హాలిడే ట్రిప్ తీపిగుర్తుగా మిగిలిపోవాలంటే ఈ టిప్స్‌ను ఫాలో అయిపోండి.
- నాణ్యమైన అండర్ గార్మెంట్స్‌ను ఎంచుకోండి. మీరు నమ్మినా, నమ్మకపోయినా నాణ్యమైన లోదుస్తులు హాలిడే ట్రిప్‌లో చాలా అవసరం. ఎందుకంటే చాలా దూరం వాకింగ్ చేయాల్సి వస్తుంది. సైట్ సీయింగ్ కోసం నడవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్, సయాకింగ్ వంటివి చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే యాంటీ బ్యాక్టీరియల్ అండర్ గార్మెంట్స్‌ను ఎంచుకోండి.
- మందులు తీసుకెళ్లండి. ఫస్ట్ ఎయిడ్‌కిట్, నొప్పి నివారణ మాత్రలు తప్పనిసరి. దగ్గు మందు, జ్వరానికి పారాసెటమాల్ వంటి జనరల్ మందులు వెంట ఉంచుకోండి.
- ఇంటర్నేషనల్ ట్రిప్స్‌కు వెళుతున్నట్లయితే కూపన్స్ కోసం ప్రయత్నించండి. డబ్బు ఆదా విషయంలో కూపన్స్ బాగా ఉపకరిస్తాయి.
- టాబ్లెట్‌లో మీకు నచ్చిన వీడియోలు, పాటలు డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. లాంగ్ ట్రిప్‌లో బోర్‌డమ్‌ను పోగొట్టడానికి ఇవి బాగా పనికొస్తాయి.
- కొంచెం ఖర్చు ఎక్కువైనా లగ్జరీకే ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే ట్రిప్ మెమొరబుల్‌గా నిలిచిపోవాలంటే ఆ మాత్రం చేయక తప్పదు.
- ఇయర్‌ప్లగ్స్‌ను బ్యాగులో ఉంచుకోండి. నాయిస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇయర్ ప్లగ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే టూర్ మెమొరబుల్‌గా చిరకాలం నిలిచిపోతుంది.
No comments:
Post a Comment