ముక్తిధామాలు
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే యాత్రల్లో ఉత్తరాఖండ్ ‘చార్‌ధామ్’ యాత్ర ఒకటి. ప్రతి సంవత్సరం వేసవిలో మొదలై, శీతకాలంలో ముగిసే ఈ యాత్రకు లక్షలాది భక్తులు తరలివస్తూ ఉంటారు. మంచుతో చలిగా ఉండే వాతావరణం మధ్య ఎగుడుదిగుడుగా ఉండే పర్వత సానువుల్లో సాగే ఈ యాత్రను సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్రగా అభివర్ణించవచ్చు.
ఏమిటి ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్ర?:
భారతదేశంలోని నాలుగు దిక్కుల్లో ఉన్న పూరి, రామేశ్వరం, ద్వారక, బదరీనాథ్‌లలో ఆది శంకరాచార్యులు మఠాలను స్థాపించారు. ఆ మఠాలు ఉన్న ప్రదేశాల్లోని ఆలయాల సందర్శనను చార్‌ధామ్ యాత్ర అని అంటారు. కాగా, హిమాలయ సానువుల్లో నెలకొన్న పవిత్రమైన నాలుగు ఆలయాల సందర్శనను కూడా (ఉత్తరాఖండ్) చార్‌ధామ్ (లేదా ఛోటా చార్‌ధామ్) యాత్రగా వ్యవహరిస్తారు. ఇవి ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్‌లలో ఉన్నాయి. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వీటిని స్థాపించినట్టు కథనాలున్నాయి. వీటి సందర్శన యాత్రను ‘ముక్తి యాత్ర’ అని కూడా అంటారు.
ఈ ఏడాది ప్రారంభ తేదీలు: యమునోత్రిలో, గంగోత్రిలో ఏప్రిల్ 18, కేదార్‌నాథ్‌లో 29, బదరీనాథ్‌లో ఏప్రిల్ 30.
ముగిసే తేదీలు: యమునోత్రి, గంగోత్రిలో, కేదార్‌నాథ్‌లో నవంబర్ 9, బదరీనాథ్‌లో ప్రకటించాల్సి ఉంది
ఎలా వెళ్ళాలి?:
అయిదు రోజుల నుంచి పదిహేను రోజుల వరకూ వివిధ ప్యాకేజీలను ట్రావెల్ప్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా ఢిల్లీ నుంచి ఈ యాత్రలు ప్రారంభమవుతాయి. వివరాలను ఆ సంస్థల వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. లేదా ఢిల్లీ నుంచి హరిద్వార్ చేరుకొని అక్కడి నుంచి ఈ యాత్ర చేపట్టవచ్చు. హెలికాప్టర్లలో కూడా ఈ ధామాలను దర్శించుకోవచ్చు.
ఇదీ మార్గం :
యమునోత్రికి...ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు 210 కిలోమీటర్లు, అక్కడినుంచి యమునోత్రికి 236 కిలోమీటర్లుంటుంది, తరువాత ఏడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
గంగోత్రికి... అక్కడి నుంచి ఉత్తరకాశి మీదుగా గంగోత్రికి దాదాపు 220 కి.మీ..
కేదార్‌నాథ్‌కి... తిరిగి ఉత్తర కాశి, రుద్రప్రయాగ మీదుగా 254 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 20 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి కేదార్‌నాథ్ చేరుకోవచ్చు.
బదరీనాథ్‌కి... కేదార్‌నాథ్ నుంచి రుద్రప్రయాగ మీదుగా 160 కి.మీ. దూరంలో బదరీనాథ్ ఉంది. బదరీనాథ్ నుంచి రుషీకేశ్‌కు సుమారు 300 కి.మీ.. అక్కడి నుంచి ఢిల్లీకి 230 కి.మీ. పర్వత ప్రాంతాల్లో రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ వాహన ప్రయాణాలను అనుమతించరు.

No comments:
Post a Comment