Wednesday, 29 March 2017

అగస్త్వేశ్వరస్వామి - దక్షిణ కాశీ





ఇక్కడ దర్శనం చేసుకుంటే కాశీకి వెళ్లినంత పుణ్యం



చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రాశస్త్యం పొందిన శైవక్షేత్రాల్లో అగస్త్వేశ్వరస్వామి కొండ దక్షిణ కాశీగా పేరుగాంచింది. పుంగనూరు మండలం నెక్కొంది సమీపంలో ఈ క్షేత్రం ఉంది. అగస్త్య మహాముని ఈ శివలింగాన్ని ప్రతిష్టించడంతో ఆలయానికి శ్రీ అగస్త్యేశ్వరాలయమనే పేరు వచ్చింది. కొండ శిఖరాగ్రంపై విశాల స్థలంలో శివపార్వతులు, శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, అగస్త్యేశ్వరస్వామి, వినాయకుడు, చౌడేశ్వరి, వీరభద్రుడు, భద్రకాళి పూజలందుకుంటున్నారు.

స్థలపురాణం:
అగస్త్యుడు ప్రతిష్టించిన శివలింగం పార్వతీ కల్యాణ సమయంలో పరమేశ్వరుని ఆదేశం మేరకు అగస్త్యుడు దక్షిణ దేశంలో శివాలయాలు స్థాపిస్తూ ఇక్కడి కొండను చేరుకున్నాడు. పార్వతీ కల్యాణ సమయంలో తాను అక్కడ లేనందుకు అగస్త్యుడు ఆందోళన చెందుతుండగా శివుడు స్వయంభువుగా పుట్టనుంచి ఉద్భవించడంతో రుషి కొండలోని గవి లోపల ఆ శివలింగాన్ని ప్రతిష్టించాడు. నాటి చోళరాజులు ఆలయం, ప్రహరీ, గర్భగుడి, దక్షిణ ప్రవేశ ద్వారంతో ప్రధాన ఆలయం, తూర్పు ప్రవేశంగా గర్భాలయాలు, కోనేరు తదితరాలను క్రీ.పూ.921వ శతాబ్దంలో నిర్మించారు. అనంతరం క్రీ.శ.1329లో ఈ ప్రాం తాన్ని పరిపాలించిన గంగవంశ రాజులు తర్వాత ఆర్కాట్‌ నవాబులు, పుంగనూరు జమీందార్లు వంశపారంపర్య ధర్మకర్తలుగా అగస్త్యేశ్వరకొండను అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆలయం దేవాదాయశాఖ ఆధీనంతో ఉంది.

అద్భుత శిల్పకళచోళరాజులు నిర్మించిన ఈ ఆలయం అద్బుతమైన శిల్పకళతో ఉట్టిపడుతోంది. 16 స్తంభాలపై నిర్మించిన నాలుగు అంతస్తుల గౌని మండపం సందర్శకులను ఆకట్టుకుంటుంది. దక్షిణ ప్రవేశంగా పైకి ఎక్కేందుకు 18 రాతిమెట్లతో, ప్రతి స్తంభాన్ని అద్బుత శిల్పకళాచిత్రాలతో నిర్మించారు. పై అంతస్తు తామర పుష్పం వలె, అష్టభుజ ఆకారంతో ఎనిమిది ద్వారాలతో అద్భుతంగా నిర్మించారు. గౌని మండపంలో గతంలో స్వామివారి బ్రహ్మరథానికి రాతి తేరు చక్రాలు ఉండేవి. శిథిలమై ఇది కూలిపోవడంతో రాతి రథం స్థానంలో కొయ్యరథం నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఆలయ ప్రాముఖ్యతను వివరిస్తూ రాతి శాసనాలు ఉన్నాయి. 240 అడుగుల పొడవు అంతే వెడల్పుతో నిర్మించిన కోనేరుకు నాలుగు వైపులా మెట్ల వరుసలు నిర్మించారు. కోనేటి మధ్యలో 75 అడుగుల ఎత్తుతో నాలుగుకాళ్ల మండపం ఉండేదట. నలువైపులా కోనేరులోకి వెళ్లేందుకు నిర్మించిన ప్రాకార మండపాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

Wednesday, 22 March 2017

నాగలాపురం వేదనారాయణస్వామి







మార్చి నెలలో మాత్రమే కనిపించే అద్భుతం
మూడు రోజులు ఆలయంలోకి సూర్య కిరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ సిటీ పేరు పొందిన చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఇది చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉంది. ఈ దేవాలయంలో ఏటా మార్చిలో సూర్యపూజా మహోత్సవాలు అట్టహాసంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఓ ప్రత్యేకత వుంది. అయిదు రోజుల పాటు స్థానిక పుష్కరిణిలో తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో తొలిరోజు సూర్యకిరణాలు రాజగోపురం ద్వారా నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి స్వామివారి పాదాలను తాకుతాయి. రెండో రోజు నాభి వరకు, మూడో రోజు శిరస్సును స్ప్రుశిస్తాయి. ఈ అద్భుత దృశ్యాలను తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది భక్తులు తరలివస్తారు.

తెప్పోత్సవాల తొలిరోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వేధనారాయణుడు, రెండోరోజు గోదా సహిత వేదనారాయుణుడు, మూడో రోజు సీతాలక్ష్మీ సమేత కోదండరామస్వామి, నాల్గు, ఐదో రోజున శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణుడి అలంకరణలో స్వామివారు దేవేరులతో తెప్పలపై విహరిస్తారు.

మార్చి 27న తెప్పోత్సవం తర్వాత ముత్యపు పందిరి వాహానంలో స్వామివారిని ఊరేగిస్తారు. 28న పెద్దశేష వాహనంపై తిరువీధి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సూర్యపూజా మహోత్సవాలకు సంబంధించి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ ఆలయాన్ని పల్లవుల కాలంలో నిర్మించారు. దీనిలో సొరంగా మార్గాలున్నాయని, వాటి రహస్యాలను చేధించేందుకు TTD, పురావస్తు శాఖ తవ్వకాలను చేపట్టింది. ఈ తవ్వకాల్లో 14 పంచలోహ విగ్రహాలు బయల్పడ్డాయి. నిధుల కోసం అన్వేషిస్తూ రెండో సొరంగంలో తవ్వకాలు మొదలెట్టారు. ఇందులో విలువైన సంపద ఉంటుందని భావిస్తున్నారు. మొదటి సొరంగంలో 2006లో తవ్వకాలు జరిపారు. రెండో సొరంగంలో తాజాగా తవ్వకాలు జరుగుతున్నాయి.






Sunday, 19 March 2017

నేపాల్‌ - బుద్ధుడు పుట్టింది ఇక్కడే!

బుద్ధుడు పుట్టింది ఇక్కడే!
నేపాల్‌



* నేపాల్‌. మనకు బాగా తెలిసిన మన పొరుగు దేశం. మన దేశంతో పాటు ఇది చైనా సరిహద్దుల్ని పంచుకుంటుంది.
* హిమాలయ పర్వతాల్ని పంచుకునే అయిదు దేశాలైన భూటాన్‌, భారత్‌, చైనా, పాకిస్థాన్‌లతో పాటు ఇదొకటి. ప్రపంచంలోనే ఎత్తయిన పది పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి. అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతం ఉందీ ఇక్కడే. మౌంట్‌ ఎవరెస్టును ఇక్కడ సాగరమాత అని పిలుస్తారు.
* నేపాల్‌ బుద్ధుడి జన్మస్థలం. క్రీస్తు పూర్వం 563లో గౌతమ బుద్ధుడు ఇక్కడి లుంబినిలో జన్మించాడు. ఇప్పుడు ఈ ప్రాంతం బౌద్ధులకు పవిత్రస్థలం.
దేశం: నేపాల్‌
రాజధాని: కాఠ్‌మాండూ
జనాభా: 2,64,94,504
విస్తీర్ణం: 1,47,181చదరపు కిలోమీటర్లు
భాష: నేపాలీ
కరెన్సీ: నేపాలిస్‌ రూపీ
జెండా: ప్రపంచంలో ఏ దేశ జెండా అయినా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. కానీ నేపాల్‌ జెండా అందుకు భిన్నం. నీలం అంచుతో ఉండే ఎరుపు రంగు త్రిభుజాకారాలు రెండు ఉంటాయి. వీటిల్లో ఒకటి చంద్రుడికీ, మరోటి సూర్యుడికీ సూచిక.
* ఈ దేశానికి స్వాతంత్య్ర దినం లేదు. ఎందుకంటే ఈ దేశం ఎప్పుడూ పరాయి దేశాల పరిపాలనలో లేదు.
* ఈ దేశ పటాన్ని 90 డిగ్రీల కోణంలో తిప్పితే అచ్చు పోర్చుగల్‌ దేశ పటంలానే ఉంటుందట.
* నేపాల్‌ జాతీయ జంతువు ఆవు. గోవధ ఇక్కడ నేరం.
* ఈ దేశంలో గౌరవంగా పలకరించడానికి కరచాలనం ఇవ్వరు. రెండు చేతులు జోడించి నమస్తే చెబుతారు.
* ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా ఉన్న నేపాల్‌ 2007లో లౌకికరాజ్యంగా మారింది. ఎన్నోమతాలు సామరస్యంతో కలిసి నివసిస్తున్న ఇక్కడ 81 శాతం మంది హిందువులు ఉంటారు.
* ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు ఉంది ఈ దేశంలోనే.
* మహాపాదిగా చెప్పుకునే ‘యతి’ ఈ దేశ హిమాలయాల్లో కనిపించినట్టు చెబుతారు.
* జీవ వైవిధ్య పరంగా ఈ దేశం ముందంజలో ఉంది. ఇక్కడ వేలాది రకాల జీవులుంటాయి. 900 రకాల పక్షి జాతులుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పక్షి జాతుల్లో 8.9 శాతం ఇక్కడే కనిపిస్తాయి. 4.2 శాతం సీతాకోక చిలుకలు, 3.96 క్షీరదాలు ఉంటాయి. అందుకే నేపాల్‌ని ‘అమెజాన్‌ ఆఫ్‌ ఆసియా’గా పిలుస్తారు.




ద్వారకను చూసొచ్చాం!








ద్వారకను చూసొచ్చాం!



‘‘శ్రీకృష్ణుడు పాలించిన అలనాటి ద్వారక విశేషాలనూ, సోమనాథ్ జ్యోతిర్లింగ మహాత్త్వాన్నీ వైభోగాలకు నెలవైన చిత్తోడ్, ఉదయ్ పూర్ కోటల అందచందాలను ఏకకాలంలో చూసి రావాలంటే గుజరాత్,రాజస్తాన్ రాష్ట్రాలను పర్యటించాల్సిందే. ’’

మా పర్యటనలో భాగంగా ముందుగా మేం అహ్మదాబాద్‌కు వెళ్లాం. మేం వెళ్లింది దసరా సమయం కావడంతో ఎక్కడ చూసినా గార్భా సందడే. గుజరాతీలు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా జరుపుకునే పండగల్లో దసరా అత్యంత ముఖ్యమైనది. అందుకే నవరాత్రుల తొలి రోజున గార్భాను పూజామందిరాల్లో పెట్టి అమ్మవారిని ఆవాహన చేస్తారు. తొమ్మిదిరోజులూ భక్తిశ్రద్ధలతో పూజించి దశమినాడు హోమంతో పూజ పూర్తి చేసి దగ్గరలోని దేవాలయాల్లో ఉన్న పూజారులకు దక్షిణ తాంబూలాలతో గార్భాను సమర్పిస్తారు. చుట్టూ చిల్లులు ఉన్న కుండలో దీపం పెట్టి పైన మూతపెట్టినదే గార్భా. ప్రత్యేక ప్రదేశాల్లోనూ వీధికూడళ్లలోనూ మనం అమ్మవారి విగ్రహం పెట్టినట్లుగా ఈ గార్భాలను పెడతారు. చీకటిపడిన దగ్గర్నుంచీ తెల్లారేవరకూ చేసే ఈ గార్భా నృత్యాలనే రాస్‌ అంటారు.

తీన్‌ దర్వాజా!
ముందుగా మేం అహ్మదాబాద్‌లోని భద్రకాళీ మందిరంలో అమ్మవారిని దర్శించుకున్నాం. దేశానికి పశ్చిమం వైపున ఉండటంవల్లనేమో మనకన్నా గంట ఆలస్యంగా సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఉన్నాయక్కడ. పూర్వం నగరానికి స్వాగత ద్వారంలాంటి తీన్‌ దర్వాజా నేడు ప్రముఖ వ్యాపార కూడలి. దానిగుండానే పురాతన జామామసీదుకు వెళ్లాం. తరవాత సబర్మతీ నదీతీరాన్నే ఉన్న గాంధీజీ ఆశ్రమాన్నీ అక్కడ ఉన్న మ్యూజియాన్నీ చూశాం. ఆ మ్యూజియంలోని ఆనాటి దినపత్రికల్లో మన ఆంధ్ర పత్రిక కూడా ఉంది. అవన్నీ తిరిగి చూస్తుంటే నాటి పరిస్థితులు కళ్లకు కట్టినట్లుగా అనిపించాయి.

శ్రీకృష్ణ ద్వారక!
తరవాత చార్‌ధామ్‌లలో ఒకటైన ద్వారకకు బయలుదేరాం. దారి పొడవునా పవన విద్యుచ్ఛక్తికోసం ఏర్పాటుచేసిన గాలిమరలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి ఏడు గంటలు ప్రయాణించి ఇరుకిరుకు సందులతో ఉన్న ద్వారకలోకి అడుగుపెట్టాం. గోమతీనది అరేబియా సముద్రంలో కలిసే సంగమ ప్రదేశంలో విశ్వకర్మ చేతుల్లో రూపుదిద్దుకున్న శ్రీకృష్ణ రాజధాని ద్వారక ఇదేనా అనిపించింది. అలనాటి ద్వారక అనేకసార్లు సముద్రంలో మునిగిపోయింది. ఏడోసారి నిర్మించినదే ప్రస్తుత ద్వారక. ముందుగా ద్వారకాదీశ మందిరానికి వెళ్లాం. అద్భుతమైన శిల్పకళతో కట్టిన ఆ గుడిలో స్వామివారి నల్లరాతి విగ్రహం చక్కని అలంకరణతో నయన మనోహరంగా ఉంది. కృష్ణభక్తురాలైన మీరాబాయి భజన కీర్తనలు ఆలపిస్తూ ప్రజలు చూస్తుండగానే గర్భగుడిలోకి వెళ్లి మరి బయటకు రాలేదట. ఆ మహాభక్తురాలు కృష్ణుడిలో ఐక్యమైపోయిందని విశ్వసిస్తారు భక్తులు.

అక్కడకు బెట్‌ ద్వారక ఐదు కిలోమీటర్లు. ఆ దారిలో జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వరలింగం, గోపీతలావ్‌, రుక్మిణీమందిరం, సముద్ర నారాయణుని గుడి మొదలైన దర్శనీయ స్థలాలు ఉన్నాయి. లాంచీలో చిన్నదీవిలా ఉన్న బెట్‌ ద్వారకకు వెళ్లాం. అక్కడ కృష్ణుడు, సత్యభామ, ఇతర దేవేరుల మందిరాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ ద్వారక, బెట్‌ ద్వారకల మధ్య గరుత్మంతునిపై తిరిగేవాడట. సూర్యాస్తమయ సమయానికి సముద్రతీరానికి చేరుకున్నాం. నేలనుంచి సుమారు 30-40 అడుగులు కిందకు కుంగిపోయినట్లు దిగబడిపోయిన సముద్ర ఒడ్డును చూస్తుంటే ఒళ్లు జలదరించినట్లయింది. ఏదో ఉపద్రవంతో ఒక్కసారిగా భూమి ముక్కలైపోయినట్లుగా పొరలుపొరలుగా కనిపిస్తుంది. అది చూస్తుంటే నాటి పురాణాలూ ఇతిహాసాలూ నిజంగా జరిగాయా అనిపించకమానదు. గాంధీగారి సొంతూరు!

