర్ ప్లాంట్ హార్వెస్టింట్ లాంటి వాటి ద్వారా శ్రీనగర్ ఆర్థికా భివృద్ధికి ఎంతో తోడ్పడుతోంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ‘షికారాలు’. అంటే గూటి పడవలు. అందంగా అలంకరించిన ఈ పడవల్లో ప్రయా ణించడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. చలికాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. అందుకే దీన్ని చూడాలంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే వెళ్లాలి.

భారతదేశంలో ఉన్న ఏకైక ఫ్లోటింగ్ మార్కెట్ శ్రీనగర్‌లోనే ఉంది. కూరగాయలు, పండ్లు, పూలు అన్నిటినీ పడవల్లోకెక్కించి, దాల్ సరస్సు నీటిపై తేలియాడుతూ అమ్ముతుంటారు. ఈ పూలు, కూరగాయలు, పండ్లు అన్నీ దాల్ లేక్ పరిసర ప్రాంతాల్లో సాగు చేసినవే. రోజూ ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఈ మార్కెట్ ఉంటుంది. పడవలో ప్రయాణిస్తూ అన్నీ కొనుక్కోవడం భలే ఉంటుంది కదూ!

శ్రీనగర్‌లో ఎన్ని గార్డెన్స్ ఉన్నాయో లెక్క లేదు. 17వ శతాబ్దంలో కట్టిన షాలిమార్ బాగ్ శ్రీనగర్‌లో ఉన్న మూడు మొఘల్ గార్డెన్స్‌లోనూ పెద్దది. మే నుంచి అక్టోబర్ నెలల మధ్య ప్రతి రోజూ సాయంత్రం ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది. శుక్రవారం సెలవు. నిషాత్ గార్డెన్ కూడా ఫేమస్. ఈ రెండూ పర్షియన్ పద్ధతిలో నిర్మితమయ్యాయి. శరదృతువు (ఆకులు రాలే కాలం)లో ఈ మొఘల్ గార్డెన్స్ రాలిపడిన ఎరుపు-బంగారం రంగు ఆకులతో కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ఇక మొక్కలపై ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా జవహర్‌లాల్ నెహ్రూ మెమోరియల్ బొటానికల్ గార్డెన్‌ను చూడాల్సిందే. ఇక్కడ లేని మొక్క ఉండదు. 80 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండే ఈ గార్డెన్‌లో 17 హెక్టార్ల మేర ఓ అందమైన సరస్సు ఉంటుంది. అలాగే నసీం బాగ్. ఇది ప్రశాంతతకు మారు పేరు. 1586లో అక్బర్ చక్రవర్తి దీన్ని నిర్మించారట. ఇక్కడి ప్రకృతి అందాన్ని చూడటానికి, అలసిన మనసును శాంతపర్చుకోడానికి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.

ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉన్న వారికి శ్రీనగర్ ఎంతో నచ్చుతుంది. అక్కడ ఉన్న గుళ్లు, మసీదులు చూస్తే మనసులో భక్తి అలలై ఎగసిపడుతుంది. కశ్మీర్ మధ్య భాగంలో విస్తరించి ఉన్న జబర్‌వాన్ పర్వతాన్ని శంకరాచార్య హిల్ అంటారు. పూర్వం దీనికి ఎన్నో పేర్లుండేవి. అయితే వెయ్యేళ్ల కిందట ఆది శంకరాచార్యుడు ఇక్కడికి వచ్చి, కొన్ని రోజులు ఉన్నాడట. అందుకే ఆ కొండకు ఆయన పేరును పెట్టారు. ఈ కొండపై 11వ శతాబ్దంలో నిర్మించిన శివుడి గుడి ఉంది. ఆ గుడి ఆవరణ లోకి సెల్‌ఫోన్లను, కెమెరాలను అనుమతించరు.

అలాగే క్రీ.శ 1400లో నిర్మించిన జామియా మసీదు. ఇందులో 370 చెక్క స్తంభాలున్నాయి. ఒకేసారి 33,333 మంది నమాజ్ చేసుకునేందుకు వీలుంది ఈ మసీదులో.

ఇక ఖీర్ భవానీ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది శ్రీనగర్ దగ్గర్లోని తుల్లా ముల్లా గ్రామంలో ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న దేవతని దుర్గా దేవి అవతారంగా చెబుతుంటారు. నైవేద్యంగా ఖీర్ (పాయసం) పెడుతుంటారు. అందుకే ఆ ఆలయానికి ఖీర్ భవానీ టెంపుల్‌గా పేరొచ్చింది. ఈ ఆలయంలో శుక్ల పక్ష అష్టమి నాడు వేలమంది భక్తులు చేరి యాగాలు, హోమాలు చేస్తుంటారు.

శ్రీనగర్ శివార్లలో ఉంది సోనామార్గ్. అంటే అర్థం ‘మెడోస్ ఆఫ్ గోల్డ్’ అని. దీని చుట్టూ ఉండే కొండల పై ట్రెక్కింగ్ జరుగుతూ ఉంటుంది. పచ్చదనానికి, ఆల్పైన్ పూలకు ఇది ప్రసిద్ధి. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 2,740 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ మార్గ్ చుట్టుపక్కల చాలా సరస్సులు ఉంటాయి. సరదా ఉన్నవారు ఫిషింగ్ చేయవచ్చు.

శ్రీనగర్‌లోని సింథన్ టాప్ గురించి చాలామందికి తెలియదు. ఇది శ్రీనగర్ శివార్లలో ఉంటుంది. ఇక్కడ ప్రకృతి అందాలను తిలకించడానికి రెండు కళ్లూ చాలవు. సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో ఉండటంతో, ఆ ప్రదేశం చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మంచుతో పర్వతం మొత్తం కప్పబడి ఉండటం వల్ల మరింత అందంగా ఉంటుంది. ఇక్కడి అందాలను ఆస్వాదించాలంటే ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలమే సరైన సమయం.

చలి కాలం వస్తే మంచు విపరీతంగా కురుస్తుంది కాబట్టి పర్యాటకులను అనుమతించరు. యాపిల్ కొనుక్కు తినడమే తెలిసిన మనకు యాపిల్ పండ్ల తోటల్లో తిరుగాడుతూ, వాటిని స్వయంగా కోసుకుని తినే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఆ అవకాశాన్ని ఎవరైనా జారవిడుచుకుంటారా? అందుకే శ్రీనగర్‌లోని యాపిల్ తోటలు ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. పండ్లను కోయడం మీద ఎటువంటి ఆంక్షలూ లేకపోవడంతో అక్కడి పనివాళ్లతో పాటు సందర్శకులు కూడా కాయలను తెంపి మురిసిపోతుంటారు.

సినిమా పాటల్లో టులిప్ తోటల్ని చూసినప్పుడు... ఇలాంటి ప్రదేశానికి మనమూ వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా! అయితే దానికోసం విదేశాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీనగర్ వెళ్తే చాలు. ‘ఇందిరాగాంధీ మెమోరియల్ టులిప్ గార్డెన్స్’ ఆసియాలోనే అతి పెద్ద టులిప్ గార్డెన్. ఇక్కడ మనం ఒకేసారి 20 లక్షల పూలను చూడొచ్చు. యేటా మార్చి, ఏప్రిల్ నెలల్లో ‘టులిప్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది.

ఏం తినాలి?
శ్రీనగర్‌లో Wazwan(వాజ్వాన్) తిని తీరాలి. Wazwan అంటే వంటకం పేరు కాదు. 36 రకాల వంటకాలతో కూడిన meals. ఇది తింటే కశ్మీర్ ఫుడ్ మొత్తాన్నీ రుచి చూసినట్టే లెక్క.
అలాగే ‘తుజ్జీ’ చాలా ఫేమస్. అంటే మటన్ బాల్స్‌ని ఐరన్ రాడ్ మీద పెట్టి కాల్చి చేసే వంటకం. దీన్ని స్థానికంగా దొరికే బ్రెడ్, చట్నీతో సర్వ్ చేస్తారు.
ఖావా అనే స్పెషల్ గ్రీన్ టీ రుచి నాలుకను వదలదు.
నూన్ చాయ్ అని పిలిచే సాల్టీ టీ అయితే ఇక్కడ తప్ప ఎక్కడా దొరకదు. పాలు, గ్రీన్ టీ, ఉప్పు, సోడా బైకార్బనేట్ కలిపి చేసే ఈ టీ గులాబి రంగులో ఉంటుంది. ఒక్కసారి దీన్ని రుచి చూస్తే జీవితంలో మర్చిపోలేం అంటారు దాన్ని టేస్ట్ చూసినవాళ్లు!

