మేము పూణే నుండి కారులో బయల్దేరి త్రియంబకేశ్వరం చేరుకున్నాము. అక్కడ దర్శనానికి సుమారు 2 గంటలు పట్టింది. గుడిలోపల లింగాకారం ఉండదు దాని ప్రదేశంలో ఒక గుంత వుంటుంది. ఈ గుంటలో మూడు చిన్న లింగాకారాలు ఉంటాయట. అందులో ఒకటి బ్రహ్మకు ప్రతిరూపం, ఒకటి విష్ణువుకు ప్రతిరూపం, ఇక మూడొవది శివునికి ప్రతిరూపం. అందుకే ఈ ప్రదేశానికి త్రియంబకం అని పేరు వచ్చింది.
గుడి చాలా పురాతన పురాతనమైనది. తరువాత ఒక కోనేటి దగ్గర నుండి గోదావరి ఉద్గమ స్థానాన్ని చూసాము. అక్కడ నుండి కొంత దూరంలో వున్నా గోదావరి ఉద్గమ స్థానానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళడానికి ఒక కొండ ఎక్కాల్సి వుంటుంది. కొండ కింద పెద్ద మందార చెట్టు వుంది. నేను సాధారణంగా మందార మొక్కలను చూసాను. కాని ఇక్కడ మందార మహా వృక్షం వుంది. దాని నీడలో రెండు కార్లు ఆపివుంచారంటే ఆ చెట్టు ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.
అక్కడ కొండపైకి వెళ్ళడానికి దోళీళు వున్నాయి. ఒక మనిషికి 250 రూపాయలు తీసుకుంటున్నారు. కొండపైన కోతులు ఎక్కువుగా ఉంటాయని ఒకతను చెప్పాడు. అక్కడే కర్ర పుల్లలు అద్దెకు ఇస్తున్నారు. ఒక కర్ర పుల్లకు 5 రూపాయలు ఇచ్చి తీసుకోవాలి. తిరిగి వచ్చేటప్పుడు మనకు 3 రూపాయలు తిర్గి ఇస్తారు. మేము అందరం తలా ఒక కర్ర పుల్ల అద్దెకు తీసుకున్నాము.
కొండపైన కంచె మేకలు వున్నాయి. అవి అవలీలగా కొండ అంచులకు ఎక్కి గడ్డి తింటున్నాయి. కొండ మధ్యలు ఒక చిన్న గుండం వుంది అక్కడ ఒక గుడి కూడా వుంది. అక్కడ ఒక ఆమె నీళ్ళు తోడిపోసింది.
ఆ నీళ్ళు అక్కడ తీర్థంలా భావిస్తారట. కొండపైన గోదావరి అమ్మవారికి చిన్న గుడి వుంది. ఆమె విగ్రహం కాళ్ళ దగ్గర నుండి నీళ్ళు వస్తున్నాయి. అక్కడకు కొద్ది దూరంలో సహశ్ర లింగాల గుహ ఒకటి ఉంది.
అక్కడ మేకలు కోతులను బెదిరించి మరమరాలు తింటున్నాయి. అక్కడనుండి నాసిక్ చేరుకున్నాము. అక్కడ ఒక శివాలయానికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుండి పూణే తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము.

No comments:
Post a Comment