ద్వారకకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది పోరుబందరు. కృష్ణుడు కుచేలుడికి బహూకరించిన నాటి సుధామపురే నేటి పోరుబందరు. కృష్ణుడు రాజమందిరాన్ని ప్రసాదించినా అందులో నివసించకుండా పక్కనే చిన్న గదిలో ఉంటూ కృష్ణుణ్ణి పూజించి తరించిన ఆ సుధామ మందిరం, దాని పక్కనే ఆయన గదీ నాటి బావీ నేటికీ ఉండటం విశేషం. అక్కడనుంచి తరవాత గాంధీజీ జన్మించిన ఇంటిని చూడ్డానికి బయలుదేరాం. పురాతన భవనమైనా చెక్కుచెదరలేదు. ఎగువ మధ్యతరగతి వైశ్య కుటుంబం కావడంతో ఇల్లు దర్పంగా విశాలంగా ఉంది. బాపూజీ తల్లిదండ్రులవీ బాపూజీ-కస్తూర్బాలవీ నిలువెత్తు తైలవర్ణ చిత్రాలు అలంకరించారు.

ప్రభాస పట్టణ దర్శనం...
అక్కడకు 129 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమనాథ్‌కు రాత్రికి చేరుకున్నాం. పురాణాల్లో దీన్నే ప్రభాస పట్టణంగా చెబుతారు. పాలసముద్రంలాంటి అరేబియా ఒడ్డున విశాలమైన ప్రాంగణాల్లో అద్భుత శిల్పకళా చాతుర్యానికి నితువెత్తు దర్పణంలా మెరిసిపోతుంది ఈ దేవాలయం. మందిరం దగ్గర్లోనే కపిల, హిరణ్య, సరస్వతి అనే మూడు నదుల త్రివేణీ సంగమస్థానం భక్తులతో సందడిగా ఉంది.

కృష్ణుని మహాప్రస్థానం..!
మహా ప్రళయానికి ద్వారక నాశనం కాగా శ్రీకృష్ణుడు సోమనాథ్‌ పక్కనే ఉన్న భాలకా అనే ప్రదేశం చేరుకుని చెట్టు కింద విశ్రమిస్తున్నాడట. ఆయన పాదాన్ని లేడి కన్నులా భావించి కిరాతకుడు వేటకై బాణాన్ని విడవగా అది కృష్ణ పరమాత్మ ప్రాణాలు గైకొందట. బలరాముడు ఆదిశేషుని రూపంలో త్రివేణీసంగమం దగ్గర ఉన్న పుట్ట ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయాడట. శంఖుచక్రాలు సముద్రంలో లీనమై గోమతీ చక్రాల రూపంలో సోమనాథ్‌-ద్వారకల మధ్య ఉన్న సముద్ర ప్రదేశంలో మాత్రమే లభిస్తున్నాయట. ఒకవైపు శంఖం, మరోవైపు చక్రంలా ఉండి ఇవి లక్ష్మి-విష్ణు స్వరూపంగా సర్వశక్తిమంతమై నేటికీ పూజలందుకుంటున్నాయి.

చిత్తోడ్‌గఢ్‌ కోటలో...


అక్కడ నుంచి రాజుపుత్రుల శౌర్యప్రతాపాలూ వైభోగాలూ దర్శించడానికి రాజస్థాన్‌కు బయలుదేరాం. దారిపొడవునా పాలరాతి కొండలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఉదయ్‌పూర్‌కు ముందు మేవాడ్‌ రాజుల రాజధాని ఈ చిత్తోడ్‌గఢ్‌. క్రీ.శ. 7-16 వరకూ ఎన్నో వైభోగాలతో తులతూగింది. ఖిల్జీల దండయాత్రలో నాశనమైపోయింది. మీరా పూజలందుకున్న కృష్ణమందిరం నేటికీ పూజలందుకుంటూ గత స్మృతుల్లోకి మనల్ని నెడుతుంది. శివమందిరంలో బాల, ఫ్రౌడ, వృద్ధ రూపాలుగా శిరస్సు మాత్రమే కనిపించేలా చెక్కిన ఎత్తైన శివుని విగ్రహం కొంత భయం గొలిపేలా ఉంది. ఆ పక్కనే గోముఖ్‌ రిజర్వాయర్‌, కాళీమందిరం, రాణీ పద్మినీ ప్యాలెస్‌, గులాబీవనం, జైనమందిరం కనిపిస్తాయి.

అద్భుత అందగత్తె అయిన రాణీ పద్మినీ, రాణీ కర్ణావతిల సమాధుల్ని చూశాం. చిత్తోడ్‌ సామ్రాజ్యాధికారం కోసం పసిబిడ్డగా ఉన్న ఉదయ్‌సింగ్‌ని చంపాలనుకున్నారట దాయాదులు. ఈ కుట్రను పసిగట్టిన దాసి పన్నాబాయి ఉదయ్‌సింగ్‌ స్థానంలో అదే వయసున్న తన బిడ్డను ఉంచిందట. దాయాదుల చేతిలో ఆ బిడ్డ హతం కాగా చిన్నారి ఉదయ్‌సింగ్‌తో పన్నాబాయి కోట దాటి తప్పించుకున్న ప్రదేశం మనకు కనిపిస్తుంది. ఇలా ఎన్నో చారిత్రక సాక్ష్యాలకు నిలయం చిత్తోడ్‌కోట. ప్రస్తుతం కొండజాతివారు ఈ కోటలో సీతాఫలాలు పండించుకుంటూ జీవిస్తున్నారనీ వాళ్లు రాణా ప్రతాప్‌కు సహాయం చేసిన భీల్‌ తెగవారనీ మా గైడ్‌ చెప్పాడు. నార చీరలు తయారుచేయడం, అతి తేలికైన రజాయిలు చేయడం వాళ్ల ప్రత్యేకత అనీ, ప్రభుత్వ సహకారంతో వాటిని కోటలోని దుకాణాల ద్వారా అమ్ముకుంటూ ఆ డబ్బుతోనే జీవించే నిజాయతీ పరులనీ చెప్పాడు. తరవాత అక్కడినుంచి ఉదయ్‌పూర్‌కు వెళ్లాం.

సరస్సుల నగరంలో విహారం... 


మహారాణా ఉదయ్‌సింగ్‌ అడవిలాంటి ఈ ప్రదేశానికి వేటాడుతూ రాగా గోస్వామి ప్రేమ్‌జీ అనే సన్యాసి ఇక్కడ కోటను నిర్మించమన్నాడట. ఆయన ఆదేశంతో 1559లో నాలుగు అంతస్తులుగా కోటనూ నగరాన్నీ నిర్మించాడట. అందుకే ఈ నగరం ఆయన పేరు మీదనే ఉదయ్‌పూర్‌గా స్థిరపడింది. నగరానికి రాణీలాంటి సిటీ ప్యాలెస్‌ పిచోలా సరస్సు పక్కనే ఉన్న కొండమీద ఉంది. ఇప్పటికీ ఉదయ్‌సింగ్‌ వంశంలోని 24వ తరం వారి అధీనంలోనే ఈ కోట ఉంది. వారి కులదైవమైన సూర్యుని ముద్ర ప్రవేశద్వారంపై ఉంటుంది. లోపల విశాలమైన వరండాలూ గదులూ ఉన్నాయి. ఉదయ్‌సింగ్‌ కుమారుడు రాణా ప్రతాప్‌, మొఘల్‌ చక్రవర్తుల కొమ్ముకాస్తున్న జైపూర్‌ రాజు రాజా మాన్‌సింగ్‌ని చంపడానికి తన గుర్రం చేతక్‌కు ముందు ఇనుముతో చేసిన ఏనుగుతొండం కట్టి కదనరంగంలోకి వెళతాడు. మాన్‌సింగ్‌ అధిరోహించిన ఏనుగు, దాన్ని ఓ పిల్ల ఏనుగుగా భావించి చేతక్‌ జోలికి రాదు. అయితే అది దగ్గరకొచ్చాక చేతక్‌ ఒక్కసారిగా కత్తులు కట్టిన తనముందు కాళ్లతో పైకి లేవడంతో రాణా చేతిలో మావటి క్షణాల్లో చనిపోయాడట. కానీ మాన్‌సింగ్‌ కిందకు వంగడంతో ప్రాణాలతో బయటపడతాడు. ఆ యుద్ధంలో గాయపడ్డ రాణాప్రతాప్‌ను తను గాయపడ్డా కూడా యుద్ధభూమి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంబాల్‌గఢ్‌ వరకూ తీసుకెళ్లి అక్కడ 42 అడుగుల వెడల్పు ఉన్న బనాస్‌ నదిలో దూకి రాణా ప్రాణాలు కాపాడి చేతక్‌ కన్ను మూసిందట. ఆ దృశ్యాలన్నీ తైలవర్ణ చిత్రాల్లో చిత్రించి ఉన్నాయి. ఇక, రాజదర్బారు, సింహాసనాలతోబాటు రాజప్రాసాదానికే తలమానికమైన అద్దాల నెమలి ఆనాటి కళాకారుల పనితనానికి ప్రతీక. మేవాడ్‌ రాజులు సూర్యదర్శనం తరవాతే భోజనం చేస్తారు. శ్రావణమాసంలో సూర్యదర్శనం కష్టం కాబట్టి, ఆ సమయంలో దర్శించుకోవడానికి ప్రజ్వలంగా వెలుగుతున్నట్లున్న సూర్యబింబం ఆకారాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. అతిథులను ఆటపట్టించడానికి నిర్మించిన రాతి తలుపులూ సరదా పుట్టించే వేట దృశ్యాల వర్ణ చిత్రాలూ... ఇలా ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు అక్కడ ఉన్నాయి.

పాలరాతితో చేసిన తొట్టెలో బంగారునాణాలను నింపి దసరా కానుకగా జనానికి పంచేవారట. సుగంధద్రవ్యాలతో హోలీ ఆడుకునే చిన్న కొలనూ ఫౌంటెయినూ అద్దాల మందిరమూ ముఖమల్‌ మందిరమూ... ఇలా అవన్నీ చూస్తుంటే సమయమే తెలియలేదు.


కోటపైనుండి ఒకవైపు సరస్సు మధ్యలో మహారాజా జగత్‌సింగ్‌ నిర్మించిన వేసవి విడిది లేక్‌ ప్యాలెస్సూ దానికి కొద్దిదూరంలో ఉదయ్‌విలాస్‌ కోటా కనిపిస్తాయి. అక్కడ నుంచి సహేలియోంకీ బాడీకి వెళ్లాం. రాణా సంగ్రామ్‌సింగ్‌ ఆనాటి రోజుల్లోనే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఫౌంటెయిన్లు నిర్మించిన అందమైన ఉద్యానవనమే ఈ సహేలియోంకీ బాడీ. ముందుగా వెల్‌కమ్‌ ఫౌంటెయిన్‌ కనిపిస్తుంది. మనం వస్తుంటే ఇందులోంచి నీళ్లు పైకి చిమ్ముతాయి. తరవాత జోరువాన శబ్దం వినిపించే బాదల్‌ బర్‌సాత్‌, చెట్ల ఆకులూ పొదలమీద పడుతున్న వాన శబ్దాన్ని వినిపించే శ్రావణ బరసాత్‌ ఫౌంటెయిన్లనీ చూశాం. చివరగా తామరకొలను దగ్గరకు వెళ్లాం. దానికి నలువైపులా పాలరాతి ఏనుగుల తొండాల నుంచి నీరు చిమ్మేలా నిర్మించారు. అలాగే కొలను మధ్యలో రకరకాల పక్షుల ముక్కుల నుంచి నీళ్లు రావడం ఎంతో బాగుంది. చివరిగా రాణాప్రతాప్‌ స్మారక స్తూపం చూసి తిరుగు ప్రయాణమయ్యాం.



కామాఖ్యాదేవి ఆలయం

స్త్రీ శక్తికి... సృష్టి ఆవిర్భావానికీ సంకేతం.


అష్టాదశ శక్తిపీఠాలలో అగ్రగణ్యమైనది, శాక్తేయులకు అత్యంత ఆరాధనీయమైనదీ కామరూపాదేవి ఆలయం. పిలవని పేరంటానికి వెళ్లి, కన్నతండ్రి చేత ఘోరపరాభవం పొందిన సతీదేవి, అవమాన భారంతో ఆత్మత్యాగం చేస్తుంది. ఇది తెలిసి, అక్కడకు చేరుకున్న శివుడు విచలిత మనస్కుడై, ఆమె శరీరాన్ని భుజాలమీదకు ఎత్తుకుని రుద్రతాండవం చేస్తుంటాడు. సతీదేవి శరీరం అక్కడ ఉన్నంతసేపూ శివుడిని ఆపశక్యం కాదని తెలిసిన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు.

అవి 108 ఖండాలుగా భూలోకంలోని వివిధ ప్రదేశాలలో పడతాయి. ఆమె శరీరంలోని కీలకమైన భాగాలు పడిన ప్రదేశాలలో తిరిగి అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి, ఆలయాలు నిర్మించారు పూర్వులు. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధిచెందాయి. వాటిలో అమ్మవారి యోనిభాగం నీలాచలం కొండలపై పడింది. అదే కామాఖ్యా పీఠంగా గుర్తింపు పొంది, కామాఖ్యాదేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, ఛిన్నమస్త, భైరవి, ధూమావతి, కమలాంబిక, షోడశి, మాతంగి అనే పది వేర్వేలు ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయమూ ఒక్కో విద్యకు ప్రసిద్ధమైనది. ప్రధాన ఆలయం కామాఖ్యాలయమే.

మరో కథ:
సతీదేవి ఆత్మత్యాగానంతరం తీవ్రమైన వేదనతో తపస్సమాధిలో లీనమై ఉన్న పరమేశ్వరుని మనస్సును మార్చాలని దేవతలు సంకల్పిస్తారు. ఇందులో భాగంగా మన్మథుడు సమయం చూసుకుని, పూలబాణాలు వేసి, ఆయనకు తపోభంగం కలిగిస్తాడు. దాంతో ముక్కంటి తన మూడవకంటిని తెరచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. మన్మథుడికే కాముడు అనే పేరు. కాముణ్ణి దహించిన ప్రదేశం కనుక దీనికి కామాఖ్య అనే పేరొచ్చిందంటారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తిరిగి రూపాన్ని పొందాడు. అయితే కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే రూపంతో కనిపిస్తాడు. ఇక్కడి బ్రహ్మపుత్రానదిలో భస్మకూటమనే పర్వతం ఉండటం శివుడు మన్మథుని భస్మం చేయడం, తిరిగి ఆయన రూపం పొందాడనడానికి ప్రతీకగా నిలుస్తుంది.

ప్రత్యేకతలకు ఆలవాలం:
ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్యమతస్థుల దాడుల్లో ధ్వంసం కాగా, 17వ శతాబ్దంలో కుచ్‌ బీహార్‌ రాజు నరనారాయణుడు పునర్నిర్మించాడని శాసనాధారాలున్నాయి. తేనెపట్టు ఆకారంలో ఉన్న ఆలయ శిఖరం గణేశుడు తదితర దేవీ దేవతల శిల్పాలతో కనువిందు చేస్తుంది. మాంత్రికులకు, తాంత్రికులకు, వామాచారులకు, క్షుద్రపూజలు చేసేవారికి ఈ ఆలయమే ఆధారం. కారణం ఇది సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. కాబట్టి అమ్మవారు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. మూడు మంటపాలుగా నిర్మించి ఉంటుంది.