ఏం కొనాలి?
శ్రీనగర్‌లో షాపింగ్ చేయాలంటే షాపులకి వెళ్లడం కంటే... స్ట్రీట్ మార్కెట్స్‌కి వెళ్లడం మంచిది. ఎందుకంటే ఆ మార్కెట్లలో షాపుల్లో కంటే విభిన్నమైన, వైవిధ్యమైన వస్తువులు దొరుకుతాయి. పైగా వెల కూడా అందుబాటులో ఉంటుంది. అన్నిటికంటే ముందు కొనాల్సింది శాలువాలు, కార్పెట్లు. అక్కడ దొరికేంత అందమైన శాలువాలు, అద్భుతంగా రూపొందించిన కార్పెట్లు మన దేశంలో మరెక్కడా దొరకవు. లాల్ చౌక్, బాద్‌షా చౌక్ ప్రాంతాల్లో ఉన్న షాపుల్లో కని, పష్మినా శాలువాలు తప్పక కొనాల్సిందే. అలాగే పోలో వ్యూ మార్కెట్లో యాంటిక్ సిల్వర్ జ్యూయెలరీ, వూడెన్ జ్యూయెలరీ బాగా దొరుకుతుంది. ఫ్లవర్‌వాజ్‌లు, ఆర్టిఫీషియల్ పువ్వులు కూడా బాగుంటాయి. కశ్మీర్ గవర్నమెంట్ ఆర్ట్స్ ఎంపోరియంలో బ్యాగులు, టేబుల్ ల్యాంప్స్ లాంటివి అతి తక్కువ ధరకు దొరకుతాయి. ఇక రెసిడెన్సీ రోడ్‌లో అడుగుపెడితే డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసుల వాసన గుప్పుమంటుంది. ఆపైన అవి కొనకుండా రావడం మనవల్ల కాదు.


ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి శ్రీ నగర్ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌కి నేరుగా ఫ్లయిట్స్ ఉన్నాయి. గంటన్నర నుంచి రెండు గంటల్లో వెళ్లిపోవచ్చు. బస్సులో వెళ్తే ఇరవై గంటల పైనే పడుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్లు ఉన్నాయి. వాటిలో వెళ్లినా బానే ఉంటుంది. అక్కడికెళ్లాక ఉండటానికి బోలెడు హోటళ్లున్నాయి. మన బడ్జెట్‌ను బట్టి ఎంచుకోవచ్చు.

ఏం చేయాలి?

ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వింతలు, విశేషాలను చూసి రావడం అందరూ చేస్తారు. కానీ ఏదైనా కొత్తగా చేయడంలోనే ఉంటుంది మజా. శ్రీనగర్ వెళ్తే అలాంటి కొత్త అడ్వెంచర్స్ చాలా చేయవచ్చు. వాటిలో ముఖ్యమైనది పారా గ్లైడింగ్. తేలికైన గ్లైడర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వీపునకు కట్టుకుని, గాల్లో ఎగురుతూ కశ్మీర్ అందాలను చూస్తుంటే మనసు కూడా విహంగమై ఎగిరిపోతుంది. ఎయిర్ బెలూన్స్‌లో కూర్చుని ఎగురుతూ సిటీని చూసే అవకాశం కూడా ఉంది. పర్వత సానువులపై ట్రెక్కింగ్ చేస్తూ, వాటి ఎత్తుల్ని కొలిచే అనుభూతిని మిస్సవ్వడానికి లేదు. అలాగే రివర్ ర్యాఫ్టింగ్ కూడా. నదీ అలలపై తేలియాడుతూ, చల్లగా వీచే గాలిని ఆస్వాదిస్తుంటే మనసు మరో లోకంలోకి వెళ్లిపోవడం ఖాయం.

దేవరచర్లలో ప్రకృతి అద్భుతం


దేవరచర్లలో ప్రకృతి అద్భుతం 

చుట్టూ కొండలు.. దట్టమైన అడవులు.. నింగి నుంచి జాలువారే నీటి పరవళ్లు.. గంగమ్మ శివలింగాన్ని అభిషేకించే అద్భుత దృశ్యాలు.. మనసును ఇట్టే కట్టి పడేసే ఈ ప్రకృతి సోయగాలు చూడాలంటే నల్లగొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్లకు వెళ్లాల్సిందే! ఈ గ్రామానికి సమీపంలోని ముని స్వామి గుట్టలు రమణీయ దృశ్యాలకు ఆలవాలంగా నిలుస్తున్నాయి. దేవరకొండ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం దేవరచర్ల. అక్కడ్నుంచి సుమారు 5 కి.మీ. నడిస్తే చేరుకునే ప్రాంతం మునిస్వామిగుట్ట. ఇక్కడ జలపాతం జాలువారే చోటే కొలువైన శివలింగం, వందల ఏళ్ల నాటి పురాతన ఆలయం కనువిందు చేస్తున్నాయి.

గుట్టల నడుమ ఆలయం, ఆ పక్కనే సొరంగ మార్గం ఉంది. ఈ నిర్మాణాలు ఎప్పటివో ఎవరికీ తెలియదు. ఈ ప్రాంతం చుట్టు ప్రక్కల ఉండే గిరిజనులు మాత్రం..  తాత ముత్తాతల కాలం నాటి నుంచి ఆ ప్రాంతంలో శివాలయం, జలపాతం ఉన్నాయని చెబుతున్నారు. ఏటా శివరాత్రి, ఏకాదశి పర్వదినాల్లో ఏడాదికి రెండుసార్లు మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ఈ పర్వదినాల్లో గుట్టపై నిర్వహించే జాతరకు వందల మంది భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. వాస్తవంగా దేవరకొండ ఖిల్లా దుర్గాన్ని 13వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన రాజులు పాలించారు. ఆలయంలోని స్తంభాలపై చెక్కిన పద్మాలను (పుప్పాలు) బట్టి ఈ నిర్మాణాలు పద్మనాయక కాలం నాటివని తెలుస్తోంది. ప్రస్తుతం చెట్లు పడడంతో ఆలయం కొంతమేర కూలిపోయి కనిపిస్తోంది.

ఎన్నెన్నో విశేషాలు:
కొండపై కొలువైన శివలింగంపై ఎప్పుడూ గుట్టల నుంచి జాలు వారుతున్న నీటి పరవళ్లు అభిషేకిస్తూనే ఉంటాయి. మునుస్వామి ఆలయాన్ని గుట్ట కింది భాగంలో నిర్మించారు. ముందు స్తంభాలను మాత్రమే నిలబెట్టి వెనుక భాగంలో గుట్టనే ఆలయంగా మలిచారు. ఓచోట చతురస్రాకారంలో ఉన్న ఇటుకలతో ఒక నిర్మాణం ఉంది. ఆ ఇటుకలు కేవలం 200  నుంచి 300 గ్రాముల బరువున్నాయి.

ఈ ఆలయానికి అపవిత్రంగా వెళ్తే అక్కడి కందిరీగలు, గబ్బిలాలు హాని చేస్తాయని ఇక్కడి గిరిజనులు విశ్వసిస్తారు. గుడిలోనే కాకుండా శిథిలావస్థకు చేరిన మరొక ఆలయ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ శివలింగం చుట్టూ చిన్న సైజులో మరో 18 చిన్న లింగాకారాలున్నాయి. ఆలయం పక్కనే ఒక గుహ లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు రహస్య సొరంగ మార్గం ఉందని స్థానికులు చెబుతుంటారు. ఏటా ఇక్కడ గోపా బావోజీ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గిరిజనులు కోరుతున్నారు.


దేవరచర్ల.. తెలంగాణ అరకులోయ


అదే ఫీలింగ్. అదే అబ్బురపాటు. దేవరచర్ల అందాలపై అధికారులు కూడా ముగ్ధులైపోయారు. వావ్! ఇది తెలంగాణ అరకులోయ అంటూ అభివర్ణించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్ల అందాల పై ఇటీవల ప్రధాన సంచికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురావస్తు, పర్యాటకశాఖకు సంబంధించిన అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులను, అందాలను తిలకించారు.

పర్యాటకశాఖ పరంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించారు. దీంతోపాటు పురావస్తు శాఖ అధికారులు అక్కడి ఆలయాన్ని, విగ్రహాలను, ఆ కట్టడం తీరును అవగతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవరచర్లకు వచ్చిన పురావస్తు శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు, పర్యాటకశాఖ అధికారి శివాజీ తదితరులు దేవరచర్లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను  వివరించారు.

