కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహం కోరుకుంటున్నారా..!
అయితే మీ ఉల్లాసాన్ని పదింతలు చేసే ప్రయాణానికి సన్నద్ధమవ్వండి. కడలి కెరటాలపై ఎంచక్కా చక్కర్లు కొట్టేయండి. విహార యాత్రలోనే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. ఇన్ని రకాల అనుభూతులను మిగిల్చే పర్యాటక ప్రదేశం ఎక్కడుందంటారా..?
ఈ సంక్రాంతి సెలవులకు కర్ణాటకలోని మురుడేశ్వర్‌కి వెళ్లండి. సాగర తీరంలో సరదాగా గడిపేయండి.
మూడు వైపులా అంతులేదనిపించే అరబిక్ కడలందం. ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు.. ఆ కెరటాలపై తేలియాడే బోట్లు.. ఆహ్లాదంగా కనిపించే తీరం.. దాని వెంబడి పర్యాటకుల సందడి.. వెరసి మురుడేశ్వర్‌లో కనువిందు చేసే దృశ్యాలు. అక్కడే మరోవైపు వెండికొండంత ఎత్తులో కనిపించే పరమేశ్వరుని రజతవర్ణ విగ్రహం.. ఆ చెంతనే ఆకాశాన్నంటే రాజగోపురం.. యాత్రికులకు ఆధ్యాత్మికత ఆనందాన్ని పంచుతాయి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంటుందీ మురుడేశ్వర్. పౌరాణిక ప్రాశస్త్యం కలిగి ఆధ్యాత్మిక కేంద్రంగా పరిఢవిల్లిన ఈ ప్రదేశం.. కాలక్రమంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పసందైన విడిదిగా అరలారుతోంది.
పౌరాణిక ప్రశస్తి..
ఇక్కడున్న కందుక పర్వతంపై పరమేశ్వరుడు మురుడేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. రావణాసురుడు శివుడి ఆత్మలింగం తీసుకుని వెళ్తుండగా.. గణపతి దానిని గోకర్ణంలో నేలపై ఉంచుతాడు. లింగాన్ని తిరిగి తీసుకోవడానికి రావణుడు విఫలయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో లింగం భిన్నమై.. ఒక భాగం మురుడేశ్వర్‌లోని కందుక పర్వతంపై వచ్చి పడుతుంది. అలా పరమేశ్వరుడు అక్కడ వెలిశాడని స్థానిక కథనం. ఇదే పర్వతంపై ప్రపంచంలోనే రెండో ఎత్తయిన పరమేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాదాపు 130 అడుగుల ఎత్తుండే ఈ మూర్తిని చూస్తే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. మురుడేశ్వర్ ఆలయ రాజగోపురం 20 అంతస్తులతో ఠీవీగా కనిపిస్తుంది. ఆలయంలో స్వర్ణ వర్ణంలో ప్రకాశించే సప్తరుషుల మండలం ప్రధాన ఆకర్షణ. శివుడి జటాజూటం నుంచి గంగ జాలువారిన దృశ్యాన్ని కళ్లకుకట్టే మరో విగ్రహం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇలా మురుడేశ్వర ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక విశేషాలతో అలౌకిక ఆనందాన్ని పంచుతుంది.
కెరటాలపై ఆటలు
ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్‌గా మురుడేశ్వర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎక్కువగా వస్తుంటారు. విదేశీ యాత్రికులు కూడా ఇక్కడ సేదతీరుతుంటారు. మురుడేశ్వర్ బీచ్‌లో ఆటపాటలకు కొదువేం ఉండదు. సముద్రంలో స్పీడ్ బోట్‌లో విహారం ఎప్పటికీ మరచిపోలేం. సాగరహోరులో సాగిపోయే జెట్ స్కీయింగ్, బనానా ట్యూబ్ బోట్ రైడింగ్, ఫ్లైబోర్డింగ్.. వంటి జలక్రీడలు టూరిస్టుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. ఇక్కడి నేత్రాని ఐలాండ్ స్కూబా డైవింగ్‌కు ప్రత్యేకం. సముద్ర గర్భంలోని వింతలను చూస్తూ సమయాన్ని మరచిపోవచ్చు. ఎందుకాలస్యం లెట్స్ గో టు మురుడేశ్వర్ .
ఎలా వెళ్లాలి

- బెంగళూరు నుంచి మురుడేశ్వర్‌కు దూరం దాదాపు 455 కిలోమీటర్ల. రోడ్డు మార్గాన వెళ్తే బెంగళూరు నుంచి NH-206 మీదుగా హొన్నావర్ చేరుకుని అక్కడి నుంచి NH-17 మీదుగా మురుడేశ్వర్ చేరుకోవచ్చు.
- మురుడేశ్వర్‌లో రైల్వేస్టేషన్ ఉంది. బెంగళూరు నుంచి మురుడేశ్వర్‌కు నేరుగా రైలు సౌకర్యం లేదు. బెంగళూరు నుంచి భట్కల్ పట్టణానికి రైలులో చేరుకోవాలి. అక్కడ్నుంచి మార్మగోవా-మురుడేశ్వర్ ప్యాసింజర్ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
- మురుడేశ్వర్‌కు దగ్గరగా ఉన్న విమానాశ్రయం మంగళూరు. అక్కడ్నుంచి మురుడేశ్వర్‌కు 180 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో గానీ, రైలులో గాని మురుడేశ్వర్ చేరుకోవచ్చు.
No comments:
Post a Comment