అందులో మొదటి ప్రాకారంలో గుహలా ఉండే గర్భాలయంలో యోనిచిహ్నం ఉన్న నల్లటి బండరాయి ఉంటుంది. దానికే పూజలు జరుగుతాయి. అయితే ఆ రూపం కనిపించకుండా భక్తుల దర్శనానికి ముందే పూలతో నింపేస్తారు. ఆ గుహలోపల రాతి మీద ఎప్పుడూ జల వూరుతూ ఉంటుంది. అందువల్ల మూలవిరాట్టు ఎప్పుడూ తడిగా ఉంటుంది. గర్భాలయం అంతా చిత్తడిగా, జారుడుగా ఉంటుంది. ఆలయం బయటే శీతలాదేవి సన్నిధి ఉంటుంది. దీర్ఘవ్యాధులు ఉన్నవారు ఈమెను సేవించుకుంటే వాటినుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. రెండవ మండపం చతురస్రాకారంలో, సువిశాలంగా ఉంటుంది. అదే అమ్మవారు కొలువై ఉన్న గుహాంతర్భాగంలోకి దారితీస్తుంది.

పూజలు – ఉత్సవాలు:
అమ్మవారికి రోజూ చేసే పూజలు గాక దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా దుర్గాపూజ జరిపిస్తారు. ఇవిగాక ఫాల్గుణ మాసంలో దుర్గాడియుల్‌ అని దుర్గాదేవికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా మానసాపూజ, పోహన్‌ బియా అంటే పుష్యమాసంలో కామేశ్వరుడికీ, కామేశ్వరీదేవికీ కల్యాణం జరిపిస్తారు. అదేవిధంగా చైత్రమాసం రాగానే, వసంత రుతు ఆగమనానికి సంకేతంగా వసంతపూజ జరుగుతుంది. ఇదే మాసంలో మదన డియుల్‌ అంటే కామదేవతకీ, కామదేవుడికీ పూజ జరుగుతుంది.

Saturday, 18 March 2017

సేదతీరుతునిద్రించే భంగిమలో శివుడు

చాలా చోట్ల లింగరూపంలోనే కనిపించే శివుడు ప్రముఖ క్షేత్రాల్లోనే విగ్రహరూపంలో దర్శనమిస్తాడు. కానీ నిద్రించే భంగిమంలో ఉన్న భంగిమలో శివుడు  దర్శనమిస్తున్నాడు. అదెక్కడో, ఆ విశేషాలేంటో చూడండి.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నాగులాపురం మండలం సరటుపల్లిలో మనకు పడుకుని ఉన్నమహాశివుడు కనిపిస్తాడు. క్షీరసాగరమథనం అప్పుడు లోకకళ్యాణం కోసం హళాహలాన్ని మింగిన శివుడు,విషప్రభావం వల్ల కాసేపు స్పృహ తప్పిపడి పోయిన శివుడు అమ్మవారి ఒడిలో సేదతీరుతుంటే కంగారు పడిన దేవతలు శయనరూపంలో ఉన్న శివున్ని సేవించుకున్నారని, అప్పుడు తన కంఠంలో ఉన్న గరళాన్ని అందరికీ చూపించి అభయమిచ్చాడనే స్థల పురాణం.ఈ ప్రాంతానికి సురులు వచ్చి శివున్ని పూజించినందున సురులపల్లిగా, కాలక్రమేణా సురుల పల్లి సరటుపల్లిగా మారింది.శివరాత్రి రోజున ఈ శివున్ని దర్శిస్తే ఆరోగ్య సమస్యలు పోతాయని భక్తుల విశ్వాసం.





యనమదుర్రు









యనమదుర్రు
తలకిందులు భంగిమలో ఉన్న శివుడు


చాలా చోట్ల లింగరూపంలోనే కనిపించే శివుడు ప్రముఖ క్షేత్రాల్లోనే విగ్రహరూపంలో దర్శనమిస్తాడు. కానీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గర యనమదుర్రులో మాత్రం శివుడు తలకిందులుగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈ గుడికి వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. శీర్షాసనంలో తపస్సు చేస్తున్న శివుడి జటాజుటం నేలకు తగులుతూ, ముఖం, పాదాలు, ఉదరం, మోకాళ్లు పైకి ఉండి పక్కనే అమ్మవారు కొలువై ఉంటుంది. జగన్మాత పార్వతిదేవి నెలలపిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు ఉండడం ప్రత్యేకత.

ఈ గుడి వెనుక ఒక పురాణకథ ఉంది. లోకాన్ని పట్టి పీడిస్తున్న శంభరున్ని అంతం చేయాలనుకున్న యమధర్మరాజు, శంభరుడు శివుని భక్తుడని శంభరున్ని అంతంచేయాలంటే శివుడి ఆజ్ఞ తీసుకోవాలని శివుడి గురించి తపస్సు చేస్తాడు. అదే సమయంలో కైలాసంలో తలకిందులుగా తపస్సు చేస్తున్నశివుడు, పక్కనే బాలింత పార్వతీ దేవి యమధర్మరాజు తపస్సు చేస్తున్నచోట ప్రత్యక్షం అయ్యారని పురాణకథ. యమధర్మరాజే స్వయంగా ఇక్కడ శివున్ని ప్రతిష్టించి గుడికట్టి, గుడికెదురుగా ఒక కోనేరుని ఏర్పాటు చేసాడని, ఈ కోనేరులో స్నానం చేసి ఆ శివున్ని దర్శించుకుంటే అకాల ప్రాణభయం ఉండదని భక్తుల విశ్వాసం.




కైలాస కోన


నేడు భారతదేశంలో ఎంతో వైభవంగా విరిసిల్లిన ఎన్నో దేవాలయాలు, దైవాన్ని తలపించే ఇతర కట్టడాలన్నీ.. పురాతన కాలంలో దేవతలు పరవశించి కొన్నాళ్లపాటు గడిపిన ప్రాంతాలకు చిహ్నంగా నిర్మించబడినట్లు కొన్ని కథనాలు ప్రచారంలో వున్నాయి. అటువంటి ఆధ్యాత్మిక చరిత్రతో కూడిన నిర్మాణాల్లో కైలాసకోన గుహాలయం కూడా ఒకటి! చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో ఉన్న గుహాలయం దర్శించుకోదగ్గ ఆలయం.

ఆలయ నిర్మాణం వెనుక ప్రచారంలో వున్న పురాతన కథ :
పూర్వం ఒకనాడు నారాయణపురంలో పద్మావతీ వెంకటేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు ఇతర దేవతలతోబాటు కైలాసం నుంచి శివపార్వతులు కూడా ఇక్కడికి విచ్చేశారు. అప్పుడు వాళ్లు ఈ ప్రాంతంలోని ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలంపాటు ఇక్కడే గడిపారు. అలా వాళ్లిద్దరు నివసించడం వల్ల ఈ కొండకు కైలాసకోన అనే పేరు వచ్చింది. చక్కటి గుహాలయం పక్కనే మనోహరంగా ప్రవహించే జలపాతం ఎంతో చూడముచ్చటగా వుండే ఈ ఆలయం.. ఎంతో అద్భుతంగా దర్శనమిస్తుంటుంది.

మరిన్ని విశేషాలు :
- ఓ కొండపై వుండే కైలాస కోన పక్కనే జలపాతం ప్రవహిస్తూ ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంది. ఈ కైలాసకోన గుహాలయంలో ఓ శివలింగం ఉంటుంది. ఈ లింగానికి ఎదురుగానే నంది విగ్రహం, దాని పక్కన వీరభద్రుని ప్రతిమ, దాని పక్కనే ఆదిశంకరాచార్యుల శిల్పం ఉంది. ఈ గుహాలయాలు ప్రాచీన సౌందర్యాన్ని ప్రతిఫలిస్తూ ముగ్ధమనోహరంగా ఉంటాయి.
- ఈ కైలాసకోన జలపాతం నారాయణవనం మండలంలో ఉంది. ఇది ఎత్తైన కొండలపై నుంచి అనేక ఔషధీ వృక్షాల వేర్లను తాకుతూ ప్రవహిస్తూ 100 అడుగుల పైనుంచి పడుతూ ఉంటుంది. ఈ జలపాతంలో స్నానమాచరిస్తే పుణ్యంతోపాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్నది ప్రజల విశ్వాసం. ఈ ప్రాంతమంతా ఎత్తైన చెట్లతో పచ్చగా నిండి వుంటుంది.

- ప్రస్తుతం ఈ కైలాసకోన ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి కొన్ని వేలాదిమంది ప్రజలు నిత్యం విచ్చేస్తుంటారు. కుటుంబసభ్యులతో కలిసి ఈ సౌందర్యవంతమైన ఆధ్యాత్మిక ప్రదేశాన్ని దర్శించుకుని.. సంతోషంగా తమ కాలాన్ని గడుపుతారు.

బేలూరు చెన్నకేశవ ఆలయం






బేలూరు చెన్నకేశవ ఆలయం

దేశంలో దేవుళ్లు స్వయంభువుగా వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతోపాటు రాజవంశస్థులు నిర్మించిన మరెన్నో దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి వున్నాయి. అయితే.. మరికొందరు రాజులు మాత్రం చరిత్రలో తమ పేరుప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలా కొన్ని ఆలయాలను గుర్తుగా నిర్మించుకున్నవారున్నారు. అటువంటి ఆలయాల్లో ‘చెన్నకేశవ ఆలయం’ను ఒకటిగా చెప్పుకోవచ్చు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసలుల రాజవంశస్థులు నిర్మించినట్లు చారిత్రక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో వుంది.

ఆలయ చరిత్ర :
11-12 శతాబ్ద కాలాల్లో హోయసలుల రాజవంశస్థులు వుండేవారు. వారు ‘బేలూరు’ పట్టణాన్ని తమ రాజధానిగా నియమించుకుని పాలించేవారు. ఈ పట్టణం హళేబీడు ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు పట్టణాల జంట-పట్టణాలుగా పిలుస్తారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ప్రధాన పర్యాటక ప్రాంతాలుగా కొనసాగుతున్న ఈ రెండు పట్టణాలను పూర్వం హొయసలుల రాజులు పాలించేవారు. వారు ఈ రెండు ప్రాంతాలలోనూ అద్భుత శిల్పకళతో కూడిన ఆలయాలను నిర్మించారు. అందులో ప్రధానంగా బేలూరులో నిర్మించిన  చెన్నకేశవాలయం చూడదగినది.

ఈ ఆలయాన్ని హొయసలుల రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు. క్రీ.శ. 1117లో పశ్చిమ చాళక్యులు, హోయసలుల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హొయసలులవారు గెలిపొందారు. ఆ విజయ సూచికగానే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అప్పుడు వారు చోళులపై ‘తాలకాడ్’ యుద్దవిజయంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే.. ఈ ఆలయం నిర్మాణం వెనుక మరో కథనం కూడా వుంది. వైష్ణవ మత ప్రాశస్త్య ప్రచారానికై జగద్గురు రామానుజాచార్యుల ప్రబోధానుసారం నిర్మించాడనన్న వాదనలూ వున్నాయి.

ఆలయ విశేషాలు :
ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆలయంగా కేశవాలయం పరిగణించబడుతుంది. ఈ ఆలయం చుట్టూ రంగనాయకి, కప్పే చేన్నగరాయ ఆలయాలు కూడా వున్నాయి. ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హొయసలుల రాజముద్ర కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఆ రాజవంశస్థులు ద్రావిడ శైలిలో ‘సబ్బురాతి’తో నిర్మించారు. ఈ శిల సబ్బువలె అతి మెత్తగా ఉండి, కావలసిన రీతిలో మలుచుకునేందుకు అనువుగా వుంటుందట! అందుకే ఈ దేవాలయంపై వున్న శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి, అద్భుత సౌందర్యంతో అలరారుతాయి.

అలాగే.. దేవాలయ గోడలపై, పై కప్పు భాగంలో... వివిధ రకాలైన పక్షులు, జంతువులు, లతలు, వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. అందులో ముఖ్యంగా దర్పణ సుందరి, భస్మ మోహిని అనేవి చెప్పుకోదగిన ఆకర్షణీయ శిల్పాలలో కొన్ని!

ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంది. దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది. హొయసల శైలి శిల్పకళకు నిలువుటద్దంగా ఈ దేవాలయం వుంటుంది.



‘స్కందపురాణం’లో నైనితాల్ ప్రాంతం విశిష్టత





‘స్కందపురాణం’లో నైనితాల్ ప్రాంతం విశిష్టత 

నైనితాల్.. భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలువబడే అద్భుతమైన ప్రదేశం. హిమాలయ శ్రేణులలో ‘కుమావొన్ హిల్స్’ మధ్య భాగంలో వున్న ఈ ప్రాంతం అందమైన సరస్సులను కలిగి వుంది. నైనీతాల్ పేరులోని నైనీ అంటే నయనం.. తాల్ అంటే సరసు. భారతదేశంలో నైనీతాల్ ప్రసిద్ధ హిల్ స్టేషనే కాకుండా పుణ్యా క్షేత్రాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాంచింది. ఇది సముద్రమట్టానికి 2084 మీటర్ల (6,837 అడుగుల) ఎత్తున ఉంది. నైనీతాల్ కంటి ఆకారం కలిగిన ఉన్న పర్వతశిఖరాల మద్యనున్న ప్రదేశంలో ఉపస్థితమై ఉంది. ఈ ప్రాంతానికి ‘నైనితాల్’ అనే పేరు రావడం వెనుక వున్న చరిత్ర ‘స్కందపురాణం’లో పొందుపరచబడింది.

పేరువెనుక చరిత్ర :
‘స్కందపురాణం’లోని మానస ఖండ్ లో నైనితాల్ ను ‘ముగ్గురు ఋషుల సరస్సు’ లేదా ‘ముగ్గురు ఋషుల సరోవరం’ అని అంటారు. ఆ ముగ్గురు ఋషుల పేర్లు అత్రి, పులస్త్య, పులాహ. వీరు ముగ్గురు తమ దాహం తీర్చుకునేతందుకు నైనితాల్ వద్ద ఆగారు. ఈ ప్రాంతంలో నీరుకోసం ఎంత వెదికినప్పటికీ వారికి దొరకలేదు. దీంతో వారు ముగ్గురు కలిసిన వెంటనే ఒక పెద్ద గొయ్యి తవ్వడం ప్రారంభించారు. దానిలోకి ‘మానస సరోవరం’ నీటిని నింపి వారు తమ దాహం తీర్చుకున్నారు. ఆ విధంగా నైనితాల్ సరస్సు సృష్టించబడింది. మరో కథనం ప్రకారం ఇక్కడ శివుడి భార్య అయిన సతి ఎడమ కన్ను పడి.. ఆ ప్రాంతంలో నైని సరస్సు సృష్టించబడింది.

మరికొన్ని ఆసక్తికర విశేషాలు :

  • భూతల స్వర్గంలా తలపించే ఈ నైనితాల్ ఎంతో ఆకర్షణీయంగా వుండటంతోపాటు ప్రశాంత వాతావరణాన్ని కలిగివుంటుంది. బ్రిటిష్ వ్యాపారి అయిన ఫై.బర్రోన్ అనే వ్యక్తి ఈ ప్రాంత అందాలకు ముగ్ధుడై 1839లో ఒక బ్రిటిష్ కాలనీ స్థాపించి దానిని ప్రసిద్ధి చేశాడు. ఆంగ్లో నేపాలీ యుద్ధం (1814-1816) తరువాత ఈ ప్రాంతం కుమాన్ హిల్స్ బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. అయినప్పటికీ 1841 తరువాతనే నైనీతాల్ అభివృద్ధిచేయబడింది.
  • 1846లో బెంగాల్ సైన్యానికి చెందిన కేప్టన్ ఆర్టిల్లరీ నైనీతాల్‌ను దర్శించాడు. ఆయన మాటలలో ‘దాదాపు సముద్రమట్టానికి 7,500 అడుగులు (2,300 మీటర్లు) ఎత్తువరకు నివాసగృహాలు వ్యాపించి ఉన్నాయి’ అని వర్ణించాడు. తరువాత కాలంలో అటవీప్రాంతంలో సెయింట్ జాన్ చర్చ్ నిర్మాణం జరిగింది.
  • నైనిటాల్ సందర్శనకు ప్రణాళిక చేసే వారు ఇక్కడే కల హనుమాన్ ఘర్ కూడా తప్పక చూడాల్సిందే! దీంతోపాటు ఇండియాలోని 51 శక్తి పీఠాలలో ఒకటైన నైనా దేవి టెంపుల్ కూడా తప్పక చూడాలి.
  • షాజాన్‌పూరుకు చెందిన చక్కెర వ్యాపారి పి.బారన్ యురేపియన్ హౌస్ (భక్తుల వసతి గృహం) నిర్మాణంతో ఇక్కడ మొదటి నిర్మాణం ఆరంభం అయింది.