అధికారుల మనోగతం
‘తెలంగాణలో అరకులోయ అనే ఫీలింగ్ కలిగింది. వందశాతం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గిరిజన సంస్కృతిని, ఆచార సంప్రదాయాలను, ఈ ప్రాంత వైభవాన్ని, విశేషాలను బాహ్య ప్రపంచం తెలుసుకోవాల్సిందే. ఇన్ని రోజులుగా ఇంత మంచి దృశ్యాలు, చరిత్ర మరుగునపడి ఉండడం దురదృష్టకరమని’ అధికారులు అభిప్రాయపడ్డారు. తమ పర్యటనలో వెలుగులోకి వచ్చిన పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.

దేవరచర్లలో ఉన్న శివాలయం ముందు మండపం 18 స్తంభాలతో నిర్మించారని, గర్భగుడికి రెండు వైపులా ఉన్న పూర్ణకుంభం ఆధారంగా ఈ ఆలయం 14వ శతాబ్ధం రేచర్ల పద్మనాయక వంశస్థులు నిర్మించినట్లు, దేవరకొండ ఖిల్లాకు ఆలయానికి సంబంధమున్నట్లు పేర్కొన్నారు. దేవరచర్లలో విష్ణు, నంది, వల్లి సుబ్రమణ్యస్వామి, భైరవ, సప్తమాత్రిక విగ్రహాలు ఉన్నట్లు తెలిపారు.

అయితే అక్కడి నుంచి బయల్దేరిన అధికారులు వైజాగ్‌కాలనీ నుంచి వస్తుండగా క్రీ.పూ.1000  - క్రీ.శ.300 నాటి రాకాసి గూళ్లను కృష్ణా తీర పరీవాహక ప్రాంతంలో గుర్తించారు. ఇలాంటి రాకాసి గూళ్లు చాలా అరుదుగా ఉంటాయని అధికారులు వివరించారు. మరో పదిహేను రోజుల్లో ఉన్నతాధికారులతో సహా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంపై మరింత అధ్యయనం చేయనున్నట్లు వారు తెలిపారు.

నివేదికలో...
తెలంగాణలో అరకులోయ లాంటి ప్రదేశంగా అధికారులు ఈ ప్రాంతాన్ని అభివర్ణించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించాల్సిన అవసరాన్ని నివేదికలో పేర్కొంటామన్నారు. దీంతో పాటు రానున్న కృష్ణా పుష్కరాలకు వైజాగ్‌ కాలనీ సమీపంలో ఘాట్లు ఏర్పాటు చేసి దేవరచర్ల, వైజాగ్‌ కాలనీతో పాటు ఇక్కడ గిరిజన సంస్కృతి ఉన్న గ్రామాలను సందర్శించేలా చర్యలు తీసుకునేందుకు అధికారులకు నివేదికలివ్వనున్నారు. దీంతో పాటు ఎకో టూరిజం, ట్రెక్కింగ్, ట్రైబల్ టూరిజంగా మార్చడానికి ప్రతిపాదనలు పంపించనున్నారు.


కూర్గ్ - కూల్‌కూల్‌కూర్గ్

కూల్‌కూర్గ్
వింటే భారతం వినాలి. తింటే గారెలే తినాలి. చూస్తే కూర్గ్ అందాలనే చూడాలి. దట్టమైన అడవులు, నురుగులు కక్కే జలపాతాలు, పరవశింప జేసే పశ్చిమ కనుమలు, ఆకుపచ్చని కాఫీతోటలు, మత్తెక్కించే సుగంధ ద్రవ్యాల సువాసనలు... ఎన్నని చెప్పాలి? దక్షిణ భారత దేశంలోని పాపులర్ హిల్ స్టేషన్స్‌లో కర్ణాటకలో ఉన్న కూర్గ్‌ది ప్రత్యేక స్థానం. కొడగు, స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచే ఈ ప్రదేశం, మంచి సమ్మర్ టూరిస్టు కేంద్రమే కాదు... బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్ కూడా.

ఏం చూడాలి?
కూర్గ్ జిల్లాలో ఉన్న మడికెరీ మంచి టూరిస్ట్ ప్లేస్. పశ్చిమ కనుమల్లో ఉండటం వల్ల ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఉష్ణోగ్రత వేసవిలో కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు డిగ్రీలను మించదు. జనవరిలో అయితే పది వరకూ పడిపోతుంది. అసలీ ఈ పట్టణాన్ని గతంలో ముద్దురాజాకెరీ అని పిలిచేవారు. అంటే ముద్దురాజా పట్టణం అని అర్థం. హలేరీ వంశానికి చెందిన ముద్దురాజా కొడగును 1633 నుంచి 1687 వరకూ పాలించాడు. అతని పేరు మీద ఏర్పడిన పట్టణమిది.

ఆ రాజావారి కోట ఇప్పటికీ అక్కడ ఉంది. ఈ పట్టణానికి శివారులో ఉండే ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ‘రాజాస్ సీట్’ అంటారు. నాలుగు స్తంభాల ఆధారంగా, ఓ చరియ మీద అర్ధచంద్రాకారంలో నిర్మించిన ఈ నిర్మాణం ప్రముఖ సందర్శనీయ స్థలం. ఇక్కడ్నుంచి సూర్యాస్తమయాన్ని చూడటానికి అందరూ క్యూ కడతారు.

అల్లంత ఎత్తునుంచి జాలువారుతూ... గలగల సవ్వడితో పల్లాలకు పారే సెలయేటిని చూడటం కన్నులకు ఎంతటి విందు! అబ్బే అనే జలపాతం అలాంటి విందునే అందిస్తుంది. దాదాపు డెబ్భై అడుగుల ఎత్తు నుంచి నురుగులు కక్కుతూ జాలువారే ఈ జలపాతాన్ని చూస్తే ఆకాశం నుంచి పాలధారలు కురుస్తున్నాయా అనిపించక మానదు. పచ్చటి కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలకు మధ్య ఉండటం దీని అందాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. బ్రహ్మగిరి పర్వతం మీది నుంచి జాలువారే ఇరుప్పు వాటర్ ఫాల్స్ అందం కూడా తక్కువేమీ కాదు!

మడికెరీకి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉండే నిసర్గధామ ఐల్యాండ్‌ను చూడకపోతే కూర్గ్ సందర్శన పూర్తి చేసినట్టు కాదు. కావేరీ జలాల మధ్య ఏర్పడిన ఈ దీవిలో వెదురు, చందనపు చెట్ల అందాలు వర్ణించతరం కాదు. కుందేళ్ల పార్క్, లేళ్ల పార్క్, నెమళ్ల పార్కులు ఈ దీవిలో తప్పక చూడాల్సిన ప్రత్యేకతలు. ఏనుగు స్వారీ, బోట్ రైడ్స్ వంటి అదనపు ఆకర్షణలూ ఉన్నాయి.

‘భాగమండల’ను టెంపుల్ టౌన్ అంటారు. ఇక్కడ ఉన్న శ్రీ భాగనందేశ్వర ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినదని అంటారు. కావేరి, కన్నికె, సుజ్యోతి నదుల త్రివేణి సంగమం వద్ద స్నానమాచరిస్తే సమస్త పాపాలూ తొలగిపోయి పుణ్యం చేకూరుతుందని నమ్మకం. అలాగే 1820లో లింగరాజేంద్ర అనే రాజు నిర్మించిన ఓంకారేశ్వర ఆలయం కూడా ఎంతో ప్రాశస్తం కలిగినది. నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

ఇస్లామిక్, గోథిక్ శైలులను మేళవించి నిర్మించిన ఈ ఆలయం చుట్టూ నీరు ఉంటుంది. అందులో ఉండే చేపలకు భక్తులు ఆహారం వేసి మనసులోని కోరికలు విన్నవించుకుంటూ ఉంటారు. కావేరీ నది పుట్టిన చోట నిర్మించిన ‘తలక్కావేరి’ ఆలయంలోని కావేరీ మాత భక్తుల కొంగు బంగారం. వీటన్నిటితో పాటు ‘బైలకుప్పె’ బౌద్ధాలయం కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలో బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ అంటుంటారు.

