స్థల పురాణం
వైష్ణవ ధర్మ ప్రచారకులైన ఆళ్వారులు అందరు శ్రీ రంగ వాసులే ..శ్రీ మద్రామానుజుల వారు తమ విశిష్టాద్వైత మతాన్ని లోకానికి ఇక్కడి నుంచే చాటారు ..కనుక వైష్ణవానికిది రాజ దాని అయింది .తిరుపతి తర్వాతా అంత సంపన్నమైన ఆలయం శ్రీ రంగం .ఆలయ శిఖరం ‘’ఓంకార రూపం ‘’గా ఉండటం ఇక్కడి విశేషం .అయితే ఎంత దూరం నుంచి చూసినా ,ఆలయ శిఖరం కణి పించదు .ఇది . మరో విచిత్రం ..గర్భ గుడి కి ఎదురు వైపున ఉన్న ఒక మండపం లో ఒక ప్రత్యెక స్థలం దగ్గర నుంచొని చూస్తె నే ఓంకార శిఖరం కన్పించి ,తన్మయులను చేస్తుంది .
జమ్బుకేశ్వరాలయం
రంగం లో నే ‘’జంబుకేశ్వరం ‘’ఉంది .పంచ భూతాత్మక మైన ‘’జల లింగం ‘’జమ్బుకేహ్వార లింగం .లింగం కింద పాను వత్తం లో నుంచి ఎప్పుడు నీరు బోట్లు బోట్లు గా ఊరతం ఇక్కడి చిత్రాలలో విచిత్రం ..పాను వత్తం చుట్టూ బట్ట చుట్టి ఉంచుతారు ..అది తడిసి పోగానే తీసి ,పిండి ,మళ్ళీ పరవటం ఆనవాయితీ .ఈ ఆలయం రంగానాదాలయం కంటే ప్రాచీన మైనది గా భావిస్తారు .చాలా విశాల మైంది కూడా .జంబు వ్రుక్షాలేక్కువ కనుక ఆ పేరు వచ్చింది .ఆడి శంకరులు దర్శించిన దివ్య ధామం ఇది .అమ్మవారు ‘’అఖిలాండేశ్వరి ‘’.ఉగ్రమూర్తి గా అమ్మ వారు కన్పించటం ఇంకో వింత ..ఆ భయంకర మూర్తి ణి చూడ టానికి భక్తులు భయపడుతుంటే శంకరాచార్యుల వారు ఇక్కడ ఉంది తపస్సు చేసి ,అమ్మను ప్రసన్నం చేసుకొని ,ఉగ్ర రూపాన్ని ఉపసంహరింప జేషి శాంత మూర్తి గా మార్చారట .అదో విశేషం ..విలువైన నవ రత్న నిర్మిత శ్రీ చక్రాన్ని ఆడి శంకరులు ఇక్కడ ప్రతిష్టించారు .
రాక్ టెంపుల్
శ్రీ రంగం నిజం గా ఒక దీవి ..కొబ్బరి తోటలతో ,కన్నుల పండువ గా కన్పిస్తుంది ,ఒక చిన్న కొండ మీద వినాయకుని ఆలయం ఉంది .చాలా పెద్ద వినాయక విగ్రహం మనల్ని ఆకర్షిస్తుంది ..తీరని కోర్కెలను తీరుస్తాడని నమ్మకం .కొండ మీద ఉంది కనుక రాక్ టెంపుల్ అన్టారు .
శ్రీ రంగ నాధ సేవలో యామునా చార్యులు ,పెర్యాల్వార్ అనబడే విష్ణు చిట్టులవారు అంటే గోదా దేవి పెంపుడు తండ్రి ,స్శ్రీ పాదాన్ఘ్రి రేణువు అని పిలి పించు కొనే విప్రనారాయణ స్వామి ,’’చూడి కొడుట్ట నాచియార్ ‘’అంటే ఆముక్త మాల్యద అయిన తిరుప్పావై రచించి సాక్షాత్తు శ్రీ రంగ నాదుదినే భర్త గా పొందిన న గోదా దేవి తరించి భక్తీ మార్గానికి దర్శకు లైనారు .శ్రీ రంగ నాధుని దర్శనం సర్వ పాప వినాశనం ,ముక్తి దాయకం .
No comments:
Post a Comment