బుల్లి తిరుపతి







బుల్లి తిరుపతి

దేశంలో ఎన్నో హిందూదేవాలయాలు వెలసినా.. వాటి ప్రముఖ్యతలు, విశిష్టతలు మాత్రం భక్తుల నోళ్లలో నానుతూ ఆచంద్రతారఖ్కంగా నిలుస్తున్నాయి. భక్తులు విశ్వాసాలకు పుట్టినిళ్లుగా మారిన దేవాలయాల్లో దేవుళ్లు స్వయంభువుగా వెలిస్తే, మరికొన్ని ఆలయాలను భక్తులు దేవుడిపై వున్న తమ భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించారు. ఇలా నిర్మితమైన వాటిలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందినవి వున్నాయి. అలాంటి ఆలయాల్లో తిరుపతి వెంకటేశ్వర ఆలయం ఒకటి! ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులు వస్తుంటారు. పలు కీలక సందర్భాలలో మాత్రం బారులు తీరుతుంటారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి వైకుంఠంగా ప్రసిద్ది చెందిన తిరుమలకు ఉన్న విశిష్టత నేపథ్యంలో ఈ ఆలయ తరహాలోనే మరెన్నో ఆలయాలు పుట్టుకొచ్చాయి. సదరు దేవాలయాలకు ప్రత్యేకంగా పేర్లున్నప్పటికీ వాటికి గుర్తింపు మాత్రం ప్రసిద్ధ ఆలయాలతో పోలి ఉంటుంది. అలాంటి ఆలయాల్లో శ్రీ వరాల వేంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి! ఆంధ్రరాష్ట్రంలో ఉన్న ఈ ఆలయం ‘బుల్లి తిరుపతి’గా ప్రసిద్ధి గాంచింది.

ఆలయ విశేషాలు :ఈ దేవాలయం పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలోని ఈడూరులో నెలకొని ఉన్న ప్రసిద్ధ ఆలయం. 2005 ఫిబ్రవరి 17న శ్రీ భూనీలా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం నిర్మాణం జరిగింది. క్రమంగా స్వామివారి మహిమ గుర్తించిన భక్తులు.. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా కొలుస్తూ కోరిన వరాలు ఇచ్చే దేవునిగా ‘శ్రీ వరాలవేంకటేశ్వరుని’గా ప్రసిద్ధి చెందారు. మనసులో కొరిక తలచుకొని 11 ప్రదక్షిణలు చేసి ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి వారి మొక్కును చెల్లించుకోవడం ఇక్కడ ప్రజల ఆనవాయితీగా మారింది.

ముందుగా చిన్నగుడిగా నిర్మాణమైన ఈ ఆలయం.. దాతల సహకారంతో గుడిచుట్టూ ప్రాకారం, రాజగోపురం నిర్మాణం జరిగింది. రథోత్సవాల కోసం రథం తయారు చేయించారు. మకరతోరణం, గరుడవాహనం, శేషవాహనం కూడా స్వామి వారికి సమకూర్చడం జరిగింది. అందరికీ మంచి బుద్ధి సిద్ధించాలని, సర్వజనులు సుఖశాంతులతో ఉండాలని, ఆలయ దినదినాభివృద్ధి సాధించాలని ఈ ఆలయంలో ఓ ప్రత్యేక యాగం నిర్వహిస్తారు. ఈ యాగంలో పాలుపంచుకున్న దంపతులకు, సర్వులకు శ్రీవారి అనుగ్రహం వల్ల సర్వదోషాలు తొలిగి.. అన్నీ విధాల సుఖశాంతులతో జీవిస్తారని నమ్మకం.

ఇక ఆలయంలో ప్రతీ శనివారం విశేష అలంకారాలు, పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతీ నెలా వచ్చే శ్రవణా నక్షత్రం రోజున స్వామి వారికి కల్యాణం జరుపుతారు. ఈ కల్యాణం జరిపించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతాయని, పిల్లలు లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుంది, ఉద్యోగం లేనివారికి ఉద్యోగం, చదువు , ఆరోగ్యం, మొదలైన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.



కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం

ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. వాటిల్లో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు, వంశస్థులవారు దేవుడిపై భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించగా.. మరికొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభువులుగా వెలిశారు. అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి.  కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రం ‘పరశురామ’ క్షేత్రాలలో ఒకటి.
ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యారాలు వెలువరించే కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుకు 100 కి.మీ.ల దూరంలో కుమార పర్వతశ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్న గ్రామం ’సుబ్రహ్మణ్యం’లో వుంది. పూర్వం ఈ గ్రామాన్ని ‘కుక్కే పట్నం’ అనే పిలిచేవారు. క్రమంగా ఇది ‘కుక్కె సుబ్రహ్మణ్య’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. సుబ్రహ్మణ్య ఆలయం గురించి ‘స్కాందపురాణం’లో సనత్‌కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణంలో తెలుపబడింది.

స్థలపురాణం : 
పూర్వం తారకుడు, సూర్పర్మాసురా అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి (కుక్కే సుబ్రహ్మణ్య గ్రామంలో) ధారానదిలో శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత ఈ కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా ఆయన అంగీకరిస్తాడు. ఆ తరువాత వాసుకి తపస్సుకు మెచ్చి వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించడం వల్ల ఈ క్షేత్రం వెలసింది.

మరిన్ని వివరాలు :
సుబ్రహ్మణ్యస్వామి ముఖద్వారం తూర్పుముఖమై ఉన్నా, భక్తులు మాత్రం పృష్టభాగం నుండి ముందుకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భగుడికి, ఈమధ్య నిర్మించబడ్డ వసారాకు మధ్యన వెండితాపడాలతో అలంకరింపబడ్డ స్తంభం ఉంటుంది. వాసుకి విషపు బుసలనుండి రక్షింపపడడానికి ఈ స్తంభాన్ని నిర్మించారు అని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపటి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు సాక్షాత్కరిస్తాడు. పైభాగంలో సుబ్రహ్మణ్యస్వామి , మధ్యభాగంలో వాసుకి, కింద్రిభాగంలో ఆదిశేషు ఉంటారు.


ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలమూలల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తారు. పూర్వం ‘ఆది శంకరాచార్యులు’ తన ధర్మ ప్రచార పర్యటనలో భాగంగా సుబ్రహ్మణ్యను దర్శించారు. ఆయన విరచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ‘నమస్తే సదా కుక్కుటేశోగ్ని కేతా స్స్మస్తాపరాధం విభోమే క్షమస్వ’ అని పేర్కొన్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయని కొందరి భక్తుల నమ్మకం.

పశుపతినాథ్ ఆలయం


నేపాల్ లోని పవిత్రమైన పశుపతినాథ్ ఆలయం

పశుపతినాథ్ దేవాలయం.. ఇది నేపాల్ దేశ రాజధాని అయిన కాఠ్మండు నగరంలోని భాగమతి నది ఒడ్డున వుంది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా వున్న ఈ ఆలయాన్ని అతి పవిత్రమైన శైవాలయంగా భావిస్తున్నారు. ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా వుండే శివభక్తులు వేలసంఖ్యల్లో తరలివస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. శివుడు ఆత్మలింగం రూపంలో వెలిసిన ఈ ఆలయం నిర్మాణం వెనుక రెండు ఇతిహాసాలు దాగివున్నాయి. అవేమిటో తెలుసుకుందామా...

గోవు ఇతిహాసం-1 : 
పూర్వం ఒకనాడు శివుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండేవాడు. అప్పుడు కొందరు దేవతలు శివుడిని తన స్వరూపంలో చూడాలనే కోరికతో శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగిపోయి ఇక్కడ ఖననం చేయబడింది. కొన్ని శతాబ్ధాల తరువాత ఒకనాడు ఓ ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రదేశంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి చూశాడు. ఆవు పాలు ఎందుకు కురిపిస్తుందోనన్న అనుమానంతో ఆ కాపరి అక్కడి ప్రదేశానికి చేరుకుని త్రవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు శివలింగం బయటపడింది. ఆ విధంగా లింగం బయటపడగా.. ఆలయాన్ని నిర్మించారు.

మరో ఇతిహాసం-2 : 
నేపాల్ మహత్యం, హిమవత్‌ఖండం ప్రకారం.. ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తున్నాడు. అప్పుడు దేవతలు శివుడిని తిరిగి కాశీకి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు.. జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగంగా ఉన్నదని ఇతిహాసంలో పేర్కొనబడింది.

మరికొన్ని విశేషాలు :
  • గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం.. ఈ ఆలయాన్ని లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ. 753 సంవత్సరంలో నిర్మాణం జరిపినట్లుగా పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది. తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని, 1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది.
  • ఈ దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి, బంగారంతో చేయబడి ఉంటాయి. నాలుగు ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయబడి ఉంటుంది. పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని, ప్రధాన అర్చకుడిని మూలభట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ. ఈ దేవాలయం తూర్పున వాసికినాథ్ దేవాలయం వుంది.
  • శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. అలా నిర్వహించడానికి ప్రధాన కారణం.. నేపాల్ రాజు మరణించినప్పుడు దేశం సంతాప సముద్రంలో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు. పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు.
  • ఈ దేవాలయంలోకి హిందు మతస్థులను మాత్రమే ప్రవేశించనిస్తారు. హిందువులు కానివారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూలవిరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం వుంది. ఏకాదశి, సంక్రాంతి, మహా శివరాత్రి, రాఖీ పౌర్ణమి గ్రహణం రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.



‘గంగోత్రి’



‘గంగోత్రి’
గంగాదేవి నదిరూపంలో ప్రతిష్టితమైన పుణ్యక్షేత్రం

దేశంలో వెలసిన పవిత్రపుణ్యక్షేత్రాల్లో ‘గంగోత్రి’ ఒకటి. గంగాదేవి నదిరూపంలో ప్రతిష్టితమైన ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో వుంది. ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 4,042 మీటర్ల ఎత్తులో వుంది. ఈ ప్రదేశం హిమాలయాల్లోని చార్‌ధామ్‌లలో ఒకటి. అక్కడ గంగానది బాగీరథి పేరుతో పిలువబడుతుంది. పూర్వం గంగాదేవిని భూమికి తీసుకోవడానికి భాగీరథుడు కారణం కాబట్టి.. ఆ పేరు వచ్చింది. గంగాదేవి భూవిలో నదిరూపంలో ప్రతిష్టితమవడానికి ఓ పురాణగాధ వుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...

పురాణ గాధ :పూర్వం ‘సగరుడు’ అనే రాజు రాక్షస సంహారం తరువాత పాప పరిహారార్ధం ‘ఆశ్వమేధ’ యాగం చేశాడు. అప్పుడు సగరుని వైభవాన్ని చూసిన స్వర్గరాజు దేవేంద్రుడు సగరుడు తనపదవికి పోటీకి వస్తాడేమోనన్న భయపడతాడు. దాంతో సగరుడి యాగాన్ని ఎలాగైనా భంగం కలిగించాలని భావించి సగరుని అశ్వమేధ అశ్వాన్ని అపహరిస్తాడు. అనంతరం ఆ అశ్వాన్ని కపిలముని ఆశ్రమంలో కట్టి వేసి ఏమీ తెలియనట్టుగా తిరిగి వెళ్లిపోతాడు. ఈ మొత్తం తతంగం సగరుని 60 వేల కుమారులకు తెలియదు. ఆ అశ్వాన్ని కపిలమునియే అపహరించాడని భావించి.. అశ్వరక్షణార్ధం వెంట వచ్చి కోపంతో కపిల మహాముని ఆశ్రమంలో ప్రవేశిస్తారు. తపో దీక్షలో ఉన్న కపిలమునిని భంగం కలిగిస్తారు. దీంతో తీవ్ర కోపాద్రిక్తుడైన ఆ కపిలముని.. తన తపోభంగానికి కారణమైన సగరుని కుమారులు 60వేల మందిని భస్మం చేస్తాడు.

అలా కపిల మునిచే భస్మం కావింపబడ్డ తన పిత్రుల ఊర్ధ్వ గతుల కోసం సగరుని మనుమడు అయిన భాగీరథుడు తపస్సు చేశాడు. గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం చేసుకున్న గంగాదేవిని స్వర్గంనుండి భూమికి వచ్చి తన పిత్రులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. అయితే.. గంగాదేవి తన రాకను భూమి భరించలేదని, దానిని భరించగలిగినవాడు ఒక్క సాంభశివుడేనని చెప్తుంది. అప్పుడు భాగీరథుడు.. గంగాదేవిని భూమికి తీసుకువచ్చే ప్రయత్నంలో సహకరించమని శివుణ్ణి కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరించి గంగానదిని తన జటాఝూటాలలో బంధించి మెల్లగా భూమి మీదికి వదిలినట్లు పురాణాలు చెప్తున్నాయి.

లింగం తలభాగం చీలికతో శివలింగం






లింగం తలభాగం చీలికతో శివలింగం

దేశంలో ప్రతిష్టించబడిన శివుని ఆలయాలన్నింటిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన శివదేవుని చిక్కాల గ్రామంలో ఉండే ఆలయంలో ఓ ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయంలో మూడున్నర అడుగుల పొడవు, అడుగు వ్యాసార్ధంతో ఉన్న లింగం తలభాగం నుండి చీల్చబడినట్లుగా చీలికతో ఉంటుంది. ఈ శివాలయం వుండటం వల్లే చిక్కాల గ్రామం బాగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.

స్థలపురాణం :
పూర్వం ‘రామాయణ’ కాలంలో లంకతో యుద్దానికి ముందు శివపూజ చేసిన తరువాత లంకకు పయనమైతే మంచిదని పెద్దలు చెప్పగా.. శ్రీరాములు ఆ పూజా కార్యక్రమాలను సిద్ధం చేస్తాడు. అప్పుడు శివలింగంను తీసుకురావాల్సిందిగా హనుమంతునికి శ్రీరాముడు ఆదేశిస్తాడు. తన స్వామి చెప్పడమే ఆలస్యం హనుమంతుడు వెంటనే హిమాలయాల నుండి బయలుదేరుతాడు. ప్రతిష్టకు కావలసిన అన్ని గుణాలు కలిగిన శ్రేష్టమైన తెల్లని శిలను తీసుకొని తిరిగి పయనమవుతాడు.

మార్గమధ్యంలో చిక్కాల ప్రాంతానికి హనుమంతుడు చేరుకునేసరికి సాయంత్రం అవ్వడం వల్ల ‘సంద్యావందనం’ పాటించడానికి ఆ శిలను ‘కాళింది మడుగు’ అనే సరోవరం తీరంలో వుండే ఒక చిన్న గుట్టపైన దించేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ శిల చేయిజారి సరస్సులో పడిపోతుంది. దాంతో హనుమంతుడు ఆ సరస్సులో దూకి, జారిపోయిన శిలను వెతికి వెలుపలికి తీస్తాడు. అయితే.. ఆ శిల తల భాగము నుండి సగం వరకు పగిలిపోయి ఉండటాన్ని గమనించిన ఆయన.. ఇలా జరిగిందేమని అనుకుని, దానిని ఆ గుట్టపైనే వుంచుడం ఉత్తమమని భావించి ఆ శిలను తలచిన ప్రదేశంలో ప్రతిష్టించాడు. అలా ఆ విధంగా ఆయన ప్రతిష్టించిన ఆ లింగమే శివదేవునిగా పిలువబడుతోంది.