ఈస్ట్ ఇండియా కంపెనీవారు నిర్మించిన సెయింట్ మార్క్స్ చర్చి నిర్మాణ సౌందర్యం గురించి వినడం కంటే స్వయంగా చూస్తేనే బాగుంటుంది. పులిని టీవీలో చూస్తేనే కంగారు పుడు తుంది. అలాంటిది దాని ముఖంలో ముఖం పెట్టి చూస్తే ఎలా ఉంటుంది? నాగర్‌హోల్ నేషనల్ పార్క్‌లో అలాంటి అను భవం ఎదురవుతుంది. అక్కడ ప్రత్యేక వాహనాల్లో పులుల మధ్యకు వెళ్లి, వాటిని దగ్గర నుంచి చూడవచ్చు. అదొక్కటే కాదు... ఈ పార్క్‌లో ఉన్న విభిన్న జాతుల జంతురాశిని చూడటం మంచి అనుభవం. ఈ పార్కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల లిస్టులో చేరింది.

ఎప్పుడైనా మైసూర్‌లో దసరా ఉత్స వాలు చూశారా? వాటిలో గజరాజులదే ప్రధాన పాత్ర. అందంగా అలంక రించిన ఏనుగులు ఆ ఉత్సవాల్లో చేసే సందడి, వాటి విన్యాసాలు చూడ్డానికే ఎంతోమంది వస్తుంటారు. అయితే ఆ ఏనుగులకు అలా మెలగాలని ఎవరు నేర్పుతున్నారో చాలా మందికి తెలీదు. కూర్గ్‌లో ఉన్న డ్యుబేర్ ఎలిఫెంట్ క్యాంప్ ఇచ్చే తర్ఫీదే అదంతా. అక్కడ బోలెడన్ని ఏనుగులు ఉంటాయి. వాటిని సంరక్షించడంతో పాటు వాటికి ఎన్నో విషయాల్ తర్ఫీదునిస్తుంటారు మావటులు. అవన్నీ చూసేందుకు అనుమతి ఉండటంతో కూర్గ్ వెళ్లిన సందర్శకులంతా ఆ క్యాంప్‌కు వెళ్తుంటారు. గజరాజులతో కొంత సమయం గడిపి సంతోషిస్తుంటారు.

కూర్గ్ వారికి ఆటలంటే మహాప్రీతి. ముఖ్యంగా హాకీ అంటే. ఏప్రిల్ నుంచి మే నెల ముగిసే వరకూ అక్కడ హాకీ ఫెస్టివల్ జరుగుతుంది. ఎందరో హాకీ క్రీడాకారులు ఆ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. అలాగే మే నెలలో జరిగే కుండే హబ్బా పండుగ కూడా చాలా ఫేమస్. అయ్యప్పస్వామి అవతారంగా చెప్పే ‘కుండే’ స్వామిని కొలిచే గిరిజనులు ఈ పండుగను చేసుకుంటారు. ఇది ఎంతో వేడుకగా జరుగుతుంది. వారి సంప్రదాయాలను, ఆచారాలను చూడాలంటే ఈ పండుగ తప్పక చూడాలి. కెయిల్‌పోదు, కావేరీ సంక్రమణ, పుట్టారీ, దసరా, కరంగా తదితర పండుగలు కూడా వైభవంగా జరుగుతాయి.

ఏం తినాలి?
కూర్గ్ వెళ్లే వాళ్లు ఆహారం విషయంలో ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. అక్కడ మంచి రుచికరమైన భోజనం దొరుకుతుంది. రెయిన్‌ట్రీ రెస్టారెంట్లో స్థానికంగా పండిన మసాలా దినుసులతో చేసే పెప్పర్ చికెన్, ఘీ చికెన్, మటన్ స్ట్యూ నాన్‌వెజ్ ప్రియుల మనసులు దోచుకుంటాయి. హోటల్ క్యాపిటల్‌లో బియ్యప్పిండి రొట్టెతో పాటు పోర్క్ కర్రీని సర్వ్ చేస్తారు. కూర్గ్ వారికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైన డిష్. ఇక వెజిటేరియన్స్‌కి నచ్చే అన్ని వంటకాలూ అతిథి అనే రెస్టారెంటులో లభిస్తాయి. అలాగే కూర్గ్‌ని వదిలిపెట్టే ముందు ‘కదుమ్‌బుట్టు’ని రుచి చూడకుండా రావద్దు. బియ్యపుపిండిని ఆవిరి మీద ఉడికించి చేసే ఈ రైస్ డంప్లింగ్స్ టేస్ట్ అదరహో అనిపిస్తుంది. అలాగే వెదురు కూర. లేత వెదురు బొంగులను ముక్కలుగా కోసి... ఆవాలు, ఎండుమిర్చి, కొబ్బరి వేసి చేసే ఈ కూర అక్కడ తప్ప మరోచోట దొరికే అవకాశమే లేదు.


ఏం కొనాలి?
మంచి కాఫీ దొరుకుతుంది. కాఫియా అరబికా, కాఫియా రొబుస్తా అనేవి ఫేమస్ మసాలా దినుసులకు, డ్రై ఫ్రూట్స్‌కు కూర్గ్‌లో కొదువే లేదు. యాల కులు, మిరియాలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, రోజ్‌మేరీ, జీడిపప్పు, కిస్‌మిస్... కొన్నవారికి కొన్నంత కూర్గ్‌లో ఉన్నంత మధురంగా మరెక్కడ పండిన కమలాలూ ఉండవు పండ్ల రసాలతో ప్రత్యేకంగా తయారయ్యే చాక్లెట్లు స్పెషల్. కొబ్బరి పాలతో చేసే ఒక విధమైన లిక్కర్, స్వచ్ఛమైన తేనెను మిస్సవకూడదు!

ఏం చేయాలి?
ట్రెక్కింగ్, రివర్ ర్యాఫ్టింగ్, పారా గ్లైడింగ్... ఏం చేయాలన్నా ఇక్కడ చక్కగా చేయవచ్చు. మడికెరీలోని ఆయుర్వేదిక్ స్పాలో బాడీ మసాజ్ చేయించుకుంటే, ఆ హాయి కొన్ని నెలల పాటు వదిలిపెట్టదు. మన దేశంలో ఉన్న పక్షి జాతుల్లో ఇరవై అయిదు శాతం కూర్గ్‌లోనే ఉన్నాయట. వాటన్నిటినీ చూడ్డం ఓ మంచి అనుభవం. కుశల్‌నగర్ దగ్గర ఉన్న వల్నర్ ఫిషింగ్ క్యాంప్‌కి వెళ్తే ఫిషింగ్ చేయవచ్చు. అయితే పట్టుకుని వదిలేయాలి తప్ప వాటికి హాని చేయడానికి వీల్లేదు. టీ, మసాలాల తోటల్లో నేచర్ వాక్ ఆహ్లాదంగా ఉంటుంది. చిక్‌లీహోల్ రిజర్వాయర్ దగ్గర సూర్యాస్తమయ సౌందర్యం చూడాల్సిందే!

ఎలా వెళ్లాలి?
బస్సులో: అన్ని ముఖ్య పట్టణాల నుంచీ డెరైక్ట్ బస్సులు ఉన్నాయి.
రైల్లో: డెరైక్ట్ రైళ్లు లేవు. హైదరాబాద్ నుంచి మైసూర్ వరకూ రైల్లో వెళ్లి, అక్కడి నంచి క్యాబ్ లోనో, బస్సులోనో వెళ్లాలి.
ఫ్లయిట్‌లో: నేరుగా వెళ్లే విమానాలు లేవు. మంగుళూరు వెళ్లి, అక్కణ్నుంచి ట్యాక్సీలో కూర్గ్ వెళ్లవచ్చు. విడిగా కంటే ప్యాకేజీ ఉత్తమం. ఇద్దరు మనుషులకి మూడు పగళ్లు, రెండు రాత్రులకి స్టాండర్డ్ ప్యాకేజీ అయితే రూ. 18,000 వేల లోపు, డీలక్స్ అయితే రూ. 30,000 లోపు, లగ్జరీ అయితే రూ. 37,000 లోపు అవుతుంది. అన్నీ అందులోనే!

చలో కూనూర్!

గిరుల్... తరుల్... ఝరుల్


నీలగిరుల సొగసులను నిండుగా చూడాలని ఉందా..?
నింగిని నిటారుగా తాకే కొండలు... కొండలను చీల్చుకుంటూ నేలవైపు పరుగులు తీసే జలపాతాల పరవళ్లను చూస్తూ పరవశించాలని ఉందా..?
ఆకుపచ్చని లోకంలో ఆనందంగా విహరించాలని ఉందా..?
వేసవి వేడికి దూరంగా... మనసుకు ఉపశమనం కలిగించే చల్లచల్లని ప్రదేశంలో గడపాలని ఉందా..?
అయితే, చలో కూనూర్... అక్కడ ఇవన్నీ ఉంటాయి.

