Brihadeeswarar Temple ( Big Temple )
బృహదీశ్వరాలయము భారతీయుల ప్రతిభకు నిలువేత్తు నిదర్శనం. 1000 సంవత్సరములు పూర్తిచేస్కుని చెక్కు చెదరకుండా సింహంలా కనిపిస్తుంది. మన వాళ్ళ ప్రతిభకు ముందు చూపుకు బృహదీశ్వరాలయము నిదర్శనం. ఎటువంటి ఆధునిక పరిజ్ఞానం లేని 1000 సంవత్సరాల క్రితం కేవలం 5 సంవత్సరాల వ్యవదిలోనే అంత పెద్ద ఆలయం ఎలా నిర్మించారో!?
సునామి వచ్చినప్పుడు కూడా ఎటువంటి కధలిక లేక స్థిరంగా నిలబడేలా మనవాళ్ళు చేసిన నిర్మాణం అద్బుతం. ఈ ఆలయంలో ఆశ్చర్యపరిచే ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. ఎవరికీ అంతుపట్టని ఊహకు అందనివి .
The Peruvudaiyar Kovil, also known as Periya Kovil, Brihadeeswara Temple, RajaRajeswara Temple and Rajarajeswaram, at Thanjavur in the Indian state of Tamil Nadu, is a Hindu temple dedicated to Shiva.
- ఈ ఆలయాన్ని క్రీ.శ 1004లో ప్రారంభించి 1009 లో పూర్తి చేసారు. కేవలం ఐదు సంవత్సరాలలో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణ కౌశల్యతకు నిదర్శనం. అవును ఈ ఆలయాన్ని నిర్మించి వేయి సంవత్సరాలయింది. బహు పురాతన ఆలయమిది. అందుకే ప్రపంచ వారసత్వ సంపద వారు దీనిని రక్షిత ప్రదేశంగా పరిగణించారు.
- ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి... ఇవేవీ ఉపయోగించలేదు. నిర్మాణంపై ఎలాంటి పూతా పూయలేదు. పునాదుల దగ్గర నుంచి పీఠాలు, గోపురం, శిఖరం... ఇలా అన్నీ రాళ్లతోనే తయారయ్యాయి. వాటి బరువుని బట్టి ఒక రాయి మీద మరో రాయిని పేర్చి నిర్మించారు. ఈ ఆలయ గోపురం 13 అంతస్తులు వుంది.
- బృహదీశ్వర లింగం మన భారతదేశములో ఉన్న అతి పెద్ద లింగములలో ఒకటి. ఇది నిజం గానే 8.7 మీటర్ల ఎత్తు, అయిదు మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం .
అంత పెద్ద శివ లింగానికి నందీశ్వరుడు కూడా భారీగా ఉండాలనుకున్నారో ఏమో అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.
ఒకప్పుడు ఈ మహాలింగం కేవలం రాజు గారు మాత్రమే దర్శించుకునే వారు సామాన్య జనులకు ప్రవేశం ఉండేది కాదు. తర్వాత్తరాత దీనిని సామాన్య జనం కూడా దర్శించుకునేందుకు అనుమతించారు. అతి పెద్దదైన ఈ లింగమునకు చేసే పూజలు కూడా ఘనంగా ఉంటుంది. - కేవలం ఈ ఆలయ నిర్మాణం కోసమే చాలా దూరము నుండి గ్రానైట్ రాయిని తెప్పించి రాజా రాజా చోళుడు 6 సంవత్సరాల కాలములో కట్టించినట్లు చరిత్ర చెబుతుంది.
- ఈ దేవాలయ ప్రాకారం ఎంత పొడవంటే దాదాపు 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. అంటే నాలుగు ప్రదక్షిణాలు చేస్తే ఒక కిలోమీటరు దూరం నడిచినట్లు. ఔరా ఎంత పెద్దగా ఉండి ఉంటుంది గుడి. ఇంత సువిశాలంగా ఉన్న ఇక్కడ ప్రతిధ్వని ఉండదు.. అదే మన ప్రాచీన భారతీయ శిల్పుల ప్రతిభ.
- ప్రధాన దేవాలయ గోపుర కలశం మొత్తం ఒకే శిలతో రూపుదిద్దుకుని 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినది. అంత ఎత్తుకు ఇంత పెద్ద గోపుర కలశాన్ని వేయి ఏళ్ళ క్రితం ఎలా తీసుకెళ్ళారో చాలా అద్భుతంగా ఉంటుంది...