ఇప్పటికీ దాదాపు మూడున్నర అడుగులతో తెలుపు గోధుమ వర్ణాల ఈ శివలింగం అలాగే సగం పగులుతో రెండు ముక్కలుగా కనిపిస్తుంది. దీని ప్రక్కనే ఉన్న కాళింది మడుగులో పెద్ద తాండవ కృష్ణుడి శిల్పం వుంది. చిక్కాలలో ఆ పగిలిన లింగాన్ని ప్రతిష్టించిన తర్వాత హనుమంతుడు మరో శిల కోసం తిరుగు ప్రయాణమయ్యాడు. హనుమ ఎంతకూ తిరిగి రాకపోవడం వల్ల రాముడు ఇసుకతో లింగాన్ని తయారుచేసి.. పూజ పూర్తి చేస్తాడు. అనంతరం హనుమంతుడు తీసుకెళ్ళిన లింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించారు.



అప్పలయ్యగుంట


తిరుమలకు చేరువలో వున్న పురాతన ఆలయం

అత్యంత ప్రాముఖ్యత చెందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చుట్టు ఏడు పురాతన దేవాలయాలు వున్నాయి. వాటిల్లో అప్పలయ్యగుంటలో వున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి. తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వున్న ఆలయాన్ని ప్రతిఒక్కరు తప్పకుండా సందర్శిస్తారు. ఈ ఆలయం కారణంగా అప్పలాయగుంట ప్రాంతం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ ఆలయం వెనుక ఓ చరిత్ర కూడా వుంది.

ఆలయ చరిత్ర :
పూర్వం.. శ్రీ వేంకటేశ్వరుడు ‘నారాయణ వనం’లో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడిన తర్వాత ఆయన తిరుమలకు కాలినడకన బయలుదేరాడు. మార్గమధ్యంలో.. అప్పలాయగుంటకు చేరుకున్న ఆయన.. ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించాడు. అనంతరం అక్కడ కొద్దిసేపటివరకు కొలువు దీరాడు. తర్వాత అక్కడి నుండి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శింకుని, అక్కడినుంచి సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఆరునెలలు ఉండి వున్నాడు. అనంతరం అక్కడి నుండి శ్రీవారి మెట్టుద్వారా తిరుమల చేరాడని స్థల పురాణం.

మరికొన్ని విషయాలు :
ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొలాలు వుండటంతో అక్కడి వాతావరణము చాల ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం, ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి దివ్యమంగళ రూపం కనులవిందు చేస్తుంది. శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా వుంది.

అప్పలయ్యగుంట పేరు వెనుక చరిత్ర :

పూర్వం ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి వుండేవాడు. అతడు ఓ అవసరార్ధం ఒక గుంట తవ్వించాడు. అప్పటి నుండి ఈ ప్రదేశం అప్పలయ్యగుంటగా పిలువబడుతూ వచ్చింది. కాలక్రమంలో అది అప్పలగుంటగా మారిందని తెలుస్తోంది.

తలకోన జలపాతం

దట్టమైన అడవి మధ్యలో అందమైన తలకోన జలపాతం

దేశంలో వున్న అందమైన ప్రదేశాల్లో తలకోన జలపాతం ఎంతో అపురూపమైంది. చుట్టూ ఎత్తైన కొండలు.. దట్టమైన అరణ్యప్రాంతం.. మధ్యలో వుండే ఈ జలపాతం ప్రకృతి ప్రతిరూపంగా కనువిందు చేస్తుంది. ఇంతటి రమణీయ ప్రదేశం ఎక్కడుందని ఆలోచిస్తున్నారా..? మరెక్కడో కాదు.. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతికి 58 కిలోమీటర్ల దూరంలోనే వుంది. ఈ ప్రాంతంలో సాక్షాత్తూ ఆదిశేషుడే పర్వతరూపం దాల్చాడని పురాణ గాథ.

పూర్వం కుబేరుని అప్పు తీర్చేందుకు శ్రీనివాసుడు ధనాన్ని కొలుస్తూ అలసిపోయి ఇక్కడే నిద్రపోయాడని చెబుతారు. అలా పడుకునే సందర్భంలో ఆయన తల భాగం ఇక్కడున్న కొండ (కోన) శిఖరం మీద ఆనించాడని.. అందుకే ఈ ప్రదేశానికి తలకోన అనే పేరు వచ్చిందని స్థలపురాణం. ఈ జలపాతాన్ని శిరోద్రోణం అని కూడా పిలుస్తారు. ఎంత రమణీయంగా కనువిందు చేసే ఈ జలపాతం.. రాష్ట్రంలోనే ఎత్తయినది పేరుగాంచింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే ఈ తలకోన ప్రాంతంలో మరెన్నో అందాలను వున్నాయి.

తలకోన జలపాతం :
కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు దూరంలో ఈ జలపాతాన్ని చూడొచ్చు. ఈ జలపాతానికి చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు వుంటాయి. ఇటువంటి ప్రకృతి మధ్య బంధింపబడి వున్న ఈ జలపాతాన్ని చూసినప్పుడు ఎంతో అపురూపమైన అనుభూతి కలుగుతుంది. జలపాత దృశ్యం చూడ్డానికి చాలా అకర్షణీయంగా వుంటుంది. నల్లమల పర్వతశ్రేణుల్లో ఈ జలపాతం ఉండడం విశేషం. 60 మీటర్ల ఎత్తునుంచి ఈ జలపాతం జాలువారుతుంది.

శివాలయం :
తలకోన జలపాతం ఉన్న ప్రాంతంలోనే ఓ శివాలయం ఉంది. ఇక్కడి శివుడు సిద్ధేశ్వరుని రూపాన కొలువై ఉన్నాడు. ఈ ఆలయాన్ని 1811లో అప్పాస్వామి అనే భక్తుడు కట్టించాడని స్థానికులు చెబుతారు. శివుడితో పాటు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కూడా వున్నాయి.

నెలకోన :
ఆలయానికి అతి సమీపంలోనే దట్టమైన కొండల మధ్య ఓ వాగు ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఎంత ఎత్తునుంచి నీళ్లు జాలువారుతాయో కనిపించవు. ఔషధ లక్షణాలు కల మొక్కలు అనేకం ఉన్నాయి.

వృక్ష సంపద :
ఈ దట్టమైన అటవీ ప్రాంతం వృక్ష సంపద, వన వూలికలకు పుట్టినిల్లు. ఈ అడవుల్లో వృక్షాలు చాలా ఎత్తుగా ఉంటాయి. సూర్యరశ్మి నేలమీద పడనంత దట్టమైన అడవి కావడంతో చెట్లు సూర్యరశ్మిని అందుకోవడానికి పైకి పైపైకి పెరుగుతాయి. ఎక్కువగా ఎర్రచందనం, జాలారు, వుద్ది లాంటి చెట్లు ఉంటాయి. అడవిలో ప్రధానంగా అడవికోళ్లు, నెమెళ్లు, దేవాంగుపిల్లి, బెట్లుడుత, ఎలుగుబంట్లు, దుప్పులు, కణితులు, ఏనుగులు ఉన్నాయి.

త్రికోటేశ్వరస్వామి ఆలయం విశేషాలు


‘త్రికోటేశ్వరస్వామి దేవాలయం’.. గుంటూరుజిల్లా నరసరావుపేట కోటప్పకొండలో వుండే ఈ దేవాలయంలో స్వామి యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకుంటాడు. ఈ ఆలయం ఎల్లప్పుడూ నిర్జనంగా వుంటుంది కానీ.. మహాశివరాత్రి సమయంలో మాత్రం భక్తజనంతో నిండిపోతుంది.

స్థలపురాణం
పూర్వం యెల్లమండ గ్రామానికి చెందిన సాలంకయ్య అనే శివభక్తుడు జీవనభృతి కోసం కట్టెలు కొట్టి జీవిస్తూ ఉండేవాడు. ఇతడు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ జీవితం కొనసాగిస్తాడు. కానీ.. శివభక్తి ఫలితంగా సాలంకయ్యా ఒకానొక దశలో ధనవంతుడు అవుతాడు. ఎంత ధనవంతుడు అయినప్పటికీ విలాస జీవితాన్ని కాకుండా సాధారణంగా జీవితం కొనసాగిస్తూ.. శివుడిని పూజిస్తూ వుండేవాడు. ఒకరోజు సాలంకయ్య పూజచేస్తున్న తరుణంలో ఒక జంగమదేవరను చూసాడు. సాలంకయ్య భక్తికి మెచ్చి జంగమదేవర ప్రతిరోజు అతడి ఇంటికి వచ్చి పాలను త్రాగివెళ్ళేవాడు. కొన్ని రోజుల తరువాత జంగమదేవర కనిపించలేదు. సాలంకయ్య అతడి కోసం ఎంతగా గాలించినప్పటికీ జంగమదేవరను చూడలేక పోయాడు. దీంతో తీవ్ర నిరాశ చెందిన సాలంకయ్య.. నిద్రహారాలు మానేశాడు.

సాలంకయ్యా నివసిస్తున్న ప్రదేశానికి కొంత దూరంలో సుందుడు, అతడి భార్య కుంద్రి నివసిస్తూ ఉండేవారు. వారికి ఆనందవల్లి అనే కూతురు ఉండేది. ఆనందవల్లి పుట్టిన తరువాత వారు ధనవంతులు అయ్యారు. గాఢమైన దైవభక్తి సంపన్నురాలైన ఆనందవల్లికి సాధారణ ప్రపంచ జీవితం మీద విరక్తి కలిగి... ఆమె సదాశివుని భక్తిగితాలు ఆలపించేది. అలా కొంచంకొంచంగా ఏకాంతవాసానికి అలవాటుపడి తపోజీవనం ఆరంభించింది. ఆమె భక్తికి మెచ్చి జంగమదేవర ఆమె ముందు ప్రత్యక్షం అయ్యాడు. తరువాత ఆనందవల్లి రోజూ రుద్రాచలానికి వచ్చి శివునికి ఆభిషేకాదులు నిర్వహించి పాలు కానుకగా సమర్పించేది. ఈ విషయాన్ని సాలంకయ్యా తెలుసుకుంటాడు. అతడె ఆనందవల్లిని కలుసుకుని జంగమదేవర దర్శనం, ఆశీర్వాదం ఇప్పించనని కోరాడు. ఆమె అతని కోరికను మన్నించక తపసును కొనసాగించింది.

కొన్నిరోజుల తరువాత ఆనందవల్లి వేసవి కాలంలో కూడా శివుని ఆరాధించడానికి రుద్రాచలానికి వెళ్ళసాగింది. ఒకరోజు ఆమె అభిషేకం కోసం బిందె నిండా నీళ్లు తీసుకుపోతూ.. మార్గమద్యంలో దానిని ఒక రాతిమీద పెట్టి, మారేడుదళాలతో దానిని మూసి ఉంచింది. అప్పుడు ఓ కాకి నీళ్లు తాగడం కోసం ఆ బిందె మీద వాలింది. కాకి బరువుకు బిందె పక్కకు ఒరిగి బిందెలోని జలం మొత్తం కిందికి పడిపోతుంది. దీంతో ఆగ్రహించిన ఆనందవల్లి ఈ ప్రాంతానికి కాకులు రాకూడదని శపించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోకాకులు కనిపించడం లేదని ప్రాంతీయ వాసుకు విశ్వసిస్తున్నారు. తరువాత ఆనందవల్లి తపసుకు మెచ్చి జంగదేవర ప్రత్యక్షమై ఆమెకు జ్ఞానం ప్రసాదించాడు. తరువాత ఆనందవల్లి ఏకాగ్రతతో శివునిగురించి తపసు కొనసాగించింది. ఆనందవల్లి తపసుకు మెచ్చిన జంగమదేవర.. ఆమెకు ప్రత్యక్షమై ఆమెను తిరిగి కుటుంబ జీవితం కొనసాగించమని చెప్పి బ్రహ్మచారిణి అయిన ఆమెను గర్భవతిగా మార్చాడు.

అయితే ఆనందవల్లి మాత్రం తన గర్భాన్ని లక్ష్యపెట్టక శివారాధన కొనసాగిస్తూ వచ్చింది. జంగమదేవర తిరిగి ఆనందవల్లికి ప్రత్యక్షమై ఇక ఆమె శ్రమపడి రుద్రాచలం రావలసిన అవసరం లేదని తాను ఆమెను వెన్నంటి వచ్చి ఆమె పూజలు స్వీకరిస్తానని చెప్పి ఆమెను తిరిగి చూడకుండా నివాసానికి వెళ్ళమని ఆదేశిస్తాడు. ఒకవేళ తిరిగి చూస్తే తాను అక్కడే నిలిచిపోతానని చెప్పాడు. ఆనందవల్లి రుద్రాచలం నుండి కిందకు దిగుతూ కుతూహలం కారణంగా బ్రహ్మాచలం వద్ద తిరిగి చూసింది. దాంతో పరమశివుడు వెంటనే  అక్కడే నిలిచి పక్కన ఉన్న గుహలో లింగరూపం ధరించాడు. ఆ పవిత్ర ప్రదేశమే ప్రస్థుతం కొత్తకోటేశ్వరాలయంగా పిలువబడుతూ ఉంది.

చెన్నకేశవ ఆలయం






యుద్ధ విజయసూచికగా హోయసలలు నిర్మించిన ఆలయం

దేశంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక ఆలయాల్లో ‘చెన్నకేశవ ఆలయం’ ఒకటి. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసలుల రాజవంశస్థులు నిర్మించారు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో వుంది. హోయసలలు ఈ ఆలయం నిర్మించడం వెనుక ఓ చరిత్ర దాగివుంది. ఆనాడు ఓ యుద్ధంలో గెలిచిన విజయసూచికగా, చరిత్రలో తమ పేరుప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలా వారు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల అభిప్రాయం.

ఆలయ చరిత్ర :
11-12 శతాబ్ద కాలాల్లో హోయసలుల రాజవంశస్థులు వుండేవారు. హళేబీడు ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో వున్న ‘బేలూరు’ పట్టణాన్ని తమ రాజధానిగా నియమించుకుని వారు పాలించేవారు. ఈ రెండు పట్టణాలు జంట-పట్టణాలుగా పేరుగాంచాయి. ఆనాడు వారు ఈ రెండు ప్రాంతాలలోనూ అద్భుత శిల్పకళతో కూడిన ఆలయాలను నిర్మించారు. అందులో ప్రధానంగా బేలూరులో నిర్మించిన ఈ ‘చెన్నకేశవాలయం’ చూడదగింది. ఈ ఆలయాన్ని హొయసలుల రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు.

క్రీ.శ. 1117లో పశ్చిమ చాళక్యులు, హోయసలుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హొయసలులవారు గెలిపొందారు. ఆ విజయ సూచికగానే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అప్పుడు వారు చోళులపై ‘తాలకాడ్’ యుద్ద విజయంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయం నిర్మాణం వెనుక మరో కథనం కూడా వుంది. వైష్ణవ మత ప్రాశస్త్య ప్రచారానికై జగద్గురు రామానుజాచార్యుల ప్రబోధానుసారం నిర్మించాడనన్న వాదనలూ వున్నాయి.

ఆలయ విశేషాలు :
ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆలయంగా కేశవాలయం పరిగణించబడుతుంది. ఈ ఆలయం చుట్టూ రంగనాయకి, కప్పే చేన్నగరాయ ఆలయాలు కూడా వున్నాయి. ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హొయసలుల రాజముద్ర కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఆ రాజవంశస్థులు ద్రావిడ శైలిలో ‘సబ్బురాతి’తో నిర్మించారు. ఈ ఆలయంపై వున్న శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి, అద్భుత సౌందర్యంతో అలరారుతాయి. అలాగే దేవాలయ గోడలపై, పై కప్పు భాగంలో వివిధ రకాలైన పక్షులు, జంతువులు, లతలు, వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంది. దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది.





మహేశ్వర్









మహేశ్వర్
మహాశివుడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం





మహేశ్వర్.. మహాశివుడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఆయన వెలిసిన ప్రాంతం కాబట్టే దీనికి ‘మహేశ్వర్’ అనే పేరు వచ్చింది. ఎంతో పురాతనమైన ఈ ప్రదేశం.. ప్రాచీనకాలం నుంచి ప్రజలకు తీర్థయాత్రా ప్రదేశంగా వుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున వున్న ఈ అందమైన ప్రదేశం.. పూర్వ సంస్కృతికి ప్రతిబింబం. ప్రస్తుతం ప్రముఖ పర్యాటక నగరంగా పేర్కొనబడుతున్న ఈ ప్రదేశం.. చేనేత వస్త్రాలకు చాలా ప్రసిద్ధి చెందింది.

