ఏటా ఆషాఢమాస శుక్ల పాఢ్యమి నుంచి శ్రావణమాస శుక్ల పౌర్ణమి వరకు ఈ అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుంది. జమ్మూకశ్మీర్‌లోని మంచుకొండల్లో కొలువై ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడం కొత్త అనుభూతి జూన్ 29 నుంచి ప్రారంభమవుతుంది. నగరం నుంచి పెద్ద ఎత్తున ఈ యాత్రకు భక్తులు వెళుతుంటారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమరనాథ్ యాత్రకు తరలివెళ్తుంటారు. 40 రోజుల పాటు సాగే ఈయాత్రలో మంచుకొండలు, శివనామస్మరణతో మార్మోగుతాయి. అయితే జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్‌కు అలా వెళ్లడానికి మూడు నెలల ముందే పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాతావరణం అనుకూలంగా ఉంటేనే యాత్ర సాగుతుంది. యాత్రకు వెళ్లేవారు ఆరోగ్యధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అమర్‌నాథ్ షరైన్‌బోర్డు అనేక రకాల నిబంధనలతో యాత్రకు అనుమతిస్తుంది. 13 ఏళ్లలోపు పిల్లలు 75 ఏళ్లు దాటిన మహిళలను, గర్భిణిలను యాత్రకు అనుమతించరు. తెలుగురాష్ట్రాల వాళ్లు ఎక్కువగా అమర్‌నాథ్‌యాత్రకు వెళ్తుంటారు.
దరఖాస్తు ఇలా చేసుకోవాలి...
పాతబస్తీ Pathar Gattiలోని S.Y.J Shopping Mallలో జమ్మూకాశ్మీర్ బ్యాంకు, సికింద్రాబాద్ రాష్ట్రపతిరోడ్‌లో, హిమయతనగర్‌లోని Old MLA క్వార్టర్స్ సమీపంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో యాత్రకు దరఖాస్తు ఫారాలను ఉచితంగా పొందవచ్చు. మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. www.shriamarnathjishrine.com వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను download చేసుకోవచ్చు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తును పూరించి ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. దరఖాస్తుకు 4 పాస్‌పోర్టుసైజు ఫొటోలను జతచేసి బ్యాంకులలో ఇవ్వవచ్చు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత బ్యాంకు అధికారులు కార్డును జారీ చేస్తారు. ఏ తేదీలలో యాత్రకు వెళ్లేది కార్డులలో పొందుపరుస్తారు.
రైళ్లలో వెళ్తే తక్కువ ఖర్చు..
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారు రైళ్లలో వెళ్తే తక్కువ ఖర్చవుతుంది. కొన్ని ట్రావెల్స్ సంస్థలు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాయి. నగరం నుంచి ఢిల్లీ వరకు ఒక రైలులో అక్కడి నుంచి జమ్మూతావీ, ఖత్రా వరకు మరో రైలులో వెళ్లవచ్చు. నగరం నుంచి ఢిల్లీకి స్లీపర్‌క్లాస్‌లో రూ.665ల చార్జీ, ఢిల్లీ నుంచి జమ్మూతావీ, ఖత్రా వరకు స్లీపర్‌క్లాస్ చార్జి రూ.360లు. జమ్మూ నుంచి హైదరాబాద్‌కు రాను పోను రూ.2వేలు ఖర్చు అవుతాయి. బ్రేక్ జర్నీ టికెట్ తీసుకుంటే ఈ ఖర్చు తగ్గుతుంది. జమ్మూతావీ రైల్వేస్టేషన్‌లో RTC బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. Baltal(బల్టాల్), Pahalgam(పహల్‌గావ్) నుంచి అమర్‌నాథ్‌గుహ వరకు రెండు వైపులా ప్రయాణానికి గుర్రాలకు రూ.3 నుంచి రూ.8వేల వరకు వసూలు చేస్తారు. బేరం ఆడితే రేట్లు తగ్గిస్తారు. ఎక్కువ లగేజీ ఉంటే అదేస్థాయిలో కిరాయి వసూలు చేస్తారు.
హిమాలయాల్లో తెలుగు భోజనాలు...