ఈ రాయిని గోపురం పైకి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. గోపురం నుండి ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామం దగ్గర్నుంచి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెనను నిర్మించారు. శిఖరం రెండు తలాలుగా ఉంటుంది. తంజావూరు చుట్టుపక్కల ఎక్కడా కొండలు, గుట్టలు కనిపించవు. ఈ రాళ్లను దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకొవై ప్రాంతంలోని రెండు కొండల్ని పూర్తిగా తొలిచి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ఉంటారని ఒక అంచనా. - తమిళనాట కావేరీ నదీ తీరాన కళలకు కాణాచిగా వెలుగొందిన తంజావూరు నగరంలోని బృహదీశ్వరాలయం శిల్పసౌందర్యానికి పెట్టిందిపేరు. ఈ ఆలయంను రాజ రాజ చోళ-I, మధ్యయుగ చోళ రాజు 11వ శతాబ్దం ADలో నిర్మించారు. 216 అడుగుల ఎత్తయిన గోపురం, దానిపై 80 టన్నుల కలశం, గర్భగుడిలో 13 అడుగుల ఎత్తయిన ఏకశిలా లింగం, బయట ఏకశిలా నంది ఇలా ఎన్నెన్నో శిల్పకళా మహాద్భుతాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. పునాదులే లేకుండా 11వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించిన ఈ శివాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా 1987 వ సంవత్సరంలో ప్రకటించింది.
- ఈ ఆలయ గోపురాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు. (ఎందుకంటే దాదాపు పదమూడు అంతస్థుల భవనమంత ఉంటుంది మరి)
- ఈ ఆలయ నిర్మాణమంతా కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పిచే చేయబడినది.
- ఇప్పటికీ దేశంలో అతి పెద్ద ఆలయంగా దీన్నే చెబుతారు. జీవితకాలంలో ఒక్కసారైనా తప్పని సరిగా చూడవలసిన ఆలయం.
తంజావూరు బృహదీశ్వరాలయ గోపురం 216 అడుగుల ఎత్తు. ఈ ఆలయం పై వర్షం పడినప్పుడు శిఖరం నుంచి క్రింద వరకు నీటిని ఒక చోటకు వచ్చేలా చేసి అక్కడ నుంచి ఒక గొట్టం ద్వారా కోనేరు / భూమి లోపలకి పంపేల ఏర్పాటు చేసారు. 1000 సంవత్సరాల క్రితమే మనవాళ్ళు ఎంత గోప్పగా ఆలోచించారో చూడండి.
తంజావూరు బృహదీశ్వరాలయం గుడిలోపల "ప్రతిధ్వని" ఉండదు. మనం మాట్లాడిన మాటలు మనకు తిరిగి వినబడవు. 1000 క్రింతం మన వాళ్ళు సాధించారు. పైగా గుడి అంతా రాయిచే నిర్మించబడింది. సౌండ్ తిరిగి రాకుండా ఎలా చేయగలిగారో .
తంజావూరు:: బృహదీశ్వరాలయం:: తంజావూరు బృహదీశ్వరాలయం... రాజ రాజ చోళుడు నిర్మించిన ఆలయం ... చాలా సుప్రసిద్ధమైనది..
ఇక్కడ ఈ ఆలయాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన రాళ్ళు పరిసర జిల్లాలలో కనపడవు.. అంటే వేరే ప్రదేశం నుండి తరలించినది. ఇది కూడా విచిత్రమే. ఈ ఆలయ పరిసరాలలోనే వివిధ భాషలలో తాళపత్ర గ్రంథాలను చూసాము. ఇక్కడ అతి పెద్ద పురాతన గ్రంథాలయం, మ్యూజియం, మహళ్ళు చాలా బావుంటాయి. ఒకరోజు పూర్తిగా సరిపోయేంత దర్శనీయ స్థలాలున్నాయి.
బృహదీశ్వరాలయం [తంజావూరు]
ఇక్కడ కొలువై వున్న బృహదీస్వర స్వామి, పెదనాయికి అమ్మవారి దర్శనం పెద్ద వరంగా భావిస్తారు భక్తులు. ఈ ఆలయంలో శిల్ప కళ అద్బుతం. దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు. బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది ఇది చాల పెద్ద ఆలయం. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది. పైన 80 టన్నుల బరువున్న నల్లరాతి తో శిఖారాగ్రాన్ని నిర్మించారు. ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏట వాలుగా ఒక రాతి వంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని తెలుస్తున్నది. రాజ రాజ చోళుడు క్రీ.శ. 985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19 వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది. గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు..
తంజావూరు లోని బృహదీశ్వరాలయ గోపురం
రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్బ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి. ఈ దేవాలయానికి అనుకరణగ మరోచోళరాజు తమిళనాడు లోని జయకొండచోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు. ఆ రెండో గుడి తంజావూరు గుడికన్న పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్తలో ఉన్నది.
బృహదీశ్వరాలయం
బృహదీశ్వర ఆలయం (తమిళం: பெருவுடையார் கோவில்; పెరువుదైయార్ కోయిల్ బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.
బృహదీశ్వర ఆలయం (తమిళం: பெருவுடையார் கோவில்; పెరువుదైయార్ కోయిల్[2]బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.
More: http://te.advisor.travel/poi/bRhdiishvraalyN-14567
ఈ దేవాలయానికి అనుకరణగ మరోచోళరాజు తమిళనాడు లోని జయకొండచోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు. ఆ రెండో గుడి తంజావూరు గుడికన్న పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్తలో ఉన్నది.
More: http://te.advisor.travel/poi/bRhdiishvraalyN-14567
No comments:
Post a Comment