మహేశ్వర్ లో వున్న నర్మదా నదిలో స్నానం ఆచరిస్తే.. శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పురాతన కాలం నుంచి ఇలా స్నానం చేయడం ఆచారంగా వుంది. ఈ ప్రాంతంలో ఎన్నో ఆలయాలు వున్నాయి. ఇక్కడున్న ఈ ఆలయాలన్నింటినీ హోల్కర్‌ వంశ రాణి రాజమాత అహల్యా దేవిబాయి నిర్మించింది. అంతేకాదు.. మహేశ్వర్‌ లో కోటలతోపాటు భవంతులు, ధర్మసత్రాలను కూడా కట్టించింది. నర్మదా నది ఒడ్డున భక్తులు స్నానం చేసేందుకు వీలుగా పీష్వా, ఫాన్సే, అహల్యా ఘాట్లను రాణి అహల్యా ఏర్పాటుచేసింది. ఈ ప్రదేశంలో వున్న కొన్ని సుప్రసిద్ధ స్థలాల గురించి మాట్లాడుకుంటే..

అహల్యా కోట : దీనినే ‘హోల్కర్ కోట’ లేదా మహేశ్వర్ కోట అని పిలుస్తారు. ఈ కోటను 18వ శతాబ్ధంలో నర్మదా నది ఒడ్డున వున్న కొండపై రాణి అహల్యా దేవి కాలంలో నిర్మించారు. ఈ పురాతన కోటలో శివుడి అవతారాలకు అంకితం చేయబడిన దేవాలయాలు ఉన్నాయి. వాస్తు పరంగా భిన్నంగా వుండే ఈ కోటలోని శిల్పాలు చాలా అందమైనవి.

జలేశ్వర్ దేవాలయం : పరమశివుడికి అంకితమైన ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయంలోని దేవతకు ‘నీటి దేవుడు’గా పూజలు జరుపుతారు. ఈ ఆలయంలోని శివలింగాలు కూడా చాలా కాలం నుంచి పూజలు అందుకుంటున్నాయి. ఈ ఆలయ నిర్మాణకళ మహోన్నత స్తంభాలతో నిస్సందేహంగా ఆదర్శప్రాయంగా నిలిచింది.

కాశీ విశ్వనాధ్ ఆలయం : జ్యోతిర్లింగ రూపంలో ఉన్న శివునికి అంకితం చేయబడింది. ఇక్కడున్న జ్యోతిర్లింగాలని భక్తులు పూజించి, ప్రార్థనలు జరిపితే, వారికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలోని జ్యోతిర్లింగ దర్శనం చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. వందల కొద్ది ప్రజలు ప్రతిరోజూ దర్శిస్తుంటారు.

మహేశ్వర్ ఘాట్స్ : నర్మదా నది తీరాన ఉన్న మహేశ్వర్ ఘాట్స్ ఎన్నడూ ఖాళీగా ఉండవు. ఈ ఘాట్స్ ఒడ్డున, అనేక శివాలయాలు ఉండటం వలన, ఇక్కడి వాతావరణం భక్తితో నిండి ఉంటుంది. ఈ ఘాట్స్ అనేక స్మారక చిహ్నాలను వర్ణిస్తున్న కొన్ని అసాధారణ రాతి శిల్పాలను కలిగి ఉన్నాయి.


సంగమేశ్వర ఆలయం






సప్తనదుల్లో కొలువుదీరిన సంగమేశ్వరుని ఆలయం

అది వేలసంవత్సరాల చరిత్ర కలిగి వున్న ఆధ్యాత్మిక స్థలం.. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన పవిత్ర ప్రాంతం.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఏకంగా ఏడు నదులు (తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి) కలిసే అద్భుతమైన ప్రదేశం.. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. ఎన్నో శైవాలయాలకు కొలువైన కర్నూలు జిల్లాలో సంగమేశ్వర ఆలయం ఒక్కటే ప్రత్యేక విశిష్టత కలిగి వుంది. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది.

స్థలపురాణం :
పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని పురాణ గాధ. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. మరొక కథనం ఏమిటంటే.. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు.. ప్రతిష్ట సమయానికి రాలేదు. దీంతో.. రుషుల సూచన మేరకు ధర్మరాజు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భీముడు.. తీవ్ర ఆగ్రహంతో తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆలయ విశేషాలు :

  • ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతోపాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.
  • ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా... అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు. అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం.
  • ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి.









భక్తవల్లభుడు.. సంగమేశ్వరుడు

ఆత్మకూరు గ్రామీణ, న్యూస్‌టుడే: భక్తవల్లభుడైన సంగమేశ్వరుడిని ఇంటి నుంచే భక్తితో కొలిస్తే పలుకుతాడని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. సోమవారం సాయంత్రానికి ఆలయం గోపురం సగానికి పైగా కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. క్షేత్రంలో ఎగువ ఉమా మహేశ్వరాలంలో ఎగువ ఘాట్‌లో మెట్ల పూజలు, గంగా పూజ. లలితా సంగమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులచే మెట్లోత్సవ పూజలు నర్విహించారు. ఎగువ ఉమామహేశ్వరాలయం వద్ద సాక్షిసంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోటులో నదిలోని క్షేత్రానికి చేరుకుని అక్కడ గంగా పూజ, కృష్ణమ్మకు పూజలు శిఖర పూజలు, సత్యనారాయణుడు, సూర్యనారాయణులకు పూజలు నిర్వహించారు. రైతులంతా ఉత్తరం చూసి ఎత్తురగంప అనే సామెత ఉంది. అందుకు తగ్గట్టే ఉత్తర కార్తి రైతులను రాష్ట్ర ప్రజలను ఆదుకుందన్నారు. పూజకార్యక్రమంలో తహసీల్దారు రామకృష్ణ, పలువురు భక్తులు పాల్గొన్నారు.


5 February 2018

కృష్ణమ్మ ఒడినుంచి బయటపడుతున్న సంగమేశ్వరుడు

శ్రీశైలం జలాశయంలోని కృష్ణాజలాల నుంచి సంగమేశ్వరుడు బయటపడుతున్నాడు. సోమవారం ఆలయ శిఖరం బయటపడి భక్తులను ఆనందంలో ముంచెత్తింది. గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన పూర్తిస్థాయిలో గంగ ఒడికి చేరిన సంగమేశ్వరుడు క్రమేణా మళ్లీ భక్తుల దర్శనం కోసం సిద్ధమవుతున్నాడు. కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలంలోని పురాతన సంగమేశ్వర ఆలయం వేసవికాలం మినహా సుమారు ఎనిమిది నెలలు కృష్ణాజలాల్లో మునిగిపోయే విషయం విదితమే. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల తక్కువగా ఉండటంతో ఆలస్యంగా బయటపడుతోంది. గత ఏడాది మహాశివరాత్రికి పూజలందుకున్న సంగమేశ్వరుడు ఈ ఏడాది మాత్రం కేవలం శిఖర దర్శనానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. మహా శివరాత్రి పర్వదినాన ఆలయ శిఖరానికి పూజలు నిర్వహించడానికి ఆలయ పూజారి తెలకపల్లి రఘురామశర్మ సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నీటిమట్టం 857.30 అడుగులుగా నమోదైంది. దీంతో ఈ ఏడాది ఆలయం పూర్తిగా బయటపడి భక్తుల పూజలు అందుకోవాలంటే ఏప్రిల్ మాసాంతం వరకు ఆగాల్సి ఉంటుందని జల వనరులశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.



కృష్ణమ్మ గలగల : మునిగిన సంగమేశ్వరుడు

కర్నూలు జిల్లా ఆత్మకూర్ సమీపంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం సంగమేశ్వర ఆలయం కృష్ణా నదిలో మునిగింది. రాష్ట్రానికి పై భాగంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది పోటెత్తింది. తెలంగాణాలోని నారాయణాపుర్‌, జూరాల మీదుగా కర్నూలు జిల్లాకు భారీగా వచ్చి చేరింది వరదనీరు. సుంకేసుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా జలాల ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో బ్యాక్‌ వాటర్‌ పెరుగుతుండటంతో సప్త నదుల సంగమేశ్వరం గర్భాలయం పూర్తిగా మునిగిపోయింది.

భారీ వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ ఉట్టిపడుతుంది. శ్రీశైలం జాలశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా నది పరవళ్లకు తోడు ఉపనది తుంగభద్ర నుంచి వచ్చే నీరు కూడా వచ్చి చేరుతుండడంతో ఇవాళ ఉదయానికి 1,12,694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. శ్రీశైలం జలాశయం వైపు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. రిజర్వాయర్‌లోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో-1.48 లక్షల క్యూసెక్కులు ఉన్నది. ఔట్‌ఫ్లో- 1,813 క్యూసెక్కులుగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 17.5 టీఎంసీల నీరు జలాశయానికి వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 849.6 అడుగులకు నీరు ఉంది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


12 February 2017

కనిపించి కన్నీరొలికించే ఆలయం...

మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ లో పుట్టి కృష్ణాజిల్లా లోని హంసలదీవి దగ్గర సాగరసంగమం జరిగే కృష్ణవేణీ నది మార్గంలో ఎన్నెన్నో అపురూప ఆలయాలు. ఈ నది ప్రతి మలుపు దగ్గరా ఒక ఆలయం. ఇక ఉపనదులు కలిసే కొన్ని సంగమప్రదేశాలను సంగమేశ్వరంగా వ్యవహరిస్తారు. కర్నాటకలో బాదామి చాళుక్యుల తొలిరాజధాని ఐహోళె సమీపంలో ఘటప్రభ, మలప్రభల నదులు సంగమించే ప్రదేశాన్ని కూడలి సంగమ అంటారు. ఇక్కడ చాళుక్యుల కాలం నాటి ఆలయంతో పాటూ వీరశైవ మతస్థాపకుడు, సంఘసంస్కర్త బసవన్న సమాధి మందిరమూ ఉంది.

దక్షిణాదిలో శాతవాహనుల తర్వాత వర్ధిల్లిన రాజ్యం చాళుక్యులది. వీరికాలం నాటికి బౌద్ధ, జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నా వీరు మాత్రం వైదిక మతావలంబులు. వీరి తొలిరాజధాని ఐహోళె, పట్టాభిషేకాలు జరుపుకున్న పట్టాడకల్ లలో ఎన్నో అపురూప ఆలయాలను, బాదామిలో గుహాలయాలను నిర్మించారు. ఆ తర్వాత రాజ్యవిస్తరణలో భాగంగా మొలకసీమ, ఏరువసీమ, రెండేరులసీమగా పిలువబడే ప్రస్తుత మహబూబ్ నగర్, కర్నూల్ జిల్లాలలోని భూభాగాన్ని తమ ఏలుబడి కిందకు తెచ్చుకున్నారు. ఈసీమలో తుంగభద్ర, కృష్ణల సంగమ ప్రదేశమైన కూడలి, కూడవెల్లిగా వ్యవహరించే ప్రదేశంలో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాల నమూనాతో కూడవెల్లి సంగమేశ్వరాలయాన్ని నిర్మించారు.

ఈ ఆలయ నిర్మాణానంతరం మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నా వరద సమయాల్లో గర్భాలయాల్లోకి ఒండ్రుమట్టి చేరుతున్నందున మరో ప్రాంతాన్ని అన్వేశించగా తుంగభద్ర ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న అలంపురం కనిపించింది. ఇది అదివరకే జోగుళాంబ శక్తి పీఠమైనందున, పరుశురాముడి తండ్రి జమదగ్ని ఆశ్రమ ప్రాంతమైనందున ఇక్కడ నవబ్రహ్మాలయాలను నిర్మించారు.

కాలక్రమేణా చాళుక్యుల ప్రాభవం తగ్గింది. రాష్ట్రకూటుల ప్రాభవం హెచ్చింది. వీరికి పల్లవులతో సంబంధ బాంధవ్యాలున్నందున చాళుక్యులను జయించారు. వీరూ ఆలయాలు నిర్మించాలనుకున్నారు.

నల్లమలలో భవనాశి అనే సెలయేరుగా పుట్టి కృష్ణలో కలిసే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఈ సంగమానికి నివృత్తి సంగమం అని పేరు. పాపులను పునీతులుగా మారుస్తూ గంగా నదికి కాకి రూపం వచ్చిందని, ఆ రూపం పోగొట్టుకోవడానికి సంస్థ తీర్తాల్లో జలకమాడుతూ తిరుగుతున్న ఆవిడ ఇక్కడ హంస రూపం పొందిందని కథనం. ఆవిడ పాప నివృత్తి అయినందున నివృత్తి సంగమేశ్వరంగా వ్యవహరించేవారు. ఇక్కడ నది ఒడ్డున ఒక పురాతన శివాలయం ఉంటుంది. పాండవులు అరణ్యవాస సమయాన ఇక్కడికి వచ్చారని. శివలింగం తేవడానికి భీమూన్ని కాశీకి పంపగా అతను ముహూర్త సమయానికి రానందున ధర్మరాజు ఒక వేపమొద్దును శివలింగంగా ప్రతిష్టించాడని కథనం. తల మీద, రెండు బాహువుల్లో రెండు చొప్పున మొత్తంగా ఐదు లింగాలు తెచ్చిన భీముడు ఆగ్రహంతో వాటిని విసిరెయ్యగా అక్కడ మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్దేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేరుతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని కథనం.

ఇక రాష్ట్రకూటులు ఈ ప్రదేశంలో చాళుక్య, పల్లవుల వాస్తు రీతులను మేళవించి ఆలయాలు నిర్మించారు. వీరి ఆలయం ఒక పెద్ద రాతిరధాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయాలున్న ప్రదేశంలో ధ్యానం చేస్తే రూపాయలు కురుస్తాయనే నమ్మకంతో దీన్ని రూపాల సంగమం అనేవారని ప్రజల్లో ఒక కథ ప్రచారంలో ఉంది.

కాలచక్ర గమనంలో రాజులు,రాజ్యాలు పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి.మన తొలి ప్రధాని నెహ్రూ "ఆధునిక ఆలయాలు" గా అభివర్ణించిన బహుళార్ధసాధక ప్రాజెక్టులు మొదలయ్యాయి.కృష్ణా నది మీద శ్రీశైలం లో ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైంది.మహబూబ్ నగర్,కర్నూలు జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగాయి,ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

క్రీ.పూ 1250 ప్రాంతంలో ఈజిప్ట్ లో నాటి పాలకుడు రామ్‌సెస్ 2 తన విజయచిహ్నంగా ఒక కొండను తొలచి భవ్య ఆలయం నిర్మించాడు. దాన్ని అబు సింబెల్ ఆలయంగా వ్యవహరిస్తారు.1960 ల్లో అస్వాన్ హై డామ్ నిర్మాణంలో ఈ ఆలయం మునుగుతుందని అనేక దేశాలు, UNO సహకారంతో ఆ కొండను, శిల్పాలను ఒక్కొక్కటిగా విడదీసి కాస్త ఎగువ ప్రదేశంలో పునర్ణిర్మించారు. ఈ ఆలయ ప్రేరణతో పురావస్తు శాఖ వారు సంగమేశ్వర ఆలయాలనూ ఊకో రాయికి ఒక నంబర్ ను ఇచ్చి విడదీసారు.

కూడవెల్లి లోని ఆలయాన్ని అలంపురంలో నిర్మించగా...రాష్ట్రకూటుల రూపాల సంగమేశ్వరాన్ని కర్నూలు శివారులో ఉన్న జగన్నాధ గట్టు పైన పునర్ణిర్మించారు. ఇక పాత నివృత్తి సంగమేశ్వరంలో గొప్ప శిల్పసంపద లేనందున వదిలివేసారు.

