మహాశివుడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం

మహేశ్వర్.. మహాశివుడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఆయన వెలిసిన ప్రాంతం కాబట్టే దీనికి ‘మహేశ్వర్’ అనే పేరు వచ్చింది. ఎంతో పురాతనమైన ఈ ప్రదేశం.. ప్రాచీనకాలం నుంచి ప్రజలకు తీర్థయాత్రా ప్రదేశంగా వుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున వున్న ఈ అందమైన ప్రదేశం.. పూర్వ సంస్కృతికి ప్రతిబింబం. ప్రస్తుతం ప్రముఖ పర్యాటక నగరంగా పేర్కొనబడుతున్న ఈ ప్రదేశం.. చేనేత వస్త్రాలకు చాలా ప్రసిద్ధి చెందింది.
మహేశ్వర్ లో వున్న నర్మదా నదిలో స్నానం ఆచరిస్తే.. శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పురాతన కాలం నుంచి ఇలా స్నానం చేయడం ఆచారంగా వుంది. ఈ ప్రాంతంలో ఎన్నో ఆలయాలు వున్నాయి. ఇక్కడున్న ఈ ఆలయాలన్నింటినీ హోల్కర్ వంశ రాణి రాజమాత అహల్యా దేవిబాయి నిర్మించింది. అంతేకాదు.. మహేశ్వర్ లో కోటలతోపాటు భవంతులు, ధర్మసత్రాలను కూడా కట్టించింది. నర్మదా నది ఒడ్డున భక్తులు స్నానం చేసేందుకు వీలుగా పీష్వా, ఫాన్సే, అహల్యా ఘాట్లను రాణి అహల్యా ఏర్పాటుచేసింది. ఈ ప్రదేశంలో వున్న కొన్ని సుప్రసిద్ధ స్థలాల గురించి మాట్లాడుకుంటే..
No comments:
Post a Comment