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే తెలుగు వారికి కొన్ని సంస్థలు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నాయి. జూన్ 29నుంచి ఆగస్టు 7 వరకు Baltal, Panjtarni(పంచతరణి)లో ఉచిత భోజన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లాకు చెందిన అమర్‌నాథ్ అన్నదాన సేవాసమితి గౌరవాధ్యక్షుడు బండ అంజయ్య తెలిపారు. 40 రోజుల పాటూ ఈ అన్నదాన సత్రం కొనసాగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 5గంటల నుంచి 11 గంటల వరకు నాలుగురకాల టిఫిన్స్ , మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రాత్రి 7 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉచిత భోజనం అందజేస్తారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు మరిన్ని వివరాలకోసం సెల్‌నెం.9440088511, 9848488511లలో సంప్రదించవచ్చు.
బృందాలుగా వెళ్లడం ఉత్తమం...
అమర్‌నాథ్ యాత్రకు బృందాలుగా వెళ్తే మంచిది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.150లు చెల్లించాల్సి ఉంటుంది. బృందాలుగా వెళ్లేవారికి పోస్టల్‌చార్జీలు అదనంగా వసూలు చేస్తారు. 1నుంచి 5మందికి పోస్టల్ చార్జీకింద రూ.50లు, 6 నుంచి 10మందికి రూ.100లు, 11మందినుంచి 15మందికి రూ.150లు, 16మంది నుంచి 20మందికి రూ.200లు, 21మందినుంచి 25మందికి రూ.250లు, 26నుంచి 30మందికి రూ.300లు వసూలు చేస్తారు.
హెలికాప్టర్‌ల ద్వారా గుహకు చేరుకోవచ్చు...
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారు హెలికాప్టర్‌ల ద్వారా కూడా గుహకు చేరుకోవచ్చు. Baltal - Panjtarni, Pahalgam - Panjtarniల మధ్య ఏవీయేషన్ సంస్థలు హెలికాప్టర్‌లను నడుపుతున్నాయి. Baltal-Panjtarniల మధ్య ఒక్కొక్కరికి రూ.2వేలు, Pahalgam - Panjtarni వరుక రూ.4300లు చార్జీలుగా వసూలు చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఆన్‌లైన్ ద్వారా హెలికాప్టర్ బుకింగ్ చేసుకోవచ్చు.
ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో మెడికల్ సర్టిఫికెట్లు...
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు ఆరోగ్య ధ్రువీకరణపత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. నగరంలోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో అమర్‌నాథ్‌యాత్రకు మెడికల్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో ముగ్గురు వైద్యనిపుణులు, గాంధీ ఆస్పత్రిలో నలుగురు వైద్యనిపుణులు ఈ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. మెడికల్ సర్టిఫికెట్లు, ఏఏ వైద్యపరీక్షలు చేయించుకోవాలో సూచనలు ఉంటాయి. వయస్సును బట్టి పూర్తిస్థాయి రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, చాతి ఎక్స్‌రే, గుండె సంబంధిత ECG, 2D ECHO పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
ఈ వస్తువులు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి...
అమర్‌నాథ్ యాత్ర ఎముకలు కొరికే చలి వాతావరణంలో సాగుతుంది. Monkey Capలు, Sweatersలు, చేతి గ్లౌజులు, Shoes తప్పనిసరిగా తీసుకెళ్లాలి. చేతికర్ర, టార్చిలైట్లు ఉంచుకోవాలి. అమరనాథ్ గుహకు చేరుకునేముందు మూడు కిలోమీటర్లు మంచుమీదనే నడవాల్సి ఉంటుంది. శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయి. హారతికర్పూరం తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలి. చలిబాగా ఉండడం వల్ల చెవిలో దూది పెట్టుకోవాలి. ఈ దూదిని ఇంటి వద్ద నుంచే తీసుకెళ్లడం మంచిది. డ్రైఫ్రూట్స్, గ్లూకోజ్ వెంట ఉండడం అవసరం. కడుపునొప్పి, విరోచనలు, తలనొప్పి, జ్వరం సంబంధించిన ట్యాబ్‌లెట్స్‌ను వైద్యుడి సలహాతో వెంటతీసుకెళ్లాలి. అమర్‌నాథ్ షరైన్‌బోర్డు గుర్రాలు, డోలి నిర్వాకులకు లైసెన్సు కార్డు ఇస్తుంది. గుర్రాలు, డోలిలో వెళ్లే యాత్రికులు అమర్‌నాథ్ గుహ వద్దకు వెళ్లగానే ట్యాక్సీ వారి గుర్తింపు కార్డును మన వద్ద ఉంచుకోవాలి. మంచులింగాన్ని దర్శనం చేసుకొని వచ్చేంత వరకు ట్యాక్సీ వారు మన కోసం ఎదురుచూస్తారు. దీని వల్ల మనం తీసుకువెళ్లే సామాన్లు వారు భద్రంగా ఉంచుతారు. లేకపోతే ఇబ్బందులు తప్పవు. అయితే మంచు మీద నడిచే బూట్లను జమ్మూకాశ్మీర్‌లో ప్రత్యేకంగా తయారు చేస్తారు. నగరంలోనే కాకుండా జమ్మూలోనే ఈ బూట్లను రూ.300లోపు రేట్లతో కొనుగోలు చేయవచ్చు.
