
వారణాసిలో యాత్రికుల కోసం రూమ్స్ చాలానే ఉన్నాయ్ . కాస్త అటు ఇటు లో దేవాలయానికి దగ్గర్లోనే ఉన్నాయి. వారణాసి లో దేవాలయం చుట్టూ సుమారు 2-3 కిలో మీటర్లు దూరం వరకు వీధులాన్ని చాల ఇరుకుగా ఉంటాయి. కొత్తగా వెళ్ళేవాళ్ళకి అడ్రస్ కనుక్కోవడం ఇబ్బంది కరంగానే ఉంటుంది. ఎక్కువమంది వెళ్తే కనుక అందరు వస్తున్నారో లేదు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి . ఇక తెలుగు వాళ్ళకోసం ప్రత్యేకంగా ఆశ్రమాలు / సత్రాలు ఉన్నాయి . మీరు కనుక రైల్వేస్టేషన్ నుంచి మన తెలుగు వాళ్ళు ఉన్న ప్లేస్ కి వచ్చేసరంటే సగం కాశి ప్రయాణం ఏ ఇబ్బంది లేకుండా జరిగినట్టే . ఆలయ విశేషాలు , చుట్టూ ప్రక్కల చూడవలసిన క్షేత్రాలు తరువాత చెబుతాను . పైన హెడ్డింగ్ రూమ్స్ కోసం అని పెట్టానుగా.
అక్కడ మన భాష కాని వారికంటే తెలుగు వచ్చిన వారితోనే మనం జాగ్రత్తగా ఉండాలి . ఎందుకంటున్నాను అంటే మీకు ఈ పాటికే తెలుసు ఉంటుంది . కాశి లో ఆంధ్ర ఆశ్రమం ఒకటుంది అని . అదే పేరుతో కొత్తగా తెలుగు తెలిసిన మేధావులు Ganga Yogi Lodge అనే దాన్ని శ్రీ రామ ఆంధ్ర ఆశ్రమం గా పేరు మర్చి ఆటో వాళ్లతో బేరాలు కుదుర్చుకుని ఆంధ్ర ఆశ్రమం అంటే ఇదే ఆంధ్ర ఆశ్రమం అని విరి దగ్గరకు తీస్కుని వచ్చేలా చేస్కోన్నారు. కొత్తగా వెళ్లినవారికి ఎలా తెలుస్తుంది . ఆంధ్ర ఆశ్రమం పేరు శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం . వీరు తెలివిగా తారక తీసి వేసి బోర్డు పెట్టారు.

రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో ముందుగా రూమ్ బుక్ చేస్కోవడానికి లేదు. మీరు వెళ్లి అడిగితే ఉంటే ఇస్తారు. 80% రూమ్ దొరుకుతుంది. రూమ్ రెంట్ 100, 300, 350 వసూలు చేస్తున్నారు. రూమ్స్ బాగున్నాయి . a/c రూమ్స్ కూడా ఉన్నాయి రెంట్ తెలియదు. మధ్యాహ్న భోజనం రాత్రి టిఫిన్ పెడతారు. వాటికి ఛార్జ్ ఏమి ఉండదు. కాకపోతే ముందుగా రాయించుకోవాలి.

ఆంధ్ర ఆశ్రమం పక్కనే సైకిల్ బాబా ఆశ్రమం ఉంది. తెలుగు వాళ్ళదే ఆశ్రమం. 400/- ఛార్జ్ చేస్తున్నారు నలుగురు ఉండవచ్చు. ఇక్కడ కూడా భోజనం, టిఫిన్ పెడతారు.
Sri Rama Taraka Andhra Ashram
B 14/92, Varanasi H O,
Varanasi - 221002,
Manasorovar
+(91)-542-2450418
----
Sri Sringeri Shnkar Math,
B-14/111 Kedargrghat,
Varanasi, Uttar Pradesh
PIN Code - 221 001
Telephone No 0542- 2452768
Branch in charge : Ramakrishna Prasad
--
Sri Kanchi Kamakoti Peetam Sri Sankara Mutt
Varanasi Branch
B 4/7, Hanuman Ghat,
Varanasi - 221001
--
Kumara Swamy Mutt
Near Kedar Ghat
Tel No. 0542 2454064
Click Here For :
Accommodation in Varanasi
Varanasi Yatra Video
Varanasi Local Temples
Varanasi Surrounding Temples
No comments:
Post a Comment