ఈ నివృత్తి సంగమం నదిలోనే ఉండిపోయేది. కానీ 1996 లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బాంక్ అప్పు కోసం G.O-69 తీసుకు వచ్చాడు. అంతదాకా 854 అడుగుల కనీస నీటిమట్టం ఉండాల్సిన శ్రీశైలం రిజర్వాయర్లోని నీళ్లను 836 అడుగుల వరకు కిందున్న నాగార్జునసాగర్, కృష్ణా డేల్టాకు తరలించే ఏర్పాటు చేసాడు.(నీళ్లు దిగువకు వదులుతూ విద్యుదుత్పాదనను, డెల్టాలోని పంటలనూ బ్యాంక్ వారికి చూపాడు)...ఇక ప్రతి ఏటా ఈ ఆలయం నదీ గర్భం నుంచి బయట పడటం మొదలైంది. ఇలా 4,5 నెలలు వెలుపల ఉండి తుంగభద్ర, కృష్ణలకు వరదలొచ్చినప్పుడు తిరిగి నదీ గర్భంలోకి చేరేది. 2015-16 లో సుమారు 8 నెలలు బయటే ఉండిపోయింది.

ఈ లోగా ఈ శిధిలాలయం మహిమ ప్రచారం చేస్తూ కొందరు దిగిపోయారు. ఆలయ సందర్శనకు యాత్రికుల తాకిడి మొదలైంది. ఈ ఆలయం బయట పడిందంటేనే రాయలసీమ కు కన్నీరొస్తుంది.కారణం రాయలసీమకు కృష్ణా జలాలను అందిచే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 841 అడుగుల దగ్గర ఉంటుంది. ఇక ఆలయం బయట పడిందంటే బ్రహ్మాండమైన వరదలొస్తే తప్ప ఈ పోతిరెడ్డిపాడుకు నీళ్లు చేరవు. కానీ ఆ విషయం విస్మరించిన జనం ఆలయ సందర్శనకు వెళుతూనే ఉంటారు. రైతులు మాత్రం ఎప్పుడు ఈ ఆలయం మునుగుతుందా అని ఆలోచిస్తూ కార్తెలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు.

పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లందిస్తున్నామనే కబుర్లు కాదు...చిత్తశుద్ది ఉండి నిజంగా రాయలసీమకు నీళ్లు పారాలంటే ఈ కనీసనీటి మట్టాన్ని 854 కు పెంచాలని,ఆ పట్టిసీమ వల్ల మిగులుతున్నాయని చెప్పే 45 టి.యం.సి నీళ్లు రాయలసీమకు నికర జలాలుగా కేటాయించగలరా అని సీమ రైతాంగం ప్రశ్నిస్తుంది.

మొత్తానికి కనిపించి రాయలసీమ రైతులను ఏడిపిస్తున్న ఆలయం ఈ సంగమేశ్వరం.





14-09-2015

జలాధివాసానికి చేరువలో సంగమేశ్వరుడు

కర్నూలు జిల్లా సప్తనదీ సంగమక్షేత్రంలో వెలసిన శ్రీలలితా సంగమేశ్వరుడు జలాధివాసానికి చేరువవుతున్నాడు. శ్రీశైల జలాశయ నీటిమట్టం 840 అడుగులకు చేరితే గర్భాలయంలోకి నీరు ప్రవేశిస్తుంది. పూర్తిస్థాయికి (885అడుగులు) చేరితే క్షేత్రం సంపూర్ణంగా సప్తనదీజల గర్భంలోకి చేరుతుంది.



February 09, 2018

బయిట పడుతున్న సంగమేశ్వరుడు

శ్రీ శైలం జలాశయంలోని కృష్ణాజలాల నుంచి సంగమేశ్వరుడు బయటపడుతున్నాడు. ఆలయ శిఖరం బయటపడి భక్తులను ఆనందంలో ముంచెత్తింది. గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన పూర్తిస్థాయిలో గంగ ఒడికి చేరిన సంగమేశ్వరుడు క్రమేణా మళ్లీ భక్తుల దర్శనం కోసం సిద్ధమవుతున్నాడు. కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలంలోని పురాతన సంగమేశ్వర ఆలయం వేసవికాలం మినహా సుమారు ఎనిమిది నెలలు కృష్ణాజలాల్లో మునిగిపోయే విషయం విదితమే. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల తక్కువగా ఉండటంతో ఆలస్యంగా బయటపడుతోంది. గత ఏడాది మహాశివరాత్రికి పూజలందుకున్న సంగమేశ్వరుడు ఈ ఏడాది మాత్రం కేవలం శిఖర దర్శనానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. మహా శివరాత్రి పర్వదినాన ఆలయ శిఖరానికి పూజలు నిర్వహించడానికి ఆలయ పూజారి తెలకపల్లి రఘురామశర్మ సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నీటిమట్టం 857.30 అడుగులుగా నమోదైంది. దీంతో ఈ ఏడాది ఆలయం పూర్తిగా బయటపడి భక్తుల పూజలు అందుకోవాలంటే ఏప్రిల్ మాసాంతం వరకు ఆగాల్సి ఉంటుందని జల వనరులశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.



చిక్కమగళూరు

విశ్రాంతి తీసుకోవడానికై ప్రసిద్ధి చెందిన విహారయాత్ర స్థలం

విహారయాత్ర. పర్యాటకుల్ని పరవశింపచేసే ఒక అద్భుతమైన ప్రయాణం. దేశంలో కొలువైవున్న విహారయాత్ర స్థలాలను విచ్చేసేందుకు సంవత్సరం పొడవున ఎంతోమంది పర్యాటకులు విహరిస్తూనే వుంటారు. అయితే వీటిలో కొన్ని స్థలాలు ప్రత్యేకతల్ని కలిగివుంటాయి. కొన్ని భూతల స్వర్గ ప్రదేశాలుగా పేరుగాంచితే.. మరికొన్ని అద్భుతాలకు నిలయంగా వుంటాయి. కానీ వీటన్నిటికంటే భిన్నంగా ఓ యాత్రా స్థలం ప్రశాంతత, విశ్రాంతి తీసుకోవడానికి ప్రసిద్ధిగా పేరుగాంచింది. ఆ యాత్రాస్థలమే చిక్కమగళూరు పట్టణం. ప్రశాంతంగా సేదతీర్చుకోవడానికి అనువైన ఏకైక యాత్రాస్థలంగా ఈ పట్టణం పేరుగాంచింది.

‘చిక్కమగళూరు’ అంటే ‘చిన్న కూతురి ఊరు’ అని కన్నడంలో అర్థం. ఈ ఊరిని పూర్వం ఒక రాజు తన చిన్న కుమార్తెకు కట్నంగా ఇచ్చాడనే కథ ప్రచారంలో వుంది. నిజానికి చిక్కమగళూరులో చూడటానికి ప్రత్యేకించి ఏమీ లేవు కానీ.. చక్కని వ్యూ పాయింట్లకీ, ట్రెక్కింగ్ కి అనువైన స్థలంగా ముద్రపడింది. చాలా పురాతనహైన ఈ పట్టణం చుట్టుపక్కల ప్రకృతి అందాలు, సహజ దృశ్యాలు పర్యాటకులను అలరిస్తున్నాయి. దాదాపు ఈ జిల్లా ప్రాంతం మొత్తం కాఫీ తోటలు, పెద్ద పెద్ద ఎస్టేట్ లు విస్తరించి ఉన్నాయి. అందుకే.. ఈ పట్టణాన్ని ‘కర్నాటక కాఫీ రాజధాని’ అని పిలుస్తారు. అటవీ సంబంధ ప్రదేశాలు, సాహసోపేత క్రీడల ప్రదేశాలు, హిల్ స్టేషన్లు, దేవాలయాలు, జలపాతాలు, వన్యప్రాణుల విహారాలు వంటి ఎన్నో మరెన్నో ఆకర్షణలను ఈ ప్రదేశం కలిగి వుంది.

ఆకర్షణీయమైన ప్రదేశాలు :
  • బాబా భూదాన్ గిరి :  చిక్కమగళూరు వెళ్లే పర్యాటకులు తప్పక చూడాల్సిన ప్రదేశం. ఈ ప్రాంతంలోని అటవీ ప్రదేశాలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఇది సుమారు 1930 మీటర్ల ఎత్తున ఉండి.. ట్రెక్కింగ్ విహారానికి అత్యంత అనువైన ప్రదేశంగా చెప్పవచ్చు. కొండ శిఖర పైభాగానికి వెళ్ళి అక్కడినుండి ప్రదేశాలను చూస్తే ఎటువంటి వారికైనా సరే ఎంతో ఆనందోత్సాహాలు కలుగుతాయి. ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే ‘కురింజి' పువ్వును కూడా చూడవచ్చు.
  • ముల్లాయనగరి శ్రేణులు : ఇవి పట్టణంలో అత్యధిక ఎత్తు కల శ్రేణులు. ఇది బాబా బూధాన్ గిరి లోని పశ్చిమ కనుమలలో ఉంది. ముల్లాయనగిరి శ్రేణులు సముద్ర మట్టానికి 1930 మీటర్ల ఎత్తున ఉన్నాయి. ఉత్తరాన ఉన్న హిమాలయ శ్రేణుల నుండి దక్షిణాన ఉన్న నీలగిరి కొండల వరకు ముల్లాయనగిరి అధిక ఎత్తుకల శిఖరం. ముల్లాయనగిరి పర్వత శ్రేణుల పై భాగంలో యాత్రికులు శివ భగవానుడి దేవాలయం సందర్శించవచ్చు.
  • జీ పాయింట్ : పట్టణంలో వున్న మరో అద్భుత పర్యాటక ప్రదేశం. ఇది వందల అడుగుల ఎత్తున్న కొండ మీద ఉన్నది. 30 నిమిషాల నడక మార్గం ద్వారా కొండ మీదికి చేరుకోవచ్చు. ఈ కొండ మీద నుంచి ప్రకృతి అందాలను, దగ్గరలో ఉండే జలపాతాన్ని చూసి ఆనందించవచ్చు.
  • రాక్ గార్డెన్ : ఇక్కడ వివిధ రకాల పూవులు చూడవచ్చు. ఈ గార్డెన్ లో అందమైన సూర్యోదయ, సూర్యాస్తమ సమయాలు చూసేందుకు బాగుంటాయి. ఇక్కడికి దేశ, విదేశాలనుంచి యాత్రికులు, సాహసికులు, ప్రేమికులు అందరూ వస్తుంటారు.

ఉత్తరాఖండ్

హిమాలయాల ఒడిలో పర్యాటకుల మనసు దోచుకునే ఉత్తరాఖండ్

హిమాలయాల ఒడిలో పర్యాటకుల మనసు దోచుకునే ఉత్తరాఖండ్ విహారం... వారి మదిలో చిరకాలం గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరాఖండ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది డెహ్రాడూన్. కానీ, ఇప్పటిదాకా భయటపడని ఎన్నో అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను పరవశుల్ని చేయడమే కాదు సంస్కతీ సాంప్రదాయల్లో కూడా ఉత్తరాఖండ్ ఎంతో పేరెన్నికగన్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కుంభమేళ. అంతేకాకుండా మనదేశంలో గోల్ఫ్ ఆటకు అనువైన ప్రదేశాలలో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. 'కోర్బట్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్'... అంతరించిపోతున్న మన జాతీయ జంతువు పెద్దపులికి ఇష్టమైన నివాసం. అంతేకాకుండా పర్వాతారోహలకు ఎంతో ఇష్టమైన పర్వతశిఖారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాంటి వాటిలో 'నందాదేవి పీక్' ప్రముఖమైనవి. జాతీయ వింతలు 'వాలీ ఆఫ్ ఫ్లవర్స్', 'నందాదేవీ జాతీయ ఉద్యానవనం' లాంటి ప్రదేశాలు తప్పకుండా చూసి తీరాల్సిందే. 'యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్'లు గా గుర్తింపు సంపాదించుకున్న ఈ ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందువరుసలో నిలుస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సందర్శకుల మనసుదోచే ఇలాంటి పర్యాటక కేంద్రాలు ఇక్కడ అనేకం ఉన్నాయి.

సరస్సుల నగరంగా గుర్తింపు పొందిన నైనితాల్ లో ఒకప్పుడు సుమారు 60కి పైగా చెరువులు, సరస్సులు ఉండేవట. ఇందులో 'నైనీ' అనే సరస్సు ఎంతో పేరుగాంచింది. ఇక్కడ మహాఋషులు, మునులు నివాసం ఉన్నట్టు స్కందపురా ణంలో ఉంది. నైనితాల్ సరస్సును 'ట్రై రిషి సరోవర్' (ముగ్గురు ఋషుల సరోవరం) కూడా పిలుస్తారు. అత్రి, పులస్త్య, పులహ అనే మహాఋషులు... నీరు దొరకకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నైనితాల్‌లో ఒక సరస్సు నిర్మించాలని తలపెట్టారు. అలా ఒక లోతైన గుంతను తవ్వి... టిబెట్ దగ్గర ఉన్న పవిత్ర మానస సరోవరం నుండి నీటిని తెచ్చి నింపారని ప్రతీతి. అలా ఏర్పడిందే నేడు మనం చూస్తున్న నైనితాల్ సరస్సు. ఈ సరస్సులో స్నానం చేస్తే సాక్షాత్తు ఆ మానస సరోవరంలోనే స్నానమాచరించినంత పుణ్యం దక్కుతుందట.

దేశంలో ఉన్న 64 శక్తిపీఠాలలో నైనితాల్ కూడా ఒకటి. 64 ముక్కలైన పార్వతీ దేవి శరీరభాగాల్లో ఆమె కన్ను ఈ ప్రాంతంలో పడిందట. అలా ఈ ప్రాంతానికి నైనితాల్ (హిందీలో నయన్ అంటే కన్ను) అనే పేరు వచ్చిందని ప్రతీతి. అందుకే ఆ శక్తి స్వరూపిణిని ఇక్కడ నైనాదేవి పేరుతో పిలుస్తారు. నైనాదేవీ ఆలయం దేశంలోని శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పర్యాటకులు ఇక్కడి చేరుకోవాలంటే... దగ్గరి విమానాశ్రయం పంత్‌నగర్. ఇది నైనితాల్‌కు 71 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి రోడ్డు మార్గం గుండా వెళ్లవచ్చు. రైలుమార్గం ద్వారా చేరుకునే పర్యాటకులు కథ్‌గోదామ్ రైల్వే స్టేషన్ గుండా వెళ్ళవచ్చు (ఈ స్టేషన్ నైనితాల్‌కు 31 కి.మీ).

ఉత్తరాఖండ్‌లో పచ్చదనంతో మైమరిపించే మరో ప్రదేశం ఆల్మోరా. ఇక్కడి ప్రకృతి పచ్చదనానికి పరవశించని పర్యాటకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రశాంత వాతారణంతో కొండకోనలతో అలరారుతున్న ఈ ప్రాంతాన్ని చూస్తే ప్రకృతీమాత తన నైపుణ్యాన్నంతటినీ రంగరించి మరీ తీర్చిదిద్దిందా అనిపిస్తుంది. కోశీ, సుయాల్ నదుల ప్రవాహం ఆల్మోరాకు మరింత అందాన్ని చేకూర్చింది. ఆల్మోరా ప్రకృతి అందాలతోనే కాదు, ప్రముఖుల నివాసాలతో ప్రసిద్ధిగాంచింది. స్వామీ వివేకానంద తన హిమాలయాల పర్యటనలో ఆల్మోరాను తాత్కాలిక విడిదిగా ఎంచుకున్నారట. అలా ఆయన కొన్నాళ్ళు ఇక్కడే గడిపాడట. అంతేకాకుండా స్వాతంత్య్ర సమరయోధుడు గోవింద్ వల్లభ్ పంత్, ప్రముఖ హిందీ విద్వాంసుడు సుమిత్రానందన్ పంత్, నోబెల్ గ్రహీత సర్ రొనాల్డ్ రాస్‌లకు జన్మస్థలం ఆల్మోరా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా తన బాల్యంలో కొంతకాలాన్ని ఇక్కడే గడిపాట. ధోని తండ్రికి రాంచీలో స్థిరపడక మునుపు ఇక్కడ ఫామ్‌లు ఉండేవట. ఇక్కడి చేరుకోవాలంటే నైనితాల్‌కు మాదిరిగానే పంత్‌నగర్ విమానాశ్రయం నుండి చేరుకోవాలి. రైలుమార్గం గుండా వచ్చే పర్యాటకులు కోథ్‌డామ్ రైల్వేస్టేషన్ నుండి చేరుకోవచ్చు.

మనదేశంలో గోల్ఫ్ ఆటకు సంబంధింన మైదానాలకు మారుపేరు రాణీఖేత్. ఎటుచూసిన పచ్చని తివాచీ పరిచనట్లుండే ఈ ప్రాంతంలో 9 మౌంటేన్ గోల్ఫ్ లింక్‌లు ఉన్నాయి. ఓక్ అడవుల్లో విస్తరించి ఉన్న ఈ గోల్ఫ్ కోర్స్‌లు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి. చలికాలంలో మంచు దుప్పటి పరుచుకున్నట్లుండే ఈ ప్రదేశం వేసవిలో మాత్రం సైనిక స్థావరంగా సేవలందిస్తుంది. ఇవేకాకుండా ఝులా దేవి ఆలయం, చౌభాటియా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. సమీపంలోని కథ్‌గోదామ్ రైల్వేస్టేషన్ గుండా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. దూరప్రాంతం నుండి వచ్చే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయం... పంత్ నగర్. ఇది రాణీఖేత్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Thursday, 16 March 2017

ఒకప్పటి కాశీ నగరపు నగరం



దశాశ్వమేధ ఘాట్
మణికర్ణికా ఘాట్ – 1953

మణికర్ణికా ఘాట్ – 1952



మణికర్ణికా ఘాట్ – 1870
ప్రయాగ ఘాట్ – 1883



గంగా మెహల్ ఘాట్ – 1910


గంగా మెహల్ ఘాట్ – 1928

రామ్ ఘాట్ – 1869




లలితా ఘాట్ – 1900
శ్రీ రత్నేశ్వర మహాదేవాలయం – 1905



వారణాసి సందులు – 1880

Wednesday, 15 March 2017

దుర్యోధనుడి గుడి





అక్కడ దుర్యోధనుడు ఎందుకు దేవుడయ్యాడు?

మహాభారతంలో దుర్యోధనుడి పాత్రను దుష్టత్వానికి ప్రతిబింబంగా భావిస్తారు. విలన్‌కి ఎప్పుడూ సాధారణంగా తిట్లూ శాపనార్థాలేతప్ప పూజలూ పునస్కారాలూ ఉండవుకదా! కానీ దుర్యోధనుణ్ణి మాత్రం ఆ ఊళ్ళో దేవుడిలా కొలుస్తారు. ఆ ఇతిహాస పురుషుడికి జాతర కూడా చేస్తారు. ఎక్కడ? ఏమిటి? అని తెలుసుకోవాలంటే కేరళ వెళ్ళాల్సిందే!

కొల్లం జిల్లా పోరువళి గ్రామంలో ఉంది పెరువిరుతి మలనాడి గుడి. ఇక్కడ దుర్యోధనుడే దైవం. నిజానికి అక్కడ ఏ విగ్రహమూ ఉండదు. ఆరుబయట ఓ వేదిక ఉంటుంది. భక్తులు తమలోతాము సంకల్పం చెప్పుకుని, ఆ వేదిక వద్ద మనస్సులో దైవాన్ని స్మరించుకుంటూ ప్రార్థన చేయాలి. దుర్యోధనుడు పేదలు, అణగారిన వర్గాల రక్షకుడని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ గుడిలో ఉపదేవతలుగా కొలువై ఉన్నదెవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! ఇంతకూ ఎవరో తెలుసా? దుర్యోధనుడి భార్య భానుమతి, అతడి తల్లి గాంధారి, సోదరి దుస్సల, గురువు ద్రోణుడు, ఆప్తమిత్రుడు కర్ణుడు. బాగుంది కదూ! అణగారిన వర్గాల రక్షకుడుగా దుర్యోధనుడు ఇక్కడ కొలువు తీరడం నిజంగా ఓ గొప్ప విశేషమే!

తిరుపతి కథ..





తిరుపతి కథ..

దిగువ తిరుపతి ఎంతో ప్రాచీనమైన ఊరు. ఈ పట్టణం ప్రణాళికా బద్ధ్దంగా కాక అడ్డదిడ్డంగా ఎగుడు దిగుడు సన్నటి సందు గొందులతో, అపరిశుభ్రంగా ఉండేది. ఎక్కువగా మట్టి మిద్దెలు, బోదకొట్టాలు, పూరి గుడిసెలు. ప్రజలు మలేరియా జ్వరాలతో బాధపడుతూ ఉండేవాళ్ళు. చలి ఎక్కువ. కోతుల బెడద చెప్పనలవి కాదు. వర్షాకాలంలో ఎటు చూసినా నీళ్ళే. ప్రజలు నులక మంచాల మీద కొబ్బరి పీచు, గోనె సంచులు, వరిగడ్డి పడకలుగా పరుచుకుని వాటి మీద పడుకునేవాళ్ళు. తిరుమల ఆలయం ప్రాధాన్యం పెరిగేకొద్దీ తిరుపతి ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. అనేక పేర్లు మారుతూ చివరికి తిరుపతిగా స్థిరపడింది. క్రీ.శ.1235 మందలి శాసనంలో మొదట తిరుపతి అని దీనిని పేర్కొన్నారు. తిరుపతిలో పేర్కొనదగిన శ్రీగోవిందరాజస్వామి, శ్రీకోదండరామస్వామి ఆలయాలు. గోవిందరాజ స్వామి ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయ గోడలపైన వందల కొద్దీ శాసనాలున్నాయి.. అసలు ఇది శ్రీపార్థసారధిస్వామి ఆలయం. క్రిమికాంతకుడనే చోళరాజు, తన రాజ్యంలో వైష్ణవ మతం ఉండకూడదని భావించి, చిదంబరపురంలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. వైష్ణవ మతాచార్యులు రామానుజులు, రాజును వేడుకుని అక్కడి శ్రీకృష్ణ, రుక్మిణి, సత్యభామల వారపు ఉత్సవ విగ్రహాలను తిరుపతికి తీసుకునివచ్చారు. పార్థసారధిస్వామి గర్భాలయం పక్కన మరో సన్నిధి ఏర్పా టు చేసి, అందులో గార(సున్నం)మట్టితో శయనమూర్తిగా గోవిందరాజస్వామి విగ్రహాన్ని రూపొందించి, ప్రతిష్టించారు. స్వామి ముందు, తాను తెచ్చిన ఉత్సవవిగ్రహాలను ప్రతిష్టించి, ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులు ఏర్పాటు చేశారు. ఆలయంలో పూజా విధులు ఏర్పాటు చేశారు. ఈయన తిరుపతి, తిరుమలకు మూడు సార్లు వచ్చారట. ఈయనే శివుడైన తిరుమల వాసిని వైష్ణవుడుగా (వెంకటేశ్వరుడుగా) రూపుమార్చినారట! ఆచార్య రామానుజులు, శ్రీగోవింద రాజస్వామిని ప్రతిష్టించినదానికి గుర్తుగా ఈ పట్టణాన్ని గోవిందరాజపట్టణం అనేవాళ్లు. ఆ తర్వాత తిరుపతిగా పేరుబడింది.

(ఆర్థర్‌ ఎఫ్‌ కాక్స్‌ సంకలనపరచిన నార్త్‌ ఆర్కాట్‌ జిల్లా మాన్యూల్‌(1881) ఆధారంగా)





బృహదీశ్వరాలయం





వేయి సంవత్సరాల ఆ గుడిలో మిస్టరి వింతలే

అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరితో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కడా సిమెంట్ అన్న మాటకు తావు లేకుండా ఉక్కు అన్న పదం లేకుండా కట్టిన ఈ గుడి చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడి గురించి కొన్ని మిస్టరీ వింతలు.

13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. దాదాపు వేయు సంవత్సరాల క్రితం కట్టిన గుడి. భారతదేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న క్షేత్రం, దక్షిణ కాశీగా పెరొందిన ఈ గుడిలో ఎన్నో మిస్టరీ వింతలు దాగి ఉన్నాయి. దాదాపు ఈ లింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది .

పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 20 టన్నులు కలిగియండును. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏక శిలా విగ్రహం 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు 2.5 మిటర్ల వెడల్పు కలిగియండును. ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు గాని, సిమెంట్ కాని వాడ లేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. 13 అంతస్తులు గ్రానైట్ రాయితోనే కట్టారు.

80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం. ఈ గుడికే హైలెట్. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ఇక మిట్ట మథ్యాహన సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము. 80 టన్నులు బరువున్న ఆ కలశాన్ని అక్కడికి తీసుకెళ్లటమనెది ఆనాటి రాజుల నైపుణ్యానికి ప్రతీక.

ఆ ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి. ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారితీస్తే కొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉన్నాయని అన్ని దారులు ముసేశారు.

ఆ ఆలయ ప్రాంగణం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది. అంటే చాలా సువిశాలంగా ఉంటుంది. మనం మాట్లాడే శబ్దాలు మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ గుడిని కట్టారు.

అయితే ఇప్పటికీ టెక్నాలజీకి అంతుపట్టని విషయం ఏంటంటే ఈ గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలతో 6 మీ.మి కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం. అవి అలా ఎందుకు పెట్టారు అనేది ఇప్పటికీ మిస్టరీనే.

ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. వేయి సంవత్సరాల గుడులు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికీ కనిపిస్తుంది.



తంజావూరు విశేషాలు
తంజావూరు దక్షిణ తమిళనాడులోని ప్రాచీన పట్టణం. కావేరి నదీ తీరాన వున్న ఈ పట్టణం ముఖ్యంగా బృహదీశ్వరాలయం వల్ల ప్రఖ్యాతి గాంచింది. రాజరాజచోళుడు కట్టించిన ఈ ఆలయం యునెస్కొ వారి వారసత్వ సంపదల్లో ఒకటి.ఈ ఆలయంలో అతి భారీ శివలింగం మనం చూడవచ్చు. గుడి కెదురుగా భారి నందిని మనకు దర్శనమిస్తుంది.గుడిలొనికి వెళ్ళే ద్వారాలపై అద్భుతమైన శిల్పాలు తప్పక చూడవలిసిందే.గుడి దోపురం పెద్దగా ఉండటమే కాకుండా ఆ గోపురం మొన నీడ కింద పడకుండా కట్టటం దీని ప్రత్యేకత.ఒక శివరాత్రికి అక్కడికి వెళ్ళాం.అంత పెద్ద లింగానికి అభిషేకం చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు.

ఇక్కడికి మనవాళ్ళే కాకుండా విదేశీయులు ఎక్కువగా వస్తారు.గుడిలో ఒక చెట్టు వుంటుంది.ఆ చెట్టుపై మూడు బల్లులని లెక్కపెట్టి మన కోరికలు కోరుకుంటే తెరతాయని అంటారు. ఆలయం తరవాత చూడవలసింది కోట.తంజావూరిని పాలించిన రాజులకు సంబందించిన అన్ని విషయాలు ఇక్కడ చూడవచ్చు.నాట్యశాల,దర్బారు,కోట లోపల మ్యూజియం మొదలైనవి ఇట్టే ఆకట్టుకుంటాయి.మ్యూజియం లో ఒక భారి తిమింగలం అస్థిపంజరం కోసం ఒక ఫ్లోర్ కేటాయించారు.శిమ్హాసనాలు,కత్తులు మొదలైనవి చూడవచ్చు.అందులో మనం కుర్చోవచ్చు.ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు.
తంజావురు పైయింటింగ్స్ చాలా ఫేమస్.బంగారు పూత పూయబడిన ఈ పైయింటింగ్స్ ఖరీదు కూడా ఎక్కువే.తంజావూరు సంగీతానికి ప్రసిద్ధి .ప్రతి యేటా ఇక్కడ జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకి అనేక మంది వస్తారు.

తంజావురు వెల్లటానికి చెన్నై నుంచి బస్,రైలు సదుపాయలున్నాయి.తమిళనాడులోని అన్ని పట్టనాలనుంచి తంజావురు బస్సులు వుంటాయి.తిరుచ్చి అతి దగ్గరలో వున్న విమానాశ్రయం.అక్కడినుంచి బస్లో వెళ్ళోచ్చు.తంజావురు మెయిన్ బస్ స్టాండ్ ఊరి ఎంట్రన్స్లో వుంటుంది.అక్కడినుంచి లోకల్ బస్సులు వుంటాయి.

తంజావూరు విశేషాలు

తంజావూరు దక్షిణ తమిళనాడులోని ప్రాచీన పట్టణం. కావేరి నదీ తీరాన వున్న ఈ పట్టణం ముఖ్యంగా బృహదీశ్వరాలయం వల్ల ప్రఖ్యాతి గాంచింది.నేను పుదుకొట్టైలో పిజి చేసేటప్పుడు మూడు సార్లు ఇక్కడికి వెళ్ళాను.

రాజరాజచోళుడు కట్టించిన ఈ ఆలయం యునెస్కొ వారి వారసత్వ సంపదల్లో ఒకటి.ఈ ఆలయంలో అతి భారీ శివలింగం మనం చూడవచ్చు. గుడి కెదురుగా భారి నందిని మనకు దర్శనమిస్తుంది.గుడిలొనికి వెళ్ళే ద్వారాలపై అద్భుతమైన శిల్పాలు తప్పక చూడవలిసిందే.గుడి దోపురం పెద్దగా ఉండటమే కాకుండా ఆ గోపురం మొన నీడ కింద పడకుండా కట్టటం దీని ప్రత్యేకత.ఒక శివరాత్రికి అక్కడికి వెళ్ళాం.అంత పెద్ద లింగానికి అభిషేకం చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు.

ఇక్కడికి మనవాళ్ళే కాకుండా విదేశీయులు ఎక్కువగా వస్తారు.గుడిలో ఒక చెట్టు వుంటుంది.ఆ చెట్టుపై మూడు బల్లులని లెక్కపెట్టి మన కోరికలు కోరుకుంటే తెరతాయని అంటారు.

ఆలయం తరవాత చూడవలసింది కోట.తంజావూరిని పాలించిన రాజులకు సంబందించిన అన్ని విషయాలు ఇక్కడ చూడవచ్చు.నాట్యశాల,దర్బారు,కోట లోపల మ్యూజియం మొదలైనవి ఇట్టే ఆకట్టుకుంటాయి.మ్యూజియం లో ఒక భారి తిమింగలం అస్థిపంజరం కోసం ఒక ఫ్లోర్ కేటాయించారు.శిమ్హాసనాలు,కత్తులు మొదలైనవి చూడవచ్చు.అందులో మనం కుర్చోవచ్చు.ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు.

తంజావురు పైయింటింగ్స్ చాలా ఫేమస్.బంగారు పూత పూయబడిన ఈ పైయింటింగ్స్ ఖరీదు కూడా ఎక్కువే.తంజావూరు సంగీతానికి ప్రసిద్ధి .ప్రతి యేటా ఇక్కడ జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకి అనేక మంది వస్తారు.

తంజావురు వెల్లటానికి చెన్నై నుంచి బస్,రైలు సదుపాయలున్నాయి.తమిళనాడులోని అన్ని పట్టనాలనుంచి తంజావురు బస్సులు వుంటాయి.తిరుచ్చి అతి దగ్గరలో వున్న విమానాశ్రయం.అక్కడినుంచి బస్లో వెళ్ళోచ్చు.తంజావురు మెయిన్ బస్ స్టాండ్ ఊరి ఎంట్రన్స్లో వుంటుంది.అక్కడినుంచి లోకల్ బస్సులు వుంటాయి.






బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...