ఊటీకి కూతవేటు దూరంలోనే ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్, సమ్మర్ డెస్టినేషన్ కూనూర్. నీలగిరి కొండల నడుమ వెలిసిన చిన్న పట్టణం ఇది. ఎటుచూసినా తేయాకు తోటల పచ్చదనం... నిటారుగా నింగిని తాకే నీలగిరుల సొగసులు...పరవళ్లు తొక్కే జలపాతాల గలగలలు... సముద్ర మట్టానికి దాదాపు ఆరువేల అడుగుల ఎత్తులో ఉన్న చల్లచల్లని ప్రశాంత ప్రదేశం కూనూర్. నిప్పులు చెరిగే ఎండలు ఇక్కడ ఉండనే ఉండవు. ఎంతటి వేసవిలోనైనా ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు మించవు.

తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ ప్రాంతంలో పూర్వం టోడా తెగకు చెందిన గిరిజనులు నివాసం ఉండేవారు. బ్రిటిష్ పాలకులు నీలగిరి ప్రాంతంలో చల్లని వాతావరణాన్ని గమనించి, ఊటీ మాదిరిగానే కూనూర్‌ను కూడా హిల్‌స్టేషన్‌గా అభివృద్ధి చేశారు. ఒక బ్రిటిష్ అధికారి 1819లో ఈ ప్రదేశాన్ని తొలిసారిగా గుర్తించాడు. ఆ మరుసటి ఏడాదే ఆయన ఇక్కడ ఒక పెద్ద భవంతిని నిర్మించాడు. ఆ తర్వాత సంపన్న బ్రిటిష్ అధికారులు, వ్యాపారులు ఇక్కడ తమ తమ నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో క్రమంగా కూనూర్ పట్టణంగా ఎదిగింది. బ్రిటిష్‌వారి హయాంలోనే ఇక్కడకు రైలుమార్గం ఏర్పడింది.

ఏం చూడాలి?
కూనూర్‌లోని సిమ్స్ పార్క్ చూసి తీరాల్సిన ప్రదేశం. వెయ్యికి పైగా వృక్షజాతులకు చెందిన మొక్కలు, చెట్లతో కనువిందు చేసే ఈ ఉద్యానవనం నందనవనాన్ని తలపిస్తుంది. అప్పట్లో మద్రాస్ క్లబ్ కార్యదర్శిగా పనిచేసిన బ్రిటిష్ అధికారి జె.డి.సిమ్ పేరిట ఏర్పాటు చేసిన ఈ పార్కులో ఏటా మే నెలలో జరిగే పండ్లు, కూరగాయల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

కూనూర్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే కూనూర్ పట్టణం, పరిసరాల్లోని పచ్చని తేయాకు తోటలు సహా నీలగిరుల అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. కూనూర్ వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా డాల్ఫిన్ నోస్ వ్యూపాయింట్ నుంచి నీలగిరులను తిలకించాలని తహతహలాడతారు.

కూనూర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని ల్యాంబ్స్ రాక్ కూడా మరో అద్భుతమైన వ్యూ పాయింట్. ఇది డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్‌కు వెళ్లే దారిలో ఉంటుంది. దీని పైనుంచి చూస్తే కూనూర్ పరిసరాలే కాదు, కోయంబత్తూరు మైదాన ప్రాంతంలో విస్తరించిన పచ్చదనం కూడా కనువిందు చేస్తుంది. ట్రెక్కింగ్‌పై ఆసక్తి గల పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రదేశం నుంచి ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు ఇష్టపడతారు.



కూనూర్‌కు 7 కిలోమీటర్ల దూరంలోని లాస్ జలపాతం చూసి తీరాల్సిన ప్రదేశం. కూనూర్ నుంచి మెట్టుపాళ్యం వెళ్లే మార్గంలో ఉండే ఈ జలపాతం నీలగిరి కొండల మీదుగా దాదాపు 180 అడుగుల ఎత్తు నుంచి ఉరకలేస్తూ పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. కూనూర్ నుంచి మెట్టుపాళ్యం వెళ్లే దారిలోనే కోటగిరి పట్టణానికి సమీపంలో కేథరీన్ జలపాతం కూడా చూసి తీరాల్సిందే. ఇది దాదాపు 250 అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తుంది. ఈ జలపాతానికి కోటగిరి ప్రాంతంలో కాఫీ సాగును పరిచయం చేసిన బ్రిటిష్ అధికారి ఎండీ కాక్‌బర్న్ భార్య పేరు పెట్టారు.


ఏం కొనాలి?
* శ్రేష్టమైన తేయాకు చౌకగా దొరుకు తుంది. రకరకాల టీ పొడిని కొనుక్కోవచ్చు.
* గోర్మెట్ చీజ్‌కు కూనూర్ బాగా ఫేమస్. ఇక్కడకు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా దీనిని కొనుక్కుంటారు.
* స్వచ్ఛమైన తేనె, స్థానికంగా తయారయ్యే రకరకాల జామ్స్ ఇక్కడి దుకాణాల్లో చౌకగా దొరుకుతాయి.
* ఇక్కడి దుకాణాల్లో స్థానికంగా తయారయ్యే హస్తకళాకృతులు, ఎంబ్రాయిడరీ చేసిన దిండు కవర్లు, కుషన్ కవర్లు, బెడ్‌షీట్స్, టీ సెట్లు కొనుక్కోవచ్చు.

ఏం చేయాలి?
* బోటింగ్, ట్రెక్కింగ్, వాకింగ్, షాపింగ్ వంటి వాటికి కూనూర్ చాలా అనువుగా ఉంటుంది. సిమ్స్ పార్కులోని కొలనులో బోటింగ్‌ను పిల్లలు బాగా ఆస్వాదిస్తారు.
* కూనూర్ నుంచి ఊటీ మధ్య నడిచే హెరిటేజ్ ట్రైన్‌లో ప్రయాణం కూడా గొప్ప అనుభూతి కలిగిస్తుంది. దాదాపు రెండు గంటలు సాగే ఈ ప్రయాణంలో తాపీగా ప్రకృతి అందాలను తిలకించవచ్చు.
* డాల్ఫిన్ నోస్, ల్యాంబ్స్ రాక్ ట్రెక్కింగ్‌కు అనువుగా ఉంటాయి. ట్రెక్కర్లను ఆకర్షించే మరో ప్రదేశం కూనూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని బకాసుర కొండ. దీనిపై శిథిలావస్థలో ఉన్న డ్రూగ్ కోట శతాబ్దాల చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కోట 18వ శతాబ్దిలో టిప్పు సుల్తాను బలగాలకు స్థావరంగా ఉండేది.
* కూనూర్ శివార్లలో నలువైపులా విస్తరించి ఉన్న టీ తోటల్లో వాకింగ్ ఆహ్లాదభరితంగా ఉంటుంది. ట్రెక్కింగ్‌కు ఓపిక లేనివారు టీ తోటల్లో విహరిస్తూ నీలగిరుల అందాలను తిలకించవచ్చు.

ఎలా వెళ్లాలి?
* కోయంబత్తూరు వరకు విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడి నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూనూర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది.
* కూనూర్‌లో రైల్వేస్టేషన్ ఉంది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
* తమిళనాడు, కేరళలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు విరివిగా బస్సులు అందుబాటులో ఉంటాయి.

Sunday, 15 May 2016

కాశి లో 9 రోజుల నిద్ర, దర్శించు పుణ్య క్షేత్రాలు

కాశీ లేదా వారాణసి (Kasi, Benaras, Varanasi) భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ శివుడు కాశీ విశ్వేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారాణసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం కలదు. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది.

కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు.

గంగానది, హిందూమతము, హిందూస్తానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. 

హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాస్, మున్షీ ప్రేమ్‌చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారాణసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు.

వారణాసికి గంగానది ఆవలివైపున రామనగరం ఉంది. వారాణసి సమీపంలో సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది.

విశ్వేశ్వర మందిరం, అన్నపూర్ణ మందిరం, విశాలాక్షి మందిరం, వారాహీమాత మందిరం, తులసీ మానస మందిరం, సంకట మోచన మందిరం, కాల భైరవ నందిరం, దుర్గా మాత మందిరం, భారతమాత మందిరం - ఇలా కాశీలో ఎన్నో మందిరాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది.

వారాణసిని "మందిరాల నగరం", "ధేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు.