జూన్ 29నుంచి అమర్‌నాథ్‌యాత్ర...
అమర్‌నాథ్ యాత్ర ఈ సంవత్సరం జూన్ 29నుంచి ప్రారంభమవుతుంది. ఆగష్టు 7వ తేదీ రక్షాబంధన్ (రాఖీపౌర్ణమి) వరకు ఈయాత్ర కొనసాగుతుంది. 40 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే తప్ప ఈ యాత్రకు అనుమతించరు. జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహకు చేరడానికి రెండుమార్గాల ద్వారా వెళ్లవచ్చు. Pahalgam నుంచి అమర్‌నాథ్ వరకు చేరడానికి 45 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సివుంటుంది. రెండవ మార్గం Baltal గుండా కూడా వెళ్లవచ్చు. ఇక్కడి నుంచి అమర్‌నాథ్ గుహ కేవలం 14కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అయితే ఈ మార్గం అత్యంత క్లిష్టతరమైనది. ఈ యాత్రకు వెళ్లే భక్తులు గుర్రాలు, డోలి లేక కాలిబాటన వెళ్లవచ్చు. Pahalgam నుంచి అమర్‌నాథ్ గుహకు కాలినడకన మూడు రోజులు పడుతుంది. మధ్యలో బేస్ క్యాంపులు ఉంటాయి. అక్కడ హాల్ట్ చేయవచ్చు. అదే విధంగా Baltal నుంచి కేవలం ఒక్కరోజులోనే అమర్‌నాథ్ గుహకు చేరుకోవచ్చు.
The Helicopter services from Pahalgam or Baltal is up to Panjtarni which is approximately 5-6 KMs from the Holy Cave Shrine of Shri Amarnath.
హిమవన్నగములు.. హిమానీ నదాలు.. హిమపాతము.. ఇన్నిటి మధ్య ఆధ్యాత్మిక మహిమను చాటుతూ వెలసిన హిమలింగం.. అమర్‌నాథ్! యుగాల కిందట దేవతామూర్తులు దర్శించుకున్న పుణ్యక్షేత్రం. ఏటా లక్షల మంది భక్తులు చూసి తరించే ప్రకృతి శిల్పం.. అమర్‌నాథ్! ఒకప్పుడు భక్తి పారవశ్యాల మధ్య సాగిన అమర్‌నాథ్ యాత్ర.. ఇప్పుడు ‘భయ’భక్తుల మధ్య సాగుతోంది. ఆ ధవళమూర్తి దర్శనానికి భద్రతా దళాల పహారా అవసరం అవుతోంది. తాజాగా ఉగ్రదాడితో కలకలం మొదలైనా.. శివయ్య దర్శనానికి మాత్రం భక్తులు వెనుకంజ వేయడం లేదు. భారమంతా ఆ లయకారుడి మీద వేసి, వ్యయ ప్రయాసలకోర్చి, యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ విశిష్టత మీ కోసం.
హిమాలయ పర్వత శ్రేణుల్లో వెలిసిన అందమైన గుహ. ఆ గుహాలయంలో గుంభనంగా కనిపించే శుద్ధ స్పటిక రూపం. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రాణాలు పోయాక ఆ కైలాసాన్ని చేరుకుంటామో లేదో! అందుకే ప్రాణాలకు తెగించి అపర కైలాసంగా అభివర్ణించే అమర్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించుకుంటారు భక్తులు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురైనా.. వాటిని లెక్క చేయకుండా అమర్‌నాథ్ యాత్రకు పూనుకుంటారు.