అమెరికన్ రచయిత మార్క్ ట్వేన్ ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది. సంప్రదాయం కంటే పురాతనమైనది. గాధలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి.

వారాణసి పేరు::
వారాణసి నగరానికి, గంగానదికి అవినాభావ సంబంధం ఉన్నది. గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.

"వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాశేవారు. అది తరువాత బవారస్‌గా మారింది. వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

చరిత్ర::
షుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాధల సారాంశం. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంధాలలో కాశీనగరం ప్రసక్తి ఉన్నది.
వారాణసి నగరం షుమారు 3,000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వాని వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చువాంగ్(Xuanzang)ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు. 18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో "రామ్‌నగర్" రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణసి నగరంపైన మఅత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్ నగర్ కోటలోనే నివశిస్తున్నాడు.

భౌగోళికం::
వారాణసి నగరం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తూర్పు భాగంలో గంగా మైదానంలో, గంగానది ఒడ్డున ఉంది. ఇక్కడ గంగానది వంపు తిరిగి ఉంది. ఇది వారాణసి జిల్లాకు కేంద్రం కూడాను. వారాణసి నగం, దాని పరిసర ప్రాంతాలు ("Varanasi Urban Agglomeration") కలిపి మొత్తం 112.26 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. ఈ నగరం ప్రాంతం 82° 56’తూ. - 83° 03’తూ. రేఖాంశాల మధ్య మరియు 25° 14’ఉ. - 25° 23.5’ఉ. అక్షాంశాల మధ్య ఉంది. గంగానది వరదలతో (low level floods) ఈ ప్రాంతం నేల సారవంతంగా ఉంటుంది.
వారాణసి నగరం మాత్రం గంగ, వరుణ నదుల మధ్య ఉంది. ఈ నగరం సముద్ర మట్టం నుండి 80.71 మీటర్ల ఎత్తులో ఉంది. పెద్దగా ఉపనదులు, పిల్ల కాలువలు లేనందున ఇక్కడి భూమి అధికంగా పొడిగా ఉంటుంది.
వారాణసి నగరం రెండు సంగమ స్థానాల మధ్య ఉన్నట్లుగా చెప్పబడుతుంది.
1) గంగ, వరుణ నదుల సంగమం
2) గంగ, అస్సి నదుల సంగమం.
అస్సి నది చాలా చిన్నది (కాలువ వంటిది) ఈ రెండు సంగమాల మధ్య దూరం షుమారు 2.5 కిలోమీటర్లు. ఈ రెండు సంగమ స్థానాల మధ్య (5 కిలోమీటర్ల) యాత్ర "పంచ క్రోశి యాత్ర" పవిత్రమైనదిగా భావిస్తారు. యాత్రానంతరం సాక్షి వినాయకుని మందిరాన్ని దర్శిస్తారు.

వారాణసి వాతావరణం తేమగా ఉన్న సమోష్ణ వాతావరణం. వేసవి, శీతాకాలం ఉష్ణోగ్రతల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య వేసవి కాలంలో ఋతుపవనాల వల్ల అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. హిమాలయ ప్రాంతంనుండి వచ్చే చలి తెరగలు (Cold waves) కారణంగా డిసెంబరు - ఫిబ్రవరి మధ్య శీతాకాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో నగరం ఉష్ణోగ్రతలు 32 - 46 °C మధ్య, చలికాలంలో 5° - 15 °C మధ్య ఉంటాయి. సగటు వర్షపాతం 1110 మిల్లీమీటర్లు. చలికాలంలో దట్టమైన పొగ మంచు, వేసవి కాలంలో వడ గాడ్పులు ఉంటాయి.
నగరంలో వాతావరణ (గాలి) కాలుష్యం ఇప్పటికి అంత తీవ్రమైన సమస్య కాదు. కాని నీటి కాలుష్యం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. ఇందువలనా, నది పైభాగంలో కడుతున్న ఆనకట్టల వలనా గంగానదిలో నీటి మట్టం తగ్గుతున్నది. నది మధ్యలో మట్టి మేటలు బయటపడుతున్నాయి.

సంస్కృతి::
వారాణసి సమకాలీన జనజీవనం తక్కిన నగరాల వలెనే ఉంటుంది. అయితే వారాణసికి హిందూమతంలో ఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడి గంగానది, స్నానఘట్టాలు, దేవాలయాలు, హిందూ మత సంస్థలు సంస్కృతీ చిహ్నాలుగా ప్రముఖంగా ప్రస్తావించబడుతాయి. ఇంతే కాకుండా పట్టు చీరల నేత, , హిందూ-ముస్లిమ్ సహ జీవనం (మరియు మత కలహాలు కూడా), హిందూస్తానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు నగర జీవనంలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు. గంగానది తీరాన, పాత నగరంలో ఇండ్లు, ఆలయాలు, దుకాణాలు ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అధిక జనాభా నగరంలో ఇతర ప్రాంతాలలో నివశిస్తున్నారు.

గంగానది::
గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది వడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది వడ్డున ఉన్నాయి. గంగానదిలో స్నానం కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఈ మత పరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.

స్నాన ఘట్టాలు::
వారాణసిలో షుమారు 100 ఘాట్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. కొన్ని ఘాట్‌లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు "శివాలా ఘాట్" మరియు "కాళీ ఘాట్"లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్‌లు స్నానానికి మరియు దహనకాండలకు వాడుతారు. కొన్నిఘాట్‌లు పురాణ గాధలతో ముడివడి ఉన్నాయి.

స్నాన ఘట్టాలు::
వారాణసిలో షుమారు 100 ఘాట్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. కొన్ని ఘాట్‌లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు "శివాలా ఘాట్" మరియు "కాళీ ఘాట్"లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్‌లు స్నానానికి మరియు దహనకాండలకు వాడుతారు. కొన్నిఘాట్‌లు పురాణ గాధలతో ముడివడి ఉన్నాయి.
  • దశాశ్వమేధ ఘాట్::
    కాశీ విశ్వనాధ మందిరం ప్రక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ యాత్రికులతోను, పూజారులతోను, అమ్మకందారులతోను ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వెనుక ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉండడంతో ఇది ఫొటోలు తీసికొనేవారికి చాలా ప్రియమైన స్థలం. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాధ. ప్రతి రోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు.
  • మణి కర్ణికా ఘాట్::
    మణి కర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాధ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది. మరొక కధ ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దఅచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కధనాల ప్రకారం ఈ మణికర్ణికా ఘాట్ యజమానే హరిశ్చంద్రుడిని కొని, హరిశ్చంద్ర ఘాట్‌లో కాటిపనికి నియమించాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్రఘాట్‌లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి.
  • సిండియా ఘాట్::
    150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఘాట్ బరువుకు ఇక్కడి శివాలయం కొంతవరకు నీట మునిగి ఉంటుంది. ఇది అగ్ని దేవుని జన్మ స్థలమని పురాణ కధనం. మగ సంతానం కావాలని కోరేవారు ఇక్కడ వీరేశ్వరుని అర్చిస్తారు. సిండియా ఘాట్‌కు ఉత్తరాన మణికర్ణికా ఘాట్ ఉంది. వెనుక ప్రక్క సిద్ధక్షేత్రంలో అనేక ముఖ్యమైన అలయాలున్నాయి.
  • మన మందిర్ ఘాట్::
    1770లో జైపూర్ రాజు మహారాజా జైసింగ్ ఈ మన మందిర్ ఘాట్‌ను, దాని వద్ద యాత్రా మందిరాన్ని నిర్మింపజేశాడు. యాత్రా మందిరం రాజస్థాన్-ఢిల్లీ శైలిలో చక్కని అలంకృత గవాక్షాలతో ఉంటుంది. ఇక్కడ భక్తులు సోమేశ్వరుని అర్చిస్తారు. అంబర్ రాజు మాన్‌సింగ్ మానస-సరోవర్ ఘాట్‌ను, దర్భంగా మహారాజు దర్భంగా ఘాట్‌ను నిర్మింపజేశారు.
  • లలితా ఘాట్::
    ఇది నేపాల్ రాజుచే నిర్మింపజేయబడింది. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించిన గంగా కేశవ మందిరం ఉంది. ఈ విష్ణ్వాలయంలో పాశుపతేశ్వరస్వామి విగ్రహం ఉంది.
  • అస్సీ ఘాట్::
    ఇది చాలా సుందరమైనది. అన్ని ఘాట్‌లకు చివర ఉంది. ఇది ఫొటోగ్రాఫర్లు, చిత్రకారులు, వాద్య బృందకారులతో కోలాహలంగా ఉంటుంది.
ఇంకా
జైన భక్తులు బచరాజ్ ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ నది వడ్డున మూడు జైనాలయాలున్నాయి. తులసీ ఘాట్ వద్ద గోస్వామి తులసీ దాస్ రామచరిత మానస్ కావ్యాన్ని రచించాడు.

పవిత్ర క్షేత్రం::
వారాణసి హిందువులందరికి పరమ పావన క్షేత్రం. ప్రతి యేటా లక్షమంది పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగాస్నానం, దైవ దర్శనం చేసుకొంటారు. ఇక్కడ విశ్వేశ్వరాలయంలోని People performing Hindu ceremony at one of the ghats of Varanasi శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువైయున్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.
బౌద్ధులకు కూడా వారాణసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ - ఈ ఐదు ముఖ్యమైన యాత్రాస్థలాలలని బుద్ధుడు బోధించాడు. వారాణసి సమీపంలోనే సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధననుపదేశించాడు. అక్కడి ధమేక స్తూపం అశోకునికంటె ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థఅనంలో బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిశాడట.
జైనుల 23వ తీర్ధంకరుడైన పార్శ్వనాధుని జన్మ స్థలం అయినందున వారాణసి జైనులకు కూడా పవిత్ర స్థలమే.
వారాణసిలో ఇస్లామిక్ సంస్కృతి కూడా గాఢంగా పెనవేసుకొని ఉంది. హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలు, లేదా ఘర్షణ వాతావరణం అప్పుడప్పుడూ సంభవింఛాయి.

ఆలయాలు::
వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిద కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి.
విశ్వనాధ మందిరం::
కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టింపించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు" , "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు.

1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.
ఈ మందిరం అధికారిక వెబ్‌సైటు కాశీ విశ్వనాధ 2007 జూలై 23న ప్రాంభమైంది. ఈ వెబ్‌సైటులో మందిరంలోని సదుపాయాలు, పూజా వివరాలు వంటి సమాచారం లభిస్తుంది.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే విభేదాలలో ఒకటి.

దుర్గా మందిరం::
"కోతుల గుడి" గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత "నగర"శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగమార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు.

సంకట మోచన్ హనుమాన్ మందిరం
కష్టాలనుండి భక్తులను కడతేర్చే దేవునిగా ఇక్కడ కొలువైయున్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. 2006 మార్చి 7 న ఈ మందిరంలో ఉగ్రవాదులు బాంబులు పేల్చారు.

తులసీ మానస మందిరం::
ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడింది.

బిర్లా మందిరం
కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబంచే ఈ విశ్వనాధ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది.

ముఖ్య శివ లింగాలు::
వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు::
• విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
• మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
• ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
• కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
• త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
• కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
• ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
• అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
• ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
• ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
• పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
• హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
• వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
• కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
• నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
• ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
• కాశేశ్వరుడు - త్రిలోచన్
• శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
• శుక్రేశ్వరుడు - కాళికా గలీ

కళ, సాహిత్యం::
అనాదిగా వారాణసి నగరం సాహిత్యానికి, పాండిత్యానికి, కళలకు నిలయంగా ఉంది. కబీర్ , తులసీదాస్ , రవిదాస్ , కుల్లూకభట్టు (15వ శతాబ్దంలో మను వ్యాఖ్య రచయిత)వంటి పురాతన రచయితలు, భారతేందు హరిశ్చంద్ర ప్రసాద్, జయశంకర్ ప్రసాద్, ఆచార్య రామచంద్ర శుక్లా, మున్షీ ప్రేమ్ చంద్, జగన్నాధ ప్రసాద్ రత్నాకర్, దేవకీ నందన్ ఖత్రీ, తేఘ్ ఆలీ, క్షేత్రేశ చంద్ర ఛటోపాధ్యాయ, బలదేవ్ ఉపాధ్యాయ, వాగీశ్ శాస్త్రి, విద్యా నివాస్ మిత్రా, కాశీనాథ్ సింగ్, నమ్వార్ సింగ్, రుద్ర కాశికేయ, నిర్గుణ వంటి ఆధునిక రచయితలు వారాణసికి చెందినవారు. శుశ్రుత సంహితం వ్రాసిన ఆయుర్వేద శస్త్రచికిత్సానిపుణుడు శుశ్రుతుడు వారాణసికి చెందినవాడే.

రాజ కొషోర్ దాస్ (కళా శోధకుడు), ఆనంద కృష్ణ (చరిత్ర కారుడు) మరియు ఓంకార్ ఠాకుర్ పండిట్ రవిశంకర్ , బిస్మిల్లా ఖాన్ , గిరిజాదేవి, సిద్ధేశ్వరీ దేవి, డా. లాల్ మణి మిశ్రా, డా. గోపాల శంకర్ మిశ్రా, డా. ఎన్.రాజన్, డా. రాజభాను సింగ్, పండిట్ సమతా ప్రసాద్, కంథే మహరాజ్, పండిట్ ఎమ్.కల్వంత్, సితారా దేవి, గోపీకృష్ణ, పండిట్ కిషన్ మహరాజ్, రాజన్-సాజన్ మిశ్రా (అన్నదమ్ములు), మహాదేవ మిశ్రా వంటి అనేక సంగీతకారులు వారాణసినుండి ప్రఖ్యాతులయ్యారు.
వారాణసిలో ఉత్తర హిందూస్తానంలో జరుపుకొనే పండుగలన్నింటినీ ఘనంగా జరుపుకొంటారు.

ఆర్ధికం
వారాణసిలో ఉన్న ఒక పెద్ద పరిశ్రమ రైల్వే డీసెల్ ఇంజన్ల తయారీ కర్మాగారం (Diesel Locomotive Works - DLW). కాన్పూర్‌కు చెందిన నిహాల్ చంద్ కిషోరీ లాల్ కుటుంబం 1857లో స్థాపించిన ఆక్సిజన్ కర్మాగారం ఇక్కడి మొదటి పెద్ద పరిశ్రమ కావచ్చును.కాని అధికంగా వారాణసిలో చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టు వస్త్రాల నేత ఇక్కడ పెద్ద కుటీర పరిశ్రమ. ఇంకా తివాచీల నేత, చేతి కళల వస్తువుల తయారీ ఉన్నాయి. బనారసీ పాన్, బనారసీ కోవా ప్రసిద్ధాలు. లార్డ్ మెకాలే వారాణసి ఎంతో సంపన్నమైన నగరమని, ఇక్కడ తయారయ్యే నాణ్యమైన సన్నని పట్టు వస్త్రాలు ప్రపంచంలో వివిధ సంపన్న గృహాలను అలంకరిస్తున్నాయని వ్రాశాడు.
మొదటినుండి యాత్రా స్థలం అవ్వడం వలన, వారాణసి దేశం అన్ని ప్రాంతాలనుండి జనులను ఆకర్షించేది. కనుక ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది.

రవాణా::
తరతరాలుగా వారాణసి ప్రధాన ప్రయాణ మార్గంలోని నగరంగా ఉంది. చారిత్రికంగా ఇది తక్షశిల, ఘాజీపూర్, పాటలీపుత్రం (పాట్నా), వైశాలి, అయోధ్య, గోరఖ్‌పూర్, ఆగ్రా వంటి నగరాలకు కూడలిగా ఉంది. మౌర్యుల కాలంళో తక్షశిల నుండి పాటలీపుత్రనగరానికి వెళ్ళే దారిలో వారాణసి ఉంది. దీనిని 16వ శతాబ్దంలో షేర్ షా సూరి తిరిగి వేయించాడు.
ప్రస్తుతం వారాణసి నగరం దేశంలో అన్ని ప్రధాన నగరాలనుండి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కలుపబడింది. ఇది రెండవ నంబరు ఢిల్లీ కొలకత్తా జాతీయ రహదారిపై ఢిల్లీ నుండి 800 కిలోమీటర్లు కొలకత్తా నుండి 700 కిలోమీటర్లు దూరంలో ఉన్న పట్టణం. బాబత్‌పూర్ విమానాశ్రయంనగరం నడిబొడ్డునుండి 25 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొలకత్తా, నేపాల్ లకు విమాన స్వీసులు ఉన్నాయి. వారాణసి రైల్వేస్టేషను ఢిల్లీ - కలకత్తా ప్రధాన రైలు మార్గంలో ఉంది. నగరం లోపల సిటీ బస్సులున్నాయి. కాని అత్యధికంగా ప్రైవేటు వాహనాలు, ఆటోరిక్షాలు, సైకిల్ రిక్షాలు నగరం లోపలి ప్రయాణాలకు వాడుతుంటారు. గంగా నదిని దాటడానికి చిన్న పడవలు, స్టీమర్లు ఉపయోగిస్తారు. వారాణసి ప్రక్కనే గంగానదిపై వంతెన ఉంది. అటువైపు మొఘల్ సరాయి రైల్వే జంక్షన్ పట్టణం ఉంది. నగరం లోపల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మార్గాలు ఇరుకైనవి. ఇచ్చట నుండి అలహాబాద్ 120 కిలోమీటర్లు దూరంలో ఉంది.

పాలన, సేవా వ్యవస్థ::
తక్కిన నగరాలలాగానే వారాణసిలో పాలనా బాధ్యతలు మునిపల్ సంస్థ (వారాణసి నగర్ నిగమ్) అధ్వర్యంలో నడుస్తాయి. ప్రణాళిక, ప్రగతి విషయాలు అధికంగా "వారాణసి డెవలప్‌మెంట్ అథారిటీ" చూస్తుంది. నీటి సరఫరా, మురుగు నీటి తొలగింపు వంటి పనులు "జల నిగమ్" బాధ్యత. విద్యుత్ సరఫరా "ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్" బాధ్యత. నగరంలో రోజుకు 350 మిలియన్ లీటర్ల మురుగునీరు మరియు 425 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఈ చెత్తను "లాండ్ ఫిల్" సైటులలో పారవేస్తారు.చాలా మురుగునీరు గంగానదిలోకి విడిచిపెడుతున్నారు. దీనివల్ల, గంగానది వడ్డున ఉన్న అనేక నగరాల లాగానే, తీవ్రమైన నీటి కాలుష్యం జరుగుతున్నది. "గంగా యాక్షన్ ప్లాన్" పరిధిలో ఉన్న ఐదు నగరాలలో వారాణసి ఒకటి.

విద్య::
వారాణసిలో మూడు సార్వత్రిక విశ్వవిద్యాలయాలున్నాయి. వీటిలో కాశీ హిందూ విశ్వవిద్యాలయం లేదా బెనారస్ హిందూ యూనివర్సిటీ అన్నింటికన్నా పెద్దది. 1916లో పండిట్ మదనమోహన మాలవ్యాచే స్థాపింపబడిన ఈ విశ్వవిద్యాలయంలో 128 ప్రత్యేక విభాగాలున్నాయి. ఇది ముందుగా అన్నీబిసెంట్చే ప్రారంభింపబడిన హిందూ విద్యార్ధుల పాఠశాలగా ఉండేది. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం 1350 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. తక్కిన రెండు విశ్వ విద్యాలయాలు - మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం. 1791లో లార్డ్ కారన్ వాలిస్ చే ప్రారంభింపబడిన సంస్కృత కాలేజీ క్రమంగా సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంగా రూపొందింది.

సారనాథ్‌లో ఉన్న "కేంద్రీయ ఉన్నత టిబెటన్ అధ్యయన సంస్థ" (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హయ్యర్ టిబెటన్ స్టడీస్)కు కూడా విశ్వవిద్యాలయ హోదా ఉన్నది. క్రీడా రంగంలోను, విజ్ఞాన రంగాల్లోనూ ప్రత్యేక శిక్షణనిచ్చే "ఉదయ్ ప్రతాప్ కళాశాల" కూడా విశ్వవిద్యాలయ హోదా కలిగి ఉంది. ఇంతే కాకుండా అనేక ప్రభుత్వ, ప్రైవేటు, సాంప్రదాయిక విద్యా కేంద్రాలున్నాయి. సనాతన కాలంనుండి సంస్కృతం, వేదాంతం, జ్యోతిషం వంటి సంప్రదాయ పాండిత్యానికి వారాణసి ప్రధాన అధ్యయన కేంద్రంగా ఉంటూ వచ్చింది. దీనిని "సర్వ విద్యా రాజధాని" అంటుండేవారు.నగరంలో జామియా సలాఫియా అనే సలాఫీ ఇస్లామీయ అధ్యయన సంస్థ కూడా ఉన్నది.
ఇవే కాకుండా అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ పాఠశాలలు మరియు కాలేజీలు కూడా ఉన్నాయి.

పర్యాటక రంగం
వారణాసి లో విలసిల్లిన అసమానమైన సంస్కృతి మూలంగా విదేశీ యాత్రికులకు చాలా ప్రీతిపాత్రమైన యాత్రా స్థలం.నగరంలో 3,4, 5 స్టార్ హోటళ్ళు కూడా ఉన్నాయి. అన్ని రకాల వంటకాలు లభ్యమౌతాయి.అక్కడి సంస్కృతి ప్రభావం వలన వీటిలో చాలా వరకు వీధుల్లోనే లభిస్తాయి.
పట్టు వస్త్రాలకు, ఇత్తడి సామానుకు వారాణసి ప్రసిద్ధి చెందినది. ఎంతో చక్కని పనితనం ఉట్టిపడే పట్టు చీరలు, ఇత్తడి పాత్రలు, ఆభరణాలు, చెక్క సామాను, తివాచీలు, గోడకు వేలాడదీసే పటాలు(wall hangings), ఆకర్షణీయమైన దీపపు స్థంభాలు (lamp shades) మరియు హిందూ, బౌద్ధ దేవతల బొమ్మలు విరివిగా లభిస్తాయి. చౌక్, గొధౌలియా, విశ్వనాధ్ సందు, లహురాబీర్, థటేరి బజార్ ముఖ్యమైన బజారులు

ఇతరాలు
ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు. స్కాంద పురణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యాన్ని గురించిన వర్ణన ఉంది. ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు
ముల్లోకాలు నాకు నివాసమే. అదులో కాశీ క్షేత్రం నా మందిరం.
కాశి యాత్ర
శ్రీ లక్ష్మి నరసింహ టూర్స్ ( ప్రహల్లాద్ పంతులు)
call 9948134708

కాశి యత్ర
కాశి లో 9 రోజుల నిద్ర, దర్శించు పుణ్య క్షేత్రాలు
1)గయా (మాంగల్య దేవి శిక్తి పిటం,విష్ణు పాదం , బుద్ద గయా )
2)అలహాబాద్ ( మదవేశ్వరి శక్తి పిటం, త్రివేణి నది స్నానం,నెహ్రూ పాలస్ )
3)అయోధ్య ( సరయు నది స్నానం,సీతా రాముల దర్శనం)
4) సితమడి ( సీతా అమ్మవారు భుమిలోనుకి వెళ్ళిన ప్రదేశం)
5)వింధ్యచలం (వింధ్య వసిని శక్తి పిటం)
6)కాశి (కాశి విశ్వనతుని దర్శనం, అన్నపుర్ణ దేవి దర్శనం, కాశి విశాలాక్షి దర్శనం, కాల బైరవ దర్శనం, కౌడి భాయి (గావ్వలమ్మ దర్శనం), దుర్గ మానస్ మందిర్, సంకట్ మోచన్(హనుమాన్ దర్శనం), పంచ గంగ స్నానం (మణికర్ణిక ఘాట్), గంగ హారతి (బోటు ద్వార)

అభిషేకాలు ఇతర పూజలు
కాశి విశ్వనతుని అభిషేకం, అన్నపుర్ణ అమ్మవారు దగ్గర శ్రీచక్ర కుoకుమ అర్చన,
ఓడిబియ్యలు (విశలక్షి, అన్నపుర్ణ, మాంగల్య దేవి, మదవేశ్వరి. విన్ద్యచాలవాసిని అమ్మవార్ల దగ్గర ఓడిబియ్యలు మరియు చిర సారే రుద్రా వత్తి వెలిగించుట) అలహాబాద్(ప్రయాగ) జీవితంలో ఒక్కసారి భార్య,భర్తలు చెయ్య వలసిన వేణిపూజ
త్రివేణి నది(గంగ , యమున,సరస్వతి సంగంమం) లో ఓడిబియ్యలు వదులుట
గయలోవిష్ణు పాదం దగ్గర పిండ ప్రదానాలు , కాశిలో కేధర్ ఘాట్ దగ్గర పిండ ప్రదానాలు
రామేశ్వరo నుంచి తెచ్చిన రామసేతును కాశిలో అభిషేకం చేయించి గంగ నది లో నిమర్జనం చేయుట

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...