అమర రహస్యం
అమర్‌నాథ్ ముక్తి క్షేత్రం. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుహలోనే పరమేశ్వరుడు పార్వతీదేవికి సృష్టి రహస్యాన్ని తెలియజేశాడంటారు. అమ్మవారికి సృష్టి రహస్యాన్ని తెలియజేసే క్రమంలో.. ఇతరులు ఎవరూ వినరాదని తన పరివారాన్ని ఒక్కో ప్రదేశంలో విడిచిపెట్టాడట శివుడు. నందీశ్వరుడిని పహల్గాంలో, శిఖలోని నెలవంకను చందన్‌వాడీలో, శేష్‌నాగ్ దగ్గర తన ఆభరణమైన వాసుకిని వదిలివేశాడట. మహాగణేశ పర్వతం దగ్గర వినాయకుడిని, పంచరతన్ దగ్గర పంచభూతాలను వదిలిపెట్టాడట. ఒక్క పార్వతిని మాత్రమే గుహ దగ్గరికి తీసుకొచ్చాడట. పార్వతితో ఆనంద లాస్యం చేసి ఆ తర్వాత సృష్టి రహస్యాన్ని తెలియజేశాడట. ఈ రహస్యాన్ని గుహపై ఉన్న ఒక పావురాల జంట విన్నదట. అమర రహస్యాన్ని చెప్పిన ప్రదేశం కావడంతో ఈ క్షేత్రానికి అమర్‌నాథ్ అని పేరు వచ్చింది. అంతటి దేవ రహస్యాన్ని విన్న ఆ పావురాలు మృత్యురాహిత్యాన్ని పొందాయని అంటారు. నేటికీ అమర్‌నాథ్ ఆలయంలో పావురాలు కనిపించడం విశేషం. పరమశివుడి పరివారం కొలువుదీరిన అమరనాథ్ పరిసర ప్రాంతాలు కూడా పుణ్యక్షేత్రాలుగా పరిఢవిల్లుతున్నాయి.
మంచు శిఖరం
ఏడాది పొడుగునా మంచుతో కప్పి ఉంటుందీ క్షేత్రం. ఏటా జూలై-ఆగస్టు నెలల్లో 45 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. గుహ అంతా మంచు పరుచుకుని ఒక వేదికగా కనిపిస్తుంది. దీనిపై ఆద్యంత రహితుడైన శివ రూపం మహిమాన్వితమై మంచు శిఖరంలా దర్శనమిస్తుంది. చంద్రుని వృద్ధి, క్షయాలను సూచిస్తూ.. ఈ లింగాకృతి పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. గరిష్ఠంగా ఆరు అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఏటా శ్రావణ పౌర్ణమి నాటితో అమర్‌నాథ్ యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీతో అమర్‌నాథుడి దర్శనానికి తెరపడనుంది.
శతాబ్దాలుగా..
అమర్‌నాథ్ క్షేత్ర వైభవం గురించి 11వ శతాబ్దానికి చెందిన కల్హణుడి ‘రాజతరంగిణి’ గ్రంథంలో ప్రస్తావన ఉంది. కశ్మీరదేశ రాణి సూర్యమతి అమరనాథుడికి బాణలింగం, త్రిశూలం కానుకగా సమర్పించుకుందట. నేటికీ అవి ఆలయంలో కనిపిస్తాయి. కశ్మీర రాజులెందరో స్వామిని తమ ఇలవేల్పుగా భావించేవారు. ఏటా అమర్‌నాథ్ యాత్ర నిర్వహించి భక్తిప్రపత్తులు చాటుకున్నారు. అమరనాథుడి సేవలో తరిస్తున్న బుటామాలిక్ వంశస్థుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరు యాత్ర సాగే దారిలో మధ్య మధ్యలో గుడారాలు వేసుకుని యాత్రికులకు వేడి వేడి తేనీరు, వంటకాలు అందిస్తుంటారు. యాత్రికుల నుంచి విరాళాలు తీసుకుని వచ్చిన మొత్తంలో మూడో వంతు తిరిగి భక్తుల అవసరాలకు వెచ్చిస్తారు.
అడుగడుగునా అపాయం..
అమర్‌నాథ్ యాత్ర ఎన్నో అనుభూతుల సమ్మేళనం. అకస్మాత్తుగా మారిపోయే వాతావరణం, ఎప్పుడు వచ్చి పడతాయో తెలియని కొండ చరియలు, మరోవైపు పాతాళాన్ని తలపించే లోయలు. ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా ప్రమాదం తప్పదు. ఏ వేళలో ఏం చేస్తారో తెలియని ముష్కర మూక. ఇన్ని ఇబ్బందులు ఉన్నా అమరనాథుడి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతా శివయ్య లీల అనుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పురిగొల్పుతూ ‘బోలేనాథ్ అమర్‌నాథ్’ అని విశ్వాసంతో యాత్ర పూర్తి చేస్తారు.
ఐదేళ్లు రద్దు
శతాబ్దాలుగా సాగుతున్న అమర్‌నాథ్ యాత్ర ఉగ్రవాదుల దుశ్చర్యల కారణంగా ఐదేళ్లపాటు రద్దయింది. ఉగ్రవాదుల నుంచి యాత్రికుల ప్రాణాలకు ముంపు పొంచి ఉండటంతో 1991-95 మధ్యకాలంలో యాత్రను నిలిపివేసింది భారత ప్రభుత్వం. 1996లో యాత్రికులపై కాల్పులు జరపబోమని ఉగ్రవాదులు హామీ ఇవ్వడంతో యాత్రను పునరుద్ధరించారు. తీవ్రవాదుల ధోరణి కారణంగా దశాబ్దకాలంగా అమర్‌నాథ్ సందర్శించే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2008లో 5.33 లక్షల మంది అమర్‌నాథ్‌ని దర్శించుకోగా 2016లో అది కేవలం 2.20 లక్షలకే పరిమితమైంది. 2017లో 1.46 లక్షల మంది మాత్రమే అమర్‌నాథ్ యాత్రకు ముందుకొచ్చారు.
ఇలా ముందుకు
శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గాం నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ఇక్కడే అమర్‌నాథ్ యాత్ర బేస్ క్యాంప్ ఉంటుంది. పహల్గాం నుంచి అమర్‌నాథ్‌కు 45 కిలోమీటర్లు. బేస్‌క్యాంప్ నుంచి బృందాలుగా అమర్‌నాథ్ యాత్రకు బయల్దేరుతారు. పహల్గాంకు శ్రీనగర్ నుంచి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో రహదారికి ఇరువైపులా ఉండే లిడ్డర్ నదీపాయలు మనసును ఉల్లాసపరుస్తాయి.(Lidder River)
పహల్గాం నుంచి చందన్‌వాడీ(Chandanwari) మీదుగా యాత్ర సాగుతుంది.

మహిమ లింగం

- చందన్‌వాడీ నుంచి యాత్ర సంక్లిష్టంగా మారుతుంది. ఇక్కడి దుకాణాల్లో డ్రైఫ్రూట్స్, చాక్లెట్లు, ఇతర తినుబండారాలు కొనుక్కొని మళ్లీ ప్రయాణం మొదలుపెడతారు. పచ్చదనం పరుచుకున్న కొండల నడుమ ప్రయాణించాలి. చందన్‌వాడీ నుంచి గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. మూడున్నర అడుగులు ఉండే దారిలో, కొండ అంచుల వెంట వెళ్లాల్సి ఉంటుంది. కర్ర చేత పట్టుకుని నడుస్తుంటారు.
- చందన్‌వాడీ నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణించాక శేష్‌నాగ్ ప్రాంతం వస్తుంది. ఇక్కడ ఐదు కొండలు నాగుపాము పడగల్లా కనిపిస్తాయి.
- ఈ పర్వతాల చెంతనే ఒక నీలిరంగు తటాకం ఉంటుంది. ఇందులో శంకరుడి ఆభరణం అయిన వాసుకి నిద్రిస్తుందని విశ్వసిస్తారు.
- శేష్‌నాగ్ దగ్గర భక్తులకు బస చేసే సదుపాయం ఉంటుంది. శేష్‌నాగ్ నుంచి 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే అమర్‌నాథ్ వస్తుంది.
- పహల్గాం, చందన్‌వాడీ నుంచి అమర్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లే సదుపాయం కూడా ఉంది.
132
No comments